ధనలక్ష్మిపై రామ్గోపాల్వర్మ పిటిషన్ల దండయాత్ర
హైదరాబాద్ : ఫిలిమ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై ప్రముఖ దర్శక, నిర్మాత రామ్గోపాల్ వర్మ పిటిషన్ల దండయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో ఆమెపై రెండు పిటిషన్లు దాఖలు చేసి వర్మ ఈరోజు నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తన దర్శకత్వంలో నిర్మించిన 'సత్య-2' చిత్రం విషయంలో ధనలక్ష్మి ఇబ్బంది పెట్టినట్లు వర్మ ఆరోపణ. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
వర్మ ఇప్పటికే ధనలక్ష్మిపై రెండుసార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11న వర్మ దాఖలు చేసిన పిటిషన్లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ సినిమాకు హిందీ భాషలోకంటే తెలుగులో చాలా ఎక్కువ కట్స్ పడినట్లు వర్మ వివరించారు. అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని వర్మ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ రోజు పట్టువదలని విక్రమార్కుడులాగా వర్మ మూడవసారి మరో పిటిషన్ దాఖలు చేశారు.