నమ్మలేని కథలు నిజమైతే.. | Masakali Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

నమ్మలేని కథలు నిజమైతే..

Published Sat, Feb 17 2018 4:25 AM | Last Updated on Sat, Feb 17 2018 4:25 AM

Masakali Movie Trailer Launch - Sakshi

సాయిరోనక్

సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘మసక్కలి’. నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్‌సింగ్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, ‘‘కొన్ని కథలు నమ్ముతాం.. కొన్నింటిని నమ్మలేం. కొన్నింటిని నిజంగా చూసినా నమ్మలేం. నమ్మలేని కథలు నిజమైతే అద్భుతంగా ఉంటాయి.

అలాంటి ఓ కథతో రూపొందుతోన్న చిత్రమే ‘మసక్కలి’. ట్రైలర్‌ చూస్తుంటే మంచి లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమే ఇది. అందుకే ‘మసక్కలి’ టైటిల్‌ పెట్టాం’’ అన్నారు నబి ఏనుగుబల. ‘‘ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. ఈ నెలలో ఆడియో, త్వరలో సినిమా రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు  సుమిత్‌ సింగ్‌. దర్శక–నిర్మాత మధుర శ్రీధర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిహిరామ్స్, కెమెరా: సుభాష్‌ దొంతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement