Rewind
-
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రివైండ్’ మూవీ ఎలా ఉందంటే?
టైటిల్: రివైండ్ నటీనటులు: సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ గారు, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులునిర్మాణ సంస్థ : క్రాస్ వైర్ క్రియేషన్స్దర్శకతం: కళ్యాణ్ చక్రవర్తిసంగీతం : ఆశీర్వాద్సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్విడుదల తేది: అక్టోబర్ 18, 2024సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘రివైండ్’. ఈ చిత్రంతో కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. టైం ట్రావెల్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. రివైండ్ కూడా ఓ డిఫరెంట్ టైం ట్రావెల్ స్టోరీ. ఓ మంచి ప్రేమ కథకి టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ని యాడ్ చేసి ఎంటర్టైనింగ్ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు కల్యాణ్. సినిమా ప్రారంభంలోనే సామ్రాట్ టైం ట్రావెల్ చేసి రావడం.. తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ.. కారు ప్రమాదం జరగ్గానే మాయమైపోవడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత కథలోకి కార్తీక్, శాంతి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. వీరిద్దరి మధ్య జరిగే క్యూట్ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో అనేక అనుమానాలు రేకెత్తిస్తూ కథనాన్ని నడిపించాడు. ఇంటర్వెల్ సయమానికి ప్రేక్షకుడి మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి సెకండాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్‌కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. క్లైమాక్స్ కూడా ఊహకు అందకుండా పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కార్తిక్ పాత్రలో సాయి రోనాక్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. లవర్ బాయ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శాంతి పాత్రకు అమృత చౌదరి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తోటి సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణం విలువలు బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా కనిపించింది.Rating: 2.75/5 -
ఈ 18న థియేటర్లలో 'రివైండ్' మూవీ రిలీజ్
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'రివైండ్'. కళ్యాణ్ చక్రవర్తి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు.జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తం లో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. -
‘రివైండ్’లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్
‘‘ఒక మంచి కథతో ‘రివైండ్’ సినిమా చేశాం. కల్యాణ్‌గారు మంచి కథతో ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరో సాయిరోనక్ అన్నారు. కల్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘రివైండ్’. సాయి రోనక్, అమృతా చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సాయి రోనక్ మాట్లాడుతూ.. ‘ చిన్న టీం అయినా ఒక మంచి లైన్‌తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. ప్రేక్షకులు అందరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’అన్నారు. కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తీసిన ప్రేమకథా చిత్రమిది. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది’’ అని తెలిపారు. ‘‘నాకు, మా డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్.. మా అందరికీ ‘రివైండ్’ తొలి చిత్రం’’ అని అమృతా చౌదరి పేర్కొన్నారు. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్‌నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.