దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటనను వెల్లడించింది. ఇటీవల సెన్సార్ విషయంలో పలు ఆరోపణలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దర్శక నిర్మాతలు సెన్సార్ బోర్డు సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓకేసారి దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
చెన్నై సెన్సార్‌బోర్డు అధికారిగా ఉన్న అన్భుళగన్ స్థానంలో షీలా మీనాక్షిని నియమించారు. ఇంతకు ముందు ఈమె ఢిల్లీ దూరదర్శన్‌లో పని చేశారు. ఇదే విధంగా కోల్‌కతా సెన్సార్ అధికారిగా సామ్రాట్‌బందోపాధ్యాయ, బెంగళూర్ సెన్సార్ అధికారిగా గురుప్రసాద్, ముంబై అధికారిగా రాయ్ పూర్‌కు చెందిన కర్మార్‌కర్ తుషార్ అరుణ్, తిరువనంతపురం అధికారిగా గౌహతికి చెందిన ఎల్.పార్వతి, కటక్‌కు ఢిల్లీకి చెందిన శుభశ్రీ మహాపత్రా, హైదరాబాద్‌కు చెందిన రకుల్ గౌలికర్ హైదరాబాద్ సెన్సార్ అధికారిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment