park
-
నేచర్.. లవర్స్
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్‌లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్‌లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్‌ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!! హిల్ పార్క్.. కేబీఆర్ చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్‌కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులుప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్‌గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్‌ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్‌కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్‌లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో.. నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్‌నగర్‌కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మినీ ఫారెస్ట్.. జింకల సందడిరెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్‌కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు. -
రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/కొయ్యూరు: రాష్ట్రంలో చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 40 రోజుల్లో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది. 4,756 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన శేషాచలం పార్కు రాష్ట్రంలో మొదటిది కాగా తాజాగా 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రెండో పార్కును ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు వివిధ జీవరాశులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బయోస్పియర్ పార్కును అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలకు యునెస్కో సహాయం అందించనుంది. బయోస్పియర్ రిజర్వ్‌గా మర్రిపాకల అటవీ ప్రాంతం మర్రిపాకల అటవీప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్‌గా ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు డిపోలో కలప వేలం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతూరు, రంపచోడవరం డీఎఫ్‌వోలను సంప్రదించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. దట్టమైన అడవి ఉన్న మర్రిపాకల ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొందరు విద్యుత్ తీగలు అమర్చి జంతువులను వేటాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవావరణ పార్కులో 3 జోన్లు ఉంటాయి కోర్ జోన్: ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలను అనుమతించరు. బఫర్ జోన్: పరిమితంగా స్థానిక ప్రజలను మాత్రమే అవసరమైన వనరుల సమీకరణకు అనుమతిస్తారు. ఫ్రీ జోన్: ఇది పార్కు వెలుపలి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేకుండా సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 18 పార్కులు..జీవావరణ పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని 1971లో యునెస్కో చేపట్టింది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 18 జీవావరణ పార్కులు ఏర్పాటయ్యాయి. -
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
1000 ఎకరాల్లో కొత్త జూపార్క్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు వెలుపల వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్‌లో ఉంచాలని చెప్పారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొలి్పన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. పట్టణ అటవీకరణను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘స్పీడ్’(స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతగిరిలో హెల్త్ టూరిజం అభివృద్ధి..అనంతగిరిలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందంటూ, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలో అక్కడ నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. వెల్నెస్సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహా్వనించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని, పర్యాటక రంగంలో ముందున్న రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు. బంగారు తాపడం పనుల్లో వేగం పెంచండి యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన, విడిది చేసేందుకు కాటేజీల నిర్మాణంపై దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామప్ప ఆలయం ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని అధునాతన సాంకేతికతను వినియోగించి పునర్నిర్మించాలని చెప్పారు. పర్యాటకంపై వేర్వేరు పాలసీలు టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణాతో పాటు వసతి సౌకర్యం, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా పర్యాటక ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్నిచోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ పద్ధతిలో.. హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వీటి నిర్వహణ నిరంతరం మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని రేవంత్ చెప్పారు. పర్యాటక రంగంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా టూరిజం అభివృద్ధి జరగాలన్నారు. హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలి హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసే హెల్త్ హబ్‌లో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే‹Ùరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండివేములవాడ ఆలయ విస్తరణపై సీఎం ఆదేశాలుసాక్షి, హైదరాబాద్/వేములవాడ: వేములవాడ ఆలయ విస్తరణ డిజైన్లు, నమూనాలకు వెంటనే శృంగేరి పీఠం అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సహా వేములవాడ ఆలయ అర్చకులు సీఎంను కలిశారు. ఆలయ విస్తరణకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. అధికారులు బదులిస్తూ శృంగేరి పీఠానికి వెళ్లి అను మతులు తీసుకోవలసి ఉందని చెప్పడంతో.. వెంటనే వెళ్లి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వి నోద్, స్థపతి వల్లి నాయగం, ప్రధానార్చకుడు ఉమేశ్ శర్మ, అధికారులు రాజేశ్, రఘునందన్ తదితరులున్నారు. -
అక్వేరియం ఏమైనట్టు!.. రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన
సాక్షి, హైదరాబాద్: అక్వా మెరైన్ పార్కు..హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టన్నెల్ అక్వేరియం ప్రాజెక్టు ఇది. కొత్వాల్‌గూడ ఎకో పార్కులో అత్యాధునిక హంగులతో అక్వేరియం నిర్మాణానికి హెచ్ఎండీఏ అప్పట్లో ప్రణాళికలను రూపొందించింది. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. కానీ ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచలేదు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిరి్మంచాలని భావించారు. రెండుసార్లు టెండర్లు కూడా ఆహా్వనించారు. కానీ నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ప్రస్తుతం ఎకోపార్కు తుది దశకు చేరుకుంది. కానీ టన్నెల్ అక్వేరియం ఏర్పాటు మాత్రం పెండింగ్ జాబితాలో పడిపోయింది. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల హెచ్ఎండీఏ చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను, పార్కులను పరిశీలించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన టన్నెల్ అక్వేరియంపైన ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లనున్నదనేది చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.150 కోట్లతో ప్రతిపాదించిన అక్వేరియం ప్రతిపాదన ఉన్నట్లా? లేనట్టా అనే అంశంపైనా సందిగ్ధం నెలకొంది. నగర పర్యాటకానికి మణిహారం.... హిమాయత్‌సాగర్‌కు చేరువలో హెచ్ఎండీఏ 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకోపార్కు నిర్మాణం చేపట్టింది. నగరవాసులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఒక అందమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే విధంగా పార్కును విస్తరించారు. ఈ పార్కులోనే సుమారు 4.27 ఎకరాల్లో టన్నెల్ అక్వేరియం ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్వేరియంలపైన అధికారులు అధ్యయనం కూడా చేశారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని అక్వా మెరైన్ పార్కుల కంటే మరిన్ని ఆధునిక హంగులతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కానీ పీపీపీ పద్ధతిలో ప్రతిపాదించిన ఈ భారీ అక్వేరియం నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదు. గత సంవత్సరం రెండుసార్లు టెండర్లు పిలిచారు. స్పందన రాకపోవడంతో కొంతమంది ఆసక్తి కలిగిన డెవలపర్లతో ప్రీ బిడ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ వారి నుంచీ పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పెండింగ్ జాబితాలో పడిపోయింది. దీనిపై మరోసారి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన అధికారులు ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును పూర్తిగా పెట్టేయడమా లేక, మరోసారి ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి విధి విధానాల్లో మార్పులు చేయడమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రంగు రంగుల చేపలతో... ⇒ కొత్వాల్‌గూడ ఎకో పార్కు ఏర్పాటు కోసం, చెన్నై వీజీటీ మెరైన్‌పార్కు, అహ్మదాబాద్ సైన్స్‌సిటీ ప్రాజెక్టులపైన అధికారులు అధ్యయనం చేశారు. ఆ తరువాత దేశంలోనే అతి పెద్ద టన్నెల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ⇒ వేయి రకాల రంగు రంగుల చేపలు, మెరైన్ స్పీసెస్, బహుళ టన్నెల్స్‌తో ఈ మెగా అక్వా మెరైన్ పార్కును అందంగా తీర్చి దిద్దాలని భావించారు. షార్క్ చేపల నుంచి డాలి్ఫన్ల వరకు ఉంటాయి. ఇది సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చే విధంగా, అతి పెద్ద జలాశయం అడుగున పర్యటిస్తూ వీక్షిస్తున్న అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది. ⇒ అలాగే అక్వేరియంను దగ్గరి నుంచి వీక్షించేందుకు అనుగుణంగా ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ⇒ అతి పెద్ద డోమ్ థియేటర్, సెవెన్ డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, హెల్మెట్ అక్వేరియం వంటివి ఏర్పాటు చేసేందుకు సైతం అప్పట్లో ప్రణాళికలను రూపొందించారు. ⇒ పిల్లల కోసం కియోస్‌్కలను కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ⇒ కనీసం 2500 మంది ఒకేసారి సందర్శించేందుకు వీలుగా సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావించారు. అక్వేరియంలో ఏర్పాటు చేసే టన్నెల్ ట్యాంక్ మలుపు 180 డిగ్రీల కోణంలో ఉంటుంది. ⇒ కనీసం 100 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు వాక్ వేలతో టన్నెల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ⇒ మొత్తం అక్వేరియం సుమారు 3 వేల మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యానికి తగ్గకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి
చైనాలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. నలుగురు అమెరికన్ అధ్యాపకులపై దాడి జరిగింది. దుండగులు అధ్యాపకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అధ్యాపకులంతా చైనాలోని తమ భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ ఘటన నేపధ్యంలో అయోవా కాంగ్రెస్ ప్రతినిధి మరియాన్నెట్ మిల్లర్ మీక్స్ మాట్లాడుతూ ఈ దాడిలో గాయపడిన అధ్యాపకులను తగిన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ దాడికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కార్నెల్ కళాశాల అధ్యాపకులు చైనాలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుండగా ఈ దాడి జరిగిందని వార్తా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది. కార్నెల్ కాలేజ్ ప్రెసిడెంట్ జోనాథన్ బ్రాండ్ ఈ ఘటనను ధృవీకరించారు.మరోవైపు ఈ దాడికి సంబంధించిన నివేదికలు తమకు అందాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యాపకులు ఏ మేరకు గాయపడ్డారు? వీరిపై దాడికి కుట్ర జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కార్నెల్ ప్రతినిధి జెన్ వీజర్ తెలిపారు. కాగా అమెరికా పౌరులపై దాడి ఘటనను చైనా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
Vijayawada Riverfront Park Photos: సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన రివర్ ఫ్రంట్ పార్కు (ఫొటోలు)
-
ముంపు ప్రాంతానికి రక్షణ కవచం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి, రివర్‌ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ముంపు సమస్య నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్‌నగర్, భూపేష్ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్‌కాలనీ, రామలింగేశ్వర్‌నగర్ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని తలంచారు. తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. ముంపు సమస్యకు పరిష్కారం ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవారు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్ వాల్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇన్చార్జి వరద ప్రాంతాలకు రక్ష కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్‌నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్ డిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్‌లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
యువతకు ఉపాధి.. రైతులకు లాభం
సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్ పార్క్‌లో ప్రధాన (యాంకర్) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోపవరం పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు.. సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్), మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారుచేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్ జామాయిల్‌ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో జామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్‌ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. యాంకర్ యూనిట్ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది. – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్ జిల్లా వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ -
‘మా పార్కును కాపాడండి ప్లీజ్’
హైదరాబాద్, సాక్షి: నిత్యం తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ కొందరు చిన్నారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్లు లేఖ రాశారు. దీంతో లేఖను సుమోటోగా తీసుకుని.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది హైకోర్టు. హైకోర్టుకు చిన్నారుల లేఖ ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారంటూ 23 మంది చిన్నారులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రోజూ తాము ఆడుకునే పార్క్‌ను ఎలాగైనా కాపాడాలంటూ లేఖలో సీజేను కోరారు. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని సీఎస్, జిల్లా కలెక్టర్, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది. స్థలం సంగతేంటీ? అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిల్లలు అడుకునేందుకు 1.5 ఎకరాల పార్క్ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి పార్క్ నిర్మాణం చేపట్టింది. ఈ స్థలం కబ్జా చేస్తున్నారని 2022 సంవత్సరం ఫిబ్రవరిలో కౌన్సిలర్ అంబకంటి అశోక్ అప్పటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పట్లో నిర్మాణం ఆగిపోయింది. దాని తర్వాత కూడా అధికారులు పార్కు అభివృద్ధి విషయంలో చర్యలు చేపట్టలేదు. దీంతో కొందరు మళ్ళీ ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. దీనిపై తిరిగి కౌన్సిలర్, కాలనీవాసులతో కలిసి కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. పెద్దల వల్ల కానిది పిల్లలు.! ఇదే కాలనీకి చెందిన 23 మంది పిల్లలు.. పార్కును కాపాడాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 2023లో లెటర్ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించడమే కాకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ యంత్రాంగాన్ని అడిగారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందని, ఈ భూమిని కాపాడి పార్కును నిర్మించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖలో చిన్నారులో కోరారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కమిషనర్ శైలజ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాము ఆడుకునే పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ జిల్లా ,కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆక్రమణల కట్టడికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 7 కు తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. -
తెరపైకి తెలంగాణ పార్కు
జిల్లా కేంద్రంలో తెలంగాణ పార్కు నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మళ్లించడంతో పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవలే నిధులు విడుదల చేసిన నూతన ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం వికారాబాద్‌కు ముక్కుపుడక లాంటి తెలంగాణ పార్కు ఏర్పాటు ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు స్థలం గుర్తించి వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రం అభివృద్ధికి తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల నుంచి పార్కు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారని వినికిడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున స్పీకర్ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల అనంతరం పార్కు నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. నిధుల మల్లింపుతో నిలిచిన పనులు 2019 జనవరి 29న అప్పటి కలెక్టర్ ఉమర్ జలీల్ తెలంగాణ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో 13 ఎకరాల స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2020లో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లభించింది. ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద వికారాబాద్ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 25 శాతం పార్కు అభివృద్ధికే కేటాయించినట్లు ప్రచారం సాగింది. 2021 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికే పార్కు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇట్టి నిధులు అప్పటి పాలకులు, అధికారులు ఇతర అభివృద్ధి పనులకు మల్లించడంతో పార్కు నిర్మాణం పనులు ప్రారంభించలేదనే ప్రచారం ఉంది. పర్యాటకులు పెరిగే అవకాశం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్ వచ్చే ప్రధాన రోడ్డు పక్కనే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో ఈ పార్కు నిర్మిస్తే పర్యాటకులు పెరగడంతో పాటుగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. చెరువులో ఎప్పుడు నీరు ఉండటంతో పాటు, పట్టణానికి కొంత దూరంగా ఉండటం, హైదరాబాద్ ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అనంతగిరికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పర్యాటకులు వచ్చే ప్రధాన రహదారి వెంటే పార్కు నిర్మిస్తే జిల్లా కేంద్రానికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. పార్కును ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై ఓ ప్రైవేటు కంపెనీ నమూనా గ్రాఫ్ తయారు చేసింది. ఈ తెలంగాణ పార్కులో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆటస్థలం వారు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి ఏర్పాటు, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశారు. ఆకట్టుకునే విధంగా గ్రీనరీ ఏర్పాటు, సుమారు వంద రకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో మెరిసేలా ఏర్పాటు చేయాలని గ్రాఫ్‌లో పొందుపరిచారు. పార్కు నుంచి చెరువు అందాలు వీక్షించేందుకు కొంత ఎత్తులో నిచ్చెనలతో కూడిన ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కేంద్రానికి ముక్కుపుడక లాంటి ఈ పార్కు నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తొలి ప్రాధాన్యత పట్టణానికి అందాన్ని తీసుకొచ్చే తెలంగాణ పార్కు నిర్మాణం పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు నిర్మాణం పూర్తయితే మున్సిపల్‌కు ఆదాయంతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వచ్చిన టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి పార్కుకు నిర్మాణానికి ఎక్కువ శాతం కేటాయించాలని స్పీకర్‌ను కోరాం. – మంజుల, మున్సిపల్ చైర్పర్సన్, వికారాబాద్ -
విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జూ పార్క్‌లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్‌ని శుభ్రం చేస్తుండగా కేర్ టేకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్ క్లోజర్ వద్ద క్లీనింగ్ కు వెళ్ళాడని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్ క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తస్రావమై గాయాలతో నగేష్ పడి ఉన్నాడని వెల్లడించారు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం.. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసిందని స్పష్టం చేశారు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్ టేకర్ ప్రవేశించాడు. ఎలుగుబంటిని గమనించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆయనపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు -
కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే..
ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే మనుషులు, జంతువులు, చివరికి పక్షులు కూడా పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ జూలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అక్కడ చెట్లు, మొక్కలు సమృద్ధిగా ఉన్నందున, కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూలోని జంతువులు, పక్షులపై కాలుష్య ప్రభావం పడకుండా ఉండేందుకు జూ పార్కు సిబ్బంది అక్కడి చెట్లు, మొక్కలపై నీరు జల్లే పనిని చేపడుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ జూలాజికల్ పార్క్‌లోని చెట్లపై నీళ్లు చల్లాలని అక్కడి సిబ్బందిని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఆకాంక్ష మహాజన్ మాట్లాడుతూ తమ దగ్గరున్న నీరు చల్లే సదుపాయాలు ద్వారా చెట్లు, మొక్కలపై నీరు జల్లుతున్నామని, తద్వారా పక్షులు, జంతువులపై పొగమంచు ప్రభావం తక్కువగా పడుతుందన్నారు. జంతుప్రదర్శనశాల లోపల చాలా పచ్చదనం ఉందని, బయటి ప్రాంతాలతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈసారి అక్టోబర్ నుండే జంతువులకు శీతాకాలపు ఆహారాన్ని అందించే పనిని ప్రారంభించామని, ఈ ఆహారం జంతువులలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? #WATCH | Sprinkling of water done in Delhi's National Zoological Park, as a measure against the rise in Air Quality Index (AQI) in the national capital (04/11) pic.twitter.com/ufyMDFV4YU — ANI (@ANI) November 5, 2023 -
ఒకప్పుడు అది ఉప్పుగని!
రుమేనియా క్లజ్ కౌంటీలోని టుర్డా నగరంలో ఉన్న భూగర్భ థీమ్‌పార్కు ఒకప్పుడు ఉప్పుగని. పురాతన రోమన్ సామ్రాజ్యంలో సహజమైన ఉప్పు నిక్షేపాలు ఉన్న ఈ చోట 1217లో ఉప్పును వెలికి తీసేందుకు గని తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉప్పు గనుల్లో ఇదొకటి. శతాబ్దాల తరబడి ఇక్కడి నుంచి ఉప్పు సేకరించేవారు. ఇందులోని ఉప్పు నిల్వలు అంతరించిపోయాక చాలాకాలం ఖాళీగా మిగిలింది. పాడుబడిన దశలో ఉన్న ఈ గనిలో 120 మీటర్ల లోతున 2010లో ఒక థీమ్‌పార్కును ఏర్పాటు చేశారు. జెయింట్ వీల్, ఫెర్రీవీల్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ వంటి క్రీడా వినోదాల కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఈ భూగర్భ థీమ్‌పార్కు పర్యాటక ఆకర్షణగా మారింది. రుమేనియా స్థానికులతో పాటు ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన తొలి థీమ్‌పార్కు ఇదే కావడం విశేషం. (చదవండి: తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!) -
ఆకట్టుకుంటున్న ఫైవ్ డీ థియేటర్
(సీతంపేట నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) అడవుల నడుమ నేల.. నింగి.. నీటిపై సాహస విన్యాసాలు పులకింపజేస్తాయి. ప్రకృతి ధర్మాలకు ఆలవాలమైన మెరుపులు.. వర్షం.. గాలి దుమారం.. పొగ మంచు.. మంచు కురవడం వంటి అనుభూతులన్నీ కృత్రిమంగా ఒకేసారి సాక్షాత్కరించి మనసుల్ని ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నిర్మించిన తొలి గిరిజన గ్రామీణ అడ్వెంచర్ పార్కులో ఫైవ్ డీ థియేటర్లోకి వెళితే ప్రకృతి అనుభూతులు ఒకేచోట దొరుకుతాయి. సీతంపేట ఏజెన్సీలో లోయలు, కొండలు, జలపాతాలు, నీటి వనరులు పర్యాటక ప్రదేశాలకు అనువైన ప్రాంతాలు. వీటిని దృష్టిలో పెటు్టకుని అడ్వెంచర్ థీమ్‌గా పర్యాటకులకు విహారంతోపాటు వినోదాన్ని పంచేలా పార్కును నిర్మించారు. ఇది 2019 డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో బోటింగ్ కోసమే ఈ పార్కు ఉపయోగపడేది. ఇప్పుడు అందరి వినోద, విహార యాత్రకు నెలవైంది. పార్కులో ప్రత్యేకతలివీ అడ్వెంచర్ పార్కులో 5డీ థియేటర్ ప్రధాన ఆకర్షణ. రూ.79 లక్షలతో నిర్మించిన ఈ థియేటర్ వద్ద కృత్రిమ జలపాతం, థియేటర్ ముందు భాగం అంతా అడవి జంతువుల బొమ్మలతో తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లే గది, పక్కన విభాగాలన్నీ ఫైబర్ మెటీరియల్‌తో అందంగా మలిచారు. 5డీ థియేటర్లో మెరుపులు, వర్షం, గాలి, బుడగలు, పొగమంచు, మంచు వంటివి వెంటవెంటనే వచ్చేలా 5 నిముషాల నిడివితో సినిమా ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అడ్వెంచర్ పార్కులో నేల, నింగి, నీటిపై సాహస విన్యాసాలతో వినోదం పొందేలా అభివృద్ధి చేశారు. చిన్నారులకు మెర్రీ గ్రో రౌండ్, క్యాట్ వాక్, క్లైంబింగ్ వాల్, బర్మా బ్రిడ్జి, కమాండో నెట్ వంటి వాటితో బాల విహార్ విభాగం ఉంది. యువతకు కమాండో నెట్, బంగీ జంప్, రాపెల్లింగ్ వాల్ వంటి విన్యాసాలతో కూడిన సాహస విహార్. ఆట పాటలతోపాటు కళలు, నృత్య ప్రదర్శనలకు వేదికగా ఆనంద విహార్. బోటింగ్, వాటర్ రోలర్ వంటి వాటితో జల విహార్. ఎతైన కొండలు, అవరోధాలను దాటుకుని టెర్రైన్ వెహికల్ రైడ్‌కు వైవిధ్య విహార్. నీటిపై తాళ్ల సాయంతో వేలాడే బ్రిడ్జిపై నడిచి వెళ్లే విస్మయ విహార్. నీటిపై గాలిలో తేలుతూ వెళ్లే స్కై సైక్లింగ్ వినూత్న విహార్. బుల్రైడ్స్, సుమో ఫైటింగ్, బంగీ రన్నింగ్, టార్పలిన్ వంటి వినోద విహార్. షూటింగ్, ఆర్చరీ, బాస్కెట్ బాల్‌తో సౌర్య విహార్. గుర్రాలపై స్వారీ ఆశ్వవిహార్. పారాచూట్‌తో చిన్నపాటి ఎగిరే యంత్రాలతో గగన విహార్ విభాగాలను ఏర్పాటు చేశారు. రోజుకు 600 మంది సందర్శకులు వస్తున్నారు. వారాంతంలో అయితే 3 వేల మంది వస్తున్నారు. అడ్వెంచర్ పార్కు ద్వారా నెలకు రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తోంది. తొలి అడ్వెంచర్ పార్కు మన్యం జిల్లా సీతంపేటలో ‘రావెకలబండ’ పేరుతో సహజసిద్ధమైన పురాతన చెరువు ఉంది. 3.70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీనిని అభివృద్ధి చేశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఫైవ్ డీ థియేటర్ ప్రారంభించి అడ్వెంచర్ పార్కులోని అన్ని విభాగాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని అభివృద్ధి చేయడంతో గిరిజన ప్రాంతంలో తొలి అడ్వెంచర్ పార్కుగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 57 గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరిన్ని కుటుంబాలకు పరోక్షంగా ఈ పార్కు వల్ల ఉపాధి లభిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి పర్యాటక కేంద్రంగా మారింది సుమారు పదెకరాల్లో విస్తరించిన సీతంపేట అడ్వెంచర్ పార్కును రూ.2.53 కోట్లతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంతోపాటు సరిహద్దు జిల్లాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారు. పర్యాటకులతో రాకతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పరోక్ష ఉపాధి లభిస్తుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. – కల్పనా కుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్, సీతంపేట ఐటీడీఏ -
రూ.2,300 కోట్లతో.. విశాఖలో భారీ ఐటీ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: ఐటీ, ఐటీ ఆథారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీఐఐసీ (ఏపీ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కూడా భారీ ఐటీ బిజినెస్ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్తో పాటు ఐటీ పార్క్ ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. మధురవాడ హిల్ నెంబర్–3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ తాజాగా బిడ్లను ఆహ్వనించింది. ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫెసిలిటీలతో పాటు తగినంత పార్కింగ్ సదుపాయాలు ఉండే విధంగా ఈ క్యాంపస్‌ను సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం భాగస్వామ్య కంపెనీతో ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తారు. ఈ ఎస్పీవీలో ఏపీఐఐసీ 26 శాతం వాటాను, భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటాను కలిగి ఉంటుంది. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా.. ఇక మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,300 కోట్లలో 40 శాతం ఈక్విటీగా సమకూర్చాల్సి ఉంటుంది. ఈక్విటీ రూపంలో ఏపీఐఐసీ రూ.239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ రూ.681 కోట్లు సమకూరుస్తాయి. మిగిలిన మొత్తం రూ.1,380 కోట్లను రుణ రూపంలో సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం, బ్రాండింగ్, నిర్వహణ అన్నీ భాగస్వామ్య కంపెనీయే చూడాల్సి ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించామని, భాగస్వామ్య కంపెనీ ఎన్నిక అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించి వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. గడిచిన ఐదేళ్లలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పలు అంతర్జాతీయ సంస్థలు, రిటైల్ సంస్థలు విశాఖలో ఏర్పాటుకావడంతో స్థిరాస్తి ధరలు 20 శాతం పైగా పెరిగినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వాణిజ్య సముదాయాలకు భారీగా డిమాండ్ ఉండటంతో ఐ–స్పేస్ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. -
తల్లి ఫోనులో మునక.. కొడుకు నీట మునక!
అమెరికాలోని టెక్సాస్‌లో గల ఒక వాటర్‌పార్క్‌లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్‌తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్‌గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్‌గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు. ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్‌పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్గార్డ్లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు. క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు. ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది? -
నల్లమలకు పులికూనలు
నల్లమల అభయారణ్యానికి మరో మూడు పులికూనలు రానున్నాయి. తిరుపతి జూపార్కులో ఉన్న వీటిని చిన్నమంతనాల బీటు పరిధిలో వదిలిపెట్టేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 11 నెలలుగా జూ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను వాటి సహజ సిద్ధ ఆవాసానికి తరలించేందుకు ముందుగా అడవిలో ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా చేసి ఆపై అడవిలో వదలనున్నారు. పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలు త్వరలోనే వాటి సహజసిద్ధ వాతావరణమైన నల్లమల అభయారణ్యంలోకి అడుగిడనున్నాయి. పులి పిల్లలను నల్లమలకు తరలించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. సుమారు ఎనిమిది నెలల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి స్థానికులకు కనిపించిన విషయం పాఠకులకు విదితమే. ఫిబ్రవరి మొదటి వారంలో పులి పిల్లలు దొరికిన నాటి నుంచి తల్లి పులి కోసం అన్ని ప్రాంతాలను అన్వేషించిన అటవీశాఖ అధికారులు తల్లిపులి దొరకక పోవటంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల జూ పార్కులోనే మృతి చెందింది. ఈ క్రమంలో పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. క్రమేపి అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. నల్లమలలో అనువైన ప్రాంతాల పరిశీలన పులిపిల్లలను సంరక్షించేందుకు అవసరమైన ప్రాంతాలను అడిషనల్ పీసీసీఎఫ్ ఏకే.నాయక్, ఆంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరక్టర్ శాంతి ప్రియ పాండే, రాహుల్ పాండే లాంటి ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజుల క్రితం నల్లమలలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతమైన చిన్న మంతనాల బీటు పరిధిలోని పెద్దపెంట ప్రాంతాన్ని అనువుగా ఉందని నిర్ధారించారు. దీంతో పెద్దపెంటలోనే పులికూనలను సంరక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దపెంట ప్రాంతంలో వాతావరణం పులులు సంచరించేందుకు అనువుగా ఉండటంతో పాటు, అక్కడి శీతోష్ణస్థితి వన్యప్రాణులు జీవించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పులుల సంరక్షణకు సంబంధించి ఎన్ఎస్టీఆర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పులిపిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు: నల్లమలలోని పెద్దపెంట వద్ద పెద్దపులి పిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సహజంగా తల్లిని వీడిన వన్యప్రాణుల పిల్లలకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు వేటాడే ప్రక్రియను నేర్పిస్తారు. తరువాత వాటిని అభయారణ్యంలో వదిలి పెట్టే రీ వైల్డింగ్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సహజంగా కొత్తపల్లిలో దొరికిన నాటికి పులిపిల్లల వయస్సు మూడు నెలలు. నాటి నుంచి నేటి వరకు 11 నెలల కాలంగా ఆ పిల్లలు వేటాడే తమ సహజసిద్ధ గుణాలను మరిచి కేవలం జూ అధికారులు అందజేసే అహారంతోనే జీవిస్తున్నాయి. అడవికి రారాజుగా పేరొందిన పులుల విషయంలో ఈ పక్రియ అంత మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. పులి అంటేనే వన్యప్రాణులను వేటాడే స్వభావం కలిగింది. అటువంటి పెద్దపులి పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి అడవి కుక్కలు, అడవి పందులతో పాటు స్వజాతికి చెందిన పులుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాక దొరికిన జంతువుల పిల్లలకు రీ వైల్డింగ్లో భాగంగా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు నేర్పిస్తారు. ఎన్క్లోజర్లలో పెరిగే పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 జంతువులను స్వంతంగా వేటాడి తినగలిగిన నాడే దాన్ని అభయారణ్యంలోకి వదిలి వేసే పరిస్థితిలు ఉంటాయి. అలా వేటాడలేక పోయిన నాడు వాటికి ఎదురు పడిన జింకల కొమ్ములు, అడివి పందుల దంతాల ధాటికి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాటు మగపులులు ఎదురుపడితే మేటింగ్‌కు ప్రయత్నిస్తాయని, అలా కాకుండా ఆడపులులు ఎదురు పడితే వీటిపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పలువురు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందు వల్లే ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా పులిపిల్లలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు పుట్టడం అపూర్వ సంఘటన తిరుపతి వెంకటేశ్వర జూ పార్కులో తల్లిపులి నుంచి విడిపోయి అధికారుల సంరక్షణలో పెరుగుతున్న పులి పిల్లల పుట్టుక అపురూపమైందిగా పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై పర్యావరణ ప్రేమికుల్లో కొంత మేర ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాన్పులో నాలుగు పులిపిల్లలు పుట్టడంతో పాటు, అవి తల్లి పులి నుంచి విడిపోయి బాహ్య ప్రపంచానికిలోకి రావటం ఎంతో అరుదని వారు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆడపులి పిల్లల వల్ల భవిష్యత్తులో మరెన్నో లాభాలు ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ పులుల సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు
మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్‌పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. పిక్నిక్ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్‌టాక్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్‌లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr — Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023 -
హుస్సేన్‌సాగర్ తీరంలో మరో అందమైన పార్కు
హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్‌సాగర్ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది. ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ సుందరీకరణలో భాగంగా జలవిహార్ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. విశేషాలెన్నో.. ► ఈ పార్కులో ఎలివేటెడ్ వాక్‌వేస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాక్‌వేలపై నడుస్తుంటే హుస్సేన్‌సాగర్ జలాశయంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కటి 110 మీటర్ల చొప్పున 4 ఎలివేటెడ్ వాక్‌వేలు ఉన్నాయి. పార్కులో అన్ని వైపులా వెళ్లేలా వాక్‌వేలను ఏర్పాటు చేశారు. ► అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్కులో పెవిలియన్స్, పంచతత్వ వాక్‌వే, సెంట్రల్ పాత్వే, అండర్ పాస్‌లు ఉన్నాయి. జలాశయంపై 15 మీటర్ల పొడవైన డెక్ ఉంటుంది. కాంటిలివర్, పర్గోలాస్, విద్యుత్ కాంతులతో అందంగా ఆకట్టుకొనే శిల్పాలు సందర్శకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇల్యుమినేషన్ బొలా ర్డ్స్, ఎల్ఈడీ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, నియో ఫ్లెక్స్లైటింగ్ వంటి విద్యుత్ కాంతుల నడుమ బోర్డ్ వాక్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందమైన ల్యాండ్‌స్కేప్.... ► లేక్‌వ్యూ పార్కును పచ్చదనం ఉట్టిపడేలా అందమైన ల్యాండ్‌స్కేప్‌తో అభివృద్ధి చేశారు. ఆర్కిటెక్ డిౖజైన్‌లలో సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. 25 ఏళ్ల వయసున్న 22 చెట్లను ఈ పార్కులో విజయవంతంగా ట్రాన్స్‌లొకేట్ చేశారు. మరో 40 అరుదైన మొక్కలను నాటారు. ► పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు ఖర్చు కాగా, ల్యాండ్‌స్కేప్, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం మరో రూ.4.65 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఎంట్రీ టికెట్ ఇలా.. ► లేక్‌వ్యూపార్కు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుం. వాకర్స్ నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి. -
పార్క్‌లో సరదాగా..
న్యూఢిల్లీ: నిత్యం కీలకమైన కేసుల విచారణ, వాదోపవాదనలను ఆలకించడంలో బిజీగా ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కొద్దిసేపు అవన్నీ పక్కనబెట్టారు. మధ్యాహ్నం వేళ కొన్ని కేసుల వాదనలు విన్నాక మధ్యలో కొద్దిసేపు విరామం ప్రకటించారు. వెంటనే కొందరు జడ్జీలతో కలిసి అక్కడే ఉన్న ప్రముఖమైన సుప్రీంకోర్టు పార్క్‌లో కలియతిరిగారు. అక్కడికి వచి్చన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులతో సరదాగా మాట్లాడారు. అక్కడి కెఫెటేరియాలో టీ తాగారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు సీజేఐతోపాటు నడిచారు. -
కాలం కలిసి వస్తే డంప్‌యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్‌యార్డ్‌ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్‌గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్‌యార్డ్‌లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్)