జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్‌లో మాట్లాడుతుంది జైనబ్.
‘ఇలా ఫోన్‌లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.
‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...
ఆ రోజు బామ్మగారి బర్త్‌డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్‌డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత...
‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది.
‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది జైనబ్.
ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.
జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.
‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది.
చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment