Thalapathy Vijay and Rashmika Mandanna Act Bilingual Movie To Release By Sankranthi - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: సంక్రాంతికి వచ్చేస్తున్న విజయ్‌- రష్మిక

Published Mon, May 9 2022 8:02 AM | Last Updated on Mon, May 9 2022 8:56 AM

Thalapathy Vijay And Rashmika Mandanna Movie To Release By Sankranthi - Sakshi

హీరో విజయ్‌ సంక్రాంతికి సై అంటున్నారు. ఆయన నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ‘దిల్‌’రాజు, శిరీష్, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ప్రభు, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.. అంతేకాదు.. ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement