చిరంజీవి తరువాత వరుణ్ మాత్రమే..!
ఫిదా సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈసినిమాతోనే రికార్డుల వేట మొదలు పెట్టాడు. రిలీజ్ అయి రెండు వారాలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుండటంతో రికార్డుల గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఫిదా ఓవర్ సీస్ లో 1.62 మిలియన్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే 2 మిలియన్ల మార్క్ సాధించటం ఖాయంగా కనిపిస్తోంది.
దీంతో మెగా హీరోల్లో ఈ రికార్డు సాధించిన రెండో హీరోగా రికార్డు సృష్టించనున్నాడు వరుణ్. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే 2 మిలియన్ల క్లబ్ లో ఉన్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాతో 2.45 మిలియన్ల వసూళ్లు సాధించి మెగాస్టార్ స్టార్ ఈ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఫిదా సినిమాతో వరుణ్ ఈ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు.
ప్రస్తుతానికి అత్తారింటికి దారేది సినిమాతో పవన్ 1.90 మిలియన్లతో వరుణ్ కన్నా ముందుండగా ఈ వారాంతానికే పవన్ కలెక్షన్లను వరుణ్ దాటేస్తాడని భావిస్తున్నారు. మిగిలిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ల ఓవర్ సీస్ రికార్డులను ఫిదా సినిమాతో వరుణ్ ఇప్పటికే దాటేయటం విశేషం.