
ప్రెజర్ కుక్కర్, లగ్గం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి రోనక్.. ఆయన నటించిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రివైండ్ (Rewind Movie) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న అమృత చౌదరి హీరోయిన్‌గా నటించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 10న ఓటీటీలో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ రివైంట్ చిత్రం అందుబాటులో ఉంది.
సాయి రోనక్, అమృత చౌదరి కాంబినేషన్‌తో రివైండ్ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్‌బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్ చరణ్ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్ లూక్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఐఎమ్‌బీడీ రేటింగ్ 9.4 ఉండటం విశేషం.

కథేంటి..?
ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్‌వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్‌మెంట్‌లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment