
తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రివైండ్ (Rewind Movie) ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 7న లయన్స్‌గేట్‌ప్లే (LionsgatePlay)లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది.
రివైండ్ సినిమా
సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ట్రైమ్ ట్రావెల్ చిత్రం రివైండ్. సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్‌బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్ చరణ్ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్ లూక్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథేంటంటే?
రివైండ్ కథ 2019 - 2024 మధ్యకాలంలో జరుగుతుంది. కార్తీక్ (సాయి రోనక్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడి స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోని శాంతి (అమృత చౌదరి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. హీరో పనిచేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఒకరంటే మరొకరికి ఇష్టం.. కానీ ఎవరూ బయటకు చెప్పుకోరు. ఓరోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తీని కాఫీ షాపుకు రమ్మంటుంది.
సరిగ్గా అదే రోజు అతడి తాతయ్య (సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సాయంతో కార్తీక్ టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? టైం ట్రావెల్‌లో అతడు ఏం తెలుసుకున్నాడు? చివరకు శాంతి, కార్తీక్ ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Time is ticking, but can they change the past? ⏳🔥 #Rewind premieres exclusively on #LionsgatePlay this March 7th in Hindi & Telugu! pic.twitter.com/cNEZ0EzTWI
— Lionsgate Play (@lionsgateplayIN) February 26, 2025
చదవండి: లావుగా ఉన్నానని హీరోయిన్‌గా పక్కనపెట్టేశారు: సోనాక్షి