టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రివైండ్‌’ మూవీ ఎలా ఉందంటే? | Rewind Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Rewind Review: టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రివైండ్‌’ మూవీ ఎలా ఉందంటే?

Published Fri, Oct 18 2024 4:46 PM | Last Updated on Fri, Oct 18 2024 10:38 PM

Rewind Movie Review And Rating In Telugu

టైటిల్‌: రివైండ్ 
నటీనటులు: సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ గారు, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు
నిర్మాణ సంస్థ : క్రాస్ వైర్ క్రియేషన్స్
దర్శకతం:  కళ్యాణ్ చక్రవర్తి
సంగీతం : ఆశీర్వాద్
సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్
విడుదల తేది: అక్టోబర్‌ 18, 2024

సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘రివైండ్‌’. ఈ చిత్రంతో  కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(అక్టోబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్‌(సాయి రోనక్‌) ఓ సాఫ్ట్‌వేర్‌. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్‌మెంట్‌లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్‌ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్‌) కనిపెట్టిన టైం మిషన్‌ సహాయంతో కార్తిక్‌ ట్రైమ్‌ ట్రావెల్‌ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్‌ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్‌ ట్రావెల్‌ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్‌ మిషన్‌ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్‌ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
టైం ట్రావెల్‌ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి.  రివైండ్ కూడా ఓ డిఫరెంట్‌ టైం ట్రావెల్‌ స్టోరీ. ఓ మంచి ప్రేమ కథకి టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌ని యాడ్‌ చేసి ఎంటర్‌టైనింగ్‌ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు కల్యాణ్‌. సినిమా ప్రారంభంలోనే సామ్రాట్‌ టైం ట్రావెల్‌ చేసి రావడం.. తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ.. కారు ప్రమాదం జరగ్గానే మాయమైపోవడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత కథలోకి కార్తీక్, శాంతి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. వీరిద్దరి మధ్య జరిగే క్యూట్‌ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో అనేక అనుమానాలు రేకెత్తిస్తూ కథనాన్ని నడిపించాడు. ఇంటర్వెల్‌ సయమానికి ప్రేక్షకుడి మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి సెకండాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఫస్టాఫ్‌ నుంచి సెకండాఫ్‌కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. క్లైమాక్స్ కూడా ఊహకు అందకుండా పార్ట్‌ 2కి లీడ్‌ ఇచ్చేలా ఉంటుంది.  

ఎవరెలా చేశారంటే.. 
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కార్తిక్‌ పాత్రలో  సాయి రోనాక్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. లవర్‌ బాయ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శాంతి పాత్రకు అమృత చౌదరి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది.  ఇక మిగతా పాత్రల్లో కనిపించిన సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తోటి సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే.  నిర్మాణం విలువలు బాగున్నాయి.  సినిమా చాలా రిచ్ గా కనిపించింది.

Rating: 2.75/5

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement