కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ ఫాంలో ఉన్న ఇళయ దళపతి తన సినిమాలతో వరుసగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరో మరో అరుదైన రికార్డ్‌ను సాధించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు చైనా అతిపెద్ద మార్కెట్ గా తయారవుతున్న నేపథ్యంలో విజయ్ తన సినిమాను అక్కడ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు 120 కోట్లకుపైగా షేర్ సాధించి విజయ్ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మెర్సల్ యూనిట్.
ఇటీవలే ఇండియన్ సినిమాలో చైనా మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు బాహుబలి తప్ప దంగల్, భజరంగీ భాయ్‌జాన్, సీక్రెట్ సూపర్ స్టార్, ప్యాడ్‌మేన్ లాంటి బాలీవుడ్ చిత్రాలు మాత్రమే చైనాలో రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చైనాలో రిలీజ్ అవుతున్న తొలి తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది మెర్సల్. ఈ సినిమాను సల్మాన్ భజరంగీ భాయ్‌జాన్‌తో చైనాలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థే రిలీజ్ చేస్తుండటంతో మెర్సల్ చైనా రిలీజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment