mersal
-
ఆ సినిమాకు మూడేళ్లు.. ఫ్యాన్స్ హంగామా
చెన్నై : దళపతి విజయ్, సమంతా అక్కినేని, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన చిత్రం ‘మెర్సల్’. హిట్ సినిమాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017 అక్టోబర్ 18న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే తేదీన తెలుగులో ’అదిరింది’గా విడుదలైంది. ఈ సినిమా నిన్నటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే అంతకు కొద్దిరోజుల ముందు నుంచే దేశ వ్యాప్తంగా ఉన్న దళపతి ఫ్యాన్స్ హంగామా మొదలైంది. పలు పోస్టర్లతో, సినిమాలోని తమకు నచ్చిన సీన్ల వీడియోలను షేర్ చేసుకుంటూ సోషల్‌మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #3YearsOfMegaBBMersal తో ఓ హ్యాస్ ట్యాగ్ ట్విటర్లో వైరల్‌గా మారింది. ( వరలక్ష్మీ దాగుడుమూతలు ) కాగా, రజనీ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని నెలలుగా అభిమానులు చేస్తున్న ప్రచారం రాజకీయ రంగాల్లో కలకలం రేపుతోంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా అన్నాదురై, పెరియార్లతో విజయ్ ఫొటోలను ముద్రించిన పోస్టర్లను అభిమానులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో మీరు రాజకీయాల్లోకి వస్తే అన్నాదురై లేకుంటే పెరియార్ అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రాల్లోని ఆయన గెటప్‌లలో విజయ్ ముఖాలను పొందుపరిచిన పోస్టర్లు కాంచీపురంలో హల్చల్ చేశాయి. అందులో నాడొడి మన్నన్ మాట్టుక్కార వేలన్, కుడియిరుంద, కోయిల్ చిత్రంలోని ఎంజీ రామచంద్రన్ గెటప్పుల్లో విజయ్ ముఖాన్ని పొందుపరిచారు. ఆ పోస్టర్లో మక్కల్ తిలకంకు మరో రూపమే అంటూ పేర్కొన్నారు. 2021 ప్రథమార్థంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మ్యాచ్ కుదిరిందా?
షారుక్ ఖాన్ తమిళ సినిమాలో కనిపించబోతున్నారా? కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ సర్కిల్లో ఇదే చర్చ. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో షారుక్ కనిపిస్తారని టాక్. మరోవైపు తమిళ బ్లాక్‌బస్టర్ ‘మెర్సల్’ను హిందీ రీమేక్ చేసే ఆలోచనలో షారుక్ ఉన్నారని టాక్. మంగళవారం చెన్నై – కోల్కత్తా ఐపీఎల్ మ్యాచ్‌లో షారుక్‌తో పాటు దర్శకుడు అట్లీ కూడా స్టేడియంలో కనిపించడంతో అట్లీ నెక్ట్స్ సినిమాలో షారుక్ కనిపిస్తారనే వాదనకు బలం చేకూరింది. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీస్‌కి షారుక్ ఖాన్ వెళ్లారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరి ఈ చర్చలు విజయ్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపించడానికా? లేక ‘మెర్సల్’ రీమేక్ కోసమా? తెలియాల్సి ఉంది. -
విజయ్ ఖాతాలో మరో రికార్డ్..!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ ఫాంలో ఉన్న ఇళయ దళపతి తన సినిమాలతో వరుసగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరో మరో అరుదైన రికార్డ్‌ను సాధించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు చైనా అతిపెద్ద మార్కెట్ గా తయారవుతున్న నేపథ్యంలో విజయ్ తన సినిమాను అక్కడ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు 120 కోట్లకుపైగా షేర్ సాధించి విజయ్ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మెర్సల్ యూనిట్. ఇటీవలే ఇండియన్ సినిమాలో చైనా మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు బాహుబలి తప్ప దంగల్, భజరంగీ భాయ్‌జాన్, సీక్రెట్ సూపర్ స్టార్, ప్యాడ్‌మేన్ లాంటి బాలీవుడ్ చిత్రాలు మాత్రమే చైనాలో రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చైనాలో రిలీజ్ అవుతున్న తొలి తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది మెర్సల్. ఈ సినిమాను సల్మాన్ భజరంగీ భాయ్‌జాన్‌తో చైనాలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థే రిలీజ్ చేస్తుండటంతో మెర్సల్ చైనా రిలీజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఇళయ దళపతి పుట్టిన రోజు కానుకగా!
‘మెర్సల్’ సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మురగుదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్ హిట్ కావటంతో హ్యాట్రిక్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాలో విజయ్ లుక్కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్‌కు చిత్రయూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారు. విజయ్ పుట్టిన రోజు(జూన్ 22) సందర్భంగా జూన్ 21 సాయంత్రం 6 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపాకిళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్! The First Look and Movie Title of #Thalapathy62WithSunPictures will be revealed on @SunTV at 6pm on June 21st.#Thalapathy62FirstLookon21st@actorvijay @ARMurugadoss @arrahman pic.twitter.com/vIZcckui1n — Sun Pictures (@sunpictures) 18 June 2018 -
సినిమా కష్టాలు
-
‘తెలుగు సినిమా చేయట్లేదు’
కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అట్లీ. రాజా రాణీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, తరువాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తేరి, మెర్సల్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించటంతో అట్లీ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే కొద్ది రోజులుగా అట్లీ తదుపరి చిత్రాన్ని తెలుగులో రూపొదించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన అట్లీ అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి తెలుగు సినిమా చేసే ఆలోచన లేదని తెలిపారు. గలాటా నక్షత్ర అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న అట్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి తెలుగు సినిమా చేయటం లేదన్న అట్లీ భవిష్యత్తులో టాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తానన్నారు. మెర్సల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. -
ఆ పని మాత్రం చేయను!
తమిళసినిమా: నటి నిత్యామీనన్ రూటే వేరని చెప్పవచ్చు. చాలా వరకూ లవ్లీ పాత్రలు చేసిన ఈ మాలీవుడ్ భామ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత నిస్తోందనే చెప్పవచ్చు. ఆ మధ్య కాంచన 2 చిత్రంలో దివ్యాంగురాలిగా నటించి మెప్పించిన నిత్యామీనన్, మణిరత్నం దర్శకత్వం చిత్రం కాదల్ కణ్మణి చిత్రంలో హీరోతో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేసే పాత్రలో నటించి అలరించింది. అదే విధంగా మెర్శల్ చిత్రంలో విజయ్‌కు జంటగా పల్లెటూరి అమ్మాయిగా నటించడానికి బరువు కూడా పెరిగింది. ఇక ఇటీవల తెలుగు చిత్రం ‘అ’లో లెస్బియన్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పాత్రలో నటించిన నిత్యామీనన్‌ను విమర్శించిన వారూ లేకపోలేదు. అలాంటి విమర్శలను డోంట్‌కేర్ అంటున్న నిత్యామీనన్ మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిలో ఒకటి రెండు చిత్రాలే తన వల్ల నటించడం అవుతుందని అంది. కారణం సాధారణ హీరోయిన్ పాత్రలను తాను కోరుకోవడంలేదని చెప్పింది. ఇక షూటింగ్ స్పాట్లో తన పాత్రను డెవలప్ చేసుకునే విషయంలోనూ, సంభాషణల గురించి దర్శకుడితో చర్చిస్తానని చెప్పింది. ఎందుకంటే తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని చెప్పింది. అందుకే సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నానని అంది. భవిష్యత్‌లో కచ్చితంగా మెగాఫోన్ పడతానని, అయితే సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టే పొరపాటును మాత్రం చేయనని అంటోంది. మరి ఈమె దర్శకత్వం వహించే చిత్రాన్ని నిర్మాతగా ఎవరు ముందుకొస్తారో చూడాలి. -
దేశ వ్యాప్తంగా సెన్సార్ అధికారుల బదిలీ
దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటనను వెల్లడించింది. ఇటీవల సెన్సార్ విషయంలో పలు ఆరోపణలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దర్శక నిర్మాతలు సెన్సార్ బోర్డు సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓకేసారి దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై సెన్సార్‌బోర్డు అధికారిగా ఉన్న అన్భుళగన్ స్థానంలో షీలా మీనాక్షిని నియమించారు. ఇంతకు ముందు ఈమె ఢిల్లీ దూరదర్శన్‌లో పని చేశారు. ఇదే విధంగా కోల్‌కతా సెన్సార్ అధికారిగా సామ్రాట్‌బందోపాధ్యాయ, బెంగళూర్ సెన్సార్ అధికారిగా గురుప్రసాద్, ముంబై అధికారిగా రాయ్ పూర్‌కు చెందిన కర్మార్కర్ తుషార్ అరుణ్, తిరువనంతపురం అధికారిగా గౌహతికి చెందిన ఎల్.పార్వతి, కటక్‌కు ఢిల్లీకి చెందిన శుభశ్రీ మహాపత్రా, హైదరాబాద్‌కు చెందిన రకుల్ గౌలికర్ హైదరాబాద్ సెన్సార్ అధికారిగా నియమితులయ్యారు. -
పెళ్లి విషయంలో ఒత్తిడి ఉంది: నటి
సాక్షి, చెన్నై: మెర్శల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం క్వీన్ చిత్ర తమిళ్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్‌లో నటిస్తోంది. కాజల్ తెలుగులో తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తోంది. ఈ బ్యూటీ నటిగా పరిచయం అయింది ఈ దర్శకుడి చిత్రంతోనే అన్నది గమన్హారం. కథానాయకిగా సెటిల్ అయిన తరువాత తన చెల్లెలు నిషాను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చింది. అయితే నిషా చాలా తక్కువ చిత్రాలతోనే సరి పెట్టుకంది. ఆపై అవకాశాలు లేకపోవడంతో పెళ్లిపై మొగ్గు చూపింది నిషా. 2013లో ఆ ముచ్చట తీర్చుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. కాజల్ మాత్రం వరుస అవకాశాలతో తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. కాగా మెర్శల్, తెలుగులో నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాల సక్సెస్‌తో తన పారీతోషికాన్ని పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ వదంతులేనని కాజల్ కొట్టిపారేసింది. చెల్లి పెళ్లి చేసుకోవడంతో అక్క పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నను కాజల్ అగర్వాల్ చాలా కాలంగానే ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నకు తాజాగా స్పందించిన ఈ అమ్మడు ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే ఇంట్లో మాత్రం పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్నారని చెప్పింది. మంచి వ్యక్తిత్వం కలిగి, తనను అర్ధం చేసుకునే వ్యక్తి కనపడితే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అలాంటి వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోందని కాజల్ చెప్పారు. అయితే ప్రస్తుతానికి తన నట పయనాన్ని కొనసాగించడానికే ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. హీరోయిన్గా మంచి పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానని కాజల్ పేర్కొన్నారు. -
రజినీ కాంత్‌ను దాటేసిన విజయ్
-
‘అదిరింది’ వచ్చేస్తోంది..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మెర్సల్. జాతీయ స్థాయిలో వివాదాలకు కారణమైన ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికే మెర్సల్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘అదిరింది’ రిలీజ్ విషయంలో మాత్రం ఆపసోపాలు పడుతోంది. తమిళ సినిమాతో పాటు ఒకేసారి రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా అదిరింది రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్టుగా తెలుగు వర్షన్ నిర్మాతలు ప్రకటించారు. సెన్సార్ సర్టిఫికేట్ కూడా అందటంతో నవంబర్ 9న అదిరింది రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఈ సారైన చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ అవుతుందేమో చూడాలి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన సమంత, కాజల్, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. Censor Cleared. #Adhirindhi going to hit theatres on Nov. 9th.#Mersal @ThenandalFilms @actorvijay @Atlee_dir — Northstar (@nseplofficial) 2 November 2017 -
‘మెర్సల్’ రీమేక్‌పై నిర్మాతల క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ సినిమా మెర్సల్. విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు ఇళయదళపతి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికేఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. తెలుగులో మెర్సల్‌ను అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఇక అదిరింది రిలీజ్ కాదన్న ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో మెర్సల్ రీమేక్ హక్కులను అల్లు అరవింద్ తీసుకున్నారని ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయనున్నారన్న టాక్ వినిపించింది. అయితే వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. మెర్సల్ రీమేక్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్న శ్రీ తేనండాల్ స్టూడియోస్, త్వరలోనే అదిరింది రిలీజ్ అవుతుందని తెలిపింది. -
అదిరింది... అసలు రిలీజ్ అవుతుందా..!
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్. ఇళయ దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్‌లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో డాక్టర్లను కూడా అవమానకరంగా చూపించారంటూ నిరసనలకు దిగటంతో మెర్సల్ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వివాదాలతో భారీ పబ్లిసిటీ పొందిన మెర్సల్ రికార్డ్ కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. అయితే తమిళ సినిమాతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ అదిరిందిని కూడా రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. కాని అనుకున్న సమయానికి తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. తెలుగు నిర్మాతలు రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా అదిరింది రిలీజ్‌ను తమిల నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. సెన్సార్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ప్రకటించినా నిర్మాతలు తెలుగు రిలీజ్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ శుక్రవారం అయినా అదిరింది థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఇక నిర్మాతలు అదిరింది రిలీజ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
షాకింగ్: ఆ సినిమా కలెక్షన్లు ఫేక్ అట!
విజయ్ తాజా సినిమా ’మెర్సల్’ బాక్సాఫీస్‌ను నిజంగానే షేక్ చేస్తోందా? ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి.. రజనీకాంత్ ’రోబో’ (యంతిరన్) తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న రెండో తమిళ సినిమాగా చరిత్ర సృష్టించిందని కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా చుట్టు రాజకీయ వివాదాలు ముసురుకోగా.. తాజాగా ఈ సినిమా వసూళ్లపై వివాదం ముసురుకుంది. ’మెర్సల్’ కలెక్షన్ రికార్డులు ఉత్త ఫేక్ అని ప్రముఖ పంపిణీదారుడు అబిరా రామనాథం కొట్టిపారేశారు. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ మాల్ ఓనర్ అయిన ఆయన తాజాగా ’వుయ్టాకీస్’ తమిళ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ’మెర్సల్’ వసూళ్ల లెక్కలు ఉత్త బూటకమని, ఈ సినిమా ఇంత భారీగా వసూళ్లు సాధించింది అనడానికి ప్రామాణికత ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ కల్పిత ప్రచారాన్ని సృష్టించారని, అయినా సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యూహాన్ని చాలాకాలంగా పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ’నేను 1976 నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను. టికెట్లను బ్లాక్‌లో అమ్మేందుకు అప్పట్లో మేమే ప్రజలను నియమించేవాళ్లం. టికెట్ ధరను పెంచి బ్లాక్‌లో అమ్ముతున్నారని తెలిసి ప్రజలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. తమ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందని ప్రకటిస్తే.. సహజంగానే ఆ సినిమాలో ఏముందో చూడాలన్న ఉత్సుకత ప్రజల్లో ఏర్పడుతుంది. అంత భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసిన సినిమాను మిస్ కావొద్దని ప్రజలు కోరుకుంటారు. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా చెప్తున్న.. నిజానికి ఒక సినిమా థియెట్రికల్ రన్ ముగిసే వరకు ఎంత వసూళ్లు వచ్చాయో నిర్మాతకు తెలియదు’ అని ఆయన వివరించారు. అట్లీ దర్శకత్వంతో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ’మెర్సల్’ సినిమా ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ’మెర్సల్’ కలెక్షన్లు ఫేక్ అంటూ వ్యాఖ్యలు చేసిన డిస్ట్రిబ్యూటర్ అబిరా రామనాథంపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. -
కట్ ముడియాదు
కుదరదంటే కుదరదు. కట్ కుదరదు. ముడియాదంటే ముడియాదు. కట్ ముడియాదు. జి.ఎస్.టి. ఎలాగూ కడుతున్నాం.. సినిమా టిక్కెట్లక్కూడా! వాక్ స్వాతంత్య్రానికి ఉన్న నాలుకను కోస్తానంటారా?! ముడియాదు. ముడియాదంటే ముడియాదు. టాలెంట్ ఉంది. డబ్బుల్లేవు. మెడికల్ సీటు రాలేదు. ఆ బాధ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో అర్జున్ ‘జంటిల్మన్’ చూస్తే తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళతాం. స్ట్రెయిట్‌గా వెళితే పని కాదు. ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు అంటాడు. కొట్టాల్సిన కాగితం కొడితే ఇంకే కాగితాలూ అక్కర్లేదు. ఇంత ఘోరమా! ఎంత ఘోరమో కమల్‌హాసన్ ‘భారతీయుడు’ చూస్తే తెలుస్తుంది. వైద్యో నారాయణ హరి. డాక్టర్ అంటే దేవుడు. కానీ, కార్పోరేట్ హాస్పిటల్లో వైద్యం దెయ్యం! శవాన్ని కూడా పీక్కుతింటుంది. చిరంజీవి ‘ఠాగూర్’ చూస్తే తెలుస్తుంది. బుద్ధుడు ప్రాపంచిక జ్ఞానం కోసం బోధి వృక్షం కిందికి వెళ్లాడు. ఇప్పుడా శ్రమ అక్కర్లేదు. వెళ్లి ఏసీ థియేటర్లో కూర్చుంటే చాలు. వ్యవస్థలోని మ్యాన్‌హోల్స్, లూప్‌హోల్స్ మొత్తం రెండున్న గంటల్లో తెలిసిపోతాయి. శంకర్ అవినీతిని చూపిస్తాడు. వర్మ అండర్‌వరల్డ్‌ను చూపిస్తాడు. మణీసార్ తీవ్రవాదాన్ని చూపిస్తాడు. భన్సాలీ చరిత్రను చూపిస్తాడు. సుకుమార్ లవ్వుని, పూరీజగన్నాథ్ కొవ్వునీ చూపిస్తారు. ఇవన్నీ సినిమాల్లోనే కాదు, సోషల్ స్టడీస్‌లోనూ ఉంటాయి. కానీ అవి చదివినా అర్థం కానివి, ఇవి చూస్తే అర్థమైపోతాయి. అదీ సినిమా పవర్. జి.ఎస్.టి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని మాత్రమే మోదీ చెబుతాడు. జి.ఎస్.టి. అంటే అసలర్థం మన శ్రమలోంచి మరికొంత దోచుకోవడం అని తమిళ్ హీరో విజయ్ చెబుతాడు. అందుకే సినిమాలంటే గవర్నమెంట్లకు భయం.లేటెస్టుగా ఇప్పుడు తమిళ చిత్రం ‘మెర్సల్’ సెంట్రల్ గవర్నమెంట్‌ని ఠారెత్తిస్తోంది. అందులో జి.ఎస్.టి.కి యాంటీగా ఉన్న డైలాగ్స్‌ని కట్ చేయకపోతే సినిమాను ఆడనిచ్చేది లేదని బీజేపీ.. థియేటర్ల ముందు కాపుగాసింది. ఢిల్లీ నుంచి ఒక్క ఆజ్ఞ జారీ అయితే చాలు. మెర్సల్ బంద్ అయిపోతుంది. నిన్న తెలుగులో రిలీజ్ కాబోయి కూడా ‘అదిరింది’ (మెర్సల్) ఆగిపోయింది. ‘మెర్సల్’లో ఏముంది? అసలా టైటిల్లోనే ఉంది. మెర్సల్ అంటే విరుచుకుపడ్డం. చావుదెబ్బ కొట్టడం. కలెక్షన్లలో కూడా మెర్సల్ బాక్సు బద్దలు కొట్టింది. మొదటి మూడు రోజుల్లోనే మోర్ దేన్ హండ్రెడ్ క్రోర్స్! పిక్చర్ రిలీజ్ అయి, ఒక షో నడవగానే కాంట్రావర్సీలు రిలీజ్ అయ్యాయి. మోదీని తిట్టారని, హిందువుల్ని హర్ట్ చేశారని! ‘ఎవర్రాశార్రా ఆ డైలాగులు!’ ఇదే ఇప్పుడు తమిళనాడులో సూపర్ హిట్ డైలాగ్. కోర్టులో కేసులు వేశారు. విజయ్ ఇంటి మీదకు రాళ్లు విసిరారు. బీజేపీ లీడర్ హెచ్ రాజా.. ‘నీ అబ్బ రేయ్.. నీ సంగతి మాకు తెలీదా’ అనే మాటనే కాస్త సాఫ్ట్‌గా విజయ్ ఓటర్ ఐడీని ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘ట్రూత్ ఈజ్ బిట్టర్’ అనే కామెంట్ పెట్టాడు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ అని బయట పెట్టడం అతడి వ్యూహం. కమల్, రజనీ కలిశారు! ‘మెర్సల్ ’ రాజకీయంగా, మతపరంగా ఇప్పుడొక వేడివేడి పెసరట్టు. ఈ అట్టు వేసిన డైరెక్టర్ అట్లీ 31 ఏళ్ల వాడు. ఈ అట్టుకు తగినంత వేడి, నూనె, అల్లం జీలకర్ర, పచ్చిమిరప, ఉల్లిపాయ ముక్కలు జోడించిన విజయేంద్ర ప్రసాద్ 75 ఏళ్ల వాడు. ఆవేశం, అనుభవం కలిశాయి. ఇక సెంటర్‌కి సెగ తగలకుండా ఉంటుందా? జి.ఎస్.టి మీద, డిజిటల్ పేమెంట్ల మీద, దేవాలయాల మీద, డాక్టర్ల మీద సినిమాలో ఉన్న విసుర్లను తీసేయకపోతే సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుందని తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందర్‌రాజన్.. పైకి లెటర్ పెట్టాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైలెంటుగా ‘మెర్సల్’ ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ని తొలగించింది. కలెక్షన్లను తగ్గించి, సినిమాను చంపేయడానికి పైరేటెడ్ సైట్లలో సినిమాను ముక్కలు ముక్కలుగా లింక్ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్, బీజేపీ లీడర్ జి.వి.ఎల్. నరసింహారావు మాటామాటా అనుకున్నారు. ‘వెరీ లో ఐక్యూ, వెరీ లో జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ సినిమా తీశారు’ అని నరసింహారావు టీవీ ఇంటర్వ్యూలో అంటే, అది చూసి ‘హౌ డేర్ యు!’ అని అఖ్తర్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కూడా సీన్లోకి వచ్చారు. ‘మిస్టర్ మోడీ.. తమిళ్ సంస్కృతిని, స్వాభిమానాన్ని డీమోనిటైజ్ చెయ్యడానికి ట్రై చెయ్యకండి’ అని ట్వీట్ చేశారు. రజనీ, కమల్ కూడా నోరు తెరిచారు. సినిమా సూపర్ అన్నారు. పెద్ద హీరోలు ఆ మాత్రం అన్నా చాలు. పెద్ద సపోర్ట్. ఇప్పుడేం జరుగుతుంది? ‘మెర్సల్’ డైలాగ్స్‌ని కట్ చేస్తారా? కట్ చేస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌నే కట్ చేసినట్లు! అయితే కొన్నిసార్లు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని కూడా కట్ చేయవలసి వస్తుంది. తప్పదు. రాజమౌళి ‘బాహుబలి 2’ తమిళ్ వెర్షన్లో ‘పగడాయ్’ అనే పదం ఆ రాష్ట్రంలోని ఒక సామాజిక వర్గాన్ని నొప్పించింది. పగడాయ్ అనేది దళితులలోని ‘సఖిలియార్’ అనే ఒక సబ్ కాస్ట్‌కు వాడుక మాట. అది అబ్యూజివ్గా ఉందని ఆ వర్గం మేధావులు అభ్యంతరం చెప్పారు. నిరసనకారులు మధురైలోని బాహుబలి 2 ఆడుతున్న ఒక థియేటర్‌పై పెట్రోల్ బాంబు వేశారు! డైలాగ్ రైటర్ కుర్రాడు. అతడు అపాలజీ చెప్పి, ఆ వర్డ్‌ను తొలిగించాక మాత్రమే సఖిలియార్లు శాంతించారు. గుండె ఆగి.. కొట్టుకుంది! ‘విశ్వరూపం’ రిలీజ్ ఆగిపోయినప్పుడు కమల్ హాసన్ కన్నీళ్లు పెట్టుకోవడం టీవీల్లో మీరు చూసే ఉంటారు. ప్రాణం పెట్టి తీశాడు మరి! అప్పులు తెచ్చాడు. ఇల్లు అమ్ముకున్నాడు. సొమ్మంతా కుమ్మరించాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిత్రం రిలీజ్ అయితేనే బతుకు. విదేశాల్లో విడుదలైనా విశ్వరూపానికి తమిళనాడులో విముక్తి లభించలేదు. ఇక్కడ రిలీజ్ అయితేనే కమల్‌కి ఊపిరి. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని మత సంస్థలు అడ్డు చెప్తే రిలీజ్ ఆగిపోయింది. నయం కమల్ గుండె ఆగిపోలేదు. రెండు వారాలు ఆలస్యంగా ఒళ్లంతా‘కట్’లతో బతికి బట్టకట్టాడు. తమిళనాడులో ఫీలింగ్స్ అంత గట్టిగా ఉంటాయి. గవర్నమెంట్ వెంటనే దిగొస్తుంది. ‘జల్లికట్టు’ నిషేధానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడిన ప్రజలు వాళ్లు. అంత గట్టిగా మనమూ పోరాడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని అప్పట్లో మన సినిమా యాక్టర్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. చూపుడు వేలుపై సెన్సార్! రజనీ ‘బాబా’ విడుదలకు ముందు ఓ పాటలో ‘పెరియార్’ పేరు వినిపించింది. పెరియార్ (పెరియార్ ఇ.వి.రామస్వామి) తమిళుల పందొమ్మిదో శతాబ్దపు తిరుగుబాటు నాయకుడు. వాళ్ల సెల్ఫ్‌రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది ఆయనే. ‘బాబా’ చిత్రంలోని పాటలో ఆయన గౌరవం తగ్గేలా రాశారని ‘ద్రవిడ కళగం’ (ద్రవిడుల తొలి రాజకీయ పార్టీ) నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి సినిమా రీలీజ్‌కు ముందే పెరియార్ పేరును తీయించింది! ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు పాటైనా, సీన్ అయినా.. డైలాగ్ ఫ్లోని బ్రేక్ చేసుకోవడం మంచిదే. కానీ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే వేలును కూడా కట్ చేసుకోమంటే ఎలా? ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని ప్రభుత్వం తీసేసుకున్నట్లే కదా. అంటే ప్రభుత్వమే పౌర హక్కుల్ని హరించినట్లు! తెలుగులోనూ డైలాగ్ అబార్షన్స్ మన దగ్గర పాటల్లో ఎక్కువ కట్స్ పడ్డాయి. ఆ మధ్య ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని ‘గుడిలో, బడిలో, మదిలో, ఒడిలో’ సాంగ్‌లోని నమకం, చమకం శివస్తోత్ర పదాలపై ‘అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య’ అభ్యంతరం చెప్పడంతో ఆఖరి నిముషంలో వాటిని తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’ చిత్రంలోని ‘చారీ’ పాటలో పంచెకట్టు, పిలకజుట్టు అనే పదాలు సినిమా రిలీజ్‌కు ముందే కట్ అయ్యాయి. ‘దేనికైనా రెడీ’ లో కూడా ఇదే ఇష్యూ. బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న సీన్స్‌ని, డైలాగ్స్‌నీ కట్ చేశారు. ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ చిత్రంలో సెటైర్లకు ఆగ్రహించిన రాజకీయ పార్టీల కార్యకర్తలు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటిని ధ్వసం చేశారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో కర్నాటక బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డిని గుర్తుకు తెచ్చే సన్నివేశాలు ఉండడంతో ఆయన నాయకులు థియేటర్ల అద్దాలు పగలగొట్టారు. ఇక గౌతమ బుద్ధుడి ఎదురుగా రొమాంటిక్ సాంగ్‌ని తీసినందుకు ‘రచ్చ’పై పెద్ద చర్చే జరిగింది. ప్రభుత్వంతోనే ప్రాబ్లమ్! సినిమాల్లో ప్రైవేటు వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే కొంచెం రగడ అవుతుంది. తర్వాత చల్లారుతుంది. ప్రభుత్వంతో పెట్టుకుంటే మాత్రం పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. అందుకే చూడండి.. ఇండియాలో గవర్నమెంట్లపై సెటైర్లు వేసే సినీ దర్శకులు, నిర్మాతలు తక్కువ.భారత ప్రభుత్వం సాధారణంగా సినిమాలను బ్యాన్ చెయ్యదు. కట్లు సూచిస్తుంది. లౌకిక రాజ్యం కాబట్టి. కానీ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందను కున్నప్పుడు, దేశ పాలనా వ్యవస్థమీద ప్రభావం చూపిస్తుందనుకున్నప్పుడు మాత్రమే సినిమాను బ్యాన్ చేస్తుంది. అలాంటివి బ్యాన్లు మన దగ్గర బాగా తక్కువ. కాంట్రావర్సీ మూవీలు మాత్రం ఎక్కువ. మంచి సినిమాలు ఆలోచన రేపుతాయి. ఆ ఆలోచనలను ప్రజల్లో రేపినంత కాలం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలగదు. ప్రభుత్వంలో ఆలోచనలు రేగితేనే సినిమాలకు కట్ల గాట్లు పడతాయి. -
'జోసెఫ్' విజయ్ ప్రకటనలో ఆసక్తికర అంశం!
సాక్షి, చెన్నై: వివాదాల్లో చిక్కుకున్న తన తాజా సినిమా 'మెర్సల్'కు అండగా నిలిచి.. సూపర్‌హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ తమిళ సూపర్ స్టార్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాని నరేంద్రమోదీ మానస పథకాలైన జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై విమర్శలు ఉండటంపై బీజేపీ నేతలు విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా విజయ్ విడుదల చేసిన ఈ ప్రకటనలో పైభాగంలో 'జీసెస్ సేవ్స్' అని రాసి ఉండటంతోపాటు ఎడమవైపున సీ జోసెఫ్ విజయ్, కుడివైపున ఆయన చిరునామా రాసి ఉండటం గమనార్హం. మెర్సల్ సినిమా నేపథ్యంలో బీజేపీ నేతలు విజయ్ మతాన్ని కూడా వివాదంలోకి లాగిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ 'హిందువు' కాకపోవడంతోనే మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఏకంగా విజయ్ ఐడెంటిటీ కార్డును ట్వీట్ చేసి.. అందులో జోసెఫ్ విజయ్ అని ఉండటాన్ని ప్రస్తావించారు. ఇది 'చేదు నిజం' అంటూ కామెంట్ పెట్టారు. అయితే, 'మెర్సల్' సినిమాపై బీజేపీ నేతల దాడి పెద్దగా ఫలించలేదు. కోలీవుడ్ మొత్తం విజయ్‌కు అండగా నిలిచింది. ఇటు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతూ ఘనవిజయాన్ని అందించారు. సినిమా పట్ల ఓ వర్గం వ్యతిరేకత చూపిందని, దీనికి సమాధానం అన్నట్టుగా కోలీవుడ్‌లోని తన మిత్రులు, నటులు, నటీమణులు, వివిధ సంస్థలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు అనేకమంది సినిమాకు మద్దతు పలికారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆయన తన ప్రకటనలో తెలిపారు. -
వాట్ టు డూ... వాట్ నాట్ టు డూ!
‘‘వాట్ టు డూ... ఏం చేయాలి? వాట్ నాట్ టు డూ... ఏం చేయకూడదు? ఈ రెండూ తెలిస్తే... దర్శకుడి వర్క్ చాలా సింపుల్. మాస్ పల్స్ పట్టుకోవడమే సక్సెస్ మంత్ర’’ అంటున్నారు దర్శకుడు అట్లీ. 30 ఏళ్ల ఈ యువకుడు ఇప్పటివరకు తీసింది మూడు సినిమాలే. అందులో రెండు తెలుగులోనూ విడుదలై, అట్లీకి మంచి పేరు తెచ్చాయి. ముచ్చటగా మూడోది... తమిళనాట పలు వివాదాలు, సంచలనాలకు నెలవైన ‘మెర్సల్’ ఈ వారమే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అదిరింది’గా తీసుకొస్తున్నాయి తేనాండాళ్ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అట్లీతో ‘సాక్షి సినిమా’ ఇంటర్వ్యూ... ► మీ వైఫ్ తెలుగమ్మాయే! అత్తారింటికి వచ్చినట్టుందా? (నవ్వుతూ...) నిజమే! ప్రియ (అట్లీ వైఫ్) తెలుగమ్మాయే. బట్, సెటిల్డ్ ఇన్ చెన్నై. మా అత్తగారి ఫ్యామిలీ చెన్నైలోనే ఉంటోంది. వాళ్లందరూ ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటారు. తెలుగు అర్థమవుతుంది కానీ... తిరిగి తెలుగులో రిప్లై ఇవ్వలేను. ► మీ చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. సో, మీ వైఫ్ హ్యాపీయేనా! షి ఈజ్ వెరీ హ్యాపీ! ‘రాజా రాణి’, ‘పోలీస్’ చిత్రాలకు తెలుగులో మంచి స్పందన వచ్చినప్పుడు నాకంటే తనే ఎక్కువ సంతోషపడింది. ‘అదిరింది’ తమిళ్ వెర్షన్ (‘మెర్సల్’) ఆల్మోస్ట్ 150 ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారా? అని ఎదురు చూస్తోంది. ► విజయ్‌తో వరుసగా రెండు సినిమాలు చేశారు. మీ ఇద్దరి వేవ్ లెంగ్త్ బాగా కుదిరినట్లుంది? శంకర్ సార్ దగ్గర ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’), ‘నన్బన్’ (తెలుగులో ‘స్నేహితుడు’) చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగాల్లో పనిచేశా. ‘నన్బన్’కి చేసేటప్పుడు విజయ్ అన్నతో మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. నేను ఆయనకు పెద్ద అభిమానిని కూడా! ‘రాజా రాణి’ తర్వాత విజయ్ అన్నను కలసి ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’) కథ చెప్పా. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశా. ‘తెరి’ చిత్రీకరణ చివరిదశలో ఉండగానే ‘లెట్స్ డూ వన్ మోర్ ఫిల్మ్’ అని విజయ్ అన్న అన్నారు. ► బేసిగ్గా మీరు రైటర్! విజయేంద్ర ప్రసాద్‌గారి హెల్ప్ తీసుకోవడానికి కారణమేంటి? యాక్చువల్లీ... విజయేంద్ర ప్రసాద్‌గారి కథతో సినిమా చేయాలనేది మా ప్లాన్! ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. కానీ, కథ కుదరలేదు. అప్పుడు నా దగ్గరున్న రెండు కథలను ఆయనకు చెప్పా. ఓ కథ ఫైనలైజ్ చేశాం. 40 రోజులు డిస్కషన్లూ, స్క్రిప్ట్ వర్కూ జరిగాయి. అప్పుడు సడన్‌గా నాకో ఐడియా వచ్చింది. విజయేంద్ర ప్రసాద్‌గారికి చెప్పగా... ‘ఫెంటాస్టిక్ అట్లీ! లెట్స్ డూ దిస్’ అన్నారు. అదే ‘అదిరింది’. అప్పటివరకూ 40 రోజులు వర్క్ చేసిన కథను పక్కనపెట్టేశాం. ► అదేంటో (ఐడియా) మాకూ చెబుతారా? ఓ కవర్లో ప్యాక్ చేసిన ఇన్ఫాంట్ బేబీని నదిలో పడేస్తారు. ఇట్ ఈజ్ ఎ డెడ్ బేబీ. కొందరు ఆ బేబీ దగ్గరకు వెళితే... చెయ్యి కవర్లోంచి బయటకు వచ్చి పైకి లేస్తుంది. రైజింగ్ హ్యాండ్స్ అన్నమాట! అక్కడ రివల్యూషన్ మొదలైందనేది ఐడియా. ► రాజా రాణి, పోలీస్... లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్. ఇప్పుడీ సినిమాలో పెద్ద బరువు (మెడికల్ మాఫియా)ను భుజాలపై పెట్టుకునట్టు అన్పించలేదా? ప్రతి సినిమాకూ నేనో మెట్టు ఎదగాలనుకుంటా! ‘రాజా రాణి’ 60 కోట్లు కలెక్ట్ చేసింది. ‘తెరి’ 120 కోట్లు. నెక్ట్స్ నేను తీయబోయేది అంత కంటే కలెక్ట్ చేయాలనుకున్నా. తమిళ్లో రిజల్ట్ చూసిన తర్వాత నేనూ, మా టీమ్ హ్యాపీ. నెక్ట్స్ తీయబోయేది ఇంతకంటే పెద్ద హిట్ కావాలనేది నా టార్గెట్. ► మీపై శంకర్ ఇన్ఫ్లూయెన్స్ ఉందా? యస్! స్ట్రాంగ్ మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్... కంప్లీట్‌గా శంకర్ సార్ స్కూల్ నుంచి వచ్చిన సిన్మాగానే ‘అదిరింది’ ఉంటుంది. ఐ లవ్ శంకర్ సార్ రైటింగ్. ఆరేళ్లు ఆయన దగ్గర పనిచేశా. సో, ఆ ఇన్ఫ్లూయెన్స్ తప్పకుండా ఉంటుంది. ‘మాస్ మసాలా విత్ మెసేజ్’ కథలు ఎలా రాయాలో నాకు తెలుసు. ► హీరోకి దర్శకుడు అభిమాని అయితే అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా? ‘వాట్ టు డూ... వాట్ నాట్ టు డూ’ అనేది తెలుస్తుంది. అభిమానులు ఏం ఆశిస్తారో దర్శకుడికి అర్థమవుతుంది. ► ఫైనల్లీ... మీ వైఫ్ తెలుగు సినిమాలు చేయమని అడగడం లేదా? అయ్యో! ఎప్పట్నుంచో తెలుగు సినిమా చేయమని అడుగుతోంది. గతేడాది మహేశ్‌బాబు సార్‌తో, అల్లు అర్జున్ సార్‌తో మీటింగ్స్ జరిగాయి. డిస్కషన్స్ జరిగాయి. రైట్ టైమ్, రైట్ స్క్రిప్ట్ కుదిరినప్పుడు తెలుగులో తప్పకుండా సినిమా చేస్తా. చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... హీరోలందరూ నా ఫేవరెట్సే. సమంత ఈజ్ మై బ్రదర్! సమంత నాకు మంచి ఫ్రెండ్. తనను నేను ‘తంబి’ (బ్రదర్) అని పిలుస్తా. నన్నూ తను అలానే పిలుస్తుంది. మేమిద్దరం మాట్లాడుకుంటే... ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. నేను లవ్ సీన్స్ రాసే విధానం (లైక్ ‘రాజా రాణి’) సమంతకు బాగా ఇష్టం. ‘అదిరింది’లో క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేసింది. బార్బీ డాల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది. షి ఈజ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ క్లాసీ హీరోయిన్. సినిమాకు పిల్లర్ వంటి ఎమోషనల్ రోల్లో నిత్యా మీనన్ నటించారు. -
ఆ సౌత్ హీరోతో నటిస్తా : ప్రియాంక
బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా, సౌత్ సినిమాలు చేసేందుకు రెడీ అంటూ ప్రకటించింది. అంతేకాదు సౌత్ లో విజయ్ సరసన ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలపై కూడా ఘాటుగా స్పందించింది ఈ బోల్డ్ బ్యూటీ. 'స్విమ్మింగ్ పూల్ లో బీచ్ లో చీరలతో తిరగం కదా.. అయినా నేను బాలీవుడ్ సినిమాల్లో కూడా బికినీ వేశాను. ఇప్పుడు హాలీవుడ్ లో అది కామన్ కాబట్టి అక్కడ కూడా అలాంటి దుస్తుల్లో కనిపిస్తున్నాను. ఈ మాత్రం దానికే ఎందుకంత దిగజారి కామెంట్లు చేస్తారో అర్థం కావటం లేద'ని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తనను హాలీవుడ్ నటి అంటే సంతోషంగానే ఉన్నా.. వ్యక్తిగతంగా బాలీవుడ్ హీరోయిన్ అని పిలిపించుకోవటమే ఇష్టమని తెలిపింది. -
రజనీ రికార్డ్ బ్రేక్
ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మెర్సల్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని కొన్ని డైలాగ్ లు వివాదాస్పదం కావటంతో మెర్సల్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ వివాదాల కారణంగా మెర్సల్ సినిమాకు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రచారం దక్కటంతో భారీ వసూళ్లను సాదిస్తోంది. తమిళ నాట తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది మెర్సల్. తొలి ఆరు రోజుల్లో ఈ సినిమా తమిళనాట 84 కోట్ల వసూళ్లు సాదించింది. దీంతో ఇప్పటి వరకు 75.2 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న రజనీకాంత్ కబాలి సినిమాను వెనక్కి నెట్టి విజయ్ మెర్సల్ టాప్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మెర్సల్ 155 కోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే తమిళ్ తో పాటు తెలుగు నాట కూడా సినిమాను రిలీజ్ చేయాలని భావించినా.. సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. -
'మా సినిమా ఏ ప్రభుత్వాలను గాయపరచలేదు'
తమిళనాట సంచలనంగా మారిన మెర్సల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చిత్ర నిర్మాతలు అభ్యంతరకర అంశాలను తొలగించేందుకు అంగీకరించినా వివాదం సద్ధుమణగటం లేదు. మరోవైపు కాంట్రవర్సీలతో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి కూడా మెర్సల్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. మెర్సల్ సినిమాకు మద్ధతుగా ట్వీట్ చేయగా తాజాగా మరో సినీ ప్రముఖుడు మెర్సల్ వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్.. మెర్సల్ సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ ను తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశారు. 'ఇక మీదట సినిమాలకు కొత్త స్టాట్యూటరి వార్నింగ్ వేయాలేమో.. తమ సినిమా నిర్మాణంలో ఏ ప్రభుత్వాలను గాయపరచలేదు అని' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్వీట్ స్క్రీన్ షాట్ ను తన పేజ్ లో పోస్ట్ చేశారు. pic.twitter.com/bwEhrD2OoS — SantoshSivanASC. ISC (@santoshsivan) 22 October 2017 -
'అదిరింది'.. ఈ వారం కూడా డౌటే..!
విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ సినిమా మెర్సల్. బీజేపీ నేతల అభ్యంతరాలు, డాక్టర్ల నిరసనల మధ్య భారీ వసూళ్లు సాధిస్తున్న మెర్సల్ సినిమా తెలుగునాట రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతోంది. ముందుగా మెర్సల్ తో పాటు తెలుగు వర్షన్ ను కూడా ఈ నెల 18న రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. తరువాత ఒక్క రోజు ఆలస్యంగా 19న సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ప్రచారం జరిగింది. చివరి నిముషంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదంటూ సినిమాను 26కు వాయిదా వేశారు. ఈ లోగా మెర్సల్ టీం వివాదాలతో బిజీ కావటంతో తెలుగు వర్షన్ ను పట్టించుకోవటం మానేశారు. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ చిత్రయూనిట్ మాత్రం ఆస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించటం లేదు. ఇంకా తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తి కాలేదన్న టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉన్నా.. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించలేదు. దీంతో ఈ వారం కూడా మెర్సల్ తెలుగు వర్షన్ అదిరింది రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దారి మళ్లిన మెర్శల్
తమిళసినిమా: మెర్శల్ చిత్రం దారి మళ్లింది. ఈ చిత్రం విడుదలకు ముందు సంచలనాలు, అనంతరం ప్రకంపనలు పుట్టిస్తోంది. చిత్ర తుది ఘట్టం సన్నివేశాల్లో జీఎస్టీ, వైద్య విద్యావిధానంపై సంభాషణలు అభ్యంతరకరంగా, ఉన్నాయంటూ రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి జాతీయ నాయకులు ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని డిమండ్ చేసిన విషయం తెలిసిందే. అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినా పరిస్థితి చేయి దాటి వివాదం రాజకీయరంగు పులుముకుని రచ్చరచ్చగా మారింది. అయితే చిత్ర పరిశ్రమతో పాటు బీజేపీయేతర రాజకీయ పార్టీలు మెర్శల్‌కు అండగా నిలుస్తున్నారు. దీంతో పరిణామాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఐటీ ఉచ్చులో విశాల్..? తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల ప్రధాన కార్యదర్శి నటుడు విశాల్ మెర్శల్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రాన్ని ఇంటర్నెట్లో చూశానని చెప్పిన బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాను క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఈ పరిణా మాల మధ్య మెర్శల్ వివాదం దారిమళ్లింది. సోమవారం మధ్యాహ్నం అనూహ్యంగా స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని విశాల్ కార్యాలయంలో ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు టీడీ నాంగేంద్రకుమార్ బృందం సోదాలు చేసినట్టు మీడియాలో హల్చల్ చేసింది. దిగజారుడు రాజకీయాలు.. కాగా తన కార్యాలయంపై ఐటీ దాడులపై స్పందించిన నటుడు విశాల్ దీన్ని దిగజారుడు రాజకీయాలకు అద్దం పట్టే చర్యగా పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ శాసనసభ్యుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్షుడు, నటుడు కరుణాస్ మాట్లాడుతూ విశాల్ కార్యాలయంపై ఐటీ దా డులు దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనమేల.. మెర్శల్ చిత్ర వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని, దీనికి కారణం బీజేపీ కట్టుబాటులో అన్నాడీఎంకే ఉండడమేనని కమ్యూనిస్ట్ పార్టీ నేత జి.రామకృష్ణన్ ఆరోపించారు. విజయ్‌పై ఫిర్యాదు.. మెర్శల్ చిత్ర యూనిట్‌పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం మధురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్ అన్నానగర్ పోలీస్ స్టేషన్లో విజయపై ఫిర్యాదు చేశారు. అందులో మెర్శల్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు దేశ మతసామరస్యానికి భం గం కలిగించేలా ఉన్నాయన్నారు. మసీదు, దేవాలయాలకు బదులుగా ఆస్పత్రిని కట్టాలన్న సన్నివేశం ఇది మతస్తుల మనోభావాలను దెబ్బతీ సేది గా ఉందన్నారు. జీఎస్టీ, వైద్యవిధానాలను విమర్శించేలా సన్నివేశాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. విజయ్, సమంత, కాజల్ , నిత్యామీనన్, దర్శకుడు అట్లీ, నిర్మాత మురళిలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసే విషయంపై చర్చిస్తున్నారు. మేం తనిఖీలు చేయలేదు.. విశాల్ కార్యాలయాల్లో తామెవ్వరూ తనిఖీలు చేయ లేదని ఆదాయ పన్ను శాఖ చెన్నై డివిజన్ అధికారిరాజశేఖర్ మీడియాకు తెలిపారు. దీంతో తనిఖీలు చేసిందెవరో అన్న చర్చ తెరమీదకు వచ్చింది. -
‘మెర్సల్’కు రాజకీయ రంగు
-
తమిళ గౌరవాన్ని కాపాడండి..!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి మెర్శిల్ చిత్రం వివాదంపై ట్విటర్లో స్పందించారు. మెర్శిల్ సినిమా వివాదంలో ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సినిమా అనేది సంప్కృతి, సంప్రదాయాలు, భావాలను ప్రకటించే ఒక వేదిక అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తమిళ సంస్కృతిని సినిమా మాధ్యమం ద్వారా ప్రకటించుకునే హక్కు వారికి ఉందని.. రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని జోక్యం చేసుకుని తమిళుల గౌరవానికి భంగం కలిగించరాదని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్.. మెర్శిల్ చిత్ర బృందానికి తన నైతిక మద్దతులను తెలియజేశారు. చిత్రంలోని జీఎస్టీ గురించిన మాటలపై ప్రజల్లో సానుకూల స్పందన వస్తోందని ఆయన అన్నారు. మెర్శిల్ చిత్రాన్ని ముందే సెన్సార్ చేశారు.. రెండోసారి సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. Mr. Modi, Cinema is a deep expression of Tamil culture and language. Don't try to demon-etise Tamil pride by interfering in Mersal — Office of RG (@OfficeOfRG) October 21, 2017 -
దంగల్ రికార్డ్ బ్రేక్, స్పైడర్ రికార్డ్ సేఫ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విజయ్ కెరీర్ లోనే తొలిసారిగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన మెర్సల్ ఓవర్సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది. అమెరికాలో 132 చోట్ల రిలీజ్ అయిన మెర్సల్.. దంగల్, రాయిస్ లాంటి బాలీవుడ్ చిత్రాలను రికార్డ్ లను బద్దలు కొట్టినట్టుగా ఫోర్బ్స్ తెలిపింది. మంగళవారం రిలీజ్ అయిన మెర్సల్ తొలిరోజు ఏకంగా 3,57,925 డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో తొలి రోజు 3,28,227 డాలర్లు సాధించిన దంగల్ ను వెనక్కు నెట్టి రికార్డ్ సృష్టించింది మెర్సల్. అయితే ఇటీవల విడుదలైన మహేష్ బాబు స్పైడర్ ను మాత్రం మెర్సల్ బీట్ చేయలోకపోయింది. అమెరికాలో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజే స్పైడర్ 10 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలేవి బాహుబలి 2 దారిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాహుబలి 2 తొలిరోజు ఓవర్ సీస్ లో 55 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది.