సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌పీరియం పార్క్ హైదరాబాద్‌కు తలమాణికంగా మారుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఇక్కడ ఏర్పాటు చేసిన చెట్లు తనను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయన్నారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో ఎక్స్‌పీరియం పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాందేవ్ 2000వ సంవత్సరంలో ఈ పార్క్ మొదలు పెట్టారు. ఆయన చాలా రీసెర్చ్ చేసి విదేశాల నుంచి మొక్కలు తెచ్చి నాటారు. అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి ఈ పార్క్‌ను చూసి ముచ్చట పడ్డారు. అయితే ఈ పార్క్ మీకంటే ముందు నాకు చాలా బాగా నచ్చింది. ఈ పార్క్‌లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యానవనం వల్ల చాలామంది ఉపాధి దొరుకుతుంది అని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment