Shravya
-
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి వేడుకలు.. సందడి చేసిన యాంకర్ సుమ కనకాల!
-
ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మిక మందన్న (ఫొటోలు)
-
స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ నిర్మాత శ్రావ్య వర్మ నిశ్చితార్థం చేసుకుంది. ప్రపంచ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఈమెతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా శనివారం రాత్రి ఈ విషయాన్ని వీళ్లిద్దరూ బయటపెట్టారు. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్.. వైరల్‌గా డీప్ ఫేక్ వీడియో!)బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా శ్రీకాంత్ తెలుగు వాళ్లందరికీ తెలుసు. ఇక శ్రావ్య వర్మ విషయానికొస్తే.. దేవదాసు, చిలసౌ, మ్యాస్ట్రో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అలానే కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరించింది.మరీ ముఖ్యంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ.. తన మేనకోడలు అని చెప్పి శ్రావ్య వర్మని పరిచయం చేశాడు. ఈ చిత్రానికి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినట్లు అప్పట్లో వెల్లడించాడు. శ్రావ్య ఇన్ స్టా ప్రొఫైల్ చూస్తే ఆమె ఎవరెవరికి కాస్ట్యూమ్ డిజైన్ చేసిందనేది మీకు తెలుస్తోంది. ఏదేమైనా నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పిన కొత్త జంట.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది.(ఇదీ చదవండి: చైతూ- శోభిత ఎంగేజ్మెంట్.. వాలైంటెన్స్ డే వీడియో వైరల్!) View this post on Instagram A post shared by Srikanth Kidambi (@srikanth_kidambi) -
పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..
యశవంతపుర (బెంగళూరు): టూత్‌పేస్ట్ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్రూమ్ వెళ్లిన శ్రావ్య టూత్ పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..) -
మనసు చలించి జడ దానం.. గ్రేట్ కదా..!
నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది. బీటెక్, ఎంటెక్ తర్వాత మాస్టర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్‌తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్‌కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమధుర ఆర్ట్ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
వనవాసం పెద్ద హిట్ అవుతుంది
‘‘యాక్టర్ అవుదామని వచ్చిన సంజయ్ కుమార్‌గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్ చనిపోవడంతో సంజయ్‌గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నవీన్‌రాజ్ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’. భవాని శంకర ప్రొడక్షన్స్ పతాకంపై బి.సంజయ్ కుమార్ నిర్మించారు. మోహన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమయ్యారు నరేశ్. ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత తుమ్ముళ్లపల్లి రామసత్యనారాయణ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. సంజయ్‌గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా తీశారు’’ అన్నారు భరత్.పి, నరేంద్ర. నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ∙ నవీన్,శ్రావ్య -
విలువలున్న ప్రేమకథ
మహీదర్, శ్రావ్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘నటన’. ఈ చిత్రంతో రచయిత భారతీబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కుబేర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నైతిక విలువలున్న ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇందులో సీనియర్ హీరో భానుచందర్ చేసిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటేశ్వర్. -
నమ్మలేని కథలు నిజమైతే..
సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘మసక్కలి’. నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్‌సింగ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, ‘‘కొన్ని కథలు నమ్ముతాం.. కొన్నింటిని నమ్మలేం. కొన్నింటిని నిజంగా చూసినా నమ్మలేం. నమ్మలేని కథలు నిజమైతే అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఓ కథతో రూపొందుతోన్న చిత్రమే ‘మసక్కలి’. ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్‌స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమే ఇది. అందుకే ‘మసక్కలి’ టైటిల్ పెట్టాం’’ అన్నారు నబి ఏనుగుబల. ‘‘ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. ఈ నెలలో ఆడియో, త్వరలో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు సుమిత్ సింగ్. దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిహిరామ్స్, కెమెరా: సుభాష్ దొంతి. -
ఇష్టం ఉంటే కష్టం అనిపించదు
లంకా ప్రతీక్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ప్రతీక్ మాట్లాడుతూ– ‘‘ఇందులో జాలీగా ఉండే ఇంజనీరింగ్ కుర్రాడిగా కనిపిస్తా. ఇద్దరు హీరోయిన్లున్నారని రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఒక సస్పెన్స్ ఉంటుంది. నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు. స్క్రీన్‌ప్లే ట్రిక్కీగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి టెక్నికల్ విషయాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే డైరెక్షన్ చేశా. ఈ చిత్రంలో నేను హీరోగా నటించాలనుకోలేదు. నా షార్ట్ ఫిల్మ్స్‌లో నేనే నటించేవాణ్ణి. అందుకేనేమో హీరోగా నన్నే చేయమని ఐడియా ఇచ్చారు నాన్నగారు. ఇష్టంతో చేసే పని కష్టంగా అనిపించదు. కాబట్టే డైరెక్షన్, యాక్షన్ కష్టం అనిపించలేదు. కానీ, ప్రొడక్షన్ కష్టంగా అనిపించింది. 100 నుంచి 120 థియేటర్స్‌లో సినిమా రిలీజవుతోంది. అవి కూడా దొరకవేమో అనుకున్నా’’ అన్నారు. -
కసి ఉంటేనే అనుకున్నది సాధిస్తాం – ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘ప్రతీక్ హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చూసుకుంటూ డైరెక్ట్ చేశాడు. ఇవన్నీ చేయాలంటే కసి ఉండాలి. కసి ఉండబట్టే నేను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్‌ప్లే రైటర్, హీరో అయ్యా. ‘వానవిల్లు’ టీమ్‌లో మంచి కసి కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనే కోరిక ఈ రోజు నిజమైంది. నాన్న దగ్గరకు వెళ్లి నేను డైరెక్టర్ అవుతాననగానే, ఆయన ఎంకరేజ్ చేసి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. రెండున్నరేళ్లుగా ఈ సినిమాతో జర్నీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా మళ్లీ సినిమా చేస్తా. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ కష్టం తెరపై కనపడతుంది’’ అన్నారు. లంకా కరుణాకర్, ప్రభు ప్రవీణ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: ఎస్.డి. జాన్. -
మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్లో ‘శ్రావ్య’
ఖమ్మం కల్చరల్: ప్రతిష్టాత్మకమైన ‘మిస్ వరల్డ్ కెనడా–2017’పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరచి ఫైనల్ పోటీకి ఎంపికైంది. వైరాకు చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ రవికుమార్ కూతురైన శ్రావ్య స్థానికంగా ఏడో తరగతి వరకు చదివింది. ఉన్నత విద్యను ఆదిలాబాద్‌లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కెనడాలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోం ది. అనుకోకుండా మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొని ప్రతీ కేటగిరీలో విజయం సాధిస్తూ.. తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ‘మిస్ నార్తర్న్ ఆల్బర్టా వరల్డ్– 2017’కిరీటాన్ని దక్కించుకుంది. ఫైనల్ పోటీలో శ్రావ్య హావభావాలతో పాటు ఆమె నడవడిక, ప్రవర్తన తదితర అంశాలను గమనిస్తారు. దీంతోపాటు శ్రావ్యకు మద్దతుగా నిలుస్తున్న వారి ఓటింగ్ శాతాన్ని పరిశీలించి అన్నింట్లో ముందంజలో ఉంటే అప్పుడు ఆమె మిస్వరల్డ్గా నిలుస్తుంది. కాగా, శ్రావ్యకు ఓటింగ్ వేసి తన గెలుపులో పాలుపంచుకోవాలని ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రావ్యకు మద్దతు తెలపాల్సిన వారు గిగిగి. Mఐ గిౖఖఔఈఇఅNఅఈఅ. Nఉఖీ/2017 ద్వారా ఈనెల 22 సాయంత్రం వరకు ఓటింగ్ వేయాల్సి ఉంటుంది. -
హారర్ చిత్రంలో శ్రావ్య
ఇటీవల కోలీవుడ్‌లో ప్రేమ, హాస్యం,యాక్షన్ కథా చిత్రాలు వస్తున్నా హారర్ కథా చిత్రాలదే హవా అని చెప్పక తప్పదు. ఆ కోవలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వెళ్లిక్కిళమై 13ఆమ్ తేదీ గోవింద్ స్టూడియో పతాకంపై విక్రమ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నటి శ్రావ్య దెయ్యంగా పాత్రను పోషిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో రతన్మైళి, సుజాకుమార్, రాంజీ, చిత్రాలక్ష్మణన్, ఎంఎస్.భాస్కర్, లివింగ్స్టన్, శ్యామ్,వైయాపురి, విజయరాజ్కీర్తీ, ఆర్.వినోద్‌కుమార్, రేఖ, నిరోషా, మధుమిత నటిస్తున్నారు. ఇంతకుముందు 13ఆమ్ పక్కం పార్క చిత్రాన్ని తెరకెక్కించిన పుగళ్మణి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ 13వ తేదీ శుక్రవారం సైతానులకు సంతోషాన్ని, సకల శక్తిని అందించే రోజు అంటారన్నారు. అలాంటి రోజున హీరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ ముహూర్తాన పెళ్లి పీటలపై కూర్చుంటాడని చెప్పారు. అప్పుడు పెళ్లి కూతురు రూపంలో ఒక రక్తపిశాచి వచ్చి కూర్చుంటుందన్నారు.అయితే ఆ వివాహాన్ని ఆపడానికి 13 దెయ్యాలు ప్రయత్నిస్తాయన్నారు. వాటి ప్రయత్నం ఫలించిందా? అసలు అలాంటి ముహూర్తంలో హీరో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? ఆ పిశాచితో అతని పెళ్లి అయ్యిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే వెళ్లిక్కిళమై 13ఆమ్ తేదీ చిత్రం అని చెప్పారు. ఆద్యంతం ఆసక్తికరంగా హారర్ సన్నివేశాలతో భయం పుట్టించే ఈ చిత్రంలో మరో ముఖ్య అంశం 150 అడుగు పొడవైన దేవతా విగ్రహ శిల చోటు చేసుకోవడం అన్నారు. ఇది చిత్రం చూసే ప్రేక్షకులకు పూనం వచ్చే విధంగా ఉంటుందన్నారు. తాజ్‌నూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. -
గీతం వర్సిటీలో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: విద్యాలయం సాక్షిగా మరో చదువుల తల్లి ప్రాణాలు విడిచింది. విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్(ఐటీ) మూడోసంవత్సరం విద్యార్థిని శ్రావ్య శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ కు చెందిన శ్రావ్య హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోవడాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు యాజమాన్యానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. గీతం వర్సిటీ టీడీపీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిది కావడంతో విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. సమాచారం సేకరించేందుకు వర్సిటీకి వెళ్లిన విలేకరులను లోనికి అనుమతించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మెడిసిన్ విద్యార్థి ఒకరు వర్సిటీ హాస్టల్ లోనే ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
లవ్ యు బంగారం పాటలు
‘‘30 ఏళ్ల తర్వాత ఓ యూత్‌ఫుల్ మూవీ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని కేఎస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘లవ్ యు బంగారం’. రాహుల్, రాజీవ్, శ్రావ్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోవి దర్శకుడు. కె.వల్లభ, ‘ఈ రోజుల్లో’ఫేం మారుతి నిర్మాతలు. సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన రెజీనా ఆడియో సీడీని ఆవిష్కరించి కేఎస్ రామారావుకు అందించారు. కేఎస్ రామారావు మాట్లాడుతూ -‘‘‘దమ్ము’ ఇచ్చిన అనుభవంతో ఈ సినిమా చేశాను. చిన్న సినిమాలకు భారీ వసూళ్లు రాబడుతున్నాడు మారుతి. అందుకే అతనితో సినిమా చేశా. కోదండరామిరెడ్డిలోని డెడికెషన్ని గోవిలో చూశాను. సరదాగా ఉంటూనే ఉద్వేగంతో ముగుస్తుందీ సినిమా’’అని చెప్పారు. బయ్యర్లందరికీ లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని మారుతి నమ్మకం వ్యక్తం చేశారు. తనపై ఉన్న నమ్మకంతో ఏనాడూ మారుతీ సెట్‌కి రాలేదని, తొలి సినిమానే కేఎస్ రామారావు లాంటి నిర్మాతతో పనిచేయడం గర్వంగా ఉందని దర్శకుడు చెప్పారు. అశోక్‌కుమార్, చక్రి, సందీప్‌కిషన్, ఆది, మధురిమ తదితరులు పాల్గొన్నారు.