కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విజయ్ కెరీర్ లోనే తొలిసారిగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన మెర్సల్ ఓవర్సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది. అమెరికాలో 132 చోట్ల రిలీజ్ అయిన మెర్సల్.. దంగల్, రాయిస్ లాంటి బాలీవుడ్ చిత్రాలను రికార్డ్ లను బద్దలు కొట్టినట్టుగా ఫోర్బ్స్ తెలిపింది.
మంగళవారం రిలీజ్ అయిన మెర్సల్ తొలిరోజు ఏకంగా 3,57,925 డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో తొలి రోజు 3,28,227 డాలర్లు సాధించిన దంగల్ ను వెనక్కు నెట్టి రికార్డ్ సృష్టించింది మెర్సల్. అయితే ఇటీవల విడుదలైన మహేష్ బాబు స్పైడర్ ను మాత్రం మెర్సల్ బీట్ చేయలోకపోయింది. అమెరికాలో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజే స్పైడర్ 10 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలేవి బాహుబలి 2 దారిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాహుబలి 2 తొలిరోజు ఓవర్ సీస్ లో 55 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment