Sai Ronak
-
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్‌లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
సాఫ్ట్వేర్ కుర్రాడితో 'లగ్గం'.. ఎలా ఉందంటే?
టైటిల్: లగ్గంనటీనటులు: సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి తదితరులుదర్శకుడు: రమేశ్ చెప్పాలనిర్మాత: వేణుగోపాల్రెడ్డివిడుదల తేదీ: 25 అక్టోబర్ 2024సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. లవ్ అండ్ ఫ్యామిలీ అభిమానులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అసలు కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ఎలా ఉందంటే...తెలంగాణ నేపథ్యంలో కావడంతో అక్కడి సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథ పెళ్లి సంబురాల వైపు నడిపించాడు. బంధువులు, పెళ్లి, పద్ధతులు, ఆచారాలను ఆడియన్స్‌కు పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లాడు. లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలు నిజజీవితంలో ప్రేక్షకులను టచ్ చేసేలా చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌ను ఆలోచనలో పడేశాడు. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ పరిచయాలతో కథ కాస్తా మెల్లగానే సాగినట్లు అనిపిస్తుంది. ఇకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రారంభం నుంచే ఆడియన్స్‌ను ఎమోషనల్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. ద్వితీయభాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసేలా ఉన్నాయి. ఒక్క లగ్గం చుట్టూ ఇన్ని జరుగుతాయా? అనే అనుమానాన్ని ఆడియన్స్‌లో కలిగించాడు. ఒక సాఫ్ట్వేర్ లైఫ్, ఓ తండ్రి తన కూతురి కోసం పడే తపన, కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ చెప్పాల. క్లైమాక్స్ సీన్‌తో సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేశాడు. ఓవరాల్‌గా చూస్తే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్లా అనిపించింది.ఎవరెలా చేశారంటే..సాయిరోనాక్ నటనలో మరోసారి తనదైన మార్క్ చూపించాడు. ప్రగ్యా నగ్రా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రాజేంద్రప్రసాద్, రోహిణి తమ నటనతో మెప్పించారు. రఘుబాబు , ఎల్బీ శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ , కిరీటి , అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే బాలరెడ్డి (బేబీ ఫేమ్) సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ బీజీఎం ఈ సినిమాకు మరో ప్లస్. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గుట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం మా నాన్నతో యాక్ట్ చేసినట్టే ఉంది...
-
రెండు కుటుంబాలు కాదు రెండు మనస్సులు కలిస్తేనే లగ్గం..
-
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రివైండ్’ మూవీ ఎలా ఉందంటే?
టైటిల్: రివైండ్ నటీనటులు: సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ గారు, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులునిర్మాణ సంస్థ : క్రాస్ వైర్ క్రియేషన్స్దర్శకతం: కళ్యాణ్ చక్రవర్తిసంగీతం : ఆశీర్వాద్సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్విడుదల తేది: అక్టోబర్ 18, 2024సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘రివైండ్’. ఈ చిత్రంతో కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. టైం ట్రావెల్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. రివైండ్ కూడా ఓ డిఫరెంట్ టైం ట్రావెల్ స్టోరీ. ఓ మంచి ప్రేమ కథకి టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ని యాడ్ చేసి ఎంటర్టైనింగ్ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు కల్యాణ్. సినిమా ప్రారంభంలోనే సామ్రాట్ టైం ట్రావెల్ చేసి రావడం.. తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ.. కారు ప్రమాదం జరగ్గానే మాయమైపోవడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత కథలోకి కార్తీక్, శాంతి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. వీరిద్దరి మధ్య జరిగే క్యూట్ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో అనేక అనుమానాలు రేకెత్తిస్తూ కథనాన్ని నడిపించాడు. ఇంటర్వెల్ సయమానికి ప్రేక్షకుడి మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి సెకండాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్‌కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. క్లైమాక్స్ కూడా ఊహకు అందకుండా పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కార్తిక్ పాత్రలో సాయి రోనాక్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. లవర్ బాయ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శాంతి పాత్రకు అమృత చౌదరి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తోటి సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణం విలువలు బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా కనిపించింది.Rating: 2.75/5 -
లగ్గం మూవీ ట్రైలర్.. నూతన వధూవరులకు సర్ప్రైజ్!
సాయి రోనక్, ప్రజ్ఞ నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సుభిషి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అయితే ట్రైలర్ రిలీజ్‌ను రోటీన్‌కు భిన్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. లగ్గం మూవీ ట్రైలర్‌ను రియల్‌గా పెళ్లి చేసుకుంటున్న నూతన వధూవరుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా టీమ్ అంతా పాల్గొన్నారు. వెరైటీగా మూవీ ప్రమోషన్స్ చేయడంతో మూవీ టీమ్‌ను అభినందించారు. వధూవరులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతమందించారు. Here’s the unique #Laggam trailer launch event video, out now! ✨▶ https://t.co/6ex2wPVLMq#LaggamOnOct25th#RajendraPrasad @rameshcheppala #Venugopalreddy @saironak3 @pragyanagra #BalReddy @CharanArjunwave @bnreddystar @SreedharSri4u @Subishiofficial #LaggamMovie… pic.twitter.com/0cu1eQsVaZ— Aditya Music (@adityamusic) October 10, 2024 A celebration of love, laughter, and family like never before! The ultimate marriage and family entertainer #Laggam trailer is out now on @adityamusic.▶ https://t.co/u14wc4vcps#LaggamOnOct25thTrailer launched by real Bride & Bridegroom pic.twitter.com/2VzUmhZjwb— Madhu VR (@vrmadhu9) October 10, 2024 -
'లగ్గం' రీల్ పెట్టు.. చీరపట్టు
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. మంచి కంటెంట్ ఉన్నా సరే.. ఆ సినిమా వచ్చిందనే విషయం తెలియక ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు. అందుకే మేకర్స్ వినూత్నమైన రీతిలో తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎలాగో అలా తమ చిత్రం రిలీజ్ అవుతుందనే విషయం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా ‘లగ్గం’ సినిమా మేకర్స్ కూడా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చీరల పండుగ పేరుతో రీల్ పెట్టు - చీర పట్టు అనే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. ఆసక్తి కలిగిన యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్గం సినిమాకు సంభందించి పాటలకు గానీ లేదా టీజర్ లో డైలాగ్స్ కు గాని తమ స్టైల్ లో రీల్ లేదా యూట్యూబ్ షాట్ చేసి 8885050729 నెంబర్ కు పంపితే చీర ను గిఫ్ట్ గా అందిస్తారట. అయితే ఈ బహుమతి పొందాలంటే.. వారి అకౌంట్ లో పోస్ట్ చేసి లగ్గం పేజీ కి టాక్ చెయ్యాలట.లగ్గం విషయాలకొస్తే.. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. -
‘రివైండ్’లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్
‘‘ఒక మంచి కథతో ‘రివైండ్’ సినిమా చేశాం. కల్యాణ్‌గారు మంచి కథతో ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరో సాయిరోనక్ అన్నారు. కల్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘రివైండ్’. సాయి రోనక్, అమృతా చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సాయి రోనక్ మాట్లాడుతూ.. ‘ చిన్న టీం అయినా ఒక మంచి లైన్‌తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. ప్రేక్షకులు అందరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’అన్నారు. కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తీసిన ప్రేమకథా చిత్రమిది. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది’’ అని తెలిపారు. ‘‘నాకు, మా డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్.. మా అందరికీ ‘రివైండ్’ తొలి చిత్రం’’ అని అమృతా చౌదరి పేర్కొన్నారు. -
అక్టోబర్ 25న ‘లగ్గం’
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా "రిలీజ్ డేట్ లాంచింగ్ పోస్టర్" ప్రముఖ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లగ్గం" అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. "ప్రతి ప్రవాస భారతీయులు తప్పకుండా చూడల్సిన సినిమా. ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలి’ అని ఎల్బి శ్రీరాం అన్నారు. -
తెలంగాణ పెళ్లి బ్యాక్‌డ్రాప్‌తో సినిమా.. శరవేగంగా షూటింగ్
సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. 'భీమదేవరపల్లి బ్రాంచి' మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని ఈ దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్గా నటించారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. (ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) -
ఆ సినిమా తరువాత అంత గొప్ప పాత్ర ఇదే: రాజేంద్ర ప్రసాద్
సాయి రోనక్, గనవి లక్ష్మణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'లగ్గం'. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నచెప్పాల రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సుభిశి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ...'లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర చేస్తున్నా. నా కెరీర్లో పెళ్లి పుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం మరో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ ఈ కథనాలు కనెక్ట్ అవుతాయి. మొత్తంగా లగ్గం విందు భోజనం లాంటి సినిమా' అని అన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ల లగ్గాన్ని గుర్తు చేస్తుంది. పెళ్లి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
గతంలో నా చిత్రాల్లో ఈ బ్యాలెన్స్ లేదు: ప్రముఖ డైరెక్టర్
'కాన్సెప్ట్, కమర్షియల్ అంశాలను బాగా బ్యాలెన్స్ చేయాలి. అయితే నా గత చిత్రాలకు ఈ బ్యాలెన్స్‌ను మిస్సయ్యానని అనుకుంటున్నా. బాలచందర్గారివంటి పెద్ద దర్శకుల కమర్షియల్ చిత్రాలు ఆడియన్స్‌ను అలరిస్తూనే కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉండేవి. ‘సర్కిల్’ సినిమాకి ఆ బ్యాలెన్స్ మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుని, చేశాను' అన్నారు దర్శకుడు నీలకంఠ. సాయిరోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. ఎమ్వీ శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నీలకంఠ మాట్లాడుతూ– ‘‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్. విధి వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసింది? అన్నదే కాన్సెప్ట్. ఈ చిత్రంలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన సాయి రోనక్ అనూహ్యమైన ఘటనల్లో ఎలా చిక్కుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్ సినిమాలను చూసే విధానంలో మార్పు వచ్చింది. నా తరహా సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో.. ఇది నా టైమ్ ఏమో అనిపిస్తోంది. ‘సర్కిల్’ ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇక నా కెరీర్లో నేను గ్యాప్ ఇవ్వలేదు... ఇవ్వబడింది. ‘మాయ’ సినిమాను మహేశ్ భట్‌గారు హిందీలో తీయాలనుకున్నారు.. కుదర్లేదు. ఓ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్‌కు వెళ్లే టైమ్‌లో ఆగిపోయాయి. స్వామి వివేకానందగారి జీవితంతో వెంకటేశ్‌గారితో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను.. కుదర్లేదు. కానీ ఆయన నటించిన ‘ఈనాడు’కు డైలాగ్స్ రాశాను. హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ చేశాను. ఓ సోషల్ డ్రామా, పీరియాడికల్ సబ్జెక్ట్స్‌తో వెబ్ సిరీస్‌ల్లానే ఉంది’’ అన్నారు. -
Circle:శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో ఏం చేశాడు?
ఓ ఫొటోగ్రాఫర్ తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో ఉంటాడు. అప్పుడు అతనేం చేశాడు? అనేది ‘సర్కిల్’ చిత్రం ప్రధాన ఇతివృత్తం. సాయి రోనక్, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా, పార్థవ సత్య కీలక పాత్రలు చేశారు. ఫొటోగ్రాఫర్‌గా సాయి రోనక్ చేశారు. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్వీ శరత్ చంద్ర, టి. సుమలత, అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7 రిలీజ్ కానుంది. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ‘సర్కిల్’ సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో కథానాయకుడు ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘సర్కిల్ ఆఫ్ లైఫ్’ సాంగ్
సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకుడు.ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగాఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ 'సర్కిల్ ఆఫ్ లైఫ్', అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసారు. జీవితం మరియు దాని అనిశ్చితి గురించి మాట్లాడే పెప్పీ ఫాస్ట్ బీట్ నంబర్ గా వచ్చిన ఈ పాట అందరిని అలరిస్తోంది. ఇక ఈ సింగల్ వీడియో సినిమాలోని విభిన్న సన్నివేశాల విజువల్స్‌ని చూపించి, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లైఫ్.. డెత్.. ఫేట్.. ఇదే సర్కిల్
సాయి రోనక్ హీరోగా, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ‘సర్కిల్’ టీజర్‌ను విడుదల చేశారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను ఫొటోగ్రాఫర్ పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్ .. అనే ఈ మూడు అంశాల కలయికయే ఈ చిత్రం. తన జీవితంలో జరిగిన కొన్ని çఘటనల కారణంగా తనకు ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలసుకోలేని సందిగ్థంలో పడే హీరో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు నీలకంఠ. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చతుంది. మా తర్వాతి సినిమాను కూడా నీలకంఠగారితోనే చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శరత్ చంద్ర. -
‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : డెడ్ పిక్సెల్స్ నటీనటులు : నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, వైవా హర్ష, సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాతలు : సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా కథ : అక్షయ్ పూల్ల దర్శకత్వం: ఆదిత్య మండల సంగీతం : సిద్ధార్థ సదాశివుని సినిమాటోగ్రఫీ : ఫహాద్ అబ్దుల్ మజీద్ విడుదల తేది: మే 19, 2023(6 ఎపిసోడ్స్) ఓటీటీ ఫ్లాట్‌పామ్: డిస్నీ +హాట్‌స్టార్ నాలుగేళ్ల విరామం తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్ లగుసాని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 6 ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ +హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరిస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘డెడ్ పిక్సెల్స్’ కథేంటంటే.. గాయత్రి(నిహారిక కొణిదెల), భార్గవ్(అక్షయ్ లగుసాని), ఐశ్వర్య(భావన సాగి) ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. వీరిలో గాయత్రి, భార్గవ్‌కి ఆన్లైన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయంలో మాత్రమే కాదు ఆఫీస్ టైమ్‌లో కూడా ఆన్లైన్లో ‘బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్’ అనే వీడియో గేమ్ ఆడుతుంటారు. విరిద్దరికి ఆ గేమ్ ద్వారలే పైలట్ ఆనంద్(వైవా హర్ష) పరిచయం అవుతాడు. (చదవండి: బిచ్చగాడు మూవీ 2 రివ్యూ) ఈ ముగ్గురికి ఆ గేమ్ తప్ప మరో ప్రపంచం ఉండదు. ఆనంద్ అయితే భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా గేమ్‌కే అడిక్ట్ అవుతాడు. ఈ ఆన్లైన్ గేమ్.. ఆ ముగ్గురిపై ఎలాంటి ప్రభావం చూపింది? గాయత్రికి ఆఫీసులో పరిచమైన రోషన్(సాయి రోణక్) కారణంగా ఆటలోనూ, నిజ జీవితంలోనూ భార్తవ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తండ్రి(రాజీవ్ కనకాల)తో భార్గవ్‌కు ఉన్న సమస్య ఏంటి? ‘బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్’ గేమ్‌కి అడిక్ట్ అయిన తన స్నేహితులను రియాల్టీలోకి తీసుకురావడానికి ఐశ్వర్య ఏం చేసింది? చివరకు ఏం అయింది? అనేది డిస్నీ +హాట్‌స్టార్‌లో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే.. ఆన్లైన్ గేమ్‌కు బానిసలై చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అలాంటి గేమ్స్‌కి అడిక్ట్ అయితే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది కామెడీ వేలో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా చూపించారు. దర్శక, రచయితలు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. వీడియో గేమర్సే టార్గెట్‌గా ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు.ఇందులో ఐశ్వర్య తప్ప మిగిలిన మూడు క్యారెక్టర్స్ వాస్తవ ప్రపంచంలో ఉండవు. యువతే కాదు పెద్దలు కూడా ఇలాంటి ఆటలకు బానిసలైపోతున్నారని వైవా హర్ష ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. భార్య పిల్లన్ని పట్టించుకోకపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది అతని పాత్ర ద్వారా తెలియజేశారు. రియాలిటీకి, ఆన్లైన్లో బతకడానికి మధ్య తేడా ఏంటో ఐశ్వర్య పాత్ర ద్వారా చూపించారు. గేమ్ ఆడేటప్పుడు నిహారిక, సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్‌ల మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. సిరీస్ మొత్తం ఇలానే కామెడీగా తెరకెక్కించినా బాగుండేది. మధ్యలో పేరెంట్స్‌ని కోల్పోయిన ఓ కుర్రాడిని, ఆన్లైన్ బాయ్‌కాట్ లాంటి సన్నివేశాలను ఇరికించారు. అవి అంతగా ఆకట్టుకోలేవు. గేమ్ ద్వారా నిహారిక, భార్గవ్ పాత్రలు చేసే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్షయ్, నిహారిక, సాయి రోణక్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీని మరింత ఆసక్తిగా చూపిస్తే బాగుండేది. ఇక ఆన్లైన్ గేమ్‌ల కంటే మైదానంలో ఆడే ఆటలు చాలా గొప్పవని రాజీవ్ కనకాల పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పాత్ర నిడివిని పెంచి ఆన్లైన్లో ఆడే ఆటలకు, రియల్‌గా ఆడే ఆటలకు మధ్య తేడాలను చూపించే విధంగా కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తే.. మంచి సందేశం ఇచ్చినట్లు ఉండేది.వీడియో గేమ్స్ ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. గాయత్రి పాత్రలో నిహారిక ఒదిగిపోయింది. తనకు నచ్చినట్టుగా బతికే పాత్ర అది. అర్బన్ గర్ల్‌గా నిహారిక బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక గాయత్రి ఫ్లాట్‌మేట్స్ భార్గవ్, ఐశ్వర్యలుగా అక్షయ్ లగుసాని, భావన సాగి తమ పాత్రలకు న్యాయం చేశారు. నిహారిక, అక్షయ్‌ల పాత్రలు ఆన్ గేమ్‌కి అడిక్ట్ అయితే.. వారికి హితబోధ చేస్తూ రియాల్టీలో బతికే పాత్ర భావన సాగిది. చూడడానికి అందంగా ఉండి, కాస్త తెలివితక్కువ యువకుడు రోషన్‌గా సాయి రోణక్ తనదైన నటనతో ఆకట్టకున్నాడు. భార్య పిలల్ని వదిలేసి ఆన్లైన్ గేమ్‌కు బానిసైన పైలట్ ఆనంద్‌గా వైవా హర్ష మెప్పించాడు. ఇక సాంకేతిక పరంగా ఈ సిరిస్ పర్వాలేదనిపిస్తుంది. వరుస వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న తమడా మీడియా ప్రై.లి బ్యానర్ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించింది. -
ఓటీటీలో రాజయోగం.. అప్పటినుంచే స్ట్రీమింగ్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రాజయోగం. ఈ చిత్రంతో రామ్ గణపతి దర్శకుడిగా పరిచయమయ్యాడు. డిసెంబర్ 30న విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.ఈ సినిమాను శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణిలక్ష్మణ్ రావు నిర్మించారు. కథ విషయానికి వస్తే.. మధ్య తరగతి కుర్రాడు రిషి(సాయి రోనక్) మెకానిక్‌గా పని చేస్తుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఓసారి తను రిపేర్ చేసిన కారును ఓనర్‌కు ఇచ్చేందుకు స్టార్ హోటల్‌కు వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)తో లవ్‌లో పడతాడు. ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే డేనియల్ దగ్గరున్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్) గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? అసలు రిషి, శ్రీ కలుసుకున్నారా? లేదా? అనేదే కథ. Brace yourselves for an ultimate cocktail of love, lust, fun, and action 🍹❤️🔥#Raajahyogam premieres Feb 9 only on #DisneyplusHotstar #RaajahyogamOnHotstar#SaiRonak #AnkitaSaha #Bismi#RamGanapathi #ManiLakshman #Shyam #Nandakishore #VaishnaviNatrajProduction pic.twitter.com/LN3wdvvIRG — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 2, 2023 చదవండి: మేకప్ రూమ్‌లో పేలుడు, నటి పరిస్థితి విషమం -
Popcorn: ఆకట్టుకుంటున్న ‘మది విహంగమయ్యే’ సాంగ్
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మది విహంగమయ్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో అక్కినేని నాగచైతన్య విడుదల చేసి, సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా ఆలపించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ .. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది’అన్నారు. ‘కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. -
‘పాప్ కార్న్’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో నాగార్జున (ఫొటోలు)
-
Popcorn Trailer: పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే..
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. డిఫరెంట్ మైండ్స్ సెట్స్ ఉన్న ఇద్దరు వ్యక్తుల అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. ముందు ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్న వాళ్లిద్దరూ సమయం గడిచేకొద్ది స్నేహితులుగా మారుతారు. ఒకరిపై మరొకరికి అభిమానం కలుగుతుంది. ఈ జర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. రొటీన్‌కు భిన్నంగా దర్శకుడు మురళి గంధం పాప్ కార్న్ మూవీని తెరకెక్కిచినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకనిర్మాతలు తెలిపారు. -
'ఆ సినిమా చూస్తే లక్ష రూపాయల బహుమతి.. కానీ'
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..'మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రానికే అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే లక్ష రూపాయల బహుమతి ఇస్తాం.' అని ప్రకటించారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..'సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కష్టానికి ఫలితం దక్కినట్లు అనిపిస్తోంది. నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాం. రాజయోగం చిత్రాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా.' అని అన్నారు. హీరోయిన్ అంకిత సాహా మాట్లాడుతూ..'రాజయోగం థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కాబట్టి ఓటీటీలో వచ్చేవరకు వేచి చూడకండి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మీకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది.' అని చెప్పుకొచ్చింది. తాగుబోతు రమేష్ మాట్లాడుతూ..'దర్శకుడు రామ్ గణపతి యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలతో సినిమాను రూపొందించారు. ఆయనకు సినిమా అంటే ఫ్యాషన్. అందుకే విదేశాల్లో పనిచేసే కెరీర్ వదులుకుని వచ్చారు.' అని అన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ..'రాజయోగం చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఇటీవల కొందరు గాలివాటానికి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయిపోతారన్నాడు. కానీ.. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడో ఆలోచించుకోవాలి.' అని అన్నారు. -
‘రాజయోగం’ మూవీ రివ్యూ
టైటిల్: రాజయోగం నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మీ నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ దర్శకత్వం: రామ్ గణపతి సంగీతం: అరుణ్ మురళీధరన్ డైలాగ్స్: చింతపల్లి రమణ సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: డిసెంబర్ 30, 2022 కథేంటంటే.. రిషి(సాయి రోనక్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని కలలు కంటాడు. దాని కోసం సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓ సారి తను రిపేర్ చేసిన కారును ఓనర్‌కి ఇచ్చేందుకై స్టార్ హోటల్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే.. డేనియల్ (సిజ్జు) వద్ద ఉన్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్)గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. దీంతో రిషి.. ఎలాగైన శ్రీ అసలు రంగును బయటపెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో రిషికి ఎదురైన సవాళ్లు ఏంటి? రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? డేనియల్ దగ్గర నుంచి రాధా వజ్రాలను కొట్టేశాడా? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? రిషి, శ్రీల మధ్యలోకి వచ్చిన ఐశ్వర్య(బిస్మీనాస్) ఎవరు? వజ్రాల గొడవకు, ఐశ్యర్యకు ఎలాంటి సంబంధం ఉంది? తదితర విషయాలు తెలియాలంటే ‘రాజయోగం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ కామెడీ చిత్రాలను టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. అందుకే జోనర్లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. రాజయోగం కూడా క్రైమ్ కామెడీ సినిమానే. యూత్‌ని ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సన్నివేశాలు యాడ్ చేశారు. వజ్రం కోసం జరిగే వేటలో ఇద్దరు ప్రేమికులు ఎలా ఇరుక్కున్నారు? ఆ వజ్రం ఎవరికి దొరికింది? చివరకు రాజయోగం ఎవరికీ వరించింది అనేదే ఈ సినిమా కథ. యూత్‌ని టార్గెట్‌గా పెట్టుకొని దర్శకుడు రామ్ గణపతి ఈ కథను అల్లుకున్నాడు. అడల్ట్ కామెడీ, మితిమీరిన శృంగారం.. యువతను ఆకట్టుకున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. ఫస్టాఫ్‌లో ఈతరం యువతి, యువకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. అజయ్ ఘోష్, చిత్రం శ్రీనుల కామెడీతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం ఫస్టాఫ్‌లో ఉన్నంత జోష్ ఉండదు. సాగదీత సీన్స్ ఎక్కువగా ఉంటాయి. హోటల్ సీన్‌తో పాటు ఒకటి రెండు సన్నివేశాలు నవ్వించినప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. రిషి పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ..అన్ని రకాల ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ముఖ్యంగా హీరోయిన్ అంకితతో కలిసి పండించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలెట్. అంకిత కూడా ఓ మంచి వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. శ్రీ పాత్రలో ఆమె చేసిన రొమాన్స్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. కేవలం అందాల ఆరబోతకే కాకుండా.. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించింది. విలన్ పాత్రలో డేనియల్ గా సిజ్జు బాగా నటించారు. అలాగే మరో విలన్ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ కూడా తన స్టైల్ లో బాగా నటించారు. అజయ్ ఘోష్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేశ్, షకలక శంకర్ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. అరుణ్ మురళీధరన్ నేపథ్య సంగీతం బాగుంది. సిధ్ శ్రీరామ్ ఆలపించిన రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. -
రొమాంటిక్ సీన్స్‌లో చాలా భయపడ్డా.. డైరెక్టర్‌తో గొడవపడ్డాను: హీరో
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజయోగం’ . శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం..డిసెంబర్ 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయి రోనక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు భయపడ్డాను. కొన్ని సార్లు దర్శకుడితో గొడపవడ్డాను. మొత్తం ఎడిటింగ్ లో చూశాక దర్శకుడి విజన్ అర్థమైంది. ఆయన చూపించిన సీన్స్ ఏవీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. నాకు డాన్స్, ఫైట్స్ బాగా వచ్చు. ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ కు డాన్సు నేర్పంచాను. ఆ స్కిల్ చూపించే అవకాశం ఈ చిత్రంలో కలిగింది. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నాను. పదివేల కోట్ల రూపాయల డైమండ్స్ పాయింట్ చుట్టూ కథ సాగుతుంది. ఈవీవీ గారి స్టైల్ సినిమాల్లో ఉన్నట్లు ఒక ఛేజింగ్ తో సినిమా సాగుతుంది. ఫైట్స్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది’ అన్నారు. -
కథ విని ఆశ్చర్యపోయాను
హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను. నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్ తేజ్. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
Chalo Premiddam: సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత
‘ఛలో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ మరెన్నో సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టప్ ఇచ్చింది’ అన్నారు నిర్మాత ఉదయ్ కిరణ్. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఈనెల 19న విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ థియేటర్స్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ కారణం. అందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇకపైన కూడా మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలను ఈ విధంగానే ఆదరిస్తారని కోరుకుంటున్నా` అన్నారు. (చదవండి: ‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ) దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ...‘మా సినిమాకు విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం, దర్శకత్వం, కామెడీ , నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అంటున్నారు. ఆడియన్స్ తో కలిసి ఫస్ట్ రోజు సినిమా చూశాను. అదుర్స్ రఘు కామెడీ, పోసాని, హేమ మధ్య వచ్చే ఫన్, అత్తారింటికి దారిది ఎపిసోడ్ కు ఆడియన్స్ పడి పడి నవ్వుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ , శశాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్రలు సినిమాకు హైలెట్ అంటున్నారు. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా టీమ్ సపోర్ట్ వల్లే. వర్షాల్లో కూడా మా సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ....‘ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను. అందరూ నా పర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. -
‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛలో ప్రేమిద్దాం నటీనటులు : సాయి రోనక్, నేహా సోలంకీ, పొసాని కృష్ణమురళి, హేమ, అలీ, బాహుబలి ప్రభాకర్, సూర్య తదితరులు నిర్మాణ సంస్థ : హిమాలయ స్టూడియో మేన్సన్స్ నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం : సురేష్ శేఖర్ రేపల్లే సంగీతం : భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి విడుదల తేది : నవంబర్ 19, 2021 `బ్లాక్ అండ్ వైట్`, ప్రియుడు సినిమాలతో టాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కుమార్ తాజాగా హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. `ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించారు. సురేష్ శేఖర్ రేపల్లె దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అందమైన ప్రేమకథతో పాటు, థ్రిల్లింగ్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్సాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘ఛలో ప్రేమిద్దాం’కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన ఆత్మరావు అలియాస్ రావు (సాయి రోనక్) ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్‌కు వస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న మధుమతి(నేహా సోలంకీ)తో ప్రేమలో పడతాడు. మధుమతికి కూడా రావు అంటే ఇష్టం ఉన్నప్పటీ ఆ విషయం అతనికి చెప్పదు. చిత్తూరులో ఉన్న తన మామయ్య, ఊరిపెద్ద పెద్దప్ప(నాగినీడు), సోదరుడు శివుడు(సూర్య)లకు నచ్చితేనే తన ప్రేమను ఆత్మరావుకు చెప్పాలని ఫిక్స్ అవుతుంది. తన సోదరి పెళ్లికి ఆత్మరావుతో పాటు మిగతా స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది మధుమతి. కట్ చేస్తే.. మధుమతి కిడ్నాప్‌కి గురవుతుంది. ఈ వ్యవహారంలో ఆత్మరావుతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు మధుమతిని కిడ్నాప్ చేసిందేవరు? ఎందుకు చేశారు? ఈ కేసులో ఆత్మరావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రియురాలి కోసం ఆత్మరావు చేసిన సాహసం ఏంటి? చివరకు మధుమతి తన ప్రేమ విషయాన్ని ఆత్మరావుకు చెప్పిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. కాలేజ్ స్టూడెంట్ ఆత్మరావు పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్ కూడా అదరొట్టాడు. ఇక అల్లరి పిల్ల మధుమతిగా నేహా సోలంకీ తనదైన నటనతో మెప్పించింది. హే భగవాన్ అల్లా జీసస్ అంటూ నవ్వులు పూయించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్ పనిచేయదు` అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. గ్రామపెద్దగా నాగీనీడు, అతనికి నమ్మదగిన వ్యక్తి శివుడు పాత్రలో సూర్య అద్భుత నటనను కనబరిచారు. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్,పవన్ ఫర్వాలేదనిపించారు.హీరో తండ్రిగా పోసాని, తల్లిగా హేమతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. సరదాగా జాలీగా ఉండే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన తరువాత వారి ప్రేమ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొని నిలబడ్డారు అనేదే ‘ఛలో ప్రేమిద్దాం’కథ. యూత్‌కు నచ్చే పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లే.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించాడు. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించాడు. ఒకపక్క కాలేజీ లవ్‌స్టోరి చూపిస్తూనే.. మరోపక్క యాక్షన్ ఎపిసోడ్‌ని నడిపిస్తూ ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. అయితే సినిమా నిడివి మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ‘అత్తారింటికి దారిది’హోటల్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో గేతో వచ్చే సన్నీవేశాలు కూడా యూత్‌ని నవ్విస్తాయి. క్లైమాక్స్ మాత్రం మరింత క్రిస్పిగా రాసుకోవాల్సింది. ఎక్కువ సేపు క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండటంతో ఆడియెన్స్ సహనం పరీక్షించేలా అనిపిస్తుంది.ఇక సాంకేతిక విషయానికొస్తే.. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన‘ఏమైందిరో’,‘జిందగి’పాటలలో పాటు మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఎడిటర్ ఉపేంద్ర జక్క తన కత్తెరగా ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఆకట్టుకుంటున్న ‘మల్లిగా మల్లిగా’ కాలేజీ సాంగ్
సాయిరోనక్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ రేపల్లే దర్శకుడు. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం ఈ మూవీ నుంచి తొలిపాటను విలక్షణ నటుడు జగపతిబాబు విడుదల చేశారు. `ఎమ్బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ పవార్ సాహిత్యాన్ని సమకూర్చగా భీమ్స్ సిసిరోలియో అద్భుత సంగీతాన్ని అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...‘ ప్రస్తుతం మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు. ఈ కాలేజ్ సాంగ్ యూత్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందన్నారు దర్శకుడు సురేశ్ శేఖర్. వరుసగా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామని తెలిపారు. -
పాప్‌కార్న్ సినిమా: ఆ తర్వాత ఏమైంది?
హీరోయిన్ అవిగా గోర్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘పాప్ కార్న్’. సాయి రోనక్, అవికా గోర్ జంటగా యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భోగేంద్రగుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవికా గోర్, ఎంఎస్ చలపతిరాజు సహనిర్మాతలు. బుధవారం (జూన్ 30) అవికా పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించి, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథాకథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు భోగేంద్రగుప్తా మడుపల్లి. ‘‘మెలోడ్రామా జానర్లో సాగే చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి... తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది చిత్రకథ’’ అన్నారు మురళీ నాగ శ్రీనివాస్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) -
ఐపీఎస్ ఆఫీసర్
వశిష్టసింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన వశిష్ట సింహ లుక్‌కి, హెబ్బా పటేల్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలో పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అనుదీప్ పాత్ర చేస్తున్న సాయిరోనక్ లుక్‌ని విడుదలచేశారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
మరిన్ని మంచి సినిమాలు తీయాలి
‘‘సుజోయ్ నాకు 15 ఏళ్లుగా తెలుసు. అతని రచనలు, ఆలోచనా విధానం వైవిధ్యంగా ఉంటాయి. ‘ప్రెషర్ కుక్కర్’ సినిమాలో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది’’ అని ‘ప్రెషర్ కుక్కర్’ బృందాన్ని అభినందించారు తెలంగాణ ‡రాష్ట్ర మంత్రి, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సాయి రోనక్, ప్రీతీ అస్రానీ జంటగా సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘పరిమిత వనరులతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. డాలర్ డ్రీమ్స్, అమెరికా కోసం పరిగెత్తడం వంటి విషయాలను సహజత్వానికి దగ్గరగా చూపించారు. సుజోయ్, సుశీల్ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలి’’ అన్నారు. -
'ప్రెజర్ కుక్కర్' చిత్రాని కేటీఆర్ వీక్షించారు
-
'ప్రెజర్ కుక్కర్'లో మంచి మెసేజ్ ఉంది : కేటీఆర్
సాక్షి, అమరావతి : ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చాలా బావుందని.. అందులో మంచి మెసేజ్ ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. శనివారం ఆయన రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ డైరెక్టర్ సుజయ్ నాకు మంచి మిత్రుడు. తెలంగాణ ఏర్పడిన తరువాత సుజయ్ బెంగుళూరులో ఉంటే కలిసి పనిచేద్దామని నేను ఇక్కడకు రమ్మని చెప్పాను. ఫ్రెష్ ఎనర్జీతో, మంచి మెసేజ్ ఉన్న చిత్రం. ప్రస్తుతం ఇప్పుడు అందరూ డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికాకి పరుగులు పెడుతున్నారు. అదే కథని సినిమాగా తీశాడు సుజయ్. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్థం అయ్యేలా ఉంది. హీరో, హీరోయిన్స్ నటన బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది’ అని అన్నారు. (చదవండి : ‘ప్రెజర్ కుక్కర్’ మూవీ రివ్యూ) సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ చిత్రం నిన్న విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి ('జార్జిరెడ్డి' ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు. -
‘ప్రెజర్ కుక్కర్’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రెజర్ కుక్కర్ జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ దర్శకత్వం: సుజోయ్, సుశీల్ నిర్మాతలు: సుశీల్ సుభాష్, అప్పిరెడ్డి నిడివి: 134.53 నిమిషాలు సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకద్వయం సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. చిత్ర యూనిట్ టైటిల్‌ను అనౌన్స్మెంట్ చేసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపై పడింది. అంతేకాకుండా టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. క్రిష్, నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్లు వంటి ప్రముఖులు ఈ చిన్న సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయింది. ఇన్ని అంచనాల మధ్య ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథాంశం, డిపరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టిందా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: సిద్దిపేటకు చెందిన నారాయణ (సీవీఎల్ నరసింహారావు) బంధువులు అందరూ అమెరికాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. దీంతో తన కొడుకు కిశోర్ (సాయి రోనక్)ను కూడా అమెరికాను పంపించాలని ఆరాటపడతాడు. అందుకు అనుగుణంగా కిశోర్‌కు చిన్నప్పట్నుంచే అమెరికా గొప్పతనాలను వివరిస్తూ పెంచుతాడు. అలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన కిశోర్ అమెరికా కోసం వీసా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు బయల్దేరతాడు. ఈ క్రమంలోనే స్వతంత్ర భావాలు కలిగిన అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక వీసా ప్రయత్నాల్లో భాగంగా కిశోర్‌కు చందు(రాహుల్ రామకృష్ణ) సహాయం చేస్తుంటాడు. అయితే వరుసగా మూడు నాలుగు ప్రయత్నాల్లో వీసా రిజెక్ట్ కావడంతో వివిధ ప్రయత్నాలు చేస్తుంటాడు కిశోర్. ఈ సందర్భంలోనే అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. అయితే ఆ ఆపద నుంచి రావు (తనికెళ్ల భరణి) రక్షిస్తాడు. ఇంతకి రావుకు, కిశోర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కిశోర్ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? కిశోర్, అనితల ప్రేమ చివరికి ఏమైంది? ఈ సినిమాతో దర్శకులు ఏం చెప్ప దల్చుకున్నారో తెలుసుకోవాలంటే ‘ప్రెజర్ కుక్కర్’ సినిమా చూడాల్సిందే. నటీనటులు: ఈ చిత్రంలో హీరోగా నటించిన సాయిరోనక్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మొత్తం అతడి చుట్టే తిరుగుతుండటంతో నటనకు మంచి స్కోప్ దొరికింది. అయితే వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. హావభావాలు అంత గొప్పగా పలికించలేకపోయాడు. అయితే కొన్ని చోట్ల ఫర్వాలేదనిపించాడు. నటుడిగా ఇంకా పరిపక్వత చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది హీరోయిన్ ప్రీతి అస్రాని. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. పలు సీన్లలో ఎంతో అనుభవమున్న నటిగా ప్రీతి కనిపిస్తుంది. దీంతో ఈ యువ హీరోయిన్‌కు సినీ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. ఇక తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సీనియార్టీతో రావు గారి పాత్రను అవలీగా చేశాడు. ఇక రాహుల్ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: విదేశాలకు వెళ్లి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి.. అదొక ప్రెస్టేజ్ సింబల్ అనుకునే తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంతటి ఒత్తిడికి లోనవుతున్నారు, అమెరికా వెళ్లిన వాళ్లు నిజంగా సంతోషంగా ఉన్నారా? పిల్లలు అమెరికా వెళ్లాక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అనే స్టోరీ లైన్‌తో ‘ప్రెజర్ కుక్కర్’ను తెరకెక్కించారు దర్శకులు సుజోయ్, సుశీల్. కాన్సెప్ట్ కొత్తగా ఉందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమైంది. అయితే ట్రైలర్ వరకయితే కాన్సెప్ట్‌తో మెప్పించారు. కానీ రెండు గంటలకు పైగా సాగే సినిమాను కేవలం కాన్సెప్ట్‌తో నడిపించలేరు. కాన్సెప్ట్‌కు తగ్గట్టు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా బలమైన పూర్తి స్క్రిప్ట్ ఉండాలి. ఈ విషయంలో దర్శకులు విఫలమయ్యారనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అసలు కథలోకి నేరుగా ప్రవేశిస్తుంది. తన కొడుకు అమెరికా ఎందుకు వెళ్లాలని తండ్రి అనుకుంటున్నాడు, దాని కోసం హీరో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అడ్డంకులు, కొన్ని కామెడీ సీన్స్, హీరోయిన్ ఎంట్రీ, హీరోకు అమెరికా దారులు మూసుకపోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే తొలి అర్థభాగం ముగిసే సరికి ఓకే ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ వచ్చే సరికి సినిమా ఏటో వెళ్లిపోతోంది అనే భావన కలుగుతుంది. సాగదీత సీన్లు, సెంటిమెంట్ సీన్లు అంతగా వర్కౌట్ కాలేదు. అయితే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగుంటాయి. అయితే దర్శకులు తాము చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా చెప్పలేకపోయారని సగటు ప్రేక్షకుడి కూడా అరథమవుతుంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. నలుగురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేసినప్పటికీ వావ్ అనిపించే సాంగ్స్ లేవు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ మోస్తారుగా ఉంటుంది. క్లైమాక్స్‌లో రాహుల్ సిప్లిగంజ్ వచ్చి పాడే పాట బాగున్నా.. సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. మాటల రచయిత తన కలానికి ఇంకాస్త పదును పెడితే బాగుండేది. స్క్రీన్‌ప్లే పర్వాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. హీరోయిన్ అందాలను, కొన్ని పాటలను తమ కెమెరాతో మ్యాజిక్ చేశారు సినిమాటోగ్రాఫర్స్. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: కాన్సెప్ట్ హీరోహీరోయిన్ల లవ్ సీన్స్ మైనస్ పాయింట్స్: హీరో నటన సాగదీత, బోరింగ్ సీన్లు సినిమా నిడివి - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పుడు మంచి సినిమా బతుకుతుంది
‘‘మూడు నెలల క్రితం ‘ప్రెజర్ కుక్కర్’ చూసి, నచ్చింది కానీ చిన్న కరెక్షన్స్ చేయాలని చెప్పాను. 3 వారాల క్రితం మళ్లీ చూశాను. సుజోయ్, సుశీల్ మంచి సినిమా తీశారనిపించింది. 12 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోని చాలామంది హెల్ప్ చేయడం వల్ల నేనిప్పుడీ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఈ డైరెక్టర్లు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో సుశీల్ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘బాగున్న సినిమాను చూసినవారు మరో పదిమందికి చూడమని చెబితే మంచి సినిమా బతుకుతుంది. ఈ టీజర్ చూసినప్పుడు నా ప్రెజర్ కుక్కర్ జర్నీ గుర్తుకు వచ్చింది’’ అన్నారు. ‘‘డైరెక్టర్ క్రిష్ మాకు ఎంతో సహాయం చేశారు. భవిష్యత్‌లో కొత్తవారికి మేం కూడా ఇలానే చేయాలని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకుంటాం. తరుణ్ భాస్కర్, ‘మధుర’ శ్రీధర్‌కు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు. ‘‘అమెరికా వెళ్లిన చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ కనువిప్పు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నటి సంగీత, హీరోలు సాయి రోనక్, విశ్వక్ సేన్, నిర్మాతలు రాజ్ కుందుకూరి, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు మాట్లాడారు. -
సినిమా తీయడం అంత సులువు కాదు
‘‘నాకు సినిమా పట్ల అంత ఆసక్తి లేదు. కాకపోతే రాయడం నేర్చుకున్నాను. అమెరికాలో ఎమ్మెస్ చేశాను.. అక్కడే ఓ ఐటీ కంపెనీలో 10 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత 2004లో బెంగళూరుకు మారిపోయా’’ అని సుజాయ్ కారంపూడి తెలిపారు. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజాయ్, సుశీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుజాయ్ మాట్లాడుతూ– ‘‘మధుర’ శ్రీధర్ షార్ట్ ఫిలిం కోసం ఒక స్టోరీ రాశాను. ఆయనకు బాగా నచ్చడంతో సినిమా కథలు రాయమని సలహా ఇచ్చారు. మేం ఇండస్ట్రీకి కొత్త. ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు. అందుకే తెలుగు సినిమాలు చూశాం. మా ప్రయత్నాల్ని, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. సినిమా నిర్మాణం మాకు చాలా నేర్పించింది.. ఆటుపోట్లు తెలిశాయి. సినిమా అనేది అంత సులభమైన పనేం కాదు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో మా కుటుంబాన్ని కనీసం వారాంతంలో కూడా కలవలేకపోయాం. స్క్రిప్ట్ డెవలప్ చేయడమో, సినిమా మేకింగ్‌లోనో బిజీగా ఉండేవాళ్లం’’ అన్నారు. సుశీల్ మాట్లాడుతూ– ‘‘మేం సాఫ్ట్వేర్ నేపథ్యం నుంచి వచ్చాం. అక్కడ చర్చల్లో డెవలప్మెంట్, ఫీడ్‌బ్యాక్ వంటి విలువైన అంశాలు ఉండేవి. ఇవే సూత్రాల్ని మేం స్టోరీ చర్చించేటప్పుడు కూడా పాటించాం. సినిమా మేకింగ్ సమయంలో అవి బాగా దోహదపడ్డాయి. ఒక యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. తల్లిదండ్రుల ఆత్మీయత, భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపించాం. మేకర్స్‌గా మాకిది తొలి సినిమా. విలువైన విమర్శలను ఆహ్వానిస్తాం’’ అన్నారు. -
నాకు ఆ అవకాశం ఇవ్వలేదు
‘‘అమెరికా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది. కుటుంబ బంధాలు ఎక్కువగా ఉండే సినిమా ఇది. అన్ని పాత్రలు రియలిస్టిక్‌గా ఉంటాయి. హీరోయిన్ పరిచయ సన్నివేశం బాగా నచ్చింది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని ప్రీతి అస్రాని అన్నారు. సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్లో ఇదే లొల్లి’ అనేది ట్యాగ్ లైన్. సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీతి అస్రాని మాట్లాడుతూ– ‘‘నేను గుజరాత్ నుంచి వచ్చాను. సినిమాల్లో నటించాలని చిన్నప్పట్నుంచి ఉండేది. మా అక్క అంజు అస్రాని తెలుగులో పలు సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నారు.. ఆమె స్ఫూర్తితోనే నటి అయ్యాను. టె¯Œ ్త పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చాను. ముందు ‘ఫిదా’ అనే షార్ట్ ఫిలింలో నటించాను. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌లలో, ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్లో నటించా. ‘ప్రెషర్ కుక్కర్’తో హీరోయిన్గా పరిచయమవుతున్నా. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అనిత.. బీటెక్ చదువుతుంటాను. హీరోపై చాలా ఒత్తిడులు ఉంటాయి.. అందుకే అతను ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఫీలవుతాడు. దీంతో ఆ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో కామెడీ, డ్రామా, ఎమోషన్ సన్నివేశాలుంటాయి. తనికెళ్ల భరణిగారి పాత్ర ఎక్కువ ఉంటుంది. మా సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు.. మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయి. నేను మంచి డ్యాన్సర్‌నే కానీ డైరెక్టర్ నాకు డ్యాన్స్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు ఉన్నా ఎక్కడా ఒత్తిడి పెట్టలేదు. ప్రస్తుతం గోపీచంద్‌గారి ‘సీటీమార్’ సినిమాలో కబడ్డీ కెప్టెన్‌గా నటిస్తున్నా’’ అన్నారు. -
ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాను
సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకద్వయం సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూడగానే కనెక్ట్ అయ్యాను. కొడుకు విదేశాలకు వెళితే ఒక తండ్రి ఎంతగా తల్లడిల్లిపోతాడో ఈ సినిమాలో చూపించారు. సుజోయ్, సునీల్ ఈ సినిమా బాగా తీశారు. ఒక సినిమా రిలీజ్‌కు ఎప్పుడూ పడనంత ప్రెజర్ ఈ సినిమాకు పడ్డాను. మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోదం, సందేశం మేళవించిన చిత్రం ఇది. పాటలు, రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘ఇది న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల అనుబంధం, పిల్లలు వేరే దేశంలో ఉంటే కుటుంబంపై, సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా ప్రధానాంశం. డైరెక్షన్ ఫస్ట్ టైమ్ అయినా ఎక్కడా రాజీ పడలేదు’’ అన్నారు సుజోయ్.‘‘కథ చెప్పగానే నిర్మాణంలో భాగస్వామిగా ఉండటానికి అప్పిరెడ్డి ముందుకొచ్చారు. అభిషేక్ నామాగారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీరిద్దరికీ థ్యాంక్స్. హైదరాబాద్ వాడుక భాషలో ఉండే సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు సుశీల్. ‘‘ఇంతకుముందు అమెరికా నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మా సినిమా విభిన్నంగా ఉంటుంది. కుటుంబ విలువలు ఉన్న సినిమా. ముగ్గురు స్నేహితులు కలిసి చేసే అల్లరి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సాయి రోనక్. నటుడు రాజై రోవన్, రచయిత శ్యామ్ జడల, మార్కెటింగ్ ప్రమోటర్ అభితేజ తదితరులు మాట్లాడారు. -
హై ఓల్టేజ్ యాక్షన్
సాయిరోనక్, ఎనా సహా జంటగా వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నిరీక్షణ’. టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై పి.రాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్ తొలిసారి మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘నిరీక్షణ’. ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ‘రాక్షస..’ అనే ప్రమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా రోల్ రిడా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రద్ధాదాస్, సన ప్రత్యేక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి వి., సంగీతం: ‘మంత్ర’ ఆనంద్. -
ప్రెషర్ కుక్కర్ రెడీ
సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు. సునీల్, సుజోయ్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా దక్కించుకున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాన్సెప్ట్ నచ్చడంతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మా సినిమా టీజర్‌ను కట్ చేశారు. ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ తాజాగా ‘జార్జ్‌రెడ్డి’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకున్నారు’’ అన్నారు. రాహుల్ రామకృష్ణ, రజయ్ రోవాన్, తనికెళ్ల, సీవీఎల్ నరసింహారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్, అనిత్ మడాడి, సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్. -
అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా?
సాయి రోనక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై, సుశీల్ నిర్మించి, రచించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్ ’. ఎ. అప్పిరెడ్డి మరో నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత డి. సురేశ్‌బాబు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ములైన సుజై, సుశీల్ యూఎస్ నుండి ఇండియాకు సినిమాలు చేయాలనే ప్యాష¯Œ తో వచ్చారు. చాలా క్లారిటీతో క్లియర్‌గా సినిమా తీశారు. టిపికల్ థాట్స్‌తో వస్తున్న ఇలాంటి కొత్తవారిని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. డిఫరెంట్ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. సుజై మాట్లాడుతూ– ‘‘పిల్లల్ని ఇంజినీరింగ్ చదివించడం, తర్వాత అమెరికా పంపించడం అక్కడ సెటిల్ అయ్యారని చెప్పుకోవడమే పరమావధిగా భావిస్తున్న మధ్యతరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే ఈ మా ‘ప్రెజర్ కుక్కర్’. కిషోర్ అనే కుర్రాడు ఏం చేసి అయినా యూఎస్ వెళ్లాలనుకుంటాడు. అతడు పడ్డ కష్టాలు, ఆ క్రమంలో నేర్చుకున్న కొత్త పాఠాలు, అతనిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, కుటుంబ విలువల పట్ల కొత్తగా ఏర్పడ్డ గౌరవం, దీంతో అసలు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా? అని అతనికి కలిగే సందేహం లాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించడం జరిగింది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘నాకు అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్‌గారికి ధన్యవాదాలు. నేను రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలుగా కష్టపడి క్లారిటీతో స్టోరీని ప్రిపేర్ చేశారు. మంచి ఔట్ ఫుట్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మొదటిసారి నన్ను నేను సినిమా పోస్టర్లో చూసుకోవాలనే నా కల నెరవేరింది’’ అన్నారు ప్రీతి. -
ప్రేమలో కొత్త కోణం
సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం‘మసక్కలి’. సాయిరోనక్, కావ్య, శిరీషలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నమిత్ సింగ్ నిర్మాత. నబి.యేనుగుబాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నమిత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ను ఆకట్టుకునే పాయింట్‌తో పాటు ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం. సినిమా కథనం తప్పకుండా ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్ లవ్‌లో కొత్త డైమన్షన్‌ను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేశారు మా దర్శకుడు నబి’’ అన్నారు. దర్శకుడు నబి మాట్లాడుతూ– ‘‘మా ‘మసక్కలి’ అందమైన ప్రేమకథలా ఉంటూనే సైకలాజికల్ గేమ్‌లా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని, కొత్త అనుభూతినిస్తుందనే గ్యారంటీ నాది’’ అన్నారు. -
అమ్మాయి నచ్చింది
‘పెళ్లికాని ప్రసాద్’ చిత్రం ఫేమ్ సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మాయి నచ్చింది’. సాయిరోనక్, నిశాంత్, ఇషానియా, రితిక హీరో హీరోయిన్లు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అజయ్ కుమార్ క్లాప్ ఇవ్వగా, చంద్ర కెమెరా స్విచ్చాన్ చేశారు. సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ వంటి భారీ హిట్ చిత్రం తర్వాత ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నెలలో ఐదు సినిమాలు మొదలు పెడుతున్నాం. వాటిలో తొలి చిత్రం ‘అమ్మాయి నచ్చింది’. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘వినోదంతో నిండిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రమిది. ఇద్దరు హీరోలు, హీరోయిన్లతో పాటు ‘వెన్నెల’ కిశోర్ పాత్ర కీలకం. ఐదుమంది మధ్య సాగే ఈ ప్రేమకథలోని ట్విస్ట్ ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 40 రోజులు కాశ్మీర్లో, తొమ్మిది రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపనున్నాం. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు. హీరో, హీరోయిన్లు, చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ మాచినేని. -
ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి – శ్రీకాంత్
సాయి రోనక్, అమృత అయ్యర్,ఛరిష్మా శ్రీకర్ , శ్రీప్రియ ముఖ్య పాత్రల్లో వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలా నేను ఇలా నువ్వు’. రాజ్ కందుకూరి సమర్పణలో వీరశంకర్ నిర్మించనున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచ్చాన్ చేశారు. బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘వేరు వేరు సాంప్రదాయల మధ్య పెరిగే యువతీయువకులకు వేరువేరు అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచుల వల్ల ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నారన్నది ఈ సినిమా కథాంశం. ఈ కథ 80–90 మథలో జరుగుతుంది. హెటివో ద్వారా నేరుగా ఇంట్లో హోమ్ థియేటర్స్‌లో విడుదల అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రేమా,యాక్షన్‌ను ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఎంటర్టైనింగ్గా చెబుతున్నాం. మా ప్రయత్నం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు విఎన్ ఆదిత్య. ‘‘ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా ఇంట్లోనే కూర్చొని చూసే చిత్రంగా చేస్తున్న ఈ ప్రయత్నం కచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీకాంత్. ‘‘వీరశంకర్ గారు చేస్తున ఈ ప్రయత్నం నచ్చి ఈ సినిమాలో భాగమైయాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ఈ సినిమాకు సంగీతం:నిహాల్. -
నమ్మలేని కథలు నిజమైతే..
సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘మసక్కలి’. నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్‌సింగ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, ‘‘కొన్ని కథలు నమ్ముతాం.. కొన్నింటిని నమ్మలేం. కొన్నింటిని నిజంగా చూసినా నమ్మలేం. నమ్మలేని కథలు నిజమైతే అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఓ కథతో రూపొందుతోన్న చిత్రమే ‘మసక్కలి’. ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమే ఇది. అందుకే ‘మసక్కలి’ టైటిల్ పెట్టాం’’ అన్నారు నబి ఏనుగుబల. ‘‘ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. ఈ నెలలో ఆడియో, త్వరలో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు సుమిత్ సింగ్. దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిహిరామ్స్, కెమెరా: సుభాష్ దొంతి. -
జీఎస్టీ వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బంది
‘‘నా బాల్య మిత్రుడు, క్లాస్‌మెట్ పట్టాభికి సినిమా అంటే ప్యాషన్. చిత్ర పరిశ్రమలో తనకు ఎవరూ తెలిసినవారు లేరు. సినిమాపై ఇష్టంతో సురేశ్‌బాబుగారికి ఓ ఉత్తరం రాయడంతో, ఆయన పెద్ద మనసుతో పట్టాభిని తన సంస్థలో చేర్చుకున్నారు’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. సాయి రోనక్, హరీష్, పూజ ముఖ్య పాత్రల్లో పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాదలి’. ప్రసన్ ప్రవీణ్ శ్యాం స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను కేటీఆర్ రిలీజ్ చేసి, నిర్మాత సురేశ్‌బాబు, హీరో రామ్‌చరణ్‌కి అందించారు. కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘మిత్రుడు రామ్‌చరణ్‌ని అడగ్గానే ఈ ఫంక్షన్‌కి వచ్చాడు. ‘కాదలి’ టీం కొత్తవారైనా చక్కగా చేశారు. కథే కింగ్. బాగుంటే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం ‘పెళ్లి చూపులు’ చిత్రం నిరూపించింది. ‘బాహుబలి’ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచింది. అమెరికాలోని కాలిఫోర్ని యాకి వెళ్లినప్పుడు ‘బాహుబలి’ చూశాం అని అక్కడి వాళ్లు చెప్పడం గర్వంగా అనిపించింది. సినిమా రంగానికి 28 శాతం జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విధించడం వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బందే. కమల్‌హాసన్‌గారు కూడా ఇదే విషయాన్ని రైజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి అందరూ వెళ్లి కేంద్ర మంత్రి అరుణŠ æజైట్లీని కలిసి పన్ను తగ్గించాలని కోరదాం. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది’’ అన్నారు. హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు చనిపోయాక జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది. కాబట్టి అందరూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ‘కాదలి’ విజువల్స్ చూస్తే నా ‘ఆరెంజ్’ చిత్రం అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. నా తొలి చిత్రంలో నేను ఇంత బాగా చేసి ఉండను. యాక్టర్స్ కొత్తవారైనా పది సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారిలా చేశారు. ఈ సినిమా ఎప్పు డెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఇప్పుడు మనం 7 నుంచి 14 పర్సెంట్ పన్నులో ఉన్నాం. జీఎస్టీ 28 శాతం అంటే రీజనల్ సినిమాలు చాలా నష్టపోతాయి’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. ‘‘ఒక తెలుగు సినిమాకి తమిళ టైటిల్ పెట్టినప్పుడే ఈ మూవీ ప్రత్యేకమని అర్థమైంది. ‘హ్యాపీడేస్, పెళ్లిచూపులు’లా ‘కాదలి’ కూడా హిట్ ఇవ్వాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పట్టాభి మాట్లాడుతూ – ‘‘నాకు íసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశమిచ్చిన సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్. నా మిత్రుడు కేటీఆర్ ఇక్కడికొచ్చి నన్ను సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. చిరంజీవిగారికి ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్లో రామ్‌చరణ్‌గారు డ్యాన్స్‌లో ఉర్రూతలూగిస్తున్నారు. ‘కాదలి’ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. సాయి రోనక్, హరీష్, పూజ, దర్శకులు దశరథ్, వీరూ పోట్ల, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్, పాటల రచయిత వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ రంగా, కెమెరామేన్ శేఖర్ వి.జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
'లంక' మూవీ రివ్యూ
టైటిల్ : లంక జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం : రాశి. సాయి రోనక్, ఈన సాహా, సంగీతం : శ్రీ చరణ్ దర్శకత్వం : శ్రీ ముని నిర్మాత : నమన విష్ణు కుమార్, నమన దినేష్ ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటి రాశి, లాంగ్ గ్యాప్ తరువాత కళ్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలోనూ తన మార్క్ చూపించేందుకు భర్త శ్రీముని దర్శకత్వంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లంక సినిమా రాశి అనుకున్న విజయాన్ని అందించిందా..? థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు వరుస సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో లంక మరో హిట్ సినిమా అనిపించుకుందా..? కథ : సాయి (సాయి రోనక్), సుధా( సుదర్శన్) ఎలాగైన సినీ రంగంలో స్థిరపడాలన్న కోరికతో తల్లితండ్రులు ఎంత తిడుతున్నా పట్టించుకోకుండా సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. సిల్వర్ స్క్రీన్ మీద ఛాన్స్ కొట్టాలంటే ముందు షార్ట్ ఫిలింతో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ షార్ట్ ఫిలింను తానే నిర్మిస్తానని మాట ఇవ్వటంతో పాత సామాన్ల వ్యాపారం చేసే సత్యను హీరోగా తీసుకుంటారు. హీరోయిన్ కోసం వెతుకుతుండగా.. ఓ షాపింగ్ మాల్ స్వాతి(ఈన సాహా)ను చూసి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ అవుతాడు. అప్పటికే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి ముందు కాదన్న అప్పటికే తాను ఓ పెద్ద ప్రమాదంలో ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఒప్పుకుంటుంది. అయితే స్వాతి హీరోయిన్ అని తెలియని సాయి, సుధాలు రెబాకా విలియమ్స్(రాశి) బంగ్లాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎవరూ లేని ఇంట్లో ఒక్కతే ఉండే రెబాకా ప్రవర్తన అందరికీ వింతగా అనిపిస్తుంది. చనిపోయిన తన పిల్లలను ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతున్న రెబాకాకు స్వాతి దగ్గరవుతుంది. రెబాకాతో ఉన్న సమయంలో తన బాధలన్ని మర్చిపోయి హాయిగా ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా స్వాతి కనిపించకుండా పోయిందన్న వార్త నేషనల్ మీడియాలో ప్రసారమవుతుంది. స్టార్ హీరోయిన్ మిస్ అవ్వటంతో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ను సీరియస్ గా తీసుకుంటుంది. స్వాతితో షార్ట్ ఫిలిం తీసిన సాయి టీంను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అదే సమయంలో స్వాతికి దగ్గరైన రెబాకాను అనుమానిస్తారు. అసలు స్వాతి ఎలా మిస్ అయ్యింది..? స్వాతి ఏ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం చేసేందుకు ఒప్పుకుంది..? రెబాకాకు స్వాతికి సంబంధం ఏంటి..? చివరకు స్వాతి రెబాకాలు ఏమయ్యారు...? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఒకప్పటి హీరోయిన్లందరూ రీ ఎంట్రీలో అత్త అమ్మ పాత్రలకు పరిమితమవుతుంటే, రాశీ మాత్రం ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సెటిల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఉన్నంతలో తన పరిథి మేరకు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేసింది. హీరో హీరోయిన్లుగా సాయి రోనక్, ఈన సాహాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ ఈన సాహా మంచి వేరియేషన్స్ చూపించింది. ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన శిజు రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. సుప్రీత్, సత్యం రాజేష్, సుదర్శన్, సత్యలు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : భార్య రీ ఎంట్రీ కోసం దర్శకుడు శ్రీ ముని తయారు చేసుకున్న లైన్ బాగున్నా.. కథనం నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా చాలా సన్నివేశాలను జరగనివి జరిగినట్టుగా చూపించే ప్రయత్నంలో కన్య్ఫూజన్ క్రియేట్ అయ్యింది. కథకు మూలమైన రాశి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అనవసరమైన పాటలను ఇరికించకుండా సినిమా రన్ టైం ను తగ్గించటం సినిమాకు ప్లస్ అయ్యింది. శ్రీ చరణ్ సంగీతం ఓకె. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాశి నటన స్టోరి లైన్ మైనస్ పాయింట్స్ : కథనం అసలు కథకు సంబంధం లేని ఊహలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రయాణం నేర్పిన పాఠాలు
చదువు పూర్తయిన తర్వాత అయిదుగురు విద్యార్థులు చేసిన ప్రయాణం వారికి ఏం నేర్పింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పాఠశాల’. నందు, అనుప్రియ, శిరీష, సాయిరోనాక్, హమీద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకుడు. రాకేష్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. రాహుల్‌రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లరి నరేశ్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శాసనసభ్యురాలు డి.కె.అరుణకు అందించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘జీవితంలో గోల్డెన్డేస్ అంటే కాలేజీ రోజులే. నా స్వీయానుభవాలను కూడా క్రోడీకరించి ఈ కథ రాసుకున్నాను. యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. నేను నిర్మించిన ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే కసితో ఈ సినిమా చేశాను’’ అని తెలిపారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు దామోదరప్రసాద్, నవదీప్, శశిధర్‌రెడ్డి, శశాంక్, ఖయ్యూమ్ తదితరులు కూడా మాట్లాడారు. -
'పాఠశాల' ఆడియో ఆవిష్కరణ
-
జీవితం నేర్పిన పాఠం
అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... సింపుల్‌గా ‘పాఠశాల’ చిత్రం కథాంశమిది. ‘విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలను నిర్మించిన మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ‘‘వినోదం, వైవిథ్యం, సందేశాల మేళవింపే ఈ సినిమా. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై చివరివారంలో కానీ, ఆగస్ట్ తొలివారంలో కానీ విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. సాయి రోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, కెమెరా: సుధీర్ సురేంద్రన్, కూర్పు: శ్రవణ్.కె.