చిల్లర ఉంది...వచ్చి తీసుకోవచ్చు! | varun tej about his fans | Sakshi
Sakshi News home page

చిల్లర ఉంది...వచ్చి తీసుకోవచ్చు!

Published Sat, Oct 22 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

చిల్లర ఉంది...వచ్చి తీసుకోవచ్చు!

చిల్లర ఉంది...వచ్చి తీసుకోవచ్చు!

ఓ అభిమాని 500లకు చిల్లర అడిగాడు.. రిప్లై ఇవ్వడం లేదేంటి? ఆ మెగా ఫ్యాన్ డెరైక్ట్‌గా అడిగేశాడు.. ఇంకొకరు సినిమాల గురించి అడిగారు.. వీలైనంత మందికి వరుణ్ తేజ్ సమాధానాలు ఇచ్చారు. ‘కాలు విరిగి ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. సరదాగా కాసేపు... మీరు ప్రశ్నలు అడగండి. నేను సమాధానాలు ఇస్తా’ అని ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో వరుణ్ తేజ్ చాట్ చేశారు. వింత వింత ట్వీట్స్‌తో ఫ్యాన్స్ విజృంభించారు. కాస్త వెటకారంగా.. ఇంకొంచెం కొంటెగా.. ప్రేమగా వరుణ్ సమాధానాలు ఇచ్చారు. ట్విట్టర్ ఫాలోయర్లకీ, వరుణ్ తేజ్‌కీ జరిగిన సరదా సంభాషణ మీరూ చదవండి.
 
అన్నా... ఏం సంగతులు?
నువ్వే చెప్పాలి బ్రదర్. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది.

కాలు ఎలా ఉంది?
 బాగానే ఉంది. నెమ్మదిగా గాయం తగ్గుతోంది. నడవడానికి ఇంకో నాలుగు వారాలు పడుతుంది.

 ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తారు?
 అద్దంలో చూసుకుంటాను. నేను నాలానే కనిపిస్తున్నానా? లేదా? అని చెక్ చేసుకుంటాను.

హీరోగా వచ్చే ముందు ఇది తెలిసుంటే బాగుండేది అనుకున్నారా?
 డ్యాన్స్. కొన్ని డ్యాన్స్ మూవ్స్ అయినా తెలిసుంటే బాగుండేది.

ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. మల్టీస్టారర్ చేయవలసి వస్తే, వీళ్లల్లో  ముందు ఎవరితో చేస్తారు?
 చరణ్ అన్న (రామ్‌చరణ్). నాలుగో ఆప్షన్ నేనే యాడ్ చేశా.

మిమ్మల్ని కంప్లీట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూసే చాన్సుందా?
నాకు అటువంటి సినిమాలంటే చాలా ఇష్టం. ఎవరో ఒకరు స్టైలిష్ గ్యాంగ్‌స్టర్, హై స్టంట్ వేల్యూస్‌తో ఉన్న కథతో నా దగ్గరకి వస్తారని ఆశిస్తున్నా. నాకిష్టమైన జానర్ అయితే యాక్షనే. త్వరలో ఓ యాక్షన్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా.

‘మిస్టర్’ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలను కుంటున్నాం. విడుదల ఆలస్యం కావడానికి నా గాయం కూడా ఓ కారణమే.

ఫ్యామిలీ మెంబర్స్‌తో స్వీట్ మూమెంట్?
సంక్రాంతి పండగను మా కుటుంబమంతా కలిసే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్యామిలీలో అందరూ ఆ రోజు కలుస్తారు. స్వీటెస్ట్ అండ్ బెస్ట్ మూమెంట్స్ అవి.

ఐదు వందలకు చిల్లర ఉందా?
 ఉంది. వచ్చి తీసుకో!

రాజకీయాల్లోకి వస్తారా?
 నో... వద్దు. అడగొద్దు.

మెగా ఫ్యాన్స్‌కి మీరు రిప్లైలు ఇవ్వడం లేదనుకుంట?
ప్లీజ్... అలా అనకండి. వద్దండీ!

11 ప్రశ్నలు అడిగా, రిప్లై ఇవ్వలేదు?
నీ 12వ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement