Woman And Lion Eating From The Same Plate; Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్‌?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్‌లో..

Published Wed, Jul 19 2023 1:33 PM | Last Updated on Wed, Jul 19 2023 2:49 PM

Viral Video: Woman And Lion Eating From The Same Plate - Sakshi

సింహం అంటేనే హడలిపోతాం. ఏదో దూరంగా చూసి ఆనందిస్తాం. కనీసం బోనులో ఉన్నా కూడా దగ్గరకు వెళ్లాలంటే భయపడిపోతాం. పైగా అది పెట్టే గాండ్రింపుకే హడలి చస్తాం. అలాంటిది దానితో కలిసి భోజనం షేర్‌ చేసుకోవడమా! అమ్మ బాబోయ​ అనేస్తాం. కానీ ఇక్కడొక అమ్మాయి అంత ధైర్యం చేయడమే కాదు, దాంతో కలిసి భోజనం చేసింది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఓ మహిళ పెద్ద సింహంతో కలిసి భోజనం చేసింది. అదీకూడా అది తినే ప్టేటులోనే ఫుడ్‌ షేర్‌ చేసుకుంది. ఏ మాత్రం జంకకుండా దాంతో ఓ ఫ్రెండ్‌ మాదిరి కూర్చొని దర్జాగా తింటోంది. ఈ ఘటన యూఏఈలోని వైల్డ్‌లైఫ్‌ పార్క్‌ రాస్‌ ఏఐ ఖియామ్‌లో చోటు చేసుకుంది. ఇక నెట్టింట వైరల్‌ అవతున్న.. అందుకు సంబంధించిన వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: 68 ఏళ్ల వయసులో ఓ మహిళ చేసిన సాహసం! గాల్లో ఉండగా పైలట్‌ అస్వస్థతకు గురవ్వడంతో...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement