'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్ | Varun Tej - Sekhar Kammula Fidaa Theme Poster | Sakshi
Sakshi News home page

'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్

Published Fri, Aug 5 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్

'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్

మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, మెగా హీరో వరుణ్ తేజ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. లవ్.. హేట్.. లవ్ స్టోరీ కాన్సెప్ట్గా 'ఫిదా' అనే పేరుతో కూల్ యూత్ఫుల్ ఎంటర్టెయినర్ని నిర్మించనున్నారు. శుక్రవారం ఫిదా థీమ్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ను వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. మలయాళ 'ప్రేమమ్' ఫేం సాయి పల్లవి వరుణ్ సరసన నటిస్తుంది.  

హిందీలో హిట్ అయిన కహానీకి రీమేక్గా నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తీసిన సినిమా 'అనామిక' తడబడటంతో.. రెండేళ్ల గ్యాప్ తరువాత మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్కు కీలకం కానుంది. కంచె, లోఫర్ సినిమాలతో నటుడిగా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన వరుణ్.. శేఖర్ మార్క్ హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న 'ఫిదా'పై అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement