
సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam Movie). ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా మారాడు. ఎప్పుడూ కమెడియన్‌గా నవ్వించే ధనరాజ్ ఈ మూవీతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లోకి వచ్చేందుకు రెడీ అయింది. సన్ నెక్స్ట్‌లో మార్చి 14న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి రానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) అధికారికంగా ప్రకటించింది.

కథేంటంటే?
సబ్ రిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడు. కొడుకు రాఘవన (ధన్‌రాజ్)ను చాలా గారాబంగా పెంచుతాడు. డాక్టర్‌ను చేయాలని కలలు కంటాడు. కానీ అతడు మాత్రం చదువు ఆపేసి జల్సా చేస్తాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అనేక తప్పులు చేస్తాడు. అలా ఓసారి చిక్కుల్లోపడతాడు. అప్పుడు తండ్రే అతడిని పోలీసులకు అప్పగిస్తాడు. జైలు నుంచి బయటకు రాగానే తండ్రినే చంపాలని కుట్రపన్నుతాడు.. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? అతడు చేసిన తప్పేంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
The father and son journey unfolds in a manner you won’t anticipate... 😊✨
Watch Ramam Raghavam streaming from March 14th 🔥
[Ramam Raghavam, Samuthirakani, Dhanraj Koranani, Harish Uthaman,
Satya, Vennela Kishore, Srinivas Reddy, Sunil, Prudhvi Raj]
.
.
.#RamamRaghavam… pic.twitter.com/7jrkTU01SO— SUN NXT (@sunnxt) March 5, 2025
చదవండి: వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా
Comments
Please login to add a commentAdd a comment