విజయ్ కొత్త సినిమా 'అదిరింది' | Vijay Atlee mersal telugu title adirindhi | Sakshi
Sakshi News home page

విజయ్ కొత్త సినిమా 'అదిరింది'

Published Sat, Jun 24 2017 3:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

విజయ్ కొత్త సినిమా 'అదిరింది'

విజయ్ కొత్త సినిమా 'అదిరింది'

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మెర్సల్. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా తెలుగులో మార్కెట్ కోసం కష్టపడుతున్న విజయ్ మెర్సల్ డబ్బింగ్ వర్షన్ తో టాలీవుడ్ లోనూ జెండా పాతేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. గతంలో అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి తమిళనాట ఘనవిజయం సాధించటంతో మెర్సల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను తెలుగు అదిరింది పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్, నిత్యామీనన్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ తేండాల్‌ ఫిలింస్ సంస్థ తమ బ్యానర్ లో 100 సినిమాగా చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement