
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..!
రెక్కలు కట్టుకుని గాల్లో ఎగరాలని ఎవరికి ఉండదు చెప్పండి.. లండన్‌లోని ఓ పార్క్‌లో ఉన్న ఈ బుజ్జి ఎలుకకు కూడా ఇలాగే అనిపించింది కావచ్చు.
లండన్: రెక్కలు కట్టుకుని గాల్లో ఎగరాలని ఎవరికి ఉండదు చెప్పండి.. లండన్‌లోని ఓ పార్క్‌లో ఉన్న ఈ బుజ్జి ఎలుకకు కూడా ఇలాగే అనిపించింది కావచ్చు. పాపం మరి దానికి రెక్కలు లేవు కదా! అందుకే తన మిత్రుడు వడ్రంగి పిట్టను సాయమడిగింది. ఇంకేముంది స్నేహితుని కోరికను మన్నించి తన వీపుపై కూర్చోబెట్టుకుని షికారుకు తీసుకెళ్లింది. ఇద్దరూ కలసి జాం జాం అంటూ జాలీగా గాల్లో చక్కర్లు కొట్టొచ్చారు. వీళ్లిద్దరూ అలా వెళ్తుంటే మార్టిన్ అనే ఫోటోగ్రాఫర్ కంటపడ్డారు. ఇంకేముంది మనోడు క్లిక్‌మనిపించాడు.