
ఈ ఏడాది పొంగల్‌కు రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) ఓ రేంజ్‌లో అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గేదేలే అన్నట్లుగా థియేటర్లకు క్యూ కట్టారు. కడుపుబ్బా నవ్వుకుని ఎన్నాళ్లవుతుందో అన్నట్లుగా సినీప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు సినిమా చూసి ఎంజాయ్ చేశారు. పోటీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలున్నా వాటిని వెనక్కు నెట్టి విజేతగా నిలిచింది.
ఓటీటీలో ప్రభంజనం
విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 1న అటు టీవీలో, ఇటు ఓటీటీలో రిలీజైంది. ఇంకేముంది, వన్స్ మోర్ అంటూ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఓటీటీ ప్రియులు జీ5లో సినిమా తెగ చూసేస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్ వచ్చాయని జీ5 అధికారికంగా ప్రకటించింది. 13 లక్షలమంది సినిమా వీక్షించారని పేర్కొంది. ఇంతకుముందు ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్ సినిమాల రికార్డులను సంక్రాంతికి వస్తున్నాం బద్ధలు కొట్టిందని వెల్లడించింది. జీ5 ప్లాట్‌ఫామ్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ రిలీజ్ చేసింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. వెంకీమామ భార్య భాగ్యంగా ఐశ్వర్య, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి, వెంకటేశ్ కొడుకు బుల్లిరాజుగా రేవంత్ భీమల అదరగొట్టారు. కొరికేత్త నిన్ను అంటూ బుల్లిరాజు చేసే కామెడీ కోసమైనా సినిమా చూడాల్సిందే అంటున్నారు. అన్నట్లు ఈ మూవీ ఓటీటీలో తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
HISTORY CREATED!
The BIGGEST OPENING EVER on ZEE5 in just 6 hours!
Experience the magic of #SankranthikiVasthunam
Streaming Now in Malayalam | Hindi | Tamil | Kannada| Telugu @VenkyMama @AnilRavipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo #Dilraju #Shirish @YoursSKrishna pic.twitter.com/udEZi473ov— ZEE5 Telugu (@ZEE5Telugu) March 2, 2025
చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా