Ramam Raghavam Movie
-
ఓ తండ్రి కథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం రామం రాఘవం ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది మమకారం. వారి మాట వినకూడదని పిల్లల మూర్ఖత్వం. జన్మనిచ్చిన తల్లి... జీవితాన్నిచ్చే తండ్రి తమ కన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే కాస్తంత కటువుగా మారతారు. ఆ కటుత్వం మాటున ఆప్యాయత, అనురాగాలుంటాయి. అవి అర్థం చేసుకోని పిల్లలు ఎంతో నష్టపోతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘రామం రాఘవం’. తల్లి ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రి ప్రేమను ఇంత లోతుగా చూపించిన సినిమా ఇదే. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు సముద్రఖని అందించిన ఈ కథకు నటుడు ధన్‌రాజ్ దర్శకత్వం వహించారు. ‘రామం రాఘవం’ అనేది పిల్లలకు పెద్దలు చెప్పిన పాఠం అయితే, పిల్లలకు ఇదో గుణపాఠం. అంతలా ఏముందీ సినిమాలో ఓ సారి చూద్దాం. దశరథ రామం కోనసీమ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఓ నిజాయితీ గల అధికారి. తనలాగే తన కొడుకు రాఘవను నీతీ నిజాయితీతో నిండిన మంచి వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకుంటాడు. కానీ రాఘవ చదువు కూడా కనీసం సరిగ్గా చదువుకోకుండా ఇంటా బయటా తండ్రికి తలవంపులు తెస్తుంటాడు.అంతేకాదు తనను మందలించిన తండ్రి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఆఖరికి తన తండ్రి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. రాఘవ చేసిన ప్రతి తప్పును క్షమించి కాస్తంత మందలిస్తూ అంతులేని బాధను అనుభవిస్తుంటాడు రామం. ఆఖరికి రాఘవ తన తండ్రి కోసం చేసిన ప్రయత్నమేంటి? దాని వల్ల రాఘవ పొందిన లాభం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీ వేదికైన సన్ నెక్ట్స్‌లో చూడాల్సిందే. నటుడిగా ధన్‌రాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.మరీ ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. నటుడిగా ధన్‌రాజ్ నాణేనికి ఓ వైపు మాత్రమే, ఈ సినిమాతో ధన్‌రాజ్ తన దర్శకత్వ ప్రతిభను ఘనంగా చాటారనే చెప్పుకోవాలి. ఓ పక్క కథను అందించి, కథలోని తండ్రి పాత్రకు ఊపిరి పోసింది సముద్రఖని అయితే మరో పక్క అదే కథకు దర్శకత్వం వహించి, కొడుకు పాత్రలో ఒదిగిపోయి ఆ కథకు జీవితాన్నిచ్చింది ధన్‌రాజ్.కొన్ని సినిమాలు ఆనందం కోసం చూస్తాం. ఇలాంటి సినిమాలు మాత్రం మన జీవితం కోసం చూడాలి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం చూడాలి. వీలైతే మీ తల్లిదండ్రులతో కలిసి ఈ ‘రామం రాఘవం’ చూడండి. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' రాబోతున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రామం రాఘవం, ఏజెంట్, రేఖాచిత్రం, వనవాస్, పొన్ మ్యాన్ తదితర చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు కొత్త మూవీస్ కూడా వచ్చే అవకాశముంది.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (మార్చి 14న)సన్ నెక్స్ట్రామం రాఘవం - తెలుగు సినిమాసోనీ లివ్ఏజెంట్ - తెలుగు మూవీఆహారేఖాచిత్రం - తెలుగు సినిమాసీ సా - తమిళ మూవీఅమెజాన్ ప్రైమ్బీ హ్యాపీ - హిందీ సినిమాఒరు జాతి జాతకమ్ - మలయాళ మూవీనెట్ ఫ్లిక్స్ద ఎలక్ట్రిక్ స్టేట్ - ఇంగ్లీష్ మూవీకర్స్ ఆఫ్ ద సెవెన్ సీస్ - ఇండోనేసియన్ సినిమాఆడ్రే - ఇంగ్లీష్ మూవీఎమర్జెన్సీ - హిందీ సినిమాఆజాద్ - హిందీ మూవీలవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ సీజన్ 2 - స్వీడిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆడాలసెన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5వనవాస్ - హిందీ మూవీహాట్ స్టార్పొన్ మ్యాన్ - మలయాళ సినిమామోనా 2 - ఇంగ్లీష్ చిత్రంఆచారీ బా - హిందీ మూవీబుక్ మై షోమెర్సీ కిల్లింగ్ - తెలుగు సినిమాద సీడ్ ఆఫ్ సేక్రెడ్ ఫిగ్ - పెర్షియన్ మూవీకంపానియన్ - ఇంగ్లీష్ సినిమాఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
ఓటీటీలో రామం రాఘవం.. ఎప్పటినుంచంటే?
సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam Movie). ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా మారాడు. ఎప్పుడూ కమెడియన్‌గా నవ్వించే ధనరాజ్ ఈ మూవీతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లోకి వచ్చేందుకు రెడీ అయింది. సన్ నెక్స్ట్లో మార్చి 14న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి రానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) అధికారికంగా ప్రకటించింది.కథేంటంటే?సబ్ రిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడు. కొడుకు రాఘవన (ధన్‌రాజ్)ను చాలా గారాబంగా పెంచుతాడు. డాక్టర్‌ను చేయాలని కలలు కంటాడు. కానీ అతడు మాత్రం చదువు ఆపేసి జల్సా చేస్తాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అనేక తప్పులు చేస్తాడు. అలా ఓసారి చిక్కుల్లోపడతాడు. అప్పుడు తండ్రే అతడిని పోలీసులకు అప్పగిస్తాడు. జైలు నుంచి బయటకు రాగానే తండ్రినే చంపాలని కుట్రపన్నుతాడు.. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? అతడు చేసిన తప్పేంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! The father and son journey unfolds in a manner you won’t anticipate... 😊✨Watch Ramam Raghavam streaming from March 14th 🔥[Ramam Raghavam, Samuthirakani, Dhanraj Koranani, Harish Uthaman,Satya, Vennela Kishore, Srinivas Reddy, Sunil, Prudhvi Raj]...#RamamRaghavam… pic.twitter.com/7jrkTU01SO— SUN NXT (@sunnxt) March 5, 2025 చదవండి: వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా -
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
టైటిల్: రామం రాఘవంనటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులునిర్మాత: పృథ్వీ పోలవరపుకథ: శివప్రసాద్ యానాలదర్శకత్వం: ధన్రాజ్సంగీతం: అరుణ్ చిల్లివేరుసినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కమెడియన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్థస్త్‌తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నేడు (ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ(ధన్‌రాజ్) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవ(హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటితరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాడు.చెడు అలవాట్లకు బానిసై పెరెంట్స్ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్‌తో రామం రాఘవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ధన్‌రాజ్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం, రాఘవ లాంటి పాత్రలను మనం ఎక్కడో ఒక్క చోటే చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పెరెంట్స్‌ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మంది గుండెని పిండేస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులే చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్, సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. తప్పు చేయడం..తండ్రికి దొరికిపోవడం..ఆ తర్వాత ఎమోషనల్ సంభాషణలు.. ఫస్టాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధన్‌రాజ్ లవ్‌ట్రాక్ కథకి అడ్డంకిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పటల్ సీన్ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సముద్రఖని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రల్లో అయినా జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక ధన్‌రాజ్ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్రలో కూడా నటించాడు. తొలి సినిమా అయినా కథను బాగా డీల్ చేశాడు. అనవసరపు సన్నీవేశాలను జోడించకుండా..తాను చెప్పాలనుకునే పాయింట్‌ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. ఎక్కడా ఎలివేషన్లు లేకుండా చాలా సింపుల్‌గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్‌గా నటించేశాడు. తండ్రి తనయుల సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హరీశ్ ఉత్తమ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అరుణ్ చిల్లివేరు బీజీఎం బాగుంది. పాటలు జస్ట్ ఓకే.దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే బాగుది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్