overseas collections
-
సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం
సూపర్ స్టార్, ప్రిన్స్, నాని ఇలా ముద్దుగా మహేష్ బాబును ఆయన ప్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. ఆయన తండ్రి బాటలో నడిచిన బాటసారి. అందుకే ఆ దారి రహదారి అయింది. ఒక్కసారి మహేష్ క్రియేట్ చేసిన రికార్డులను తిరగేస్తే చెబుతుంది ఆయన ఫ్యాన్ బేస్ ఎలాంటిదనేది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ కలెక్షన్ల సునామీ సృష్టించాడు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆమెరికాలో ఆయన ఫ్యాన్స్ భారీగానే ప్లాన్ చేశారు. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ప్రారంభం కానున్నా ఇప్పటికే సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో మెసేజ్‌లు వెల్లువలా వస్తున్నాయి. దీంతో పాటు బిజినెస్మెన్ సినిమా కూడా రీరిలీజ్ కానున్నడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓవర్సీస్లో మహేష్‌నే కింగ్ ఇప్పటికీ ఓవర్సీస్లో కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్‌లో అందనంత ఎత్తులో మహేష్ ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన 11 సినిమాలు వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినవి ఉన్నాయి. తెలుగులో ఇతర హీరోలకి ఇప్పట్లో అందనంత దూరంలో టాప్ ప్లేస్‌లో ఆయన ఉన్నాడు. ఘట్టమనేని అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన వారందరూ కూడా ఓవర్సీస్ గడ్డ మహేష్ బాబు అడ్డా అంటుంటారు. ఆయన తర్వాతి స్థానాల్లో తెలుగు నుంచి నాని, ఎన్టీఆర్‌లు ఉన్నారు. అమెరికా మార్కెట్ లో అత్యధిక సార్లు 1 మిలియన్ డాలర్స్ రాబట్టిన హీరోల లిస్ట్ రీసెంట్గా విడుదలైంది. (ఇదీ చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) ఇందులో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 30 సినిమాలు 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేశాయి. తర్వాత వరసుగా అక్షయ్ కుమార్ 25 సార్లు, సల్మాన్ ఖాన్ 23 సార్లు, హృతిక్ రోషన్ 17 సార్లు, ఆమిర్ ఖాన్ 13 సార్లు, అజయ్ దేవగన్ 12 సార్లు వన్ మిలియన్ డాలర్స్ బీట్ చేసిన వారిలో ఉన్నారు. ఈ లిస్టులో తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు.. సౌత్ మొత్తం నుంచి మహేష్ బాబు మాత్రమే ఉండడం విశేషం. ఇక్కడ జాబితాలో ఉన్న బాలీవుడ్ హీరోలందరూ కనీసం నలభైకి పైగా సినిమాలు చేసిన వాళ్లే ఉండగా మహేష్ మాత్రం కేవలం 27 సినిమాలకే అక్కడ చోటు దక్కించుకున్నాడు. -
ఓవర్సీస్లో దుమ్మురేపిన సాహో
ప్రభాస్ నటించిన సాహో.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. బాహుబలి సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. రెండేళ్ల గ్యాప్ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడం.. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించడంతో సాహోపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ రోజు విడుదలైన సాహోతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. (‘సాహో’ మూవీ రివ్యూ) అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరిచేలా ఉందంటూనే.. కొంత డివైడ్ టాక్‌ను మూటగట్టుకుంది. అయినా.. వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 60-70 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. ఓవర్సీస్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఒక్కరోజులోనే మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి ఔరా అనిపించింది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. యూవీ క్రియేషన్స్‌పై సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. -
‘మహర్షి’ అక్కడ చాలా వెనకపడ్డాడు!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం మహర్షి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. మహేష్ నటించిన 25 వ సినిమా కావటంతో పాటు భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతోంది. సాధారణంగా మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే మహర్షి సినిమా విషయంలో ఆ క్రేజ్ కనిపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. తొలి రోజే మిలియన్ డాలర్ మార్క్‌ను ఈజీగా సాధిస్తుందని అనుకున్నారు. కానీ మహర్షికి మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడానికి మూడు రోజుల సమయం పట్టింది. అంతేకాదు తొలి రోజు ఓవర్ సీస్లో నాన్ బాహుబలి రికార్డ్లను బద్ధలు కొడుతుందన్న అంచనాల మధ్య రిలీజ్ అయిన మహర్షి సినిమా ఖైదీ నంబర్ 150, భరత్ అనే నేను, స్పైడర్ సినిమాల కంటే చాలా వెనకపడింది. టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఫుల్‌రన్ లోనూ మహర్షి రికార్డ్ విషయంలో వెనకబడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. -
మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం!
తెలుగు హీరోలు ఈ మధ్య ఓవర్సీస్లో హవా చాటుతూ టాలీవుడ్ క్రేజ్ పెంచేస్తూ ఉన్నారు. మనోళ్లు అక్కడ మూడు, నాలుగు మిలియన్లు వసూళ్లు చేసేస్తున్నారు. అయితే ఇలా మన హీరోలు జోరు కొనసాగిస్తూ ఉంటే.. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రాలు మాత్రం అక్కడ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. గతేడాది వచ్చిన భారీ చిత్రాల్లో కూడా కొన్ని చిత్రాలు పరాజయం పాలవ్వగా.. ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలు మాత్రం వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. భారీ డిజాస్టర్ మూవీ లిస్ట్‌లోకి ఎగబడి మరీ వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లుకు దారుణంగా నష్టాలు తెచ్చి అత్యంత చెత్త సినిమాలుగా రికార్డులు సృష్టించాయి. అయితే గత శుక్రవారం విడుదలైన మహానాయకుడు ఆ రెండు చిత్రాలతో పోటీపడి అత్యంత చెత్త సినిమాగా రికార్డుకెక్కేందుకు సిద్దమైంది. ఈ మహానాయకుడు కలెక్షన్లు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ మూవీ కనీసం నాలుగు కోట్లు కూడా వసూళ్లు చేయలేదని సమాచారం. బాలయ్య లాంటి పెద్ద హీరోకు ఇది మాత్రం ఘోర పరాభావమే. ఇక ఓవర్సీస్లో అయితే ఈ చిత్రం మరి ఘోరంగా దెబ్బతిందని తెలుస్తోంది. అత్యంత భారీ డిజాస్టర్ మూవీగా మహానాయకుడు రికార్డును.. ఈ ఏడాదిలో మరే చిత్రం అధిగమించకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. -
ఓవర్సీస్లో దుమ్ములేపుతున్న ‘ఎఫ్2’
వంద కోట్ల గ్రాస్‌ను దాటి సంచలనం సృష్టించిన ఎఫ్2.. ఓవర్సీస్లోనూ దూసుకుపోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సంక్రాంతి బరిలో దిగి.. సూపర్‌హిట్‌గా నిలిచింది ఎఫ్2. ఇప్పటికీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం ఓవర్సీస్లో రెండు మిలియన్ల మార్కును చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మలిచారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. $2 Million in USA 💥⚡️ BOMMA BLOCKBUSTER!! Anthegaa... Anthegaaa.... 🤗🤗#F2 #FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP Directed by @AnilRavipudi pic.twitter.com/hKbDR5HlH3 — Sri Venkateswara Creations (@SVC_official) January 27, 2019 -
ఎన్టీఆర్ అరుదైన రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్సీస్లో కూడా మంచి జోరు చూపిస్తున్న అరవింద సమేత ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది. అయితే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన హీరోలు గతంలో కూడా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఈ రికార్డ్‌ను వరుసగా నాలుగు సార్లు సాదించటం విశేషం. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం. చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ -
బాలీవుడ్ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ
విజయ్ దేవరకొండ వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం విజయ్ స్టార్‌డమ్‌ను పెంచేసింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్.. గోవిందుడిగానూ ప్రేక్షకులను మెప్పించేశాడు. వసూళ్లలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘గీత గోవిందం’కు ఎదురులేకుండా పోయింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడే కాక ఓవర్సీస్లో కూడా దూసుకెళ్తోంది. అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక ఆస్ట్రేలియాలో పరిస్థితిని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు నిద్ర పట్టేలా కనిపించడం లేదనిపిస్తోంది. అక్కడ గత వారం విడుదలైన గోల్డ్, సత్యమేవ జయతే సినిమాలు ‘గీత గోవిందం’ ధాటికి నిలబడలేకపోతున్నాయట. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’, జాన్ అబ్రహం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’ సినిమాలు ఆస్ట్రేలియాలో ‘గీత గోవిందం’ జోరు చూసి ఖంగుతిన్నాయట. ఈ రెండు కలిసి 1.92లక్షల డాలర్లు వసూళ్లు చేయగా.. గీత గోవిందం మాత్రం 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసిందని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు విజయ్ దేవరకొండ హవా ఏ రేంజ్లో ఉందో. పరుశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్గా నటించింది. Guess which Indian film has proven a tough opponent to #Gold and #SatyamevaJayate in Australia? Telugu film #GeethaGovindam, starring Vijay Deverakonda... The *combined* weekend biz of the two Hindi films [A$ 192,306] is less than that of #GeethaGovindam [A$ 202,266]. @comScore — taran adarsh (@taran_adarsh) August 20, 2018 -
ఓవర్సీస్లోనూ దుమ్ము దులుపుతున్నాడు!
‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ తన మేనియాను సృష్టించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ స్టార్ హీరో స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం సినిమా హిట్ అవడమే కాదు.. తన నటనకు సినీ విశ్లేషకులు, సెలబ్రెటీల నుంచి మెప్పును పొందుతున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటినుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్లు కలెక్ట్ చేస్తోన్న‘గీత గోవిందం’ సినిమాతో.. తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కలెక్షన్స్ పరంగా దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్‌ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్లకు పరుగెడుతోంది. రష్మిక మందాన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. #GeethaGovindam grossed $1.5+ million at US Box-office #GeethaGovindamRampage pic.twitter.com/H5zQnNlLjV — BARaju (@baraju_SuperHit) August 20, 2018 -
కలెక్షన్స్‌లో ‘కాలా’ అక్కడ టాప్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు టాక్‌తో సంబంధం ఉండదు. సినిమా విడుదలయ్యిందా.. రికార్డులు బద్దలయ్యాయా? లేదా? అన్నట్లు ఉంటుంది. తలైవాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కాలా సినిమాకు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చినా.. తమిళనాట మాత్రం సినిమా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లను రాబట్టింది కాలా. ఓవర్సీస్లో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆస్ట్రేలియాలో తొలి వారాంతానికి 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ఫస్ట్ వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కాలా నిలిచింది. కాగా సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమా టాప్ ప్లేస్‌లో ఉంది. రానున్న రోజుల్లో కాలా మరిన్ని రికార్డులు తిరగరాస్తుందేమో చూడాలి. #Kaala is SUPERB in Australia... Emerges SECOND HIGHEST *opening weekend grosser* of 2018 [Indian films], after #Padmaavat... Thu A$ 105,672 Fri A$ 100,662 Sat A$ 110,616 Sun A$ 85,263 Total: A$ 402,213 [₹ 2.04 cr]@Rentrak — taran adarsh (@taran_adarsh) June 11, 2018 -
ఓవర్సిస్లో దూసుకెళ్తోన్న ‘మహానటి’
అలనాటి అందాలనటి సావిత్రికి ఘన నివాళిగా నిలిచింది ‘మహానటి’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్, సావిత్రి పాత్రకు ప్రాణం పోశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఓవర్సిస్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం మహానటి ఓవర్సిస్లో 2.5 డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహానటి సినిమాకు కాలం కూడా కలసి వస్తోంది. ఈ వారం విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడం కూడా మహానటికి కలిసి వచ్చే అంశం. ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందంటున్నారు విశ్లేషకులు. Savitramma continues to rule the box office! Thank you for 2.5 Million 😊 #Mahanati Thank You Everyone.@SwapnaCinema @KeerthyOfficial @dulQuer @Samanthaprabhu2 @TheDeverakonda @nagashwin7 @adityamusic @NirvanaCinemas @dancinemaniac pic.twitter.com/nnc2uqGBsq — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 29, 2018 -
‘మహానటి’ ఖాతాలో మరో రికార్డ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. తొలి షో నుంచే సూపర్ హిట్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓవర్ సీస్లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటిపై వసూళ్ల వర్షం కురుస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఓవర్ సీస్లో ఇప్పటి వరకు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
ఓవర్సీస్లో ‘మహానటి’కి బ్రహ్మరథం
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి చిత్రం ఓవర్ సీస్లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే అమెరికాలో మిలియన్ డాలర్ (ఆరు కోట్ల రూపాయల) మార్క్‌ను దాటిన మహానటి సినిమా ఇతర ప్రాంతాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. మహానటి ఓవర్ సీస్ కలెక్షన్ల వివరాలు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు (64.03 లక్షల రూపాయలు), యూకేలో 28,373 పౌండ్లు (25.90 లక్షల రూపాయలు), న్యూజీలాండ్‌లో 9,899 డాలర్లు ( 4.65 లక్షల రూపాయల) వసూళ్లు సాధించినట్టుగా వెల్లడించారు. కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్ నిర్మాత అశ్వనిదత్, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాను అన్ని చోట్లా సూపర్ హిట్ రావటంతో వసూళ్ల పరంగా కూడా మహానటి చిత్రం సత్తా చాటుతోంది. -
ఓవర్ సీస్లో సత్తా చాటిన భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్ అనే నేను. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్ ల తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా మరోసారి మహేష్ కలెక్షన్ స్టామినాను ప్రూవ్ చేస్తోంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ఫ్లాప్ సినిమాలతో కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించే మహేష్, భరత్ అనే నేను సినిమాతో మరిన్ని రికార్డులు సాధిస్తున్నడు. తెలుగు రాష్ట్రాల్లో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిన సూపర్ స్టార్ ఓవర్ సీస్లో రెండు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ఆమని, సితారలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Bharat Ane Blockbuster Superstar @urstrulyMahesh's #BharatAneNenu crossed 2 Million mark in US within 2 Days — BARaju (@baraju_SuperHit) 22 April 2018 -
కలెక్షన్స్: ఆ మార్క్‌ను దాటిన రంగస్థలం
సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాకు యూఎస్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అతితక్కువ రోజుల్లోనే రెండు మిలియన్ల మార్క్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. చెర్రీకి ఓవర్సీర్ మార్కెట్లో పెద్దగా పట్టు లేదనే వారికి ‘రంగస్థలం’ ద్వారా తన స్టామినా ఏంటో చూపించాడు. ధృవ సినిమాతో యూఎస్‌లో మిలియన్ డాలర్ హీరోగా చెర్రీ ఎంట్రీ ఇచ్చాడు. ధృవ సినిమాకు చెర్రీ, చిత్రయూనిట్ కలిసి అమెరికాలో ప్రమోషన్ చేశారు. అయితే రంగస్థలం సినిమాకు మాత్రం యూఎస్‌లో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో అభిమానులు కంగారుపడ్డారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుంటే ఓవర్సీస్లో కలెక్షన్లు తగ్గుతాయేమోనని అనుకున్నారు. కానీ కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ లేకున్నా కలెక్షన్లు దుమ్ముదులుపుతాయని రంగస్థలం నిరూపించింది. గ్రామీణ నేపథ్యం, చెర్రీ నటన, సుకుమార్ టేకింగ్ ఈ సినిమాకు హైలెట్ కావడంతో ఎన్నారైలు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. Whatte solid #RangasthalamWave at the Box Office, #2MillionRangasthalam 🔥 pic.twitter.com/AkIAM1Z5Do — Mythri Movie Makers (@MythriOfficial) April 1, 2018 -
రుద్రమదేవి రికార్డు బద్దలు కొట్టిన భాగమతి
టాలీవుడ్ దేవసేన అనుష్క నటించిన భాగమతి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదైలనప్పటి నుంచి భారీగా వసూళ్లను రాబడుతోంది. తొలిరోజునే పాజిటాక్ తెచ్చుకున్న ‘భాగమతి’ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం లోనే సుమారు రూ.20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు భారీ లాభాలనే ముట్టచెప్పింది. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’ అమెరికాలో 9.71 లక్షల డాలర్లను వసూలు చేసింది. తాజాగా ‘భాగమతి’ ఆరికార్డును చెరిపేసింది. ఇప్పటికే 9.80 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న భాగమతి మిలియన్ మార్క్‌కు అతి సమీపంలో ఉంది. దక్షిణాదిన హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. భారీ కలెక్షన్లతో తన పేరుతో ఉన్న రికార్డును తానే తిరగరాసింది. మొత్తానికి చాలా మంది టాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును అనుష్క అందుకుంది. -
దంగల్ రికార్డ్ బ్రేక్, స్పైడర్ రికార్డ్ సేఫ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విజయ్ కెరీర్ లోనే తొలిసారిగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన మెర్సల్ ఓవర్సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది. అమెరికాలో 132 చోట్ల రిలీజ్ అయిన మెర్సల్.. దంగల్, రాయిస్ లాంటి బాలీవుడ్ చిత్రాలను రికార్డ్ లను బద్దలు కొట్టినట్టుగా ఫోర్బ్స్ తెలిపింది. మంగళవారం రిలీజ్ అయిన మెర్సల్ తొలిరోజు ఏకంగా 3,57,925 డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో తొలి రోజు 3,28,227 డాలర్లు సాధించిన దంగల్ ను వెనక్కు నెట్టి రికార్డ్ సృష్టించింది మెర్సల్. అయితే ఇటీవల విడుదలైన మహేష్ బాబు స్పైడర్ ను మాత్రం మెర్సల్ బీట్ చేయలోకపోయింది. అమెరికాలో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజే స్పైడర్ 10 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలేవి బాహుబలి 2 దారిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాహుబలి 2 తొలిరోజు ఓవర్ సీస్ లో 55 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. -
ఓవర్ సీస్ లో 'జై లవ కుశ' హవా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా విడుదలైన తాజా చిత్రం జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో అదే స్థాయిలో భారీ వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా జై లవ కుశ రికార్డ్ సృష్టించింది. బుధవారం సాయంత్రమే మొదలైన ప్రీమియర్ షోస్ కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. దీంతో ప్రీమియర్ షోస్ తోనే 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ జై లవ కుశ వసూళ్లను సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రీమియర్ షోస్ తో 5,89,390 డాలర్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం 1,44,894 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా 7,34,284 డాలర్ల కలెక్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఇంకా వీకెండ్ కి శుక్ర, శని, ఆది వారాలు మిగిలి ఉండటంతో తొలి వారాంతానికే సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. Telugu film #JaiLavaKusa is racing towards $ 1 million in USA... Wed $ 589,390, Thu $ 144,894. Total: $ 734,284 [₹ 4.76 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 22 September 2017 -
టాప్ టెన్‌లో 'అర్జున్ రెడ్డి'
వివాదాస్పద చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్ లను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్ సీస్ మార్కెట్లో మరో రికార్డు ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్న అర్జున్ రెడ్డి, అక్కడ హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్‌లో టాప్ టెన్‌లో స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకు 16,82,000 డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో పదో స్థానం దక్కించుకుంది. అర్జున్ రెడ్డి కన్నా ముందు బాహుబలి రెండు భాగాలతో పాటు శ్రీమంతుడు, అ..ఆ.., ఖైదీ నంబర్ 150, ఫిదా, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్ లు సాధించే దిశగా దూసుకుపోతోంది. -
మిలియన్ క్లబ్లో అర్జున్ రెడ్డి
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి, ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. వివాదాలతోనే భారీ పబ్లిసిటీ పొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ అర్జున్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఓవర్ సీస్ లో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరక్కపోయినా.. మంచి టాక్ రావటంతో వసూళ్లు భారీగా ఉన్నాయి. తొలి రోజు 4.6 లక్షల డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా రెండో రోజు 2.8 లక్షల డాలర్లు వసూళు చేసింది. ఇప్పటి మంచి వసూళ్లు సాధింస్తుండటంతో తొలి వారాంతానికి మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు జోడిగా షాలిని పాండే నటించింది. -
చిరంజీవి తరువాత వరుణ్ మాత్రమే..!
ఫిదా సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈసినిమాతోనే రికార్డుల వేట మొదలు పెట్టాడు. రిలీజ్ అయి రెండు వారాలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుండటంతో రికార్డుల గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఫిదా ఓవర్ సీస్ లో 1.62 మిలియన్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే 2 మిలియన్ల మార్క్ సాధించటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మెగా హీరోల్లో ఈ రికార్డు సాధించిన రెండో హీరోగా రికార్డు సృష్టించనున్నాడు వరుణ్. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే 2 మిలియన్ల క్లబ్ లో ఉన్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాతో 2.45 మిలియన్ల వసూళ్లు సాధించి మెగాస్టార్ స్టార్ ఈ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఫిదా సినిమాతో వరుణ్ ఈ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి అత్తారింటికి దారేది సినిమాతో పవన్ 1.90 మిలియన్లతో వరుణ్ కన్నా ముందుండగా ఈ వారాంతానికే పవన్ కలెక్షన్లను వరుణ్ దాటేస్తాడని భావిస్తున్నారు. మిగిలిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల ఓవర్ సీస్ రికార్డులను ఫిదా సినిమాతో వరుణ్ ఇప్పటికే దాటేయటం విశేషం. -
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 3 మిలియన్లు
బాహుబలి 2 రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఇప్పటికే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాహుబలి.. యుఎస్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్ సీస్ కలెక్షన్లలో మినియన్ మార్క్ చేరుకునేందుకు చాలా మంది స్టార్ హీరోలు కష్టపడుతుంటే బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసేసింది. బాహుబలి ప్రీ సేల్స్ లోనే మూడు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రేట్ ఇండియా ఫిలిం ప్రకటించారు. ఇప్పటికే భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ప్రతీ గంటకు లక్ష డాలర్ల చొప్పున కలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాహుబలి ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, ప్రీమియర్స్ షోను గురువారం రాత్రి నుంచే ప్రారంభిస్తున్నారు. కేవలం ఓవర్ సీస్ లోనే కాకుండా ఇండియాలోనూ ప్రీమియర్స్ షోస్ పేరుతో గురువారం రాత్రి నుంచే బాహుబలి ప్రదర్శనలు ప్రారంభిస్తున్నారు. -
విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు!
హైదరాబాద్: బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కూతళ్లను ఛాంపియన్లుగా మలచడాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన దంగల్ మూవీ ఆరో వారం మంచి కలెక్షన్లను వసూలుచేస్తోంది. ఈ నెల 27నాటికి ఓవర్సీస్లో 29.69 మిలియన్ డార్లు (భారత కరెన్సీలో రూ.202.21 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. నిన్న (శుక్రవారం) 28 లక్షలు వసూలు చేసిన దంగల్ మూవీ భారత్‌లో రూ.384.15 కోట్లతో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. భారత్‌లో, విదేశాలలో చూస్తే ఓవరాల్‌గా రూ.586.36 కోట్లు వసూళ్లు రాబట్టి మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ మ్యాజిక్‌ను మరోసారి నిరూపించిన మూవీ దంగల్. భారత్‌లో కలెక్షన్లు ఇదే తీరుగా కొనసాగితే దేశంలో రూ.400 కోట్లు వసూలుచేసిన తొలి చిత్రంగానూ మరో రికార్డును చేరుకుంటుంది. -
రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి
ముంబై: కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ఆమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా దంగల్ మరో ఘనత సాధించింది. ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్ల రూపాయల మార్క్ దాటింది. ఈ నెల 22 నాటికి విదేశీ మార్కెట్లో దంగల్ 200.65 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించిన దంగల్ మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా ఆదివారం నాటికి 381.07 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తుండటంతో 400 కోట్ల రూపాయల మార్క్ బిజినెస్‌ను దాటుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే 400 కోట్ల రూపాయల కలెక్షన్లు (దేశంలో) సాధించిన తొలి భారతీయ సినిమాగా దంగల్ చరిత్రలో నిలిచిపోతుంది. -
ఓవర్సీస్లో చిన్నవాడి హవా
అసలు థియేటర్ల వరకు జనాలు వస్తారా అనుకుంటున్న సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది నిఖిల్ సినిమా. శంకరాభరణం లాంటి డిజాస్టర్ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. టైగర్ ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. పోటి కూడా లేకపోవటంతో ఈ చిన్న సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్‌సీన్‌లో మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోలతో 25 వేల డాలర్లు సాధించటంతో ఎక్కడికిపోతావు చిన్నవాడా కలెక్షన్లు జస్ట్ ఓకె అనుకున్నారు. అయితే రిలీజ్ రోజు మాత్రం ఓవర్సీస్లో కూడా దుమ్ముదులిపేసింది ఈ మూవీ. శుక్రవారం 95 వేల డాలర్లు సాధించి నిఖిల్ కెరీర్లోనే ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే 2.8 లక్షల డాలర్లు సాధించిన ఈ సినిమా ఈ వారాంతానికి హాఫ్ మిలియన్ మార్క్ రీచ్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.