Fidaa
-
ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
-
నేను అమెరికా నుంచి వచ్చా బొగత జలపాతాల అందాలకు ఫిదా
-
పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి పల్లవి. తన నటనతోనే కాకుండా డ్యాన్స్ స్టెప్పులతో అలరిస్తున్న ఈ కేరళ నటికి యూత్‌తో మంచి క్రేజ్ ఉంది. అతితక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్థిరపడిపోయిన ఈ నటి కెరీర్ బెస్ట్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇక హీరోహీరోయిన్ల ఖాతాలో నాలుగు సినిమా హిట్లు పడి కొంచెం పాపులర్ అయిన వెంటనే అందరి దృష్టి వారి పెళ్లిపై పడుతుంది. ఈ క్రమంలో సాయి పల్లవి పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. కాలేజీ రోజుల్లో ఆమె చవిచూసిన లవ్ ఫెయిల్యూర్ కారణంగా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త అప్పట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాయి పల్లవి సినిమాలకు దూరం కానుందనే కథనాలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఫిదా బ్యూటీ ఫైనల్ గా తనకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరమవడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ .. వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను’ అని సాయిపల్లవి తేల్చిచెప్పారు. ఇక ఈ కేరళ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం, లవ్ స్టోరీ చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: ఓ ఇంటివాడైన ‘రంగస్థలం’ మహేశ్ పవన్ కల్యాణ్.. ‘డ్రైవింగ్ లైసెన్స్’? -
ఏం జరిగినా మన మంచికే: సాయిపల్లవి
నటి సాయిపల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. డాక్టరు కావలసింది. అనుకోకుండా యాక్టర్ అయ్యిందీ చిన్నది. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ సహజ నటి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ అంటూ నటిగా తన పరిధిని పెంచుకుంది. అయితే మాలీవుడ్ తరువాత టాలీవుడ్ ఆదరించినంతగా కోలీవుడ్ సాయిపల్లవిని అక్కున చేర్చుకోలేకపోయింది. కారణాలేమైనా సాయిపల్లవి నటించిన మూడు తమిళ సినిమాలు ఆశించిన విజయాలను అందకోలేదు. వాటిలో ధనుష్‌కు జంటగా నటించిన మారి–2 చిత్రం కాస్త బెటర్. ఇక్కడ పరిచయం అయిన దయా చిత్రం పూర్తిగా నిరాశపరచగా, ఇక స్టార్ హీరో సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రం సాయిపల్లవి కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్ అవలేదు. అంతే కోలీవుడ్‌లో మరో అవకాశం లేదు. ఇక తెలుగులో హిట్స్ ఉన్నాయి, చాన్స్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ అమ్మడికి చాలా పాఠాలు నేర్పినట్టున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి పేర్కొంటూ జీవితంలో అనుకున్నది జరగకపోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం అని అంది. అయితే అలాంటి వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది. ఏదైనా జరగాలని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరంది. అందుకే అలాంటి సమస్యలు ఎదురైతే అందులోంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని పేర్కొంది. అంతేగానీ ఆశించింది జరగలేదే అని నిరుత్సాహపడకూడదని అంది. ఏం జరిగినా మన మంచికే అని భావించడం తనకు చదువుకునే రోజుల నుంచే అలవాటైందని చెప్పింది. ఆ అలవాటు ఇప్పుడు ఈ రంగంలో హెల్ప్ అవుతోందని చెప్పింది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం పాఠం నేర్చుకోవడానికే అది జరిగిందని భావిస్తానని అంది. అన్నట్లు ఈ భామ ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశాన్ని తోసిపుచ్చిందట. ఆ ప్రకటనలో నటించినందుకుగానూ ఏడాదికి అక్షరాలా కోటి రూపాయలు పారితోషకాన్ని ముట్ట చెబుతామన్నా, నిరాకరించిందట. అంతేకాదు గతంలో కూడా రూ. 2 కోట్లు పారితోషకాన్ని ఇస్తామని ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఆఫర్ ఇచ్చినా సారీ అనేసిన విషయం తెలిసిందే. సహ నటీమణులు చాలా మంది వాణిజ్య ప్రకటనలో నటించి సంపాదించుకుంటుంటే సాయిపల్లవి ఎందుకో ఆ రంగంలో విముఖత చూపిస్తోంది. ఇక డబ్బు కోసం ఏదిపడితే ఆది చేయనని గతంలోనే తేల్చిచెప్పేసింది. ‘ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా? సంతోషంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తే చాలు. నా విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదు. అందుకే ఇటీవలే కొన్ని యాడ్స్‌ను రిజెక్ట్ చేశాను’అని సాయిపల్లవి పేర్కొంది. ప్రస్తుతం పల్లవి తెలుగులో మంచి అవకాశాలతో దూసుకపోతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న `విరాటపర్వం' చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది. దీనితో పాటు నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో కూడా ఈ రౌడీ బేబీ నటిస్తోంది. మరి కమిట్మెంట్ కోసం కోట్లు వదలుకుంటున్న ఈ బ్యూటీ రానున్న కాలంలో కూడా ఇదే మాట పై ఉంటుందేమో చూడాలి. -
తన రికార్డును తనే బ్రేక్ చేసింది!
తన డ్యాన్సులతో, యాక్టింగ్‌తో సాయి పల్లవి అందర్నీ కట్టిపడేస్తూ ఉంటుంది. సాయి పల్లవి వీడియో సాంగ్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఫిదాలోని ‘వచ్చిండే’ సాంగ్ ఒకప్పుడు రికార్డులు సృష్టిస్తే.. ప్రస్తుతం ‘రౌడీ బేబీ’ సాంగ్ యూట్యూబ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన వీడియో సాంగ్‌గా టాప్‌లో నిలిచిన వచ్చిండే సాంగ్‌ను చాలా తక్కువ టైమ్‌లో రౌడీ బేబీ వెనక్కి నెట్టేసింది. రెండింట్లోనూ సాయి పల్లవి తన మార్క్‌తో అలరించింది. వచ్చిండే సాంగ్‌తో ట్రెండ్‌సెట్ చేసిన సాయి పల్లవి.. రౌడీ బేబీతో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఇప్పటికీ రౌడీ బేబీ వీడియోసాంగ్‌ను 183మిలియన్ల (దాదాపు 18కోట్లు) మంది వీక్షించారు. -
సౌతిండియాలో అదే నెం.1 వీడియోసాంగ్
వచ్చిండే.. అనే పాట వింటే సాయి పల్లవి స్టెప్పులు గుర్తుకురావాల్సిందే. ఫిదా సినిమాలోని ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాటే.. ఏ స్టేజ్‌పైనా అవే స్టెప్పులు. అంతలా అందరి మనుసుల్లో నాటుకుపోయిందీ పాట. సాయి పల్లవి డ్యాన్సులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. సినిమాలో తను చేసే పాత్రలైనా, పాటల్లో వేసే స్టెప్పులైనా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవే ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. మూడు రోజులు క్రితం రిలీజైన ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ యూట్యూబ్‌కు నిద్రపట్టకుండా చేస్తుంటే.. ఫిదాలోని వచ్చిండే సాంగ్.. సౌత్ఇండియాలో అత్యంత వేగంగా.. ఎక్కువ వ్యూస్ సాధించిన వీడియోసాంగ్గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 173మిలియన్స్ (17.38కోట్లు) వ్యూస్‌ను సాధించింది. సాయి పల్లవి.. తన హావాభావాలు, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేయడమే ఈ వీడియో సాంగ్స్‌కు ఇంతటి రెస్పాన్స్ రావడానికి కారణం. మరోసారి ఈ వీడియో సాంగ్‌ను చూసేయండి. -
మళ్లీ ఫిదా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ!
క్లాస్ సినిమాలను తీస్తూ.. ప్రతీ ఫ్రేమ్‌లో ఆయన మార్క్‌ను కనపడేలా చిత్రాన్ని తెరకెక్కించడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. గతేడాది ఫిదాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల ఇంతవరకు మరో ప్రాజెక్టును చేపట్టలేదు. అయితే రీసెంట్గా తన కొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్దమవుతున్నాడు. మళ్లీ కొత్తవారితో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో ఓ మంచి ప్రేమకథా చిత్రంగా మలచబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. -
మరో రికార్డ్ ‘ఫిదా’
మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ కు మించి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసిన భారీ రికార్డులు నమోదు చేసింది. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటికే ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సినిమాలోని ‘వచ్చిండే.. ’ పాట ఏకంగా 150 మిలియన్ల (పదిహేను కోట్ల) వ్యూస్ సాధించి సత్తా చాటింది. శక్తికాంత్ కార్తీక్ సంగీత సారధ్యంలో మధుప్రియ, రాంకీలు ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యమందించారు. -
శర్వాతో గొడవ.. సాయిపల్లవి క్లారిటీ!
ఫిదా సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. నటిగా మంచి పేరున్న సాయి పల్లవిపై హీరోలతో గొడవ పెట్టుకుంటుందన్న అపవాదు కూడా ఉంది. ఎమ్సీఏ సినిమా సమయంలో నానితో, కణం షూటింగ్లో నాగశౌర్యతో సాయి పల్లవి గొడవ పడినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా సాయిపల్లవి మరో హీరోతో గొడవ పడట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్ కు బ్రేక్ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వటంపై స్పందించారు. ‘శర్వానంద్, పడి పడి లేచే మనసు సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవ’ని ఆమె క్లారిటీ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
సాహోరే.. హైబ్రిడ్ పిల్లా
సాక్షి, హైదరాబాద్: బాహుబలి సిరీస్ సృష్టించిన ప్రభంజనం తెలియంది కాదు. మరోవైపు ఫిదా చిత్రం టాలీవుడ్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రెండూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినవే. కలెక్షన్లపరంగా సంగతి పక్కనపెడితే మ్యూజిక్ పరంగా మాత్రం ఫిదానే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇందుకు నిదర్శనంగా యూట్యూబ్‌లో ఓ రికార్డును ప్రస్తావిస్తున్నారు. బాహుబలి-2లోని టైటిల్ సాంగ్ సాహోరో బాహుబలి పాట కన్నా ఫిదాలోని వచ్చించే సాంగ్ ఎక్కువగా వ్యూవ్స్ రావటం విశేషం. సాహోరే సాంగ్ 11 నెలల్లో సాధించిన వ్యూవ్స్‌ను వచ్చిండే సాంగ్ 7 నెలల్లోనే దాటేసింది. బాహుబలి ది కంక్లూజన్‌కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా.. ఫిదాకు శక్తికాంత్ సంగీతం అందించారు. హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి చేసిన మ్యాజిక్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో హల్ చల్ చేస్తున్నారు. -
సాహోరే సాంగ్ కన్న వచ్చించే సాంగ్ ఎక్కువ వ్యూవ్స్
-
నా హద్దుల్లోనే నేనున్నా!
తమిళసినిమా: నేను నా హద్దుల్లోనే ఉన్నానని అంటోంది నటి సాయిపల్లవి. అదృష్టం తేనె తుట్టెలా పట్టిన యువ నటీమణుల్లో ఈ భామ ఒకరు. మాలీవుడ్‌లో ప్రేమమ్ చిత్రంతో మలర్ (పుష్పం)లా వికసించిన నటి సాయిపల్లవి. ఆ చిత్రం ఈమెను దక్షిణాదంతా వ్యాప్తి చెందేలా చేసింది. ఇక టాలీవుడ్లో ఫిదా చిత్ర విజయంతో పరుగులు తీసిన ఈ జాణ మార్కెట్ ఎంసీఏ చిత్రంతో మరింత బలపడింది. ప్రస్తుతం శర్వానంద్‌తో నటిస్తున్న తెలుగు చిత్రానికి సాయిపల్లవి కోటి రూపాయలు పారితోషికం పుచ్చుకున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇలా రెండు చిత్రాలతో అంద పెద్ద మొత్తం పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిన నటి సాయిపల్లవినే అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం కరు ఇంకా తెరపైకి రానేలేదు. మరో రెండు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో ఒకటి సూర్యతో జత కడుతున్న ఎన్జీకే. రెండోది ధనుష్‌తో రొమాన్స్ చేస్తున్న మారి–2. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. సినిమాలో తనకుంటూ ఒక బాణీని ఏర్పరచుకుని దూసుకుపోతున్న సాయిపల్లవి మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే అన్నీ కమిట్ అవకుండా తనకు నప్పే పాత్రలనే అంగీకరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ అమ్మడిపై విమర్శలు ఎక్కువే ప్రచారం అవుతున్నాయి. అలాంటివేవీ పట్టించుకోనని, తాను ఏ ఇతర నటీమణులకు పోటీ కానని చెప్పుకొచ్చింది. తన బలం,బలహీనం ఏమిటన్నది తనకు బాగా తెలుసని, అందుకే తన హద్దుల్లోనే తాను ఉన్నానని అంది. అన్ని రకాల పాత్రలకు తాను నప్పనన్న విషయం తనకు తెలుసని అందుకే పాత్రల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని సాయిపల్లవి పేర్కొంది. -
‘వైద్య వృత్తిని వదులుకున్నా’
తమిళసినిమా: సినిమా కోసం కష్టపడి చదివిన వైద్య వృత్తిని వదులుకున్నానని అంటోంది సాయిపల్లవి. నటిగా మలయాళంలో సక్సెస్ అయ్యి ఆ తరువాత తెలుగు చిత్రసీమలో విజయాలను అందుకుని ఆ తరువాతే తమిళ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ అమ్మాయి ఈ భామ. అయితే మాలీవుడ్‌లో నటించిన ప్రేమమ్ చిత్రమే ఈ అమ్మడి తొలి చిత్రం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అది నిజం కాదన్న విషయాన్ని సాయిపల్లవి తనకు తానే బయటపెట్టింది. ఆ కథేంటో చూద్దాం. ఇంతకుముందు తమిళంలో ధామ్ ధూమ్ చిత్రంలో కంగణాకు స్నేహితురాలిగా, కస్తూరిమాన్ అనే మలయాళ చిత్రంలో మీరా జాస్మిన్‌కు స్నేహితురాలిగా నటించాను. అయితే సినిమా శాశ్వతం కాదని, హీరోయిన్ల కాలపరిమితి ఐదారేళ్లే అని తన తండ్రి చెప్పారన్నారు. చదువే మంచి భవిష్యత్తునిస్తుందని తను ఎంబీబీఎస్ చదివించేందుకు జార్జియా పంపారన్నారు. జార్జియాలో చదువుతుండగానే ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. దీంతో చదువుకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నటించమని అమ్మానాన్న చెప్పారు. అలా నటించిన ప్రేమమ్ చిత్రం ఘన విజయం సాధించడంతో సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించాను. దీంతో వృత్తిని వదులుకోవలసివచ్చింది. అందుకే పూర్తిస్థాయి నటిగా మారిపోయాను. అయితే దేవుడి దయవల్ల ఈ స్థాయికి చేరుకున్నాను అని సాయిపల్లవి అంది. ఈ అమ్మడు తొలి తమిళ చిత్రం కరు త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
పాటల్లేని సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..!
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు వరుణ్. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. ఈ సినిమాలో పాటలు మాత్రం ఉండవని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తొలి షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభం కానుంది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
వరుణ్.. వరుసగా రెండోసారి..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లు సాదిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఒక్క అ! తప్ప ఓవర్ సీస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రాలేవి రిలీజ్ కాకపోవటంతో ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో స్థానం దక్కించుకుంది. ఫిదా సినిమాతో ఓవర్సీస్లో తొలిసారిగా మిలియన్ డాలర్ క్లబ్లో జాయిన్ అయిన వరుణ్ తేజ్, తొలిప్రేమతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. వరుణ్ ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడట. -
సాయి పల్లవి సినిమా మళ్లీ వాయిదా
ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్లార్ బ్యూటీ తరువాత ఎమ్సీఏ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలో చేస్తూ బిజీ అవుతోంది. ఈ భామ నటించిన మరో ఆసక్తికర చిత్రం కణం. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం కణం సినిమా మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 9న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ పై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. మార్చి 9న రిలీజ్ కావటం కాయంగా కనిపిస్తోంది. -
‘తొలిప్రేమ’ ట్రైలర్ రిలీజ్ వాయిదా..!
ఫిదా సినిమాతో ఘనవిజయం సాదించిన మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న తొలిప్రేమ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. ట్రైలర్ వాయిదా పడిన విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలోనే కొత్త రిలీజ్ టైంను ప్రకటిస్తామని, మీ నిరీక్షణకు తగ్గ స్థాయిలో ట్రైలర్ ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు తమన్. The new time of #tholiprematrailer will be announced soon !! Delay due to technical issues It’s worth a wait for sure !! Thanks for the love ♥️ pic.twitter.com/0vFX8Lrzbq — thaman S (@MusicThaman) 1 February 2018 -
‘నేల టికెట్’కు ఫిదా టచ్
‘రాజా ది గ్రేట్’ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు పనుల్లో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో వెంటనే ‘సొగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 5న సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ఓ కొత్త సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్‌ను ‘నేల టికెట్’ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సూర్య జోడిగా మల్లార్ బ్యూటీ
తమిళ సినిమా: కోరికలు అంత ఈజీగా నెరవేరవు. ఒక వేళ అలా జరిగితే అంతకంటే అదృష్టం ఉండదు. అయితే అనుకోకుండానే అందలం ఎక్కేసిన నటి సాయిపల్లవి. మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో మలర్ టీచర్‌గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా ఇరుగు, పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్షకుల మనసుల్సి కొల్లగొట్టేసిన సాయిపల్లవి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది. త్వరలో కరు చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకోవడానికి సిద్ధం అవుతోంది. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ అమ్మడింతకు ముందొక భేటీలో తనకు నటుడు సూర్య అంటే చాలా ఇష్టం అని, ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకునేది లేదని వెల్లడించింది. అయితే అలాంటి అవకాశం ఇంత తొందరగా వస్తుందని బహూశ సాయిపల్లవి ఊహించి ఉండదు. అలాంటి తన కోరిక తీరే తరుణం వచ్చేసింది. సూర్య తాజాగా తానా సేర్న్‌దకూట్టం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. సంక్రాంతికి ఆయన అభిమానులకు కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇక సూర్య తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు సూర్య. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో మరో నాయకిగా సాయిపల్లవి నటించనుంది. ఈ విషయమై దర్శకుడు సెల్వరాఘవన్ ఇప్పటికే సాయిపల్లవితో చర్చలు జరిపారని, తనూ నటించడానికి అంగీకరించిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. డ్రీమ్ వారియర్ ఫిలిం స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ చిత్రం జనవరి రెండవ భాగంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ సంతానం హీరోగా మన్నవన్ వందానడి చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. -
కొత్త దర్శకుడితో మెగా ప్రిన్స్
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్, సక్సెస్ సాధించడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఫిదా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ సాధించిన వరుణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలి ప్రేమ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. తనకు ఫిదా లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో షార్ట్ ఫిలిం దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శశి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. మరి రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడో చూడాలి. -
నాని డైరెక్టర్‌తో మెగా హీరో
ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వరుణ్, మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడు. మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన ఈ యువ నటుడు ముందు లవర్ బాయ్ గా ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా రొమాటింక్ ఎంటర్టైనర్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అదే బాటలో యువ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు అంగీకరించాడు. నాని హీరోగా నిన్నుకోరి లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరిని తెరకెక్కించిన శివ నిర్వాణ వరుణ్‌తో తెరకెక్కించబోయే సినిమాలో మాత్రం కాస్తం ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను డీవీవీ దానయ్య నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న వరుణ్, సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన తరువాతే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఆన్ లైన్ లోనూ ఫిదా చేస్తోంది..!
మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ కు మించి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసిన భారీ రికార్డులు నమోదు చేసింది. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. సినిమా రిలీజ్ అయి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు అదే మూడ్ లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. వీటిలో హేయ్ పిల్లగాడా పాట విడుదల చేసిన 24 గంటల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. మెల్ల మెల్లగా వచ్చిండే అనే మరో పాటు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమా రిలీజ్ అయి 50 రోజులు దాటిన తరువాత కూడా ఈ స్థాయిలో వ్యూస్ సాధించటంతో యూనిట్ సభ్యులు ఖుషీ అవుతున్నారు. -
మరో స్టార్ వారసుడితో తేజ..?
రానా హీరోగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ తేజ, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నారట. తన కెరీర్ లో ఎక్కువగా కొత్త నటీనటులతోనే విజయాలు సాధించిన తేజ, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేసిన ప్రతీ సారి ఫెయిల్ అయ్యారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత రానా లాంటి స్టార్ తో సినిమా చేసి మెప్పించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మరోసారి స్టార్ వారసుడి మీద దృష్టి పెట్టారు. ఈ సారి మెగా క్యాంప్ మీద కన్నేసిన తేజ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వరుణ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తేజ కథా కథనాలు రెడీ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూర్తయిన తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తేజ సినిమాకు రెడీ అవ్వనున్నారు వరుణ్. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. తేజ లాంటి దర్శకుడితో సినిమా చేస్తే వరుణ్ కు లవర్ భాయ్ మరింత స్ట్రాంగ్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
భానుమతి భయపెడుతుందా..?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేచురల్ బ్యూటి సాయి పల్లవి. తొలి సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ, టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారుతోంది. తెలుగుతో పాటు మలయాళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తున్ సాయి పల్లవి, కథల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉంటుందట. కథ నచ్చకపోతే ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా నో చెప్పేస్తోంది. అయితే తాజాగా ఈ భామ ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి, థ్రిల్లర్ సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుండటంతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
ఫిదా సందడి
-
'ఫిదా' అయిన ఓవర్ సీస్
మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్ధలు కొడుతూ దూసుకుపోతోంది. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్ సీస్ లో 2,000,159 డాలర్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన 7వ తెలుగు సినిమాగా ఫిదా నిలిచింది. ఫిదా కన్నా ముందు బాహుబలి రెండు భాగాలు, ఖైదీ నెం 150, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, అ..ఆ.. సినిమాలు ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా అందని రికార్డ్ ను సొంతం చేసుకొని ఫిదా చరిత్ర సృష్టించింది. -
ఫిదా బ్యూటీ అప్పుడే రావాల్సింది..!
ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసేసింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటి. తొలి సినిమాలోన తన నటనతో మంచి మార్కులు సాధించి వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. అయితే ఈ బ్యూటీని చాలా రోజుల కిందటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు, దర్శకుడు శేఖర్ కమ్ముల. తన దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించాడట శేఖర్. అయితే అప్పుడు సాయి పల్లవి ఎమ్బీబీయస్ చదువుతుండటంతో ఆ సినిమా చేసేందుకు సాయి పల్లవి అంగీకరించలేదు. తన కథలకు సాయి పల్లవి లాంటి నటి అయితే కరెక్ట్ అని భావించిన శేఖర్ మరోసారి ఫిదా కోసం సాయి పల్లవిని సంప్రదించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్ గా మారిపోయింది ఈ మల్లార్ బ్యూటి. -
ఫిదా అయ్యిందా..!
వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫిదా సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్న ఇప్పటికీ మంచి కలెక్షన్లను సాదిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఏకంగా 50 కోట్ల గ్రాస్ కు చేరువవుతుండటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువభాగం సాయి పల్లవి ఖాతాలోకే వెల్లింది. పల్లవి నటనకు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. అందుకే దర్శక నిర్మాతలు వరస ఆఫర్లతో సాయి పల్లవిని ఉక్కిరి బిక్కిర చేస్తున్నారు. కానీ ఈ మల్లార్ బ్యూటీ మాత్రం పాత్రల ఎంపికలో తొందర పడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది. తన క్యారెక్టర్స్ విషయంలో పక్కా క్లారితో ఉన్న సాయి పల్లవి, తనను తెలుగు సినిమాకు పరిచయం చేసిన దిల్ రాజు బ్యానర్ లో వరుస సినిమాలకు అంగీకరించింది. ఈ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు సాయిపల్లవి అగ్రిమెంట్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. -
చిరంజీవి తరువాత వరుణ్ మాత్రమే..!
ఫిదా సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈసినిమాతోనే రికార్డుల వేట మొదలు పెట్టాడు. రిలీజ్ అయి రెండు వారాలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుండటంతో రికార్డుల గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఫిదా ఓవర్ సీస్ లో 1.62 మిలియన్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే 2 మిలియన్ల మార్క్ సాధించటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మెగా హీరోల్లో ఈ రికార్డు సాధించిన రెండో హీరోగా రికార్డు సృష్టించనున్నాడు వరుణ్. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే 2 మిలియన్ల క్లబ్ లో ఉన్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాతో 2.45 మిలియన్ల వసూళ్లు సాధించి మెగాస్టార్ స్టార్ ఈ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఫిదా సినిమాతో వరుణ్ ఈ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి అత్తారింటికి దారేది సినిమాతో పవన్ 1.90 మిలియన్లతో వరుణ్ కన్నా ముందుండగా ఈ వారాంతానికే పవన్ కలెక్షన్లను వరుణ్ దాటేస్తాడని భావిస్తున్నారు. మిగిలిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల ఓవర్ సీస్ రికార్డులను ఫిదా సినిమాతో వరుణ్ ఇప్పటికే దాటేయటం విశేషం. -
'రీమేక్ అయితే చేయను' : సాయి పల్లవి
ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ముందు చేయబోయే సినిమాల విషయంలో చాలా కండిషన్సే పెడుతుంది. శేఖర్ కమ్ముల బలవంతం మీదే ఫిదాలో వెస్ట్రన్ డ్రస్ వేశానన్న సాయి పల్లవి.. ఇక మీదల ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి డ్రస్ వేసుకోనని చెప్పేసింది. అంతేకాదు కథ విషయంలోనూ తన అభిప్రాయాన్ని గట్టిగానే చెపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రీమేక్ సినిమా చేసేందుకు అంగీకరించదట. ఫిధా సినిమాను రీమేక్ చేసినా తను మాత్రం భానుమతి పాత్రలో నటించేది లేదని చెప్పింది సాయిపల్లవి. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఈ భామ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఫిదా
-
కలెక్షన్లు 'ఫిదా' చేస్తున్నాయ్..!
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఫిదా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి పర్ఫామెన్స్‌కు ఆడియన్స ఫిదా అవుతున్నారు. క్లాస్ సినిమా దర్శకుడిగా తనకున్న ఇమేజ్ను కొనసాగిస్తూ శేఖర్ కమ్ముల రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్‌కు ఆ కోరిక తీరిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. గురవారం రోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో కలిపి తొలి రోజు 35000 డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో లాంగ్ రన్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిదా కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్టీపెక్ట్స్ ప్రేక్షకులను ఈ సినిమా గట్టిగానే ఫిదా చేస్తోంది. -
'ఫిదా' మూవీ రివ్యూ
టైటిల్ : ఫిదా జానర్ : రొమాంటిక్ లవ్ స్టోరీ తారాగణం : వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, శరణ్య ప్రదీప్ సంగీతం : శక్తికాంత్ దర్శకత్వం : శేఖర్ కమ్ముల నిర్మాత : దిల్ రాజు మెగా వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, చాలా కాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆనంద్, హ్యాపిడేస్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తరువాత ఫాం కోల్పోయి కష్టాల్లో పడ్డాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిదా. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఫిదా.. వరుణ్ కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురావటంతో పాటు, దర్శకుడు శేఖర్ కమ్ములను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? కథ : అమెరికాలో డాక్టర్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్).. అన్న రాజా, తమ్ముడు బుజ్జితో కలిసి ఉంటుంటాడు. తల్లీ తండ్రి లేకపోవటంతో వరుణ్, బుజ్జిలే రాజాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఉండే రేణుక (శరణ్య ప్రదీప్) అనే అమ్మాయితో రాజా పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన వరుణ్, పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం కలుగుతుంది. కానీ తన తండ్రిని వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో వరుణ్ తన మామయ్య కూతురు శైలుతో క్లోజ్ గా ఉండటం చూసి మరింతగా దూరమవుతుంది. రాజా పెళ్లి తరువాత అన్నా వదినలతో కలిసి అమెరికా వెల్లినా వరుణ్, భానుమతిని మర్చిపోలేకపోతాడు. చివరకు భానుమతికి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ భానుమతి వరుణ్ కి నో చెపుతుంది. తరువాత వరుణ్, భానుమతి మనసు ఎలా గెలుచుకున్నాడు..? తండ్రి వదిలి వెల్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుణ్ తేజ్.. ఎన్నారై అబ్బాయిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. లవర్ బాయ్ లుక్స్ తో అదరగొట్టాడు. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళీ బ్యూటీ సాయి పల్లవి అందరినీ ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా రఫ్ అండ్ టఫ్ రోల్ లో మెప్పించింది. అల్లరి అమ్మాయిగా బబ్లీగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సాయిచంద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో రాజా, శరణ్య ప్రదీప్, సత్యం రాజేష్ లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కొంత గ్యాప్ తరువాత ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ చూపించారు. క్యూట్ లవ్ స్టోరిని తనదైన టేకింగ్ లో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. తన స్టైల్ లోనే ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా సాగే కథలో అద్భుతమైన ఎమోషన్స్ పండించారు. ఇప్పటి వరకు కాలేజ్, కాలనీ బ్యాక్ డ్రాప్ లనే ఎక్కువగా ఎంచుకున్న శేఖర్, ఈ సినిమాతో తెలంగాణ పల్లెటూళ్లను మరింత అందంగా చూపించాడు. కేవలం పరిస్థితులు, యాస మాత్రమే కాదు సాంప్రదాయాలను కూడా చాలా బాగా తెరకెక్కించాడు. శక్తికాంత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ బాణీలో సాగే 'వచ్చిండే..' పాట విజువల్‌గా కూడా సూపర్బ్. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, తెలంగాణ పల్లె వాతావరణాన్ని, అమెరికా లోకేషన్స్ ను చాలా అందంగా చిత్రీకరించాడు. మార్తండ్ కె వెంటేష్ ఎడిటింగ్ పరవాలేదు. సినిమా నిడివి ఇంకాస్త తగ్గించి ఉంటే మరింత ఆకట్టుకునేది. దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : వరుణ్, సాయి పల్లవి నటన కామెడీ, ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : సినిమా నిడివి క్లైమాక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
డ్రగ్స్ అంశాన్ని అందరికీ ఆపాదించవద్దు: నిర్మాత
లబ్బీపేట (విజయవాడ): టాలీవుడ్లో డ్రగ్స్ అంశాన్ని అందరికీ ఆపాదించవద్దని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విజ్ఞప్తి చేశారు. ఫిదా సినిమా ప్రచారంలో భాగంగా విజయవాడలోని ఓ హోటల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ విషయాన్ని తాము మీడియా ద్వారానే తెలుసుకున్నామని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే సురేష్‌బాబు, అల్లు అరవింద్‌లు వివరణ ఇచ్చారని చెప్పారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరూ డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు ఆరోపణలు వచ్చినంత మాత్రాన అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సిట్ విచారణ జరుగుతోందని చెప్పారు. తాము కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు శేఖర కమ్ముల, హీరో వరుణ్‌తేజ్ కూడా పాల్గొన్నారు. -
ఒకే బ్యానర్లో మూడు సినిమాలు..!
మలయాళ సినిమా ప్రేమమ్‌తో సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం ఈ భామ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాలో నటిస్తోంది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాతో పాటు అదే బ్యానర్ లో మరో రెండు సినిమాలకు ఓకె చెప్పిందట సాయి పల్లవి. ఫిదా సినిమాతో పాటు ఒకేసారి మూడు సినిమాలు చేసేలా దిల్ రాజు సాయి పల్లవితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంతేకాదు మూడు సినిమాలకు కలిపి పేమెంట్ కూడా ఒకేసారి చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫిదా సినిమాను పూర్తి చేసిన ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఎమ్సీఏ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత కూడా దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేయనుంది. ప్రస్తుతం సతీష్ వేగ్నేష్, దశరథ్, శ్రీకాంత్ అడ్డాలలు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ ఉన్నారు. వీటిలో ఏదో ఒక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. -
నటిగా దర్శకుడి తల్లి
కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఓ హిట్ దర్శకుడి తల్లి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు. పెళ్లి చూపులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తల్లి గీత.. ఫిదా సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గతంలో తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు షార్ట్ ఫిలింస్ లో కనిపించిన గీత.. తొలిసారిగా వెండితెర మీద కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తరుణ్ తల్లి గీత అని కాదు.. గీతగారి కొడుకే తరుణ్ అని చెప్పుకుంటారంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. -
ఫిదా ఫస్ట్ సింగిల్ లాంచ్
-
ప్రపోజల్‌ని కాలుతో తన్నింది
ఇది హార్ట్‌కి సంబంధించిన మేటర్‌రా.. హార్ట్‌కి.. అని తన ప్రేమ గురించి తెగ బాధపడిపోతున్నారు యువ నటుడు వరుణ్ తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న ఫిదా చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకుడు. 'నా ప్రపోజల్‌ని కాలుతో తన్నింది' అని వరుణ్‌తేజ్ డైలాగ్ మరింత ఆకట్టుకుంటోంది. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనే దాన్ని తనదైన కుటుంబ విలువలను జోడించడం ద్వారా ఆవిష్కరించారు శేఖర్ కమ్ముల. గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ కథానాయిక పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు. లైఫంతా ఆ ముగ్గురు కోతులకు చాకిరి చేసి చచ్చిపోతావే.. ప్రపోజల్‌ని కాలుతో తన్నింది.. అతనితో సగం సగం ఈడ ఉండలేను.. ఈ పిల్లకు లెక్కలేదు.. ఓన్లీ తిక్కే.. అప్పుడు మంచి భాను.. ఇప్పుడు చెత్త భాను.. జీవితాంతం ఒకరితో ఉండాలనుకుంటాం కదా.. అది ఈమే.. అంటూ ట్రైలర్లో ఉండే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, జులై 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. -
వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా షూటింగ్లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరిన దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, కమర్షియల్ స్టార్ అనిపించుకునేందుకు కష్టపడుతున్నాడు. ముకుంద, కంచె లాంటి సినిమాలో ఆకట్టుకున్న వరుణ్, కమర్షియల్ జానర్లో చేసిన లోఫర్, మిస్టర్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఫిదా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
ఘాజీ డైరెక్టర్‌తో మెగా హీరో సైన్స్ ఫిక్షన్..!
తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి, తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల మిస్టర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ ప్రస్తతుం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఇవి పూర్తయిన తరువాత సంకల్ప రెడ్డి తెరకెక్కించే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
ఘాజీ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..?
తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. ఇంతటి ఘనవిజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా కూడా ఘాజీ తరహాలో ప్రయోగాత్మకంగానే ఉండబోతుందని తెలుస్తోంది. మిస్టర్ ఫెయిల్యూర్‌తో డైలామాలో పడ్డ వరుణ్‌కు ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఫిదా పూర్తయిన తరువాత సంకల్ప్ రెడ్డితో చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
వరుణ్ బర్త్‌డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఫిదా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిస్టర్, ఫిదా సినిమాల షూటింగ్‌లను ఒకేసారి చేసేలా ప్లాన్ చేసినా.. ప్రమాదం కారణంగా వరుణ్ కొంత కాలం షూటింగ్‌లకు దూరం కావటంతో ఫిదాను వాయిదా వేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫిదాను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఫిదా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు. -
వరుణ్ బర్త్‌డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్
-
'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'ఫిదా' మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమమ్' ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్గా మెరవనున్నారు. ఎన్నారై కుర్రాడికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిజామాబాద్ బాన్సువాడలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. శేఖర్ కమ్ముల మార్క్ స్వీట్ లవ్ స్టోరీగా 'ఫిదా' అలరించనుంది. Wrapped a super fun schedule of #Fidaa in banswada! Hyd it is! With @Sai_Pallavi92 and Shekar See you two soon!😊😊😊 pic.twitter.com/fFZcD5xD4u — Varun Tej (@IAmVarunTej) 8 September 2016 -
ఫిదా మొదలైంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. కెరీర్ స్టార్టింగ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ డిఫరెంట్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం, కమర్షియల్ ట్యాగ్ కోసం ఊవ్విళ్లూరుతున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ లాంటి మాస్ స్సెషలిస్ట్తో లోఫర్ సినిమా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకేసారి క్లాస్, మాస్ బ్యాలెన్స్ చేస్తూ రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమా గురించి ఆలోచించని ఈ జనరేషన్లో, ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు వరుణ్. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్ ప్రారంభించిన ఈ టాల్ హీరో మొదటి షెడ్యూల్ పూర్తి చేసేశాడు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మరో సినిమా ఫిదా షూటింగ్‌ను కూడా మొదలెట్టేశాడు. ఒకే సమయంలో శ్రీనువైట్ల లాంటి మాస్ డైరెక్టర్‌తో, శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్‌తో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలు సాధించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు వరుణ్ తేజ్. -
ప్రేమ.. ద్వేషం... ఓ ప్రేమకథ
‘‘సంవత్సరం ముందే శేఖర్ కమ్ముల నాకీ లైన్ చెప్పారు. స్క్రిప్ట్ రెడీ అయ్యాక చదివాను. చాలా నచ్చింది. ‘కంచె’ సినిమాలో వరుణ్‌తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమాకు వరుణ్ తేజ్‌ను హీరోగా తీసుకుందామని శేఖర్ చెప్పారు. సాయి పల్లవి నటించిన మలయాళ ‘ప్రేమమ్’ సూపర్ హిట్. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జోడి ఈ సినిమా 50 శాతం సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘ఫిదా’ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ప్రారంభమైంది. ‘లవ్- హేట్- లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రవిశేషాలను ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అమెరికా అబ్బాయి ప్రేమలో పడతాడు. కథానాయిక తెలంగాణాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి కావడంతో ఆ రాష్ట్రంలోని బాన్సువాడను ఎంపిక చేశాం. బాన్సువాడాలో 45 రోజులు, అమెరికాలో మరో 45 రోజులు షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. నటుడు నాగేంద్రబాబు, చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సాయి పల్లవి తదితరులు పాల్గొన్నారు. -
'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్
మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, మెగా హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. లవ్.. హేట్.. లవ్ స్టోరీ కాన్సెప్ట్‌గా 'ఫిదా' అనే పేరుతో కూల్ యూత్‌ఫుల్ ఎంటర్టెయినర్ని నిర్మించనున్నారు. శుక్రవారం ఫిదా థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్‌ను వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. మలయాళ 'ప్రేమమ్' ఫేం సాయి పల్లవి వరుణ్ సరసన నటిస్తుంది. హిందీలో హిట్ అయిన కహానీకి రీమేక్‌గా నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తీసిన సినిమా 'అనామిక' తడబడటంతో.. రెండేళ్ల గ్యాప్ తరువాత మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌కు కీలకం కానుంది. కంచె, లోఫర్ సినిమాలతో నటుడిగా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన వరుణ్.. శేఖర్ మార్క్ హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న 'ఫిదా'పై అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. Here you go!..the theme poster of my next with Shekar Kamulla #Fidaa #LoveHateLoveStory pic.twitter.com/GHdcoqLcLB — Varun Tej (@IAmVarunTej) 5 August 2016