
మాడ్రిడ్: 'అగ్ని దేవుడు చలికాలంలో చిన్నవాడు.. ఎండాకాలంలో ఎదిగినవాడు' అని ఓ సామెత. మరి ఈ ఎండాకాలంలో అగ్నికి చెక్క వంటి వస్తువులు తోడైతే మరింత భగ్గుమంటుంది. అడ్డొచ్చిన అన్నింటినీ ఆహుతి చేస్తుంది. కానీ చిత్రంగా ఓ పార్క్‌లో అగ్గి రాజేసుకున్న మంటలు ఎలాంటి హాని చేయలేదు. ఈ విచిత్ర ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. కాలహోరాలోని ఓ పార్క్‌లో మంటలు చెలరేగాయి. అయితే అవి అక్కడున్నవారికి చెమటలు పట్టించడం మాని బిత్తరపోయేలా చేసింది. క్రమశిక్షణగా మండుతూ ముందుకు సాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (చిలుక నిర్ణయం: యాజమాని షాక్!)
సముద్రంలోని అలల్లాగా ముందుకు వస్తూ గడ్డిని బూడిద చేస్తూ పోయాయి. కానీ అక్కడ ఉన్న చెట్లను, చెక్క బల్లలను ఏమాత్రం పట్టించుకోలేదు. వీటిని దాటి వెళ్లిపోయాయే తప్ప చుట్టుముట్టలేదు. బుధవారం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. 37 వేల మందికి పైగా వీక్షించారు. అయితే ఇదెలా సాధ్యమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మంటల వెనక నుంచి బలమైన గాలి వీస్తుండటం వల్లే అవి అలా వేగంగా ముందుకెళుతున్నాయని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇదంతా ఎవరో కావాలనే చేశారని మరొకరు కామెంట్ చేశారు. (డ్యాన్స్ చేస్తూ పాడె మోసిన పోలీసులు!)
Comments
Please login to add a commentAdd a comment