
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ సినిమా మెర్సల్. విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు ఇళయదళపతి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికేఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు.
తెలుగులో మెర్సల్‌ను అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఇక అదిరింది రిలీజ్ కాదన్న ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో మెర్సల్ రీమేక్ హక్కులను అల్లు అరవింద్ తీసుకున్నారని ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయనున్నారన్న టాక్ వినిపించింది. అయితే వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. మెర్సల్ రీమేక్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్న శ్రీ తేనండాల్ స్టూడియోస్, త్వరలోనే అదిరింది రిలీజ్ అవుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment