
ప్రతీక్మాతక చిత్రం
న్యూఢిల్లీ: ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న ఓ యువతిపై కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న స్నేహితుడిని కలవడానికి పార్కుకు వెళ్లిన ఆమెపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
వివరాలు.. నిరక్షరాస్యురాలైన 21 ఏళ్ల యువతి ఉద్యోగం చేసి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకుంది. ఇందుకోసం అమె ఉద్యోగ వేటలో ఉండగా పరిచయం ఉన్న వ్యక్తి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం బాధిత యువతిని నోయిడాలోని పార్కుకు రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తికి తన సోదరుడితో కూడా పరిచయం ఉండటంతో తెలిసిన వ్యక్తే కదా అని యువతి నమ్మి వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో కాపాడమంటూ బాధితురాలు కేకలు పెట్టింది. అదే సమయంలో అటుగా వెళుతున్న గుడ్డు, షాము అనే ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి అతడిని తన్నితరిమేశారు. గండం తప్పిందని బాధితురాలు అనుకుంటుండగానే ఈ ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతేకాకుండా తమ స్నేహితులైన బ్రిజ్ కిశోర్, పీతంబర్, ఉమేశ్‌లకు ఫోన్ చేసి పిలిపించి బాధితురాలిపై లైంగిక దాడి చేయించారు. తర్వాత ఈ ఐదుగురు అక్కడి నుంచి పారిపోయారు.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాధితురాలు బుద్దానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినట్లు ఎస్‌ఎస్‌పీ వైభవ్ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. సెక్టర్ 63 వద్ద బుధవారం రాత్రి కొంతమంది యువతిపై లైంగిక దాడి చేశారని.. ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారని (బాధిత యువతి స్నేహితుడితో కలిపి) వారిలో నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధితురాలికి ఆస్పత్రిలో చిక్సిత అందిస్తున్నామని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. బాధితురాలు, రవి ఇచ్చిన సమాచారం ఆధారంగా 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వీరి ఆచూకీ చెప్పిన వారికి రూ.25 వేలు నజరానా ఇస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment