
కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అట్లీ. రాజా రాణీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, తరువాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తేరి, మెర్సల్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించటంతో అట్లీ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే కొద్ది రోజులుగా అట్లీ తదుపరి చిత్రాన్ని తెలుగులో రూపొదించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై స్పందించిన అట్లీ అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి తెలుగు సినిమా చేసే ఆలోచన లేదని తెలిపారు. గలాటా నక్షత్ర అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న అట్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి తెలుగు సినిమా చేయటం లేదన్న అట్లీ భవిష్యత్తులో టాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తానన్నారు. మెర్సల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment