
ఎక్కడైనా పార్క్‌ల వద్ద సైకిళ్లు, వాహనాలు తీసుకురావొద్దని, చెత్తాచెదారం పడేయొద్దనే సూచనలతో బోర్డులు చూస్తుంటాం. కానీ ఖమ్మంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కన ఉన్న ఫ్రీడమ్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డును మాత్రం ప్రతిఒక్కరు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
ఇక్కడ బోర్డుపై సైకిళ్లు పార్క్ లోపలికి తీసుకురావొద్దని, సాయంత్రం 4 గంటల తర్వాత క్రికెట్ ఆడొద్దనేవి రెండు సూచనలు ఉన్నాయి. ఇక మూడోది మాత్రం ‘లవర్స్‌కు అనుమతి లేదు’ అని రాశారు. పార్క్‌కు చిన్నాపెద్ద వాకింగ్ కోసం వస్తుండగా గంటల తరబడి తిష్ట వేస్తున్న కొన్ని జంటలు ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందులు వస్తుండడంతోనే ఇలా బోర్డు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
– ఖమ్మంమయూరిసెంటర్
Comments
Please login to add a commentAdd a comment