dhanalakshmi
-
ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే భర్త మోసాలు
రంపచోడవరం: అధికారం లేనప్పుడే ఉద్యోగాల పేరుతో గిరిజన యువతను మోసం చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త మఠం విజయ భాస్కర్ అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా రెచ్చిపోతున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రంపచోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే, రంపచోడవరం ఎమ్మెల్యే తీరుపై అంతకు పదిరెట్లు వ్యతిరేకత ఏజెన్సీ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్‌పై ప్రసారం చేసిన కథనాన్ని ప్రదర్శించారు. బహుశా టీడీపీకి నష్టం జరుగుతుందనే ఇలా ప్రసారం చేసుంటారని ఆమె చెప్పారు. అధికారం లేనప్పుడే విజయభాస్కర్‌పై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎన్నికల ముందు రాజవొమ్మంగికి చెందిన టీడీపీ నేతలు వీరి చేతిలో ఎలా మోసపోయారో బహిరంగంగానే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భర్త ప్రవర్తనతో అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా 2023లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయభాస్కర్ డబ్బులు తీసుకున్న ఫోన్‌పే స్క్రీన్ షాట్లను మీడియాకు చూపించారు. బాధితులు మాట్లాడిన వాయిస్‌లను వినిపించారు. విజయభాస్కర్‌పై గుండాట, పేకాట కేసులు ఉన్నాయని తెలిపారు. 2022లో అనంతగిరిలో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తుండగా ఇద్దరు అమ్మాయిలను పట్టుకున్నారని, ఆ కేసులో భాస్కర్ ఏ–1 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళకు చెందిన సొమ్ము నేరుగా అతని అకౌంట్‌కు పంపించుకోవడం విజయభాస్కర్ అక్రమాలకు పరాకాష్ట అన్నారు. తిమ్మాపురంలో ఇసుక తవ్వుకునేందుకు కాలువకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఎమ్మెల్యే, ఆమె భర్తకు సంబంధం లేదా? అని ప్రశ్నించారు. రంగురాళ్ల క్వారీలను తిరిగి తవ్వేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్‌శాఖలో బదిలీల కోసం రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలూ ఉన్నాయన్నారు. విజయభాస్కర్ మాట వినని అధికారులను గంజాయి కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
'బేరం'.. బెండకాయలెంత కిలో..?
‘బెండకాయలెంత కిలో?’ బుట్ట తీస్తూ అడిగింది అమ్మ.‘నలభై రూపాయలమ్మ’‘నలభై రూపాయలా!’ సాగదీస్తూ పావుకేజీ చికెన్ వస్తుంది తెలుసా.. నలభైకి’ అంది.‘పోనీ అదే కొనుక్కోండమ్మా.. నేనేం మిమ్మల్ని పిలవలేదుగా!’ దురుసుగా సమాధానం వచ్చింది అటు నుండి.‘అదేనా సమాధానం చెప్పే పద్ధతి?’ అమ్మ కోపం ఎక్కువైంది.‘ఎందుకు ఉమా ఆ బేరాలు? కావల్సినవి తీసుకో డబ్బుల సంగతి నీకెందుకు?’ సలహా ఇచ్చారు నాన్న.‘ఏం ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్టు నాటరా ఏంటి? అసలందుకే మిమ్మల్ని నాతో రావద్దంది’ కూరగాయలావిడ మీద కోపం నాన్న మీదకి మళ్లించింది ఘాటుగా.ఇదెప్పుడూ ఉండేదే! నాన్నకసలు నోరు ఊరికే ఉండదు వద్దన్నా సలహాలిస్తూనే ఉంటారు. ‘కాసేపు కామ్‌గా ఉండొచ్చు కదా నాన్న! ఎందుకిక్కడ కూడా యుద్ధం?’ సలహా ఇచ్చా! నాది కూడా నాన్న పోలికెనేమో?‘నేనా మాత్రం కలుగజేసుకోకుంటే ఈ రోజంతా వాళ్లతో బేరాలాడుతూ ఇక్కడే ఉంటుంది’‘ఉఫ్.. ఎప్పటికి పూర్తవుతుందో?’ ఆలోచిస్తూ ఆసీనురాలినయ్యా బెంచ్ మీద. మార్కెట్ అంతా తిరిగి, కూరగాయల వాళ్లతో బేరాలాడి.. వాళ్లను విసిగించి, తనూ విసుక్కుని మొత్తానికి రెండు గంటల తర్వాత వచ్చింది.‘ఉమా ఎంత మిగిలించావ్? ఛ.. రెండు గంటలు వేస్ట్.. ’ నుదురు రుద్దుకున్నారు నాన్న.‘నా టైమ్ అంత ఖరీదైనది కాదు కానీ పదండి’ అంటూనే ఓ కవర్ నాన్న చేతిలో, మరో కవర్ నా చేతిలో పడేసి ఆటోస్టాండ్ వైపు నడిచింది. నోరు మూసుకుని అమ్మని అనుసరించాం. ‘మరో ఘట్టం మొదలవుతుందిప్పుడు’ మెల్లగా అన్నారు నాన్న.‘ఈ రోజుకిదే చివరి అంకమేమో’ అంతే మెల్లగా చెప్పాను. ‘శ్రీరాం నగర్ కాలనీకి ఎంత తీసుకుంటావ్?’‘అరవై రూపాయలమ్మ’‘నలభై రూపాయలే కదా?’‘పోనీ యాభై ఇవ్వండమ్మ’‘లేదు, లేదు నలభై రూపాయలే’ బేరం సాగీ, సాగీ ఇంటికెళ్లేసరికి పది గంటలు దాటింది.‘దేవుడా!’ అనుకుంటూ సోఫాలో పడిపోయాం నీరసంగా.‘ఉమా! నువ్వెంత మిగిల్చావోనాకు తెలియదు కానీ ఈ టైమ్ తప్పిన భోజనంతో నా షుగర్ కూడా కంట్రోల్ తప్పుతుంది. ఆ మిగిలించిన డబ్బంతా నా హాస్పిటల్ బిల్కి సరిపోతుంది’ అరిచారు నాన్న.‘అవునులే అలా మిగిలించిన డబ్బుతోనే ఈ నగలన్నీ చేయించుకున్నాను’వాదన మొదలైంది. ఇదిప్పట్లో ఆగదు. ఎందుకో గానీ ఈసారి నాన్నకి సపోర్ట్ చేయాలనిపించలేదు. అమ్మది మాత్రం ఏం తప్పుంది? సగటు మధ్యతరగతి గృహిణిలానే ఆలోచిస్తోంది. ఆ చేసేదంతా ఎవరి కోసం? ఇంటి కోసం.. ఇంట్లో ఉన్న మా కోసమేగా? నాన్న పూర్తిగా వ్యతిరేకం అమ్మకి. బేరం అనే పదం కూడా నచ్చదు. సమయం వృథా, అంతకన్నా ముఖ్యంగా అలా బేరమాడటం ఆ వస్తువుల విలువను తగ్గించటమే అని వాదన. ఎవరి కోణంలోంచి చూస్తే వాళ్ళదే సరనిపిస్తుంది.‘ఏంటా ఆలోచన? దేని కోసం?’ ఉలిక్కిపడి చూశాను నాన్న వైపు.‘మీ ఇద్దరి గురించే..’‘మా గురించా?’ అర్థంకానట్టు చూశారు.‘అవును, అసలు మీ ఇద్దరూ గొడవపడకుండా ఉన్న రోజేదైనా ఉందా?’ అని నవ్వాను.‘అది కష్టమమ్మా! ఇంకా చెప్పాలంటే అసాధ్యం కూడా!’ గట్టిగా నవ్వారు నాన్న కూడా.‘అసాధ్యం కాదే మీ నాన్నని మౌనవ్రతం చేయమను’ లోపలి నుండి వచ్చింది అమ్మ.‘ అప్పుడు మాత్రం నీ నోరు ఊరుకుంటుందంటావా?’ ‘అయితే ఇద్దరూ చేయండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది చెప్తూనే లోపలికి పరిగెత్తాను.‘దానర్థం నోరు మూసుకుని ఉండమనేగా?’ మాటలు బాగా ఎక్కువయ్యాయి. రూమ్లోకెళ్లినా అమ్మ మాటలు వినిపిస్తున్నాయి.‘రేపు క్లాస్ లేదుగా?’ లోపలికొస్తూ అడిగారు నాన్న.‘ఎందుకు? స్పెషల్ క్లాస్ ఉంది, రికార్డ్ వర్క్ కూడా ఉంది’ ‘నీతో కొంచం వర్క్ ఉంది. ఎక్కువసేపు కాదు, మహా అయితే ఓ గంటన్నర అంతేలే’‘అది సరే కానీ ఆ గంటన్నర ఏం చేయాలి?’ విసుగొచ్చింది. ‘నోరు ముసుకుని, కుదురుగా కూర్చోవాలి’‘ఎక్కడ? ఎందుకు?’ విసుగు ఎక్కువైంది. ‘పెళ్లిచూపుల్లో’ నవ్వేసి వెళ్లిపోయారు.నాకు మాత్రం నవ్వు రాలేదు. ఉత్సాహం, కుతూహలం ఏవీ రాలేదు. గొప్ప కార్యక్రమం మరి! తలనొప్పికి బోనస్‌గా మెడనొప్పి కూడా. ‘ఇప్పుడప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్స్ వద్దని చెప్పా కదా? ఇంజనీరింగ్ అవలేదు, జాబ్ రాలేదు. మీకెందుకంత తొందర?’ ఇలాంటి డైలాగ్స్ నాన్న మీదకేం విసరాలనిపించలేదు. అలాంటి వాటి వల్ల ప్రయోజనమేం ఉండదు. పైగా నాన్న సంగతి నాకు తెలియంది కాదు. ఎలాంటి వారినైనా ఒప్పించగల నైపుణ్యం కలిగిన వారు. ‘చూద్దాం ఏం జరుగుతుందో?’ అనుకోవటమే నాకు మిగిలిన ఆప్షన్.‘హరీ టైమెంతయిందో తెలుసా?’ సూర్యుడు పూర్తిగా డ్యూటీ ఎక్కక ముందే లేపింది అమ్మ.‘అబ్బా! వాచ్ చూడొచ్చుకదమ్మా! లేపి మరీ అడగాలా?’ తలకొట్టుకున్నాను.‘వేశావులే పెద్ద జోక్, నోరు మూసుకుని లేచి రెడీ అవ్వు’ బాత్రూమ్లోకి తోసింది.వాళ్లొచ్చేసరికి పదిన్నర దాటుతుంది. ఇప్పుడింకా ఆరు కూడా కాలేదు. ఇప్పటి నుండి రెడీ అవుతూ ఉండాలా? ఈ దృక్పథం ఎప్పటికి మారుతుంది? అసలు మారుతుందా?‘ఏంటమ్మా ఉదయం నుండి అమ్మ చెప్పిందంతా కీ ఇచ్చిన బొమ్మలా చేస్తున్నావు? ఏంటో?’ దీర్ఘం తీశారు నాన్న. చేయకపోతే తిట్లు, చేస్తే అనుమానాలు. వాళ్లెంత మంది వస్తారో? ఎన్ని ప్రశ్నలడుగుతారో? ఆలోచిస్తుండగానే వాళ్లు రావటం, అతిథి సత్కారాలు, మరబొమ్మలా వాళ్ల ముందు కూర్చోబెట్టడం.. అన్నీ సెకెన్ల ముల్లులా చకాచకా సాగిపోయాయి. పెద్దల ప్రశ్నలు, నా సమాధానాలు సాగుతూన్నాయి.ఈ అబ్బాయికి మాటలు రావా? మొహమాటమా? నోరే విప్పటం లేదు. మరీ తెగించి చూడటం బాగుండదేమో? ఏవేవో సినిమా సన్నివేశాలు చకచకా కదిలిపోతున్నాయి. ఎంత మధురంగా ఉంటాయో పెళ్లి చూపుల సన్నివేశాలు! నాలాగే చాలా మంది అమ్మాయిలు వాటిని చూసి అలాగే ఉంటాయని భ్రమపడి, పెళ్లి చూపులయ్యాక నిరాశపడతారు.‘ఏరా? అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా?’ పెళ్లికొడుకు తండ్రనుకుంటా.. ఎంత దర్పమా గొంతులో!అప్రయత్నంగా కళ్లు తిప్పాను నాన్న వైపు. ఇప్పుడు నాన్న కూడా అబ్బాయితో మాట్లాడతావా? అంటే అందరి మొహాలు ఎలా ఉంటాయో? ఒక్కసారిగా షాకవుతారేమో?‘మాట్లాడకపోతే.. పోనీ నచ్చిందో? లేదో?’ చెప్పు సీరియస్‌గా అడిగాడాయన.‘మీ ఇష్టం నాన్నా’ మంద్రంగా వినిపించిందో స్వరం.ఏం సమాధానం..? అవుననా? కాదనా? ఇప్పుడు నేను షాకయ్యాను. అసలెలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల మాట మీద గౌరవం ఎక్కువనా? తనకి వ్యక్తిత్వం తక్కువనా?ఏ మూలో మిగిలున్న కాస్త ఆసక్తి కూడా ఎగిరిపోయింది. ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్!‘నువ్వేమంటావమ్మా?’ దగ్గర్లో గట్టి వస్తువులేం లేవు కానీ, ఉండుంటేనా వాటితో తల కొట్టుకోవాలనిపించింది.అంతా నా వైపే చూస్తున్నారు. ‘మా నాన్న ఇష్టం’ అనే నా డైలాగ్ కోసం. అలా అంటేనే కదా అమ్మానాన్నల పెంపకాన్ని పదిమందీ మెచ్చుకునేది! వాళ్ళ మెప్పు కోసం, అమ్మానాన్నల ఆనందం కోసం అలా చెప్పటం కరెక్టా కాదా? మరి నా సంగతేంటి తన గురించి ఏం తెలియకుండా ఎలా నిర్ణయించుకోవాలి? ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు. ఏం తెలియటంలేదు. ‘పర్లేదు చెప్పమ్మా..’ మరోసారి అడిగేసరికి నాన్న వైపు చూశాను నిస్సహాయంగా.‘ఉమా! తనని లోపలికి తీసుకెళ్లు’ నాన్న మాటకి నిజంగానే ప్రాణం వచ్చినట్టయింది. లోపలికెళ్తూ నెమ్మదిగా కళ్లు తిప్పాను అబ్బాయి వైపు. ఓ నవ్వు కాదుకదా! కనీసం చూడను కూడా చూడలేదు. ‘మొహమాటమంటే ఒప్పుకుంటాను. కానీ దీపు చాలా మంచివాడు చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా! ఒక్క చెడలవాటు కూడా లేదు’ ఆపకుండా చెప్పుకుపోతోంది అమ్మ. ‘చిన్నప్పటి నుండి చూస్తున్నావా?’ ఇంకో షాక్ నాకు.‘ఆ! ఎప్పుడైనా ఏ ఫంక్ష¯Œ కైనా, పెళ్లికైనా వస్తేగా చుట్టాలో, స్నేహితులో తెలియడానికి! ఎంతసేపూ ఇంటినే అంటిపెట్టుకునుంటే ఏం తెలుస్తుంది?’‘అమ్మా! ఒక ప్రశ్నకి మరో ప్రశ్న సమాధానమా?’‘వాడు నాకు మేనల్లుడి వరస. మా పెద్దమ్మ కొడుకు తెలుసు కదా.. శేఖరన్నయ్య.. వాడి కొడుకు. మంచి ఉద్యోగం కూడా! ఒప్పుకోవచ్చు కదే?’కిటికీ తెరిచి దీపు వైపు చూశాను. హుందాగా ఉన్నా అమాయకత్వం నిండి ఉన్న మొహం. అమ్మ సర్టిఫికేట్‌కి తిరుగులేదు. ‘పైగా తనకి నువ్వంటే చాలా ఇష్టం కూడా ’ అనేసి వెళ్లిపోయింది.అదేంటో ఇప్పటి వరకూ ఉన్న చిరాకంతా టక్కున మాయమైపోయింది. ‘ఏంటి బావా? వీళ్లిద్దరూ సరిగ్గా చెప్పకుండా దాటేస్తున్నారు. ఏం చేద్దాం?’ వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.‘మౌనం అంగీకారమేనేమో?’ ఇంకెవరో అన్నారు. ‘అంతవరకూ లాంఛనాల గురించి ఒక మాటనుకుంటే సరిపోతుందేమో?’ మరొకరి సలహా.‘అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం. ఉన్న ఆస్తికి ఒక్కడే వారసుడు. మీరెంత వరకు ఇద్దామనుకుంటున్నారు?’‘మా అమ్మాయిది డిగ్రీ అవుతుంది. తెలివైనది కూడా!’ మా పిన్ని నన్ను పొగడటం మొదలుపెట్టింది.‘ఇరవై లక్షలు, అబ్బాయికి నాలుగు తులాల బంగారం. అమ్మాయి కెంత బంగారం పెడతారో మీ ఇష్టం, బైక్ ఎలాగూ పెడతారుగా?’బట్టీ పట్టిన సమాధానంలా టకటకా చెప్పేశాడు మధ్యవర్తి. ‘అదేంటి బావా? మా స్థాయి తెలిసి కూడా..’ ఆపేశారు నాన్న. ‘పదిలక్షల వరకూ అయితే పరవాలేదు’ ఓ క్షణమాగి మెల్లగా అన్నారు.భూకంపం వచ్చిన ఫీలింగ్. మొదటిసారి వింటున్నా నాన్న బేరమాడటం. ఆటో డ్రైవర్ల కష్టానికి విలువనిచ్చే నాన్న, కూరగాయలకి విలువిచ్చి బేరమాడని నాన్నేనా.. ఈ రోజు నా గురించి బేరమాడుతోంది!? అదేంటో చిత్రంగా కోపం రాలేదు.. నవ్వొచ్చింది. నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది చూశాను. దీపక్ అలాగే కూర్చున్నాడు విగ్రహంలా! ఆ బేరసారాలలో పాలుపంచుకోలేదు. అరగంటసేపు సాగుతూనే ఉందా కార్యక్రమం. నాన్నకి నా మీదెంత ప్రేమున్నా తలకి మించిన భారాన్నెలా మోయగలరు?మరోవైపు నా జీవితం.కేవలం నా కోసమేగా తనకిష్టంలేని బేరమాడింది! పోనీ నా కోసమేదైనా చేస్తారని ఎంతలా సముదాయించుకున్నా ఏదో గుచ్చుతోంది మనసులో.నాన్న నా విలువను తగ్గించారా? అంగీకరించలేని నిజం!దీపక్‌ని నేను కొనుక్కుంటున్నానా? లేదు, లేదు డబ్బిచ్చి మరీ నన్నే అమ్ముతున్నారా? బాగుంది వాళ్ళ కొనుగోలు, నాన్న అమ్మకం!క్రమక్రమంగా మాట్లాడే ధోరణి నుండి బతిమాలే స్థాయికి దిగిన నాన్న గొంతు. అమ్మాయిగా పుట్టినందుకు మొదటిసారి కలిగిన బాధ! నా కారణంగానే నాన్న తగ్గాల్సి వచ్చిందన్న గిల్టీ ఫీలింగ్!నాలాగే ప్రతి అమ్మాయి ఎప్పుడో ఒకసారి ఎదుర్కోవాల్సిన సందర్భమేమో!‘కంగ్రాట్స్ హరీ’ అరుస్తున్నట్టే లోపలికొచ్చింది అమ్మ. ‘అదృష్టమంటే నీదేనే ..’ ఇంకా ఏదేదో చెప్తున్నా ఆ మాటలేం వినిపించట్లేదు.‘నాకు నచ్చలేదు’ సూటిగా, స్పష్టంగా చెప్పేశాను.‘ఏంటి?’ కోపంగా మారిపోయింది అమ్మ గొంతు. ‘ఏం నచ్చలేదే?’ ‘ఈ బేరం, బేరంలో కూర్చున్న ఆ అబ్బాయి’‘నోరు మూసుకో.. అర్థంలేని మాటలు’‘అమ్మా! ప్లీజ్ నన్నిలా వదిలేస్తావా?’ నా గొంతు నరాలు తెగిపోయాయేమో అన్నంత గట్టిగా వచ్చిందా అరుపు.‘ఉమా! దాన్నింకా విసిగించకు’ నాన్న అమ్మని తీసుకెళ్ళారు.ఎందుకీ విపరీతమైన అలజడి? గందరగోళం మనసంతా! నాకు తెలుసు. ఈ కోపం అమ్మ మీద కాదు, నాన్న మీదా కాదు, దీపు మీదసలు కాదు. మరెవరి మీద? ఆలోచిస్తూండిపోయానలా ఎంతసేపో?!‘హరీ..’ మంద్రమైన అమ్మ పిలుపు ఈ లోకానికి తీసుకొచ్చింది నన్ను. ‘నిన్ను అర్థం చేసుకోగలను కానీ మార్పు నువ్వనుకున్నంత సులభంగా రాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టంకావాలి. జడివానలా ఒక్కసారిగా వస్తుందనుకున్నావా? చిరుజల్లులా నిదానంగానే వస్తుంది. నీ కోపం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు’ చెప్పి వెళ్లిపోయింది.నిజమే మార్పు ఆవేశం వలనో, ఆక్రోశం వలనో రాదు. రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు పుట్టిన దేశంలో అబ్బాయిలందరూ దీపక్ లాగానే ఉంటారనుకోవటం నా పొరపాటు. తల్లిదండ్రులపై గౌరవంతో పాటు భార్య వ్యక్తిత్వానికి విలువనిచ్చే వారూ ఉంటారు. అమ్మాయిలు వంటిల్లు దాటి ఉద్యోగం దాకా రావటానికి శతాబ్దకాలం పట్టింది. కట్నకానుకలు, బేరసారాలు లేకుండా పెళ్లి జరగటానికి మరో రెండు శతాబ్దాలు పూర్తవ్వాలేమో .. ఆలోచిస్తూ కొత్త ప్రాజెక్ట్ హెడ్డింగ్ పెట్టాను..‘40 వ శతాబ్దం.. భారతీయ వివాహా వ్యవస్థ!’ – ధనలక్ష్మి. ఎమ్ -
ఆ ఒక్క అబద్ధం ఆడుంటే జగనన్న 2014 లోనే సీఎం అయ్యేవాడు కానీ..
-
లారీ ఢీకొని టీచర్ ధనలక్ష్మి మృతి
వేలూరు: కాట్పాడి సమీపంలో లారీ ఢీకొనడంతో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. వేలూరు శలవన్‌పేటకు చెందిన ఆరుముగం భార్య ధనలక్ష్మి(36) కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్‌పేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె బైక్‌లో పాఠశాలకు వెళుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. కాట్పాడి సమీపంలోని కల్పదూరు వద్ద సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడిని తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని కింద పడింది. ఆ సమయంలో వెనుక వైపున కాట్పాడి నుంచి చిత్తూరు వెళుతున్న లారీ ధనలక్ష్మిని ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాట్పాడి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం జగన్ లక్ష్యం
-
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
అత్యంత బాధాకరం.. సమాజం ఎటు పోతోంది?
ఇటీవల హైదరాబాద్ నగరంలో ‘నిర్భయ’ ఘటన తరహాలో కారులో నడిరోడ్డు మీద సామూహిక అత్యాచార పర్వం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఇందులో ప్రముఖుల పుత్ర రత్నాలు ఉండటంతో అనేకమంది రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. మే 8న చౌటుప్పల్ ప్రాంతంలో ఓ ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగింది. ఆ మధ్య... వికారాబాద్ సమీపంలో మరో మహిళా అత్యాచారానికి గురైంది. ఇలా... ప్రతిరోజూ దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఇటువంటి దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ‘నిర్భయ’ దుర్ఘటన తరువాత ప్రత్యేకంగా ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకొచ్చారు. 2012–2013 సంవత్సరాల మధ్య హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇటువంటి మరో ఉదంతం వెలుగు చూడటంతో ఆ ఘటనకు ‘అభయ’ ఘటన అని పేరు పెట్టారు. ఇలాగే... 2019లో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్– షాద్‌నగర్‌ల మధ్య జరిగిన అత్యాచార ఘటనకు ‘దిశ’ అని పేరు పెట్టారు. ఈ ‘దిశ’ పేరుతో ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని అమలుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు... ఈ మధ్య ఓ యాప్‌ను కూడా రూపొందించారు. తెలంగాణలో సైతం ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ను, స్పెషల్ మొబైల్ వెహికిల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు ఇలా... అత్యాచారాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ... కొందరి పురుషుల మనస్తత్వాల్లో ఏమాత్రం మార్పు రాకపోవడమే విడ్డూరం. మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారు ముక్కుపచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారాలు చేస్తూ... చట్టాలపట్ల ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. (క్లిక్: హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?) ముఖ్యంగా యువకులు ఇటువంటి పెడ ధోరణి వైపు పయనించడానికి నేటి సామాజిక మాధ్యమాలు, అందుబాటులో ఉన్న డ్రగ్స్, మద్యం వంటివే ప్రధాన కారణాలని చెప్పవచ్చు. – కె. ధనలక్ష్మి, సెక్రటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ -
చంద్రబాబుపై అసెంబ్లీలో సెటైర్లు వేసిన ఎమ్మెల్యే ధనలక్ష్మి
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం భాగంగా మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. చంద్రబాబును అందరూ ముందు చూపు ఉన్న వ్యక్తి అంటుంటారని, అది నిజమేనని తెలిపారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు దేశం పార్టీని ఎప్పుడో ఒకప్పుడు భూస్థాపితం చేస్తారని, రాష్ట్రం నుంచి ముళ్లే మూటా సర్ధుకోవాల్సి వస్తుందని ముందే తెలిసి బాబు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబుకు విజన్ ఉందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్ ‘సాధారణంగా అందరూ చెబుతూ ఉంటారు. ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని, కానీ ఈ రోజు నేను చెబుతున్నా.. ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కాదు. రాజకీయాలు కూడా కూలిపోతాయని అక్క చెల్లెమ్మలందరు చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పారు. పాపం ఇప్పటికే ఉత్తర కుమారుడిని చూసుకొని చంద్రబాబు ఏడ్వని రోజంటూ లేదు. మరోవైపు కుప్పంలోని ప్రజలు ఆయన్ను నిండా ముంచేశారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో కూడా తెలీదు. చదవండి: మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ ఏదైమైనా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అక్కాచెల్లెలందరూ సంతోషంగా ఉన్నారు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఎప్పటికీ వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అక్కాచెల్లెలందరి ఆశీస్సులతో, దీవెనలతో మరింత కాలంపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అని ఎమ్మెల్యే ధనలక్ష్మి పేర్కొన్నారు. -
ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే
తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే. తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా? ‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి. ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్ వర్క్స్’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు. పదేళ్ల క్రితం... ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్. ఏదైనా డెకరేషన్ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి. తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్‌కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి. ఊళ్లో జాతర వస్తే... సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్ పని మంతుడు. కాని వాటికి సీరియల్లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్ సెట్లలో మధ్యలో ఒక లైట్ కాలిపోయినా మిగిలిన సెట్ వెలగదు. ఆ లైట్‌ను కొత్తది వేయాలి. లేదా వైర్‌ను జాయింట్ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది. అందరు మహిళల కోసం తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్సెట్ల కటౌట్స్ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్‌కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్‌గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్‌కు అమర్చి మొత్తం కటౌట్‌ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి. తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు – సాక్షి ఫ్యామిలీ -
కుమార్తె ఎమ్మెల్యే.. తల్లి సర్పంచ్..
సాక్షి, అడ్డతీగల: కుమార్తె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె తల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ. అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం రాజుంపాలెం.. గొండోలు పంచాయతీలో ఉంది. ఇక్కడ 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే గెలుపొందారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) (తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్..) -
వ్యాక్సిన్: దంత వైద్యురాలి ఆరోగ్యం విషమం
సాక్షి, ఒంగోలు టౌన్: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న దంత వైద్యురాలు ధనలక్ష్మి ఆరోగ్యం విషమించింది. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ధనలక్ష్మి (24) కోవిడ్ వైద్యుల నియామకం కింద దాదాపు ఏడు నెలల క్రితం ఒంగోలులోని జీజీహెచ్‌లో చేరారు. ఈనెల 23న కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. 26న జ్వరం రావడంతో జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చేర్చారు. అక్కడ ఒక్కసారిగా బీపీ డ్రాప్ అవుతుండటాన్ని గమనించిన వైద్యులు వెంటనే రమేష్ సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ఆమెలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అర్ధరాత్రి 12.50 గంటలకు అంబులెన్స్‌లో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!) (వ్యాక్సిన్: బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి) -
ఫోన్లో ప్రేమ.. ఆలయంలో పెళ్లి
ఉండవెల్లి(అలంపూర్): మండలంలోని బైరాపురానికి చెందిన బోయ రాముడు(21), గత కొంతకాలంగా ఫోన్లో పరిచయమైన బెంగుళూరుకు చెందిన ధనలక్ష్మి(22)తో ప్రేమలో పడ్డాడు. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి దాకా వచ్చింది. ఈనెల 19న ఆ ప్రేమ జంట కర్నూల్ జిల్లాలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. వివాహమైన రెండు రోజుల అనంతరం భద్రత కోసం ప్రేమ జంట పోలీస్‌లను ఆశ్రయించారు. అయితే రాముడు తాండ్రపాడులోని ఆల్కలిస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, ధనలక్ష్మి బెంగుళూరు పట్టణం రాంనగర్ కాలనీలో ఉంటుందన్నారు. యువతి తల్లితండ్రులు దాడికి పాల్పడకుండా రక్షించాలని పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. యువకుడి తల్లి అనుసూయమ్మ ఫిర్యాదు మేకు ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని ఏఎస్ఐ తెలిపారు. -
శ్రీరాముడి మాదిరిగానే జగన్‌కు జనం పట్టాభిషేకం
సాక్షి, అమరావతి: ‘మందర మాటలు విని శ్రీరాముడిని కైక అడువులకు పంపినట్టే.. చంద్రబాబు మాటలు విని వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోనియాగాంధీ కష్టాలపాలు చేశారు. అరణ్యవాసం చేసిన శ్రీరాముడికి ప్రజలు పట్టాభిషేకం చేసిన విధంగానే వైఎస్ జగన్‌ను కూడా రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు’ అంటూ పురాణేతిహాసాలను జోడిస్తూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి చేసిన ప్రసంగం గురువారం శాసనసభలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై జరిగిన చర్చలో ఆమె అనేక అంశాలను ప్రస్తావించారు. ఇంగ్లిష్ మాధ్యమం వల్ల మాతృభాష ఉనికి కోల్పోదన్నారు. దేశాన్ని ఎన్నో ఏళ్లు ఇంగ్లిష్ పాలకులు పాలించినా తెలుగు వన్నె తగ్గలేదని గుర్తు చేశారు. 2,600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషకు ప్రాచీన హోదా కలి్పంచేందుకు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు చేసిన కృషి శూన్యమన్నారు. రాజకీయ ప్రయోజనాలకే ఆయన తెలుగు భాషను వాడుకుంటున్నారని మండిపడ్డారు. 20 ఏళ్ల కుర్రాడిలా ఆలోచన చేస్తాననే చంద్రబాబు.. ఈ వయసు వాళ్లు తెలుగు మీడియాన్ని ఎందుకు ఇష్టపడతారో చెప్పాలన్నారు. తన కొడుకు, మనవడిని ఏ మీడియంలో చదివించారని నిలదీశారు. తెలుగు మీద ప్రేమ చూపే టీడీపీ ఎమ్మెల్యేలు ఇంగ్లిష్‌లో ఎందుకు సంతకాలు చేస్తున్నారని ప్రశి్నంచారు. -
నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని పేర్కొంటూ.. ఓ సినిమా డైలాగును ఆమె ఉటంకించారు. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం’ అంటూ ఆమె పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగు రాదనడం సరికాదన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదని, ఆయన డ్రామాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్.. రెండూ రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై గగ్గోలు పెడుతున్న నాయకులు తమ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని అడిగారు. చంద్రబాబు మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల ఎన్నో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉషాచరణ్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని అన్నారు. మన అనుకుంటేనే ప్రజలకు ఏదైనా చేయగలమని, అలా అనుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. -
భర్త దూరం కావడంతో..
ప్రకాశం, యర్రగొండపాలెం: భర్త దూరం కావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి యర్రగొండపాలెంలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఎం.ధనలక్ష్మి(28) భర్తకు విడాకులు ఇచ్చింది. కుమార్తెతో కలిసి తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఆమె కొంతకాలంగా కలత చెందుతున్నట్టు ఆమె బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ధనలక్ష్మి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఒక కూతురు ఉంది. ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై పి.ముక్కంటి తెలిపారు. -
మహిళలకు రక్షణ కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైంది
-
కన్నీరు పెట్టుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే!
కాకినాడ సిటీ: గిరిజనులు ఏం పాపం చేశారు. ప్రతి తల్లీ ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఓవైపు పురిటి నొప్పులు పడుతూనే పుట్టే బిడ్డ సజీవంగా పుడతాడా లేదా అనే ఆందోళనతోనే ఉంటోంది. కొద్దిపాటి అనారోగ్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ వందల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. దీనికి తోడు కాళ్ల వాపు కబళిస్తోంది. అసలు ఏజెన్సీలో ఏం జరుగుతోంది? నివారణా చర్యలేమిటనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పనితీరును జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణి తనకు పుట్టిన బిడ్డ బతుకుతుందో లేదోనన్న ఆందోళనతో ఉన్నారని, వీరికి సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన బిడ్డలు చనిపోవడం, ఒక్కొక్కసారి తల్లీ, బిడ్డా కూడా మరణిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అసలు పుట్టిన బిడ్డలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కావడంలేదని, పౌష్టికాహార లోపమా లేక, మరే ఇతర సమస్యా అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రానున్న రెండేళ్లలో అందరికీ ఆరోగ్యం: ఆళ్ల నాని రానున్న రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఉద్ఘాటించారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులు, వైద్యులతో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ పనితీరును ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నవరత్న పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తామన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబాన్నీ కవర్ చేసేందుకు వీలుగా హెల్త్ కార్డులు అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని జనవరి 1, 2020న పశ్చిమగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రి నాని తెలిపారు. అన్ని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డితో సమీక్షించిన అనంతరం పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తామని, ప్రస్తుతం 1070 వ్యాధులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుండగా మరో వెయ్యి వ్యాధులను యీ పరిధిలోకి తీసుకువస్తామని అన్నారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సెప్టెంబర్ నాటికి 108 వాహనాలు 676 , 104 వాహనాలు 773 కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఇప్పటికే 32 మంది డయాలసిస్ రోగులు ఉన్నారని, ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం దారుణంగా ఉంటోందని, ఈ ప్రాంతంలో కాళ్లవాపు వ్యాధి వచ్చి అనేక మంచి మరణించారని అన్నారు. ఇప్పటికీ ఆ వ్యాధి ఎందుకు వస్తుందో వైద్యులు తెలుసుకోలేదన్నారు. జిల్లాలో 24 ్ఠ7 గా పీహెచ్‌సీలు నడుస్తున్నా, 7 గంటలు కూడా అవి పనిచేయడం లేదని అన్నారు. కరపలో నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను తీసుకువచ్చి భవనం నిర్మిస్తే గత ప్రభుత్వంలో ఆ భవనాన్ని బీసీ హాస్టల్‌కు ఇచ్చారని అన్నారు. జిల్లాలో లెప్రసీ మళ్లీ విజృంభిస్తున్నట్లు సాంకేతికాలు అందుతున్నాయని, దీనిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖామంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో వైద్యాన్ని మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకంలో పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల్లో ఉన్న ఆస్పత్రులను 2020 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఆధునికీకరించి మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతీ పీహెచ్సీలో డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు చిన్న, చిన్న ఆరోగ్య పరీక్షలు అన్ని అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందేవారి సంఖ్యను 60 శాతానికి పెంచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తుని ఆస్పత్రిలో 20 మంది సిబ్బంది అవసరం ఉన్నారని, అనస్థీషియా వైద్యుని, గైనకాలజిస్ట్‌లను నియమించాలన్నారు. ఎంపీ గీత మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే జిల్లాలో చాపకింద నీరులా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో ట్రామాకేర్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, దీనికి కావల్సిన స్థలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలా గైనకాలజిస్ట్‌లను, సివిల్ సర్జన్లను, ఆర్థోపెడిక్ వైద్యులను నియమించాలన్నారు. జగ్గంపేట ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడం వల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జగ్గంపేటలో ట్రామాకేర్ సెంటర్, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏలేశ్వరం ఆస్పత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ప్రత్తిపాడు పీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ పిఠాపురం ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులను డిప్యూటేషన్ ఇవ్వకుండా చూడాలని, అవసరమైన చోట్ల వైద్యులను, నర్సులను, ఆస్పత్రి సిబ్బందిని నియమించాలన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా మార్చాలని అన్నారు. ట్రామాకేర్ సెంటర్ ఉన్నా సిబ్బంది లేరన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్ లీకైన సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటే వారిని కాకినాడ తరలించాల్సి వస్తోందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ తమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ రోగులకు అందించినట్టే పెరాలసిస్ రోగులకు కూడా రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు తమ ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని, వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయుష్ కమిషనర్ రమ్యశ్రీ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, డీఎంఅండ్‌హెచ్‌వో బి.సత్యసుశీల, జేసీ–2 జి రాజకుమారి, మేయర్ సుంకర పావని పాల్గొన్నారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
-
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్‌పేటలో గతరాత్రి దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్విన్‌పేటకు చెందిన ధనలక్ష్మి, చంద్రశేఖర్‌లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ధనలక్ష్మిపై అతను అనుమానం పెంచుకున్నాడు. సోమవారం ఉదయం సైకిల్‌పై వస్తున్న ధనలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె శరీరంపై 17 చోట్ల కత్తితో పొడిచాడు. ఆసమయంలో ఆమె సోదరి కూడా వెంట ఉండడంతో ధనలక్ష్మిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాగా ధనలక్ష్మి వేరే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ చనువుగా ఉంటుందనే అక్కసుతోనే చంద్రశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితునిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నేరేడ్మెట్ వినాయక్‌నగర్‌లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వినాయక్‌నగర్‌కు చెందిన జి.వెంకటేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి కుమార్తె ధనలక్ష్మి కుషాయిగూడలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి తన గదిలో చున్నీతో ఉరివేసుకుంది. సోమవారం ఉదయం ఆమె తల్లి గమనించేసరికి గదిలో పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. చదువుపై ఆసక్తి లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె మూడు నెలలుగా కాలేజీకి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం
పాతపోస్టాఫీసు: కొన్ని జీవితాలను చూస్తే విధికి ఎందుకంత కంటగింపో ఎవరు చెప్పగలరు? విధి వైచిత్రిని, వైపరీత్యాన్ని ఎవరు ఊహించగలరు? మృత్యు కెరటంలా విరుచుకుపడే విధి ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతుంది. అనూహ్య పరిణామాలతో జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిళ్లా ధనలక్ష్మి కుటుంబం పరిస్థితీ అదే విధంగా మారింది. ఏడాది వ్యవధిలో మృత్యువు ఆమె భర్తను, తర్వాత ఆమెను దిగమింగడంతో ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంత విషాదంలోనూ ఆమె బం ధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించడంతో ధనలక్ష్మి జీవితం కడతేరినా, మరికొందరికి ప్రాణదానం చేసి నట్టురుుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిల్లా ధనలక్ష్మి (35) శుక్రవారం అనకాపల్లిలోని బంధువుల గహ ప్రవేశానికి వెళ్లి బావ గోవింద్ ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా సబ్బవరం దేవీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారు. తలకు దెబ్బ తగలడంతో ఆమెను రాంనగర్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. శనివారం ఉదయం ధనలక్ష్మి బ్రెరుున్‌డెడ్ అరుునట్టుగా వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారి సూచన ప్రకారం ఆమె బంధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించారు. నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంక్‌కు కళ్లను, లివర్‌ను అపోలో ఆస్పత్రికి, ఒక కిడ్నీని కేర్‌కు, ఒక కిడ్నీని సెవన్ హిల్స్ ఆస్పత్రికి అందజేయడానికి అంగీకరించారు. గత ఏడాది ధనలక్ష్మి భర్త గుండె పోటుతో మరణించారు. ఇప్పుడు తల్లికూడా మరణించడంతో వుడాపార్క్ చేరువలోని గాయత్రి విద్యాపరిషత్ పాఠశాలలో టెన్త చదువుతున్న హేమంత్ (15), ఎంవీపీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ (11) రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
నా కూతురిది ముమ్మాటికి హత్యే
బంజారాహిల్స్: తన కూతురిది ఆత్మహత్య కాదని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసును పునర్విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు,దనలక్ష్మి(26)దంపతులు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం భర్త వెంకటేశ్వరరావు తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన కూతురుది ఆత్మహత్య కాదని కట్నం కోసం, పిల్లలు పుట్టడం లేదనే సాకుతో రెండో పెళ్ళి చేసుకునేందుకు అల్లుడు వెంకటేశ్వరరావు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు చేయడంతో పుర్విచారణ చేపట్టారు. వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
దయ చూపమ్మా.. ధనలక్ష్మీ
కడప కల్చరల్: పదులు, ఇరవైలు, యాభైలు, వంద, ఐదు వందలు, వెయ్యి నోట్లు.. ఇలా కొత్త కరెన్సీ నోట్లు తెంచుకున్నాయి.. అమ్మవారికి అభరణాలయ్యాయి.. పూలమాలలుగా ఒదిగిపోయాయి.. గోడలకు పరదాలుగా.. ఇతర అలంకార సామగ్రిగా దర్శనమిచ్చాయి. çశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దాదాపు అన్ని ఆలయాలలో అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారిని కొలువుదీర్చే వేదిక, ఇతర అలంకార సామాగ్రితోపాటు అమ్మవారికి దుస్తులను కూడా కరెన్సీ నోట్లతోనే ఏర్పాటు చేయడం విశేషం. అమ్మవారిశాలలో సరస్వతిమాతగా అలంకరించి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పెసల సత్యనారాయణ, బూరగడ్డ విశ్వనాథం ఆధ్వర్యంలో చిన్నారి బాలలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు ఉచితంగా అందజేశారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కాత్యాయిని అలంకారం చేశారు. రాజేశ్వరి ఆలయం, బాల పోలేరమ్మ ఆలయం, నబీకోట శివాలయాలలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. గడ్డిబజారు శివాలయంలో కాళీయమర్దనిగా, సరస్వతిదేవిగా అలంకారం చేశారు. -
చిన్నారిపై యువకుని పైశాచికం..
మద్యం మత్తులోఒక యువకుడు ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. చుట్టుపక్కల వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాలివీ.. రవి (22) అనే వ్యక్తి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో కార్మికుడు. అతడు ధనలక్ష్మి అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె కుమార్తె(5) సహా ఆదిత్యనగర్‌లో ఉంటున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ధనలక్ష్మి ఇంట్లో లేని సయమంలో రవి పీకలదాకా మద్యం తాగి వచ్చి ఆ చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ.. రక్తం వచ్చేలా రక్కుతూ చిత్రహింసలు పెట్టాడు. బాధ తాళలేక చిన్నారి పెద్దగా ఏడవటంతో చుట్టుపక్కలవారు అక్కడికి వచ్చారు. రవి నిర్వాకాన్ని గమనించిన స్థానికులు అతడిని చితక బాదారు. అనంతరం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ధనలక్ష్మి తెచ్చే మలుపులు
డబ్బంటే ధనలక్ష్మి. ఆమె రాక ఎవ్వరినైనా ఏరువాకే. ధనలక్ష్మి ఎవరికి చేదు....! కష్టపడి సంపాదించేవాళ్లు కొందరైతే.....ఇక ఉచితంగా వస్తే ఎంతైనా తీసుకోవడానికి వెనుకాడని వారు మరికొందరు. ఓ నలుగురి జీవితాల తలుపు తట్టింది ధనలక్ష్మి. మరి వారి జీవితాలు ఆ తర్వాత ఎటువంటి మలుపులు తీసుకున్నాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధనరాజ్, మనోజ్‌నందం , సింధుతులానీ ముఖ్యతారలుగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కథాకథనాలు హైలైట్‌గా నిలుస్తాయని, ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే శావలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రసాద్ మల్లు, ప్రతాప్ భీమిరెడ్డి, సమర్పణ: మాస్టర్ సుక్కురామ్. -
ధనలక్ష్మి కేసులో నిందితులు అరెస్టు
బంటుమిల్లి : బంటుమిల్లికి చెందిన యామర్తి లక్ష్మీనారాయణ రెండో కుమార్తె వై.ధనలక్ష్మి మృతి కేసులో కుటుంబసభ్యులతో పాటు పలువురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 22వ తేదీ రాత్రి ధనలక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందింది. 23వ తేదీ తెల్లవారుజామున కుటుంబసభ్యులు పలువురి సహకారంతో దహనం చేశారు. దీనిపై 26వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల పాటు దర్యాప్తు జరిపి ధనలక్ష్మి తండ్రి యామర్తి లక్ష్మీనారాయణ, అన్న సత్యన్నారాయణలతోపాటు మృతురాలి ప్రియుడు మద్దాల చిరంజీవి, ఆటో డ్రైవరు ఆకునూరు వీర వెంకటేశ్వరరావు, శ్మశానానికి వెళ్లిన పోసిన మోహన్‌రావు, మద్దిపూడి కోటేశ్వరరావు, పొదిలి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బందరు రూరల్ సీఐ ఎస్.వి.మూర్తి మాట్లాడుతూ చదువుకునే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడిందన్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి పెద్దలు 2004లో మరో యువతితో వివాహం జరిపించారని తెలిపారు. ఆ తర్వాత కూడా ధనలక్ష్మి, చిరంజీవి వ్యవహారంపై గ్రామ పెద్దలు రాజీ చర్చలు జరిపినట్లు చెప్పారు. ధనలక్ష్మికి 2012లో గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపారన్నారు. ధనలక్ష్మికి వివాహం అయిన తర్వాత కూడా చిరంజీవి వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. దీంతో ధనలక్ష్మి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయని, ఈ విషయం విడాకుల వరకు వచ్చిందని చెప్పారు. చిరంజీవి వేధింపులు తాళలేక ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు మొదటి ముద్దాయిగా చిరంజీవిపై ఐపిసి 306 చట్టం నమోదు చేశామన్నారు. మిగిలిన వారిపైన 201 కేసు పెట్టినట్లు తెలిపారు. అనంతరం నిందితులను బంటుమిల్లి జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఎస్ఐ చిర ంజీవి సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల దర్యాప్తుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ధనలక్ష్మిపై రామ్‌గోపాల్‌వర్మ పిటిషన్ల దండయాత్ర
హైదరాబాద్ : ఫిలిమ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ పిటిషన్ల దండయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో ఆమెపై రెండు పిటిషన్లు దాఖలు చేసి వర్మ ఈరోజు నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తన దర్శకత్వంలో నిర్మించిన 'సత్య-2' చిత్రం విషయంలో ధనలక్ష్మి ఇబ్బంది పెట్టినట్లు వర్మ ఆరోపణ. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. వర్మ ఇప్పటికే ధనలక్ష్మిపై రెండుసార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11న వర్మ దాఖలు చేసిన పిటిషన్లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ సినిమాకు హిందీ భాషలోకంటే తెలుగులో చాలా ఎక్కువ కట్స్ పడినట్లు వర్మ వివరించారు. అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని వర్మ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ రోజు పట్టువదలని విక్రమార్కుడులాగా వర్మ మూడవసారి మరో పిటిషన్ దాఖలు చేశారు. -
ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో రామ్‌గోపాల్ వర్మ పిటిషన్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్య-2 సినిమా విడుదల సందర్భంగా ధనలక్ష్మి తనను ఇబ్బంది పెట్టినట్లు వర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని వర్మ శనివారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ధనలక్ష్మి అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. సత్య-2 శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు హిందీ భాషలోకంటే తెలుగులో చాలా ఎక్కువ కట్స్ పడినట్లు కూడా వర్మ వివరించారు. -
సెన్సార్ బోర్డ్ సభ్యురాలిపై క్రిమినల్ కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ
-
సెన్సార్‌బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ
హైదరాబాద్: సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ఆమె అడ్డుకుంటున్నట్లు వర్మ ఆరోపించారు. ఈ సినిమా హిందీ భాషలో విడుదలయింది. తెలుగులో విడుదలకు అడ్డంకులు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడ్డారని వర్మ ఆరోపణ. ధనలక్ష్మిపై రేపు నాంపల్లి కోర్టులో కేసు వేస్తానని వర్మ చెప్పారు. ధనలక్ష్మిపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి.