ఆ ‘చిల్లర’ ప్రశ్నకు మెగాహీరో సూటి బదులు!! | Varun Tej answers to fan on twitter | Sakshi
Sakshi News home page

ఆ ‘చిల్లర’ ప్రశ్నకు మెగాహీరో సూటి బదులు!!

Published Sat, Oct 22 2016 7:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

ఆ ‘చిల్లర’ ప్రశ్నకు మెగాహీరో సూటి బదులు!!

ఆ ‘చిల్లర’ ప్రశ్నకు మెగాహీరో సూటి బదులు!!

కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌ శుక్రవారం ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటించాడు. చాలామంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు. అన్నయ్య రాంచరణ్‌తో కలిసి మల్టీ  స్టారర్‌ సినిమా చేసేందుకు ఇష్టపడతానని, బాబాయి పవన్‌ కల్యాణ్‌లో నిజాయితీ బాగా నచ్చుతుందని.. ఇలా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆస్క్‌ వరుణ్‌ హాష్‌ట్యాగ్‌తో ఈ సంభాషణ నడిచింది.

అయితే, ఓ అభిమాని మాత్రం కొంచెం అతి తెలివి ప్రదర్శించబోయాడు. రూ. 500 చిల్లర ఉందా? అంటూ చికాకు పరిచే ప్రశ్న అడిగాడు. ఇలాంటి ‘చిల్లర’ ప్రశ్నను లైట్‌ తీసుకొని వదిలేయవచ్చు. లేదా హెచ్చరికలాగా ఘాటైన సమాధానం చెప్పొచ్చు. కానీ, వరుణ్‌  ఏమాత్రం సహనం కోల్పోకుండా హుందాగా చురకలంటించాడు. ‘ఉంది వచ్చి తీసుకో’ అంటూ సూటిగా  చెప్పేశాడు.


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రంలో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయిపల్లవిని కథానాయిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement