ధనలక్ష్మి తెచ్చే మలుపులు
డబ్బంటే ధనలక్ష్మి. ఆమె రాక ఎవ్వరినైనా ఏరువాకే. ధనలక్ష్మి ఎవరికి చేదు....! కష్టపడి సంపాదించేవాళ్లు కొందరైతే.....ఇక ఉచితంగా వస్తే ఎంతైనా తీసుకోవడానికి వెనుకాడని వారు మరికొందరు. ఓ నలుగురి జీవితాల తలుపు తట్టింది ధనలక్ష్మి. మరి వారి జీవితాలు ఆ తర్వాత ఎటువంటి మలుపులు తీసుకున్నాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’.
ధనరాజ్, మనోజ్‌నందం , సింధుతులానీ ముఖ్యతారలుగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కథాకథనాలు హైలైట్‌గా నిలుస్తాయని, ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే శావలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రసాద్ మల్లు, ప్రతాప్ భీమిరెడ్డి, సమర్పణ: మాస్టర్ సుక్కురామ్.