బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో | Vijay gifts gold coins to Mersal team | Sakshi
Sakshi News home page

బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో

Published Wed, Aug 2 2017 3:33 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో

బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తన సినిమాకోసం పనిచేసిన యూనిట్ సభ్యులకు ఏదో ఒక కానుక ఇవ్వటం హీరో విజయ్ కి అలవాటు. అయితే ఈ సారి విజయ్ ఇచ్చిన కానుక కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

తన  మెర్సల్ మూవీకి పనిచేసిన దాదాపు 200 మంది సాంకేతిక నిపుణులు, సహాయ సాంకేతిక నిపుణులకు ఇళయదళపతి విజయ్ బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement