అదిరింది... అసలు రిలీజ్‌ అవుతుందా..! | Adirindi Release Postponed Indefinitely | Sakshi
Sakshi News home page

అదిరింది... అసలు రిలీజ్‌ అవుతుందా..!

Published Tue, Oct 31 2017 3:35 PM | Last Updated on Tue, Oct 31 2017 4:01 PM

Adirindi Release Postponed Indefinitely

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్‌. ఇళయ దళపతి విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్‌లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో డాక్టర్లను కూడా అవమానకరంగా చూపించారంటూ నిరసనలకు దిగటంతో మెర్సల్‌ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వివాదాలతో భారీ పబ్లిసిటీ పొందిన మెర్సల్‌ రికార్డ్‌ కలెక్షన్లు సాధించి సత్తా చాటింది.

అయితే తమిళ సినిమాతో పాటు తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ అదిరిందిని కూడా రిలీజ్‌ చేయాలని భావించారు చిత్రయూనిట్‌. కాని అనుకున్న సమయానికి తెలుగు వర్షన్‌ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్‌ పలుమార్లు వాయిదా పడింది. తెలుగు నిర్మాతలు రెండు మూడు సార్లు రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసినా సినిమా రిలీజ్‌ కాలేదు. తాజాగా అదిరింది రిలీజ్‌ను తమిల నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది.

సెన్సార్‌ సభ్యులు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చినట్టుగా ప్రకటించినా నిర్మాతలు తెలుగు రిలీజ్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ శుక్రవారం అయినా అదిరింది థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఇక నిర్మాతలు అదిరింది రిలీజ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement