అమెరికాలోని టెక్సాస్‌లో గల ఒక వాటర్‌పార్క్‌లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్‌లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు.
ది న్యూయార్క్ పోస్ట్‌తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్‌గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్‌గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు.
ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్‌పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది.
ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్‌గార్డ్‌లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు.
క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్‌లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు.
ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది?
Comments
Please login to add a commentAdd a comment