మిస్‌వరల్డ్‌ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’ | Kammas World: Sravya Kalyanapu eyes Miss World Canada 2017 | Sakshi
Sakshi News home page

మిస్‌వరల్డ్‌ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’

Published Fri, Jul 21 2017 4:35 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

మిస్‌వరల్డ్‌ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’

మిస్‌వరల్డ్‌ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’

ఖమ్మం కల్చరల్‌: ప్రతిష్టాత్మకమైన ‘మిస్‌ వరల్డ్‌ కెనడా–2017’పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరచి ఫైనల్‌ పోటీకి ఎంపికైంది. వైరాకు చెందిన అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ కూతురైన శ్రావ్య స్థానికంగా ఏడో తరగతి వరకు చదివింది. ఉన్నత విద్యను ఆదిలాబాద్‌లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కెనడాలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోం ది. అనుకోకుండా మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొని ప్రతీ కేటగిరీలో విజయం సాధిస్తూ.. తుది దశకు చేరుకుంది.

ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ‘మిస్‌ నార్తర్న్‌ ఆల్బర్టా వరల్డ్‌– 2017’కిరీటాన్ని దక్కించుకుంది. ఫైనల్‌ పోటీలో శ్రావ్య హావభావాలతో పాటు ఆమె నడవడిక, ప్రవర్తన తదితర అంశాలను గమనిస్తారు. దీంతోపాటు శ్రావ్యకు మద్దతుగా నిలుస్తున్న వారి ఓటింగ్‌ శాతాన్ని పరిశీలించి అన్నింట్లో ముందంజలో ఉంటే అప్పుడు ఆమె మిస్‌వరల్డ్‌గా నిలుస్తుంది. కాగా, శ్రావ్యకు ఓటింగ్‌ వేసి తన గెలుపులో పాలుపంచుకోవాలని ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రావ్యకు మద్దతు తెలపాల్సిన వారు  గిగిగి. Mఐ  గిౖఖఔఈఇఅNఅఈఅ. Nఉఖీ/2017 ద్వారా ఈనెల 22 సాయంత్రం వరకు ఓటింగ్‌ వేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement