censor board Officer
-
దేశ వ్యాప్తంగా సెన్సార్ అధికారుల బదిలీ
దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటనను వెల్లడించింది. ఇటీవల సెన్సార్ విషయంలో పలు ఆరోపణలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దర్శక నిర్మాతలు సెన్సార్ బోర్డు సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓకేసారి దేశ వ్యాప్తంగా ఏడుగురు సెన్సార్ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై సెన్సార్‌బోర్డు అధికారిగా ఉన్న అన్భుళగన్ స్థానంలో షీలా మీనాక్షిని నియమించారు. ఇంతకు ముందు ఈమె ఢిల్లీ దూరదర్శన్‌లో పని చేశారు. ఇదే విధంగా కోల్‌కతా సెన్సార్ అధికారిగా సామ్రాట్‌బందోపాధ్యాయ, బెంగళూర్ సెన్సార్ అధికారిగా గురుప్రసాద్, ముంబై అధికారిగా రాయ్ పూర్‌కు చెందిన కర్మార్కర్ తుషార్ అరుణ్, తిరువనంతపురం అధికారిగా గౌహతికి చెందిన ఎల్.పార్వతి, కటక్‌కు ఢిల్లీకి చెందిన శుభశ్రీ మహాపత్రా, హైదరాబాద్‌కు చెందిన రకుల్ గౌలికర్ హైదరాబాద్ సెన్సార్ అధికారిగా నియమితులయ్యారు. -
ధనలక్ష్మిపై రామ్‌గోపాల్‌వర్మ పిటిషన్ల దండయాత్ర
హైదరాబాద్ : ఫిలిమ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ పిటిషన్ల దండయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో ఆమెపై రెండు పిటిషన్లు దాఖలు చేసి వర్మ ఈరోజు నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తన దర్శకత్వంలో నిర్మించిన 'సత్య-2' చిత్రం విషయంలో ధనలక్ష్మి ఇబ్బంది పెట్టినట్లు వర్మ ఆరోపణ. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. వర్మ ఇప్పటికే ధనలక్ష్మిపై రెండుసార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11న వర్మ దాఖలు చేసిన పిటిషన్లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ సినిమాకు హిందీ భాషలోకంటే తెలుగులో చాలా ఎక్కువ కట్స్ పడినట్లు వర్మ వివరించారు. అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని వర్మ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ రోజు పట్టువదలని విక్రమార్కుడులాగా వర్మ మూడవసారి మరో పిటిషన్ దాఖలు చేశారు. -
సెన్సార్‌బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ
హైదరాబాద్: సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ఆమె అడ్డుకుంటున్నట్లు వర్మ ఆరోపించారు. ఈ సినిమా హిందీ భాషలో విడుదలయింది. తెలుగులో విడుదలకు అడ్డంకులు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడ్డారని వర్మ ఆరోపణ. ధనలక్ష్మిపై రేపు నాంపల్లి కోర్టులో కేసు వేస్తానని వర్మ చెప్పారు. ధనలక్ష్మిపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి.