Surprise
-
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్.‘ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...ఆ రోజు బామ్మగారి బర్త్‌డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్‌డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత... View this post on Instagram A post shared by ZAINAB ROSHNA | ZR✌🏻 (@zainabroshna) ‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది. ‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది జైనబ్.ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలిఅత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
కన్న తల్లికి జవాన్ సర్ ప్రైజ్
-
భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. అదేంటో తెలుసా?
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.అయితే శివ కార్తికేయన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్మీ డ్రెస్‌లోనే తన ఇంటికెళ్లి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటిపనితో ఫుల్ బిజీగా ఉన్న ఆయన భార్య ఆర్తి దగ్గరికి వెళ్లి సైలెంట్‌గా నిల్చున్నారు. ఇదేమీ గమనించని ఆర్తి తనపని చేసుకుంటూ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తన భర్తను ఆర్మీ డ్రెస్‌లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. Sivakarthikeyan and his wife Aarthi 😍 pic.twitter.com/YcOC9eL5CG— SmartBarani (@SmartBarani) November 13, 2024 -
డెలివరీ ఏజెంట్‌కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్‌డే.. వేడుక ఏదైనా మనకు టైమ్‌కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్‌డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్‌డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్‌తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్‌తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..!
భారతీయ కళా సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన వాల్‌పేపర్ డిజైన్స్, అలనాటి ఐశ్వర్యాన్ని నేడు కళ్ల ముందు నిలిపినట్లు అనిపించకమానదు. ఈ వాల్పేపర్స్లోని ప్రతి డిజైన్ ఒక కళాఖండంలా ఉంటుంది. ఈ వాల్పేపర్లు ఇంటి ఆకర్షణను ఇనుమడింపజేస్తాయి.ఒకప్పటి మొఘల్ రాజభవనాల వైభవాలు, రాజస్థానీ ప్రకృతి దృశ్యాలతో కూడిన వాల్పేపర్లు; వాటికి తోడుగా రోమన్ థీమ్, యురోపియన్ శైలితో ఉండే వాల్పేపర్లను ప్రజలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు ‘లైఫ్ ఎన్ కలర్’ నిర్వాహకురాలు అపూర్వ శర్మ.పరిశోధనతో ప్రారంభం..‘మధ్యయుగ కాలంలో భారతీయ కళారూపాలు, భారతీయ పురాణ గాథల చిత్రాలతో çకూడిన డిజైన్లు ఇటీవలి కాలంలో ట్రెండ్‌గా మారాయి. జనాల అభిరుచిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ డిజైన్లను వీలైనంత కొత్తగా రూపొందిస్తుంటాం’ అని చెబుతారామె.పెయింటింగ్స్ మరిపించేలా..భారతీయ పురాణాల చిత్రాలతో పాటు ఆధునిక అలంకరణలను అనుసరించి పేస్టల్ కలర్స్‌తో సృష్టించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన కథలను వివరించే డిజైన్లను ఎంచుకోవచ్చు. గోడలపైన సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక డిజైన్లను పెయింటింగ్స్‌లో చూస్తుంటాం. అయితే, ఈ డిజైన్లతో కూడిన వాల్పేపర్లు ఇంటిగోడలకు మరింతగా వన్నె తేగలవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.ఇవి చదవండి: గర్భవతులు మరింత బరువు పెరిగితే..? -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్‌కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా!
మన జీవితంలో మనం ఎన్నోరకాల, ఎంతో ఖరీదైన వస్తువల ధరలను విని ఉంటాం. అవసరమైతే ఆ వస్తువులను చూసుంటాం. అత్యంత ఖరీదైన ఆ వస్తువులలో బంగారం, ప్లాటినమ్ అనుకుంటే పొరబడినట్లే. మరి వాటన్నింటికన్నా మరింత ఖరీదైన వస్తువు(ఖనిజం) గురించి మీకు తెలుసా..! ఇక అదేంటో చూద్దాం. అత్యంత ఖరీదైన ఖనిజాలు బంగారం, ప్లాటినమ్ అని చాలామంది అనుకుంటారు. వీటన్నింటి కంటే అత్యంత ఖరీదైన ఖనిజం ఫ్రాంకియమ్. దీని ధర ఒక గ్రాముకు 100 కోట్ల డాలర్లు (రూ.8229 కోట్లు) ఉంటుంది. ఇవి కూడా చదవండి: ఫండే: పర్వతమే హోటల్! కాదు.. అదొక 'హిల్థ్రిల్'!! -
అమ్మా, నాన్న ఆనంద విహారం
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్‌తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్‌లో మనం జైపూర్‌కు వెళుతున్నాం’ అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాడు. పాస్‌పోర్ట్‌లను వారి చేతికి అందిస్తూ ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్ కాదని సింగపూర్‌కు అని తెలుసుకున్న వివేక్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ‘సీ దెయిర్ రియాక్షన్... సర్ప్రైజ్ ట్రిప్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా యూజర్లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్ జై భానుశాలి ‘ప్రౌడ్ సన్. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్ పెట్టారు. -
మామిడిపిందె అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..
'మనం సాధారణంగా కోడిగుడ్లల్లో పెద్దవిగానో, చిన్నవిగానో చూసి ఉంటాం. అలాగే కొన్నింటినీ గండ్రంగా గానీ, పొడవుగా గానీ, తోలుగుడ్లలాంటివి కూడా చూసుంటాం. కానీ ఇలాంటి అసలు సిసలైన, గమ్మత్తైన కోడిగుడ్డును చూశారా! మరెందుకు ఆలస్యం.. అదేంటో చూద్దాం!' ఈ ఫొటోలో చూస్తుంది.. మామిడిపిందె అనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాదు కాదు.. తప్పులో కాలేసినట్లే.. అవును ఇది నిజం.. ఇది మామిడిపిందె కాదు.. మామిడి పిందె ఆకారంలో ఉన్న అసలు సిసలైన ‘కోడిగుడ్డు’.. ఇది నమ్మాల్సిన నిజమే.. మామిడి పిందెలాంటి గుడ్డు కథలోకి వెళ్తే.. హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఎదురుగా ఉన్న దుమ్మల శ్రీనివాస్‌యాదవ్ కిరాణంలో గురువారం ఈ మామిడిపిందె ఆకారంలో ఉన్న కోడిగుడ్డు కనిపించింది. అప్పుడే వచ్చిన కోడిగుడ్ల నిల్వను దుకాణంలో ఓ చోట పెడుతూ ఉండగా ఒక్కసారిగా గుడ్ల ట్రేలో తేడా కనిపించడంతో పరీక్షించి చూడగా కోడిగుడ్డు రూపం గమ్మత్తుగా అగుపించింది. కోడిగుడ్డు అచ్చంగా ‘మామిడిపిందె’ ఆకారంలో విచిత్రంగా కనబడటంతో ఆ గుడ్డును అంతా విచిత్రంగా చూస్తూ ఔరా.! ఇదేంటీ ఈ విచిత్రం సుమా.. అనుకోవడం కొసమెరుపే. ఇవి చదవండి: ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ! కానీ ఆమెకు.. -
అలీగడ్.. హరిగఢ్ ఎందుకయ్యింది? రామాయణంతో సంబంధం ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్ పేరు మారింది. తాజాగా అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్ పేరు మార్పు వెనుక ఒక ప్రత్యకత, ఘనమైన చరిత్ర ఉంది. అలీగఢ్‌ను పూర్వకాలంలో అంటే 200 ఏళ్ల క్రితం కోయిల్ లేదా కోల్ అని పిలిచేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కౌశిరివ్ పేరు కనిపిస్తుంది. అతనిని యుద్ధంలో ఓడించిన కోల్ అనే రాక్షస రాజు ఈ ప్రదేశానికి పాలకునిగా మారతాడు. అతని పేరును అనుసరించి ఈ ప్రదేశానికి కోల్ అని పేరు పెట్టారు. కాగా సయ్యద్ రాజవంశం కాలంలో కోల్ ప్రాంతం పేరు అలీగఢ్గా మారింది. అలీగఢ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. దీనిని లాక్ సిటీ అని కూడా అంటారు. మొఘలుల కాలం నుండి తాళాల తయారీకి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు తమ చదువులను పూర్తి చేస్తున్నారు. భారతీయత ఉట్టిపడాలనే ఉద్దేశంతోనే అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది? -
పెళ్లి పీటలపై పంతులుకి షాకిచ్చిన పెళ్లి జంట..
-
పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!
పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. View this post on Instagram A post shared by Betty Who (@bettywho) వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్‌ని ప్లే చేశారు. ఆ ట్యూన్‌కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్లను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్‌కు ఫిదా అయినట్లు స్పందించారు. ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు -
ఆకాశంలో పుట్టినరోజు వేడుకలు.. చిన్నారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్..
పుట్టినరోజును ఎవరైన చాలా స్పెషల్‌గా జరుపుకోవాలనుకుంటారు. అందుకు ముందే కొత్తగా ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ మొదటి బర్త్‌డే అంటే ఇక ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇవేం లేకుండానే ఓ చిన్నారి తన బర్త్‌డేని చాలా స్పెషల్‌గా జరుపుకుంది. ఎందుకంటే చిన్నారి పుట్టినరోజుని ఏకంగా ఇండిగో విమాన సంస్థే జరిపింది. బ్యూలా లాల్ అనే చిన్నారికి ఇండిగో విమాన సంస్థ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయేలా అరుదైన జ్ఞాపకాన్ని అందించింది. చిన్నారి మొదటి పుట్టిన రోజునే విమానంలో ప్రయాణిస్తుందని తెలుసుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ముందస్తుగా బర్త్‌డే ప్లాన్ చేశారు. కరాచీ విమానాశ్రయానికి చిన్నారి రాగానే ఎయిర్‌లైన్స్ కెప్టెన్ మైక్ అందుకుని ఈ విషయాన్ని మైకులో అందరికీ ప్రకటించారు. చిన్నారితో కేక్ కట్ చేయించారు. విమాన ప్రయాణీకులందరూ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఈ వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చాలా మంచి అవకాశం అని స్పందించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. లాంగ్ లైఫ్, హ్యాప్పీగా ఉండాలని చిన్నారి సోషల్ మీడియా వేదికగా దీవించారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ..
ఒక మహిళ తన కుమారుని 18వ బర్త్‌డే నాడు చేసిన పనికి అతను బంధువులందరిముందు సిగ్గుతో చితికిపోయాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను ఆ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనిని కొందరు ఓపెన్ కల్చర్ అని అంటుండగా, మరికొందరు ఆమె చేసిన పనికి మద్దతు పలుకుతున్నారు. డైలీ స్టార్ రిపోర్టును అనుసరించి ఈ ఘటన మెక్సికోలోని నువో లియోన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన 18 ఏళ్ల కుమారుని పుట్టినరోజున ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. దానిని చూసిన అతను అక్కడున్నవారందరి మధ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆమె కుమారుని బర్త్‌డే నాడు అతనిని సర్ప్రైజ్ చేస్తూ ఒక స్ట్రిప్పర్(అడల్డ్ డాన్సర్)ను ఆహ్వానించింది. వీడియోలో ఆ మహిళ తన చేతులతో బర్త్‌డే కేక్ పట్టుకుని కనిపిస్తుంది. ఆ సమయంలో ఆమె కుమారుడు మరో గదిలో ఉంటాడు. కుమారునికి సర్ప్రైజ్ ఇచ్చేందుకు ఆమె ఆ గదిలోకి వెళుతుంది. ఆ గదిలోకి వెళ్లగానే.. తల్లి తన కుమారుని కళ్లు మూస్తుంది. ఆ కుర్రాడు కళ్లు తెరవగానే అతని ముందు ఒక స్ట్రిప్పర్ షార్ట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఆ స్ట్రిప్పర్‌ను చూడగానే ఆ యువకుడు సిగ్గుతో చితికిపోతూ బంధువులవైపు బేల చూపులు చూస్తాడు. తరువాత తన ముఖం దాచుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో తల్లి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది.అప్పుడు ఆ స్ట్రిప్పర్ ఆ కుర్రాడి ఒడిలో కూర్చుని, అశ్లీల నృత్యం చేస్తుంది. ఈ వీడియో బహిర్గతమైన నేపధ్యంలో పలు విమర్శలు చుట్టుముట్టడంతో ఆ మహిళ తన అకౌంట్ నుంచి ఆ వీడియోను తొలగించింది. ఈ వీడియోకు అప్పటికే 23 మిలియన్లకు మించిన వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘ఆ మహిళ అనుబంధాల విషయంలో హద్దులను గుర్తెరగాలి’ అని కామెంట్ చేయగా, మరొకకు ఇది ఎంతో సిగ్గుమాలిన పని అని పేర్కొన్నారు. ఇంకొక యూజర్ కుర్రాడికి 18 ఏళ్లు వస్తే, తల్లిదండ్రులు అతనిని స్నేహితునిగా భావించాలని’ అన్నారు. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
తన బర్త్ డే రోజున ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసిన తారక్..
-
రామ్ ఫ్యాన్స్‌కి డబల్ బోనాంజా
-
ఎన్టీఆర్ బర్త్ డేకి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న కొరటాల తగ్గేదేలే అంటున్న తారక్ ఫ్యాన్స్
-
యూ ఆర్ మై ఫేవరెట్.. ఎన్టీఆర్‌కు ఆలియాభట్ సర్ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా ఆమె ఎన్టీఆర్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవకు కొత్త దుస్తులు పంపి తన అభిమానాన్ని చాటుకుంది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్‌లో ప్యాక్ చేసి.. పిల్లల పేర్లతో ట్యాగ్లు పెట్టి మరీ పంపించింది. ఆలియా భట్ బహుమానానికి ఎన్టీఆర్ ఫిదా అయిపోయారు. త్వరలోనే నా పేరుతో మీరు ఓ బ్యాగ్ చూస్తారు అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు యంగ్ టైగర్. కాగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 పేరు పెట్టారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మహేష్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ బిగ్ సర్ప్రైజ్
-
మాట నిలబెట్టుకున్న విజయ్! వందమంది ఫ్యాన్స్ సర్ప్రైజ్ ట్రిప్ వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంతో యూత్‌లో ఆయన విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల కంటే కూడా తన ప్రవర్తనతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. హిట్..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. అలాగే విజయ్ కూడా తరచూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. చదవండి: నాపై అలాంటి కామెంట్స్ చేశారు.. దానికి కారణం ఇదే: ఎస్వీ కృష్ణారెడ్డి గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరుతో ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని మనాలి విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు. చదవండి: పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్ జోరు ఇప్పటికే ఈ 100 మంది పేర్లు ప్రకటించిన విజయ్ ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాత్ర కొనసాగనుందని వెల్లడించాడు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 17న) వారి జర్నీ స్టార్ట్. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ పంపిన వీడియోని విజయ్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఈ రోజు ఉదయం వాళ్లు ఫ్లైట్‌లో ఉన్న వీడియోను నాకు పంపించారు. పర్వతాల్లోకి హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ విజయ్ రాసుకొచ్చాడు. Cutest ❤️ they sent me a video from their flight this morning. And they are off on their holiday to the mountains! 100 from across the country, makes me so happy 🥰#Deverasanta2022 pic.twitter.com/BF4DX5PIyG — Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2023 And here are the 100 of you, randomly selected this year :) Travel dates - February 17- 20. Will do a call group call and speak soon ❤️ pic.twitter.com/syOaRfvsXa — Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2023 -
'ఆర్ఆర్ఆర్' అని గూగుల్‌లో సెర్చ్ చేశారా? మీకో సర్ప్రైజ్ !
Google Gives Surprise To RRR Movie For Rajamouli: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీలోనూ తన సత్తా చాటింది. ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన నెటిజన్స్, ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ గుర్తించిన గూగుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రజలకు ఏ సందేహం కలిగిన గూగుల్ తల్లిని అడుగుతారన్న విషయం తెలిసిందే. ఇలా ఆర్ఆర్ఆర్ గురించి కొన్ని కోట్ల మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' గురించి సెర్చ్ చేసే వారికి ఒక సర్ప్రైజ్ కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ అని గూగుల్‌లో టైప్ చేసి ఎంటర్ కొట్టగానే సెర్చ్ బార్ కింద ఒక బైక్, గుర్రం వెళ్తూ కనిపిస్తాయి. ఒకసారి బైక్ ముందు వస్తే, మరోసారి గుర్రం ముందు వస్తుంది. చదవండి: మహాత్మ గాంధీ హత్యోదంతంగా '1948 అఖండ భారత్'.. మూవీ రివ్యూ కాగా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తారక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపగా, రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే బైక్‌పై రామ్ చరణ్, గుర్రంపై ఎన్టీఆర్ వెళ్లే సన్నివేశాలు చిత్రంలో ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఇటు నందమూరి, అటు మెగా అభిమానులను, ప్రేక్షకులకు ఈ సన్నివేశాలు గుర్తు తెచ్చేలా గూగుల్ ఈ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్‌కు 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ ధన్యవాదాలు చెప్పింది. ''మమ్మల్ని సర్ప్రైజ్ చేసినందుకు, వరల్డ్‌వైడ్‌గా 'ఆర్ఆర్ఆర్'కు ఉన్న పాపులారిటీని గుర్తించినందుకు థ్యాంక్యూ గూగుల్'' అని పేర్కొంది. అలాగే గూగుల్‌లో 'ఆర్ఆర్ఆర్' అని సెర్చ్ చేసి స్క్రీన్‌షాట్ లేదా వీడియో తీసి RRR Take Over అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని ఆడియెన్స్‌ను కోరింది సినిమా చిత్రబృందం. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. దేవుడి పాత్రలో..
Lucky Man Teaser Released: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నా ముందు కమిట్ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ అభిమానులకు త్వరలోనే సర్ప్రైజ్ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్'తోపాటు 'లక్కీ మ్యాన్' కూడా ఉంది. పునీత్ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్ రాజ్‌కుమార్ చేసే డ్యాన్స్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు -
పెళ్లి రోజు వరుడు సర్ప్రైజ్.. గిఫ్ట్ చూసి ఏడ్చేసిన వధువు!
జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేమైనది. అందుకే యువతీ యువకులు వారి పెళ్లి రోజున స్పెషల్స్, సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకుంటూ జీవితంలో మరచిపోని రోజులా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీ ఫంక్షన్లు, హల్దీ వేడుకలతో హడావిడీ చేస్తున్నారు. అంతేనా ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం అవి నెటిజన్లను ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహా ఓ జంట వీడియో గత సంత్సరం నెట్టింట ప్రత్యక్షమైంది. తాజాగా ఆ వీడియో మరో సారి వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏముందంటే.. వెడ్డింగ్ డే అనేది ప్రతి జంటకు ప్రత్యేకమైన రోజు. అందుకే తమ కుటుంబ సభ్యులు, బంధువులతో, స్నేహితులతో కలిసి ఎప్పటికీ గుర్తుండేలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో పాటు తమ జీవిత భాగస్వామికి ఏదైనా మరచిపోని బహుమతిని ఇచ్చేందుకు తాపత్రయ పడడం కూడా సహజమే. అయితే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన భార్యకు స్పెషల్ గిఫ్ట్‌తో ఆశ్యర్యపరిచాడు. ఎలా అంటారా.. బ్రెజిల్లో ఉంటున్న వధువు తల్లిదండ్రులను విమానంలో పిలిపించి ఆమెకు స్పెషల్ సర్ప్రైజ్లా ప్లాన్ చేశాడు ఓ వరుడు. ఇక వెడ్డింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వధువు తన తల్లిదండ్రలను చూడగానే ఆనందంతో ఒక్కసారిగా వారి ఏడవడం మొదలుపెట్టింది. అనంతరం వారిని కౌగిలించుకుని తన సంతోషాన్ని కనీళ్ల రూపంలో వారికి తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సర్ప్రైజ్ బాగుంది బాస్ అంటు కామెంట్ పెట్టారు. Husband surprises bride by flying her parents from Brazil to their wedding. ☺️☺️ pic.twitter.com/eBZnOj1R5X — made me smile (@mademe__smile) May 4, 2022 చదవండి: Viral video: చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు -
శ్రుతిహాసన్ కోసం ప్రభాస్ చేయించిన వంటలు చూస్తే నోరూరాల్సిందే..
Prabhas surprises Shruti Haasan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్లో ఉంటాయి. సెట్లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. వెరైటీ వంటకాల రుచి చూపిస్తారాయన. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్..ఈసారి సలార్ బ్యూటీ శ్రుతిహాసన్ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా సలార్ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ కోసం స్పెషల్‌గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీ సహా దాదాపు ఇరవై రకాల వంటకాలను ప్రభాస్ వండించి తీసుకొచ్చారట. దీనికి సంబంధించిన లిస్ట్‌ను శ్రుతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బయటపెట్టింది. నోరూరించే వంటకాలు చూసి శ్రుతి చాలా థ్రిల్‌కి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్కు మురిసిపోయిన శ్రుతి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఆయన డార్లింగ్ అంటూ కొనియాడుతున్నారు. -
సర్ప్రైజ్: ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్న వీడియో
న్యూఢిల్లీ: పెళ్లిలో వధువుకు వరుడు ఇచ్చిన సర్ప్రైజ్ ప్రతి ఒక్కరిని హృదయాలను హత్తుకుంటుంటోంది. డౌన్స్ సిండ్రోమ్(జన్యు సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న) చిన్నారులను పెళ్లిలో రింగ్ బేరర్లుగా ఉంచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పెళ్లి కూతురితో పాటు నెటిజన్లను సైతం కంటితడి పెట్టిస్తోంది. జానా హిషమ్ అనే ట్విటర్ యూజర్ సోమవారం ఈ వీడియోను షేర్ చేసింది. దీనికి ఆమె ‘పెళ్లి కూతురిని ఆశ్చర్యపరచడానికి పెళ్లి కుమారుడు డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న విద్యార్దులను రింగ్ బేరర్లుగా ఉంచాడు. ఇది చూడగానే ఒక్కసారిగా వధువు నా కళ్లలో నీళ్లు తిరగాయి’ అంటూ ఆమె షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె విద్యార్థులను రింగ్ బేరర్లు నియమించిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. (చదవండి: మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం) పెళ్లి కూతురికి ఇలా సర్ప్రైజ్ ఇచ్చిన పెళ్లి కొడుకుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఈ జంట ఎప్పటికి ఆశ్వీర్వదించబడాలి’, ‘కన్నీళ్లు ఆగడం లేదు’, ‘ఇంతకంటే మంచి వీడియోను ఈ మధ్య కాలంలో చూడలేదు’ అంటూ నెటిజన్లు భావోద్యేగానికి లోనవుతున్నారు. రెండు నిమిషాలకు పైగా నిడివి గల ఈ వీడియోలో నూతన వధువరుల వైపు కొంతమంది చిన్నారులు తోడిపెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దుస్తులు ధరించి ఉన్నారు. వారు జంటలుగా వారి వైపు నుడుచుకుంటు రింగ్‌ను తీసుకురావడం చూసి పెళ్లి కూతురు ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ పెళ్లి కొడుకును హత్తుకుంది. ఎందుకంటే ఆ పిల్లలు అంతా డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వారే. ఈ చిన్నారులంతా సదరు వధువు విద్యార్థులు. పెళ్లి కూతురిని సర్ప్రైజ్ చేసేందుకు పెళ్లి కొడుకు వారిని రింగ్బేరర్లుగా నియమించాడు. అయితే ఇది ఏప్రిల్ నాటి వీడియో అని తెలుస్తోంది. ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, వధూవరులు ఎవరు అనే వివరాలు లేనప్పటికీ.. ఈ వీడియోలోని భావోద్వేగానికి వీక్షకులు కనెక్ట్ అవుతున్నారు. (చదవండి: సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం) This groom surprised his bride by having her students with Down’s syndrome be the ring bearers and I’m a puddle of tears on the floor 😄 pic.twitter.com/PKv1SduZv4 — Jana Hisham (@JanaHisham) October 17, 2020 -
స్వీట్ షాక్
తమిళ హీరో విష్ణు విశాల్ పుట్టినరోజు సందర్భంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూలై 17న) విష్ణు విశాల్ పుట్టినరోజు. తాను వస్తున్నట్లు ముందు చెప్పకుండా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి జ్వాల బాయ్‌ఫ్రెండ్‌కు స్వీట్ షాక్ ఇచ్చారు. ‘నా బర్త్‌డే సర్ప్రైజ్’ అని ఆమెతో దిగిన ఫొటోలను విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. మరోవైపు జ్వాల కూడా ‘హ్యాపీ బర్త్‌డే బేబీ’ అనే క్యాప్షన్ తో వారిద్దరూ దిగిన ఫొటోని ట్వీట్ చేశారు. కాగా విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాలను కలిశారట విశాల్. అప్పుడు కుదిరిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్. ‘మేమిద్దరం రిలేషన్ షిప్లో ఉన్నాం’ అంటూ జ్వాల ఆ మధ్య వెల్లడించారు కూడా. అయితే విష్ణు విశాల్‌కు ఇప్పటికే పెళ్లయింది. రజినీ నటరాజ్‌తో ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018లో ఆమె నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో జ్వాల పెళ్లాడారు. కారణాలేంటో తెలియదు కానీ 2011లో వీరిద్దరూ విడిపోయారు. మరి.. విష్ణు–జ్వాల ప్రేమ.. పెళ్లి వరకూ వెళుతుందా? -
సర్ప్రైజ్ సర్ప్రైజ్
నాగచైతన్య బర్త్‌డేకు (నవంబర్ 23) స్పెషల్ బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ‘వెంకీమామ’ చిత్రబృందం. ఈ నెల 23న నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీందర్(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. ‘కెప్టెన్ కార్తీక్’ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా చైతన్య ఈ సినిమాలో నటించారు. ఈ టీజర్లోనే ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారని తెలిసింది. లవ్‌స్టోరీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ఓ ప్రేమకథాచిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. చైతన్య బర్త్‌డేకి ‘లవ్ స్టోరీ’ టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. చైతన్య అభిమానులకు డబుల్ ధమాకా. -
పసుపు కుంకుమ
‘‘ఆలోచించేపని లేదు. చెప్పినట్లు చెయ్యండి. కొంచెం పసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘‘పట్టేశాను’’ అన్నాడు వీరభద్రం.ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు ప్రయత్నించాడు సహస్ర. ప్రమతి భర్త సహస్ర.‘పట్టేశాను’ అన్న వెంటనే, తన వెంట తెచ్చుకున్న బీకరులాంటి గాజు పాత్రలో పెట్టేసి, గట్టిగా బిరడా బిగించాడు వీరభద్రం. వీరభద్రం భూత వైద్యుడు కాదు. భూత తాంత్రికుడు. మనుషులకు పట్టే దెయ్యాల్ని వదిలించడంలో అతడికి ఇంట్రెస్ట్ లేదు. మనుషుల్ని వదలకుండా పట్టి పీడించే దెయ్యాల్ని బంధించడంలో అతడు ఎక్స్పర్ట్. ప్రమతి, సహస్ర మొదట తనను కలిసేందుకు వచ్చినప్పుడు అతడేం ఉత్సాహం చూపలేదు. ఏమిటన్నట్లు చూశాడు. ‘‘ద..ద..’’ అని ప్రమతి తత్తరపడుతుంటే.. సహస్రే చెప్పాడు, ‘‘దెయ్యం ఉన్నట్లుంది మా ఇంట్లో.. దాన్ని వదిలించాలి’’ అని. ‘‘ఎన్నాళ్ల నుంచి ఉందనుకుంటున్నారు మీ ఇంట్లో దెయ్యం?’’ అడిగాడు వీరభద్రం. భార్యాభర్తలు ముఖాలు చూసుకున్నారు. యువ దంపతులు వాళ్లు. పెళ్లయి ఒక వారమైనా అయినట్లు లేదు. అంత ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు. ‘‘ఏడాది నుంచీ ఉంటున్నాం. ఆ దెయ్యం కూడా ఏడాది నుంచీ మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది. దెయ్యం వదలట్లేదని, ఇంటినే వదిలేయడానికి కూడా లేదు. అద్దెల్లు కాదు. సొంతది. మాకోసం మా అత్తమామలు కొని ఇచ్చింది. పెళ్లయిన నెల రోజులకు గృహప్రవేశం చేశాం’’ చెప్పింది ప్రమతి.‘‘సరే.. వస్తాను వెళ్లండి’’ అన్నాడు వీరభద్రం. ‘వస్తాను, వెళ్లండి’ అనగానే.. ‘మా ఇంటి అడ్రస్..’ అంటూ దారులు, దిక్కులు చెప్పబోయింది ప్రమతి. అవసరం లేదన్నట్లు చేత్తో వారించాడు వీరభద్రం. సహస్రకు భలే ఆశ్చర్యం అనిపించింది. వెనక్కు వచ్చేశారు. అలా వెనక్కు వచ్చేటప్పుడు కూడా వీరభద్రం వెనక నుంచి వాళ్లనేమీ అడగలేదు. ఏ టైమ్‌లో ఉంటారూ.. ఇద్దరూ ఒకే టైమ్‌లో ఎప్పుడుంటారూ, ఆఫీస్‌లకు సెలవెప్పుడూ.. ఇలాంటివేమీ అడగలేదు. వాళ్లలా వెళ్లగానే ఇలా.. పుస్తకాలేవో తెరుస్తుండడం ప్రమతి, సహస్ర గమనించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంతసేపు దెయ్యం సంగతి మర్చిపోయి, వీరభద్రం గురించి మాట్లాడుకున్నారు. ఆయన కళ్లల్లో వారికేదో తేజస్సు కనిపించింది. ‘‘పట్టేస్తాడు’’ అనుకున్నారు. ‘‘పట్టేశాను’’ అని చెప్పి, బీకరులో పడేసి, బిరడాలో పెట్టేశాక.. దానిని ఈశాన్యంలోని దేవుడి మూలకు అభిముఖంగా, నైరుతి మూలలో చేతికి అందే ఎత్తులో అటకమీద ఉంచి చెప్పాడు వీరభద్రం.. ‘‘దీన్నిక్కడే కొన్నాళ్లు కదలకుండా ఉంచండి’’ అని. భయంగా చూశారు భార్యాభర్తలు. ‘‘దెయ్యాన్ని మీరు తీసుకెళతారనుకున్నాం’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి. ‘‘లేదు. కొన్నాళ్లు ఈ బీకరు ఇక్కడే ఉండాలి. బీకరుకు అడ్డంగా కర్టెన్లాంటిది కూడా ఏమీ వేలాడదీయకండి. అది మీకు కనిపిస్తూ ఉండాలి’’ చెప్పాడు వీరభద్రం. ‘‘కానీ దాన్ని చూస్తుంటే మాకు భయంగా ఉంటుంది. బీకరులోని దెయ్యం మమ్మల్నే చూస్తూ ఉంటుందేమోనని. పైగా బీకరు అక్కడ ఉంటే.. మేం ఏ పనిలో ఉన్నా ఆ దెయ్యానికి కనిపిస్తూ ఉంటాం. తింటున్నా, టీవీ చూస్తున్నా, పడుకోడానికి వెళుతున్నా, స్నానం చేసి వస్తున్నా..’’ చెప్పాడు సహస్ర. అవునన్నట్లు చూసింది ప్రమతి. ‘‘కనిపించాలి’’ అన్నాడు వీరభద్రం.. బీకరులోకి చూస్తూ. ఆ మాటకు భయంగా గుటకలేశారు భార్యాభర్తలు. దెయ్యం ఇంట్లో ఏమూలన తిరుగుతోందో తెలియక భయపడడంవేరు. ఫలానా చోటు ఉందని తెలిసీ దెయ్యం.. ముందు ఇంట్లో తిరగడం వేరు. అది ఆలోచిస్తున్నారు వాళ్లు. అది కనిపెట్టాడు వీరభద్రం. ‘‘ఆలోచించే పని లేదు. చెప్పినట్లు చెయ్యండి.కొంచెంపసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘మరి!’ అన్నట్లు చూశారు ప్రమతి, సహస్ర. ‘‘నీ కాలికి రాసుకున్న పసుపు. నీ భర్త గుండెలకు నువ్వద్దిన కుంకుమ’’ అని చెప్పాడు వీరభద్రం. కాళ్లకు పసుపు రాసుకుని, ఆ రాసుకున్న పసుపులోంచి కొంత తీసింది ప్రమతి. అలాగే భర్త గుండెకు కుంకుమ అద్ది, ఆ అద్దిన కుంకుమలోంచి కొంత తీసింది. వాటిని చిన్న కాగితం ముక్కలో వేసుకుంది. రెంటినీ కుడిచేతి ఉంగరపు వేలు, బొటనవేలితో కలపి, నలపమని చెప్పాడు వీరభద్రం. కలిపి, నలిపింది. దాంట్లోంచి భార్యాభర్తల్ని చెరిసగం తీసుకోమని చెప్పాడు. తీసుకున్నారు. బీకరు దగ్గరికి వెళ్లి, బీకరుపై ఇద్దర్నీ వేర్వేరుగా రెండు బొట్లు పెట్టమన్నాడు. మళ్లీ ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు సహస్ర ప్రయత్నించాడు కానీ వీలుకాలేదు. ‘‘భయంలేదు. వెళ్లమ్మా.. నువ్కొక బొట్టు పెట్టు, నువ్వూ ఒక బొట్టు పెట్టబ్బాయ్’’ అన్నాడు. బొట్లు పెడుతున్నప్పుడు వాళ్ల వేళ్లు వణికాయి. బీకరు లోపల ఊపిరి ఆడకుండా ఎవరో టపటపా కొట్టుకుంటున్నట్లనిపించింది. ఆ తర్వాత వీరభద్రం వెళ్లిపోతుంటే.. భయంగా అడిగింది ప్రమతి. ‘‘ఎప్పుడు తీసుకెళతారు ఆ దెయ్యాన్ని’’ అని. ‘‘ఎవరూ తీసుకెళ్లే పని లేదు. సమయం వచ్చినప్పుడు బీకరే దానంతటది కిందపడి బద్దలవుతుంది’’.. చెప్పాడు వీరభద్రం. ‘‘అప్పుడు దెయ్యం మా పని పట్టదా.. అన్నాళ్లూ బంధించి ఉంచినందుకు?’’ అడిగాడు సహస్ర. ‘‘అలా జరగదు’’ అన్నాడు. వెళ్లే ముందు ఇంకో మాట కూడా చెప్పాడు. ‘‘మీరనుకున్నట్లు ఆ బీకరులో దెయ్యం లేదు. దెయ్యాలు ఉన్నాయి. రెండు దెయ్యాలు. ఒకటి ఆడ దెయ్యం, ఇంకోటి మగదెయ్యం. అంతేకాదు, అవి రెండూ కూడా బతికే ఉన్న ఇద్దరు మనుషుల ఆత్మలు.’’బతికున్న మనుషులకు కూడా ఆత్మలు ఉంటాయా అని ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రమతి, సహస్ర. ఆ తర్వాతెప్పుడూ బీకరులోని ఆ రెండు దెయ్యాల గురించిమాట్లాడుకోలేదు. ఇంట్లో దెయ్యం ఉందని మునుపు వాళ్లకు అనిపించడానికి కారణమైన సంఘటనలు కూడా వీరభద్రం వచ్చి వెళ్లాక మళ్లీ ఆ ఇంట్లో జరగలేదు. కొన్నాళ్ల తర్వాత.. ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ప్రమతి, సహస్రలకు భళ్లున ఏదో పగిలిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూశారు. బీకరు! ముక్కలై పడి ఉంది. ఆ మధ్యాహ్నం వాళ్లకు వేర్వేరుగా రెండు పెళ్లి కార్డులు వచ్చాయి. ఒక జంటలో వరుడు పంపిన కార్డు ప్రమతి పేరు మీద వచ్చింది. ఇంకో జంటలో వధువు పంపిన కార్డు సహస్ర పేరు మీద వచ్చింది. ‘నువ్వు లేకుండా బతకలేను’ అని ప్రమతికి చెప్పి, ప్రమతికి పెళ్లవుతున్న రోజు.. చీకట్లో ప్రమతినిపట్టుకుని బోరుమని ఏడ్చిన అబ్బాయి వరుడు. ‘నువ్వే నా సర్వస్వం. నిన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోనని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నావా!’’ అని.. చివరిసారి కలవడానికి వచ్చిన సహస్రను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుని, లోపల్నుంచి దభీదభీమని తలను తలుపుకేసి కొట్టుకున్న అమ్మాయి వధువు. ∙∙ మర్నాడు వీరభద్రాన్ని కలిసి బీకరు పగిలిపోయిందని చెప్పారు ప్రమతి, సహస్ర. ‘‘ఆత్మ విముక్తి జరిగింది’’ అన్నాడు వీరభద్రం. ‘‘బీకరును మీతో తీసుకెళ్లితే ఆత్మ విముక్తి జరిగి ఉండేది కాదా?’’ అడిగాడు సహస్త్ర.. ఆసక్తి కొద్దీ. ‘‘కసితో జరిగిన ఆత్మవిముక్తి అది. మీ దాంపత్యాన్ని ఆ ఆత్మలు కళ్లారా చూశాక’’.. చెప్పాడు వీరభద్రం. ∙మాధవ్ శింగరాజు -
విమానంలో ప్రత్యేక అతిథి.. సర్ప్రైజ్ ఇచ్చిన పైలెట్
జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే.. ఆ జన్మకు సార్ధకత లభించేలా చేసేది గురువులు. ఉపాధ్యాయుల గొప్పదనం తెలిపే ఓ సూక్తి ఇలా చెప్తుంది.. ‘నా ముందు దైవం, గురువు ఇద్దరూ నిలబడితే.. నేను ముందుగా గురువుకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఈ రోజు నాకు భగవంతుని దర్శనం లభించిందంటే అందుకు కారణం గురువు’ అని ఉంటుంది. అది ఉపాధ్యాయులకు మనం ఇవ్వాల్సిన గౌరవం. తాము విద్యాబుద్ధులు నేర్పిన వారు నేడు ప్రయోజకులై తమ కళ్లముందుకు వస్తే వారికి కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేము. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ ఉపాధ్యాయునికి. తన విద్యార్థి ఇచ్చిన సర్ఫ్రైజ్.. ఆ టీచర్నే కాక ఇతర ప్రయాణికుల చేత కూడా కంటతడి పెట్టించింది. వివరాలు..టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో ఓ వృద్ధుడు ప్రయాణిస్తున్నారు. విశేషం ఏంటంటే చిన్నప్పుడు అతని వద్ద చదువుకున్న విద్యార్థే ఆ ఎయిర్‌లైన్స్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు చదువు చెప్పిన టీచర్, నేడు తాను నడుపుతున్న విమానంలోనే ప్రయాణిస్తుండటంతో ఆ పైలెట్ తెగ సంతోషపడ్డాడు. తన టీచర్‌కి జీవితాంతం గుర్తుడిపోయేలా ఏదైనా సర్ఫ్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. వెంటనే.. ‘విమానంలో ఎడమ వైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి నా స్కూల్ టీచర్. ఒకప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఈరోజు నేను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ సందర్భంగా ఆయనకు గుర్తుండిపోయేలా ఏదన్నా చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు పువ్వులు ఇచ్చి విష్ చేయాల్సిందిగా సిబ్బందిని కోరుతున్నాను’ అంటూ ఉద్వేగానికి లోనవుతూ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న ఆ టీచర్‌కి కన్నీళ్లాగలేదు. ఈ లోపు పైలట్ చెప్పినట్లుగానే విమానంలోని ఇతర సిబ్బంది ఫ్లవర్ బోకేలు ఇచ్చి సదరు టీచర్ని విష్ చేశారు. ఆ తర్వాత తన టీచర్‌ను కలవడానికి క్యాబిన్ నుంచి పైలట్ కూడా వచ్చాడు. టీచర్ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. సదరు పైలట్ చేసిన పనికి తోటి ప్రయాణికులకు కూడా కన్నీరాగలేదు. చప్పట్లు కొడుతూ పైలట్‌ను అభినందించారు. విమానంలోని కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. అయితే ఇదే సమయంలో విమానంలో టర్కీకి చెందిన ఇష్టిషమ్ ఉల్హక్ అనే విలేకరి కూడా ఉన్నారు. Turkish Airlines pilot thanks his school teacher who was on board the flight. Very moving and shows the ultimate respect to the educators who shape our lives. pic.twitter.com/loEvkLQh3m — Ihtisham ul Haq (@iihtishamm) November 28, 2018 ఈ వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘ తనకు చదువు చెప్పిన టీచర్ తను నడుపుతున్న విమానంలో ఉన్నారని తెలిసి ఈ పైలట్ ఈ రకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ దృశ్యం నన్నెంతో కదిలించింది. మన జీవితాలకు వెలుగునిచ్చిన ఉపాధ్యాయులకు మనం ఇచ్చే మర్యాద ఇది..’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చాలా వైరల్ అవుతోంది. -
నేను నమ్మలేకపోయా
న్యూఢిల్లీ: ఇటీవల నలుగురు జడ్జీల పదోన్నతులకు 48 గంటల్లోపే కేంద్రం అనుమతి ఇవ్వడం తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. సీజేఐ శుక్రవారం సుప్రీంకోర్టు వార్తలు రాసే పాత్రికేయుల ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. జస్టిస్ సుభాష్ రెడ్డి సహా వివిధ కోర్టుల నుంచి నలుగురు న్యాయమూర్తులు పదోన్నతిపై ఇటీవల సుప్రీంకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ‘గత నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ నలుగురు జడ్జీల ప్రమోషన్లపై మేం(కొలీజియం) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపాం. అదే రోజు సాయంత్రమే ఆ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించినట్లు సమాచారం అందింది. నేను చాలా షాక్‌కు గురయ్యా. నేను నమ్మలేకపోయా. అదే విషయం అధికారులను కూడా అడిగా. మీ మాదిరిగానే నేనూ విస్మయానికి లోనయ్యా’ అని సీజేఐ జస్టిస్ గొగోయ్ తెలిపారు. ‘ఈశాన్య ప్రాంతం నుంచి సీజేఐ అయిన మొదటి వ్యక్తిగా, 48 గంటల్లోపే జడ్జీల పదోన్నతులను కేంద్రంతో ఓకే చేయించి సృష్టించారు’ అని ఓ విలేకరి ప్రశ్నించగా సీజేఐ స్పందిస్తూ.. న్యాయశాఖ మంత్రి వద్దనే దీనికి సరైన సమాధానం ఉంటుందన్నారు. కక్షిదారుల్లో ఇంగ్లిష్ తెలియని వారికి మాతృభాషల్లోనే సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను అందజేస్తుందని ఆయన తెలిపారు. సిబ్బంది, వనరుల కొరత కారణంగా ముందుగా హిందీతో ఈ దిశగా ప్రయత్నం ప్రారంభిస్తామన్నారు. నాలుగో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐ కానున్నారా అన్న ప్రశ్నకు ఆయన..ఆ విషయం కచ్చితంగా తానెలా చెప్పగలనన్నారు. ‘సోమ, శుక్రవారాల్లో పలు రకాల ఇతర కేసుల విచారణను చేపడతాం. అలాగే, ముగ్గురు సభ్యుల ధర్మాసనాల ఏర్పాటు ప్రస్తుతం అవసరం లేదు. దీనివల్ల కోర్టుల సంఖ్య పెరుగుతుంది’ అని సీజేఐ వివరించారు. -
ఒక్క గంట ఉన్నా చాలు!
అనగనగా ఓ రాజు. ఆయనకు ప్రజలంటే ప్రాణం. వారిని కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. ఎంతో ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ధర్మబుద్ధికి, సత్యనిష్ఠకు మెచ్చాడు ఇంద్రుడు. ‘‘వెంటనే నువ్వు స్వర్గానికి రా’’ అని పిలిచాడు. ‘‘నేను నా ప్రజలను విడిచి ఇప్పుడే రాలేను’’ అన్నాడు రాజు. ‘‘అదేంటి, నేను పిలిచినా రావా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఇంద్రుడు. ‘‘మీ మీద గౌరవం, నాకు స్వర్గం మీద ప్రేమ లేక కాదు. నాతోపాటు నా ప్రజలు కూడా రావాలి. అప్పుడే వస్తాను’’ అన్నాడు రాజు. ‘‘అలా కుదరదు. నీ ఒక్కడికే స్వర్గార్హత ఉంది. నీ ప్రజల్లో కేవలం ఒక్క శాతంకన్నా తక్కువ మందికే స్వర్గప్రాప్తి యోగం ఉంది.మిగతా అందరూ నరకానికి వెళ్లవలసిందే’’ అన్నాడు ఇంద్రుడు.‘‘నా ప్రజలందరూ ఎక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటాను. వారు లేని స్వర్గమైనా, నాకు నరకంతో సమానమే. వారితోబాటు నరకానికి వెళ్లి అక్కడే ఉంటాను’’ అన్నాడు రాజు. ‘‘పిచ్చివాడిలా ఉన్నావే. ప్రజలకోసం స్వర్గాన్ని వదులుకుంటావా?’’ అన్నాడు ఇంద్రుడు. ‘‘దేవేంద్రా! మీకు తెలియనిదా! రాజుకు రాజభోగాలు ఎక్కడినుంచి వచ్చాయి? ప్రజలు ఇవ్వబట్టే కదా. ప్రజాబలంతోనే కదా’’ అన్నాడు. ‘‘అయితే, వారందరి కోసం నీ పుణ్యఫలాలను ధార పోస్తావా మరి?’’ అడిగాడు ఇంద్రుడు. ‘‘సంతోషంగా ధారపోస్తాను’’ అన్నాడు రాజు. ‘‘వారందరికీ నీ పుణ్యాన్ని ధారపోయగా నీకు ఎంత మిగులుతుందనుకుంటున్నావ్? అలా మిగిలిన దానితో నీకు మహా అయితే ఒకటి రెండు రోజులు తప్ప స్వర్గ ప్రాప్తి కలగదు. అదే నీ ఒక్కడికే అయితే చాలా కాలం ఉంటుంది’’ అన్నాడు ఇంద్రుడు. ‘‘వారందరితో కలిసి ఒక్క రోజు కాదు, ఒక్క గంట ఉన్నా నాకు అదే చాలు’’ అన్నాడు రాజు. దేవతలు అతని మీద పుష్పవర్షం కురిపించారు. -
త్వరలో మీకో సర్ప్రైజ్ : వెంకటేష్
సీనియర్ హీరో వెంకటేష్ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటికి 32 ఏళ్లు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం కలియుగ పాండవులు 14 ఆగస్టు 1986లో రిలీజ్ అయ్యింది. తొలి సినిమాతో హీరోగా ఘనవిజయాన్ని అందుకున్న వెంకీ అప్పటి నుంచి ఈ విక్టరీ హీరో అగ్రకథనాయకుల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఇన్నేళ్ల తన ప్రయాణానికి సహకరించిన వారికి వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘14 ఆగస్టు 1986న కలియుగ పాండవులు సినిమా రిలీజ్‌తో నటుడిగా నేను జన్మించాను. 32 ఏళ్లుగా మీ ప్రేమానురాగాలతో నాకు సపోర్ట్‌గా నిలివటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాల్లో మీరిచ్చిన ప్రోత్సాహంతో మీకు మరింత చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నాను. త్వరలో మీకో సర్ప్రైజ్’ అంటూ తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు వెంకీ. గురు తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో వరుణ్ తేజ్ దర్శకత్వంలో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా తరువాత కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారు. -
లేడీ ఫ్యాన్‌కు మహేష్ గ్రీటింగ్స్..
గతంలో మహేష్ బాబు పెద్దగా అభిమానులతో కలిసేవారు కాదు. తన సినిమా వేడుకల్లో తప్ప ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇటీవల మహేష్ తీరు మారుతోంది. సినిమా ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా మీడియాను కలుస్తూ, సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు మహేష్. సురేఖ, సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న మహేష్, నమత్రలు ఆమె పెళ్లి రోజున ఓ గ్రీటింగ్ కార్డును పంపించారు. మహేష్, నమ్రతలు స్వయంగా సంతకం చేసిన ఆ గ్రీటింగ్ కార్డును సురేఖ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరుగుతుండగా ఆమె చేతికందించారు. తన అభిమాన నటుడి నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ కార్డ్ రావటంతో సురేఖ తెగ సంబరపడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారాయి. భరత్ అనే నేను సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలోనే తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
అభిమానులకు కోహ్లి సర్ప్రైజ్!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటననంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాను ఎంజాయ్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముంబై వచ్చిన కోహ్లిని ఎయిర్‌పోర్టులో అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఈ జంట సన్నిహితుల పెళ్లికి హాజరైంది. ఈ పెళ్లిలో కోహ్లి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అయింది. తాజాగా కోహ్లి ట్విటర్లో అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ముంబైలో కొత్తగా నిర్మించిన తన ఇంటి బాల్కనీలో దిగిన ఫొటోకు‘ ఇంటి నుంచి ఇంత అద్భుమైన వీక్షణం ఎక్కడైనా..ఎప్పుడైనా ఉండాలని కోరుకోకుండా ఉండగలరా? అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. శ్రీలంకలో జరుగుతున్న నిదహాస్ ట్రోఫీకి కోహ్లితో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. Where else would you wanna be when you have such a stunning view from home! 😇♥️ pic.twitter.com/u4LfeXmQ11 — Virat Kohli (@imVkohli) 8 March 2018 -
నా కథ
ఎప్పట్లాగే ఈరోజు కూడా గడిచిపోతుంది అనుకున్నా. సమాధిలా దాచిన జ్ఞాపకాలు తవ్వడం నాకెప్పుడూ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు కొంచెం కష్టంగానే వుంది. నిన్న ‘‘క్లాస్‌రూమ్‌లో అలా కన్నీళ్లు పెట్టుకున్నారేంటీ?’’ అని సంగీత అడిగినప్పట్నుంచీ ఇలాగే ఉంది. ‘‘దేవుడు అందరికీ పరీక్షలు పెడతాడు కానీ, కచ్చితంగా పరీక్షలకి తట్టుకొని నిలబడతారు అనే వాళ్లని మాత్రం పరీక్షిస్తూనే ఉంటాడు. వాటన్నింటికీ తట్టుకొని నిలబడ్డ వాళ్లే గొప్పోళ్లు’’ అమ్మ చెప్పిన ఈమాట నా మట్టి బుర్రకి అప్పుడు ఎక్కలేదు కానీ, ఇప్పుడు అది తలచుకోని రోజంటూ ఉండదు.ఇన్ని ఆలోచనల మధ్య కిందకి చూస్తే బకెట్లో నీళ్లు అయిపోయాయి. ‘అసలు మొహానికి సబ్బు రుద్దుకున్నానా?’ అనుమానమొచ్చింది. ఎందుకైనా మంచిదని ఇంకొన్ని నీళ్లు పట్టుకుని మొహం కడుక్కున్నా. దేవుడిని నమ్మను కాబట్టి పూజా కార్యక్రమాలు లేవు. హ్యాంగర్‌కి ఆల్రెడీ నిన్ననే తగిలించుకున్న నలుపు రంగు కుర్తా వేసుకున్నా. అద్దంలో చూసుకుంటే క్రాపుకి, బంగారు అంచు ఉన్న కుర్తా వింతగా ఉన్నట్టు అనిపించింది. చేతుల దగ్గర పైకి మడిచి అప్పుడు జుట్టు సర్దుకున్నా. చిన్నప్పట్నుంచీ ఓణీలు తప్ప ప్యాంటు చొక్కాల జోలికి పోలేదు. ఇప్పుడు ఈ టామ్‌బాయ్ లుక్ నాకే ఆశ్చర్యం అనిపించింది. నెక్ దగ్గర మొదటి గుండీ లేకపోవడం చివరిసారి వేసుకున్నప్పుడే గమనించాను. పిన్నీసు పెట్టుకుని అలాగే వెళ్ళిపోయా కానీ ఆరోజు స్టాఫ్ మీటింగ్‌లో ఆ వెధవ చూపులు ఇంకా గుర్తున్నాయి. బట్టలు మార్చుకుందామనుకున్నా. గడియారం తొమ్మిది గంటలు కొడుతోంది. ‘ఈరోజు రాగానే కుట్టుకుంటా’ అని గట్టిగా అనుకున్నా. ఆ వెధవ కళ్ల ముందు కదిలాడు. ‘చూడనీ.. ఈసారి అలాగే చూస్తే పిన్నీసు తీసి వాడి కళ్లలో పొడుస్తా!’ అనుకుని బండి కీ తీస్కొని బయల్దేరా. దారంతా రణగొణధ్వనులు. నాలో నాకు నచ్చే విషయం ఏంటంటే.. ఎన్ని ఆలోచించినా, మనసెంత బాగోకపోయినా బండి నడిపేటప్పుడు మాత్రం మరేం ఆలోచించను. చిన్న చిన్న చిరాకులకు జీవితాన్ని రిస్కులో పెట్టడం నాకు నచ్చదు. పక్కన ఒకడు నా బండి రాసుకుంటూ పోయాడు. అప్పటికీ అరుస్తూనే ఉన్నా ఇయర్‌ఫోన్‌లో పాటలు వింటూ ప్రపంచాన్నే మర్చిపోయాడు పిల్ల వెధవ. తర్వాత వాడికోసం బండి కొంచెం స్పీడ్ పెంచా. సిగ్నల్ దగ్గర దొరికాడు. వాడి పక్కనే వెళ్లి బండి ఆపి చూద్దును కదా.. నా క్లాస్ కుర్రోడే! వాడి భుజం మీద తట్టాను. చెవిలోంచి ఆ ఇయర్‌ఫోన్ తీసి నా వంక చూసి భయంతో తలదించుకున్నాడు.‘‘ఏంట్రా ఆ స్పీడు?’’ అడిగాను. ‘‘శాంతి మేడం క్లాస్ మేడం!’’ అన్నాడు.‘‘అయితే ఇలా రోడ్డుమీదా హడావిడి చేసేది? ముందు చెవిలో అది తీయ్. మెల్లగా వెళ్లు..’’. ఆ వైర్లు తీసేసి బ్యాగ్‌లో పెట్టి ‘‘సారీ మేడం!’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌లో సంతకం చేసి టైం చూశా. సరిగ్గా పావు తక్కువ పది. హమ్మయ్య అనుకుని క్లాస్‌లోకి రిజిస్టర్ పట్టుకొని వెళ్లి కూర్చున్నా. నిన్న నేను క్లాస్‌లో కంటతడి పెట్టడం పిల్లలు అంత సులభంగా మర్చిపోరని తెలుసు. గట్టిగా గాలి పీల్చుకొని పాఠం మొదలుపెట్టా. ఒక్కసారి పాఠం మొదలెట్టగానే నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. మనసు తేలికపడింది. క్లాస్ అయిపోయాక వెళ్లి నా గదిలో కూర్చున్నా. కొంతసేపటికి సంగీత వచ్చి ‘‘మీతో మాట్లాడాలి!’’ అంది. ‘‘చెప్పమ్మా!’’ అన్నాను. ‘‘మీ గురించి తెలుసుకోవాలని ఉంది.’’ నాకు నా గతం తల్చుకోడం ఇష్టం లేదు. కానీ ఈరోజెందుకో సంగీతకి చెప్పాలనిపించింది. టీచర్ని కదా.. ప్రశ్నలకు బదులివ్వకుండా ఉండలేను. ‘‘మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేనొక్కదానినే కూతుర్ని. చిన్నప్పట్నుంచి నేను కొంచెం ముభావస్తురాలిని. బాగా సిగ్గు. బస్టాండ్‌కి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. పెళ్లి దాకా ఏ కష్టం లేకుండా పెరిగా. వాడు మనిషికి ఎక్కువ. మృగానికి తక్కువ. జీవితం అంటే అంత సులువైంది కాదు అని తెలిసేలా చేశాడు. దీనికి నేనెప్పుడూ వాడికి ఋణపడివుంటా. పెళ్లైన మొదటి రోజున సిగ్గుపడటం తప్ప, తర్వాత నవ్విన సందర్భాలు నాకు మొహమాటానికి కూడా గుర్తులేవు. నేనెప్పుడూ ఒకటి నమ్ముతాను. పెద్దలు కుదిర్చిన సంబంధంలో పెళ్లైన కొత్తలోనే మొదటిరాత్రి జరుపుకోవడం ఏ వ్యభిచారానికీ తక్కువ కాదు. సరిగ్గా ఒకరినొకరు తెలుసుకోకుండానే, ప్రేమ కలగకుండానే శరీరాన్ని తృప్తి పరచటం అంటే.. అదికాక మరేమిటి? కానీ ఆ రోజుల్లో ఈ మాట బయటకి చెప్పేంత ధైర్యం నాకు లేకపోయింది. తను ఏ రోజూ ప్రేమగా మాట్లాడటం నాకు కనిపించలేదు. రాత్రి పట్టుకున్నప్పుడు కూడా వాడి అవసరం, ఆనందం తప్ప అందులో ఆత్మీయత నాకెప్పుడూ కనిపించలేదు. ఇంట్లో అంత ముద్దుగా పెరిగిన నేను, ప్రతి కష్టం పంటిబిగువనే పెట్టుకున్నా. ఎవరికీ ఏం తెలియనివ్వలేదు. తర్వాత అద్భుతం జరిగింది. ఒకరోజు లెగిసి చూసేసరికి వాడు కనపడలా. వాడి బట్టలు కూడా మాయం. నాకు కొంతసేపు అసలేం అర్థం కాలేదు. బీరువాలో నా నగలు కూడా కనపడలా. పిచ్చిదానిలా ఇంటిచుట్టూ చూశా. ఇంట్లో ఉత్తరం లాంటిదేదైనా ఉందేమోనని వెతికాను కానీ వాడికి అంత ఆలోచనా? అదీ నా గురించి. ఛ ఛ! నా ఊహ కాక మరేమిటి కానీ, వాడు చేసిన పనుల్లోకల్లా గొప్ప పని ఏంటంటే నన్ను తల్లిని చెయ్యలేదు. లేదంటే నా బంగారు తండ్రి అన్యాయం అయిపోయి వుండేవాడేమో. ఇంట్లో వాళ్లకి అంతా చెప్పినప్పుడు వాళ్లకి ఏం చెయ్యాలో తెలియలేదు. తర్వాత వాడి మీద కేసు పెట్టి విడాకులు తీసుకున్నా నాకు ఆ నగలు వద్దని చెప్పా. పాతిక సంవత్సరాల కిందటి మాట ఇదంతా. ఇప్పుడున్న తెలివి అప్పుడుంటే కచ్చితంగా ఆ నగలు తీసుకొనేదాన్నేమో!’’ ఆ చివరిమాటకు సంగీత నవ్వింది. నేనూ నవ్వేశా. ‘‘తర్వాత ఏమైంది మేడం?’’ అని అడిగింది. ‘‘ఏముంది.. అప్పటినుంచి మా అమ్మా నాన్నల దగ్గరే ఉండిపోయా. ఇప్పుడు నేను మహారాణిని కాదు కానీ బాధ్యతలతో, బాధలతో నా రాజ్యాన్ని చూసుకుంటున్నా. నా వస్త్రధారణ అంతా మార్చేశా. హెయిర్‌కట్ చేసి ఈ టామ్‌బాయ్ లుక్‌లోకి వచ్చేశా. ‘నేను ఆడపిల్లని. అందుకే ఈ అడ్డంకులన్నీ’ అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నా. అలాగే ఉంటున్నా. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. చాలా కష్టంగా అనిపించింది. తర్వాత నా జీవితం మొత్తం నాన్నే. నెలక్రితం ఆయనా చనిపోయాడు. అందుకే నిన్న అలా..’’. సంగీత కళ్లలో ఒకలాంటి భావన కనిపించింది. దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలీలేదు. ‘‘మేడం! మీరు కథలు రాస్తారు కదా.. మీకు బాగా ఇష్టమైన కథ ఏంటి?’’ అని అడిగింది. అవును! నా అన్ని కథల్లో నాకు నచ్చిన కథేంటీ? ఆ.. నా కథ. నా కథే!! రిషిత గాలంకి (పాండిచ్చేరి) -
భౌతిక దాడులకు భయపడను
సాక్షిప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం క్రైం: ప్రజాక్షేత్రంలోకి వచ్చాక భౌతిక దాడులు, రాజకీయ విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన ప్రత్యక్షమవుతుందని, తాను తెలంగాణ బాగు కోరితే తప్పేంటని నిలదీశారు. సినిమాల్లో ఉంటే అందరూ పొగుడుతున్నారని, రాజకీయాల్లో మాత్రం తన ఎదుగుదలను ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదిగి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే అన్ని కులాలు, మతాల మద్దతు అవసరమని.. ఆ మద్దతు కూడగట్టేందుకే ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టానని తెలిపారు. మన యాస, భాషతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించినపుడే జై తెలంగాణ నినాదానికి అర్థం ఉంటుందన్నారు. జై తెలంగాణ అంటూ సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మార్పు కోసమే.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ప్రతి కార్యకర్త దీన్ని గుర్తించాలని పవన్ చెప్పారు. సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన కార్యకర్త ప్రత్యక్షమవ్వాలని, వాటిని పరిష్కరించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు. 2019లో అధికారంలోకి వస్తామని చెప్పడం లేదని.. కానీ కనీస మార్పుకు ఆ ఎన్నికలు నాంది కావాలన్నారు. శ్రీకాకుళంలో ఉన్నట్లే తెలంగాణలోని నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఉందని, దాన్ని అంతమొందించే వరకు కృషి చేస్తామని ప్రతినబూనారు. వారికేం ఇబ్బందో.. రాజకీయాల్లో విమర్శలు సహజమని, సహేతుక విమర్శలు స్వీకరించేందుకు తాను సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. కానీ అవగాహన ఉన్న కాంగ్రెస్ నేతలూ తనపై విరుచుకుపడటం ఆశ్చర్యంగా ఉందని.. తన రాజకీయ విధానాలు ప్రచారం చేసుకుంటే ఇతర పార్టీలకు ఏం ఇబ్బందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మాజీ ఎంపీ హనుమంతరావును ఆ పార్టీ తరఫున తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన మద్దతిస్తుందని వెల్లడించారు. వీహెచ్ వంటి నేత తనతో కలిసొస్తే ఇంటింటికీ తిరిగి సమస్యలేంటో తెలుసుకుందామన్నారు. చెప్పు విసిరిన అగంతకుడు పవన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఓ అగంతకుడు చెప్పు విసిరాడు. కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ఓపెన్‌టాప్ కారులో వస్తుండగా.. తల్లాడ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పవన్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రక్షణ వలయంగా నిలిచారు. చెప్పు ఎవరు విసిరింది తెలియలేదు. కాగా, కొత్తగూడెం నుంచి ఖమ్మం వస్తు న్న సమయంలో వాహన శ్రేణిలోని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తి కాలు విరిగింది. అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పవన్ కాన్వాయ్‌లో ని ఓ కారు.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఖమ్మం రూరల్ ఎస్ఐ చిరంజీవి కాలిపైకి ఎక్కడంతో గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
నాని సంక్రాంతి సర్ప్రైజ్
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ సంక్రాంతికి అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇటీవల ఎమ్సీఏ సినిమాలో మంచి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయమున్నా.. అభిమానుల కోసం ఇప్పుడే ఫస్ట్ లుక్ లతో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని వీడియో మేసేజ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు నాని. ముందుగా 14వ తేదిన భోగి రోజు కృష్ణ పాత్ర ఫస్ట్ లుక్‌ను, సంక్రాంతి రోజు అర్జున్ పాత్ర ఫస్ట్‌లుక్‌ను తరువాత కనుమ రోజు తొలి పాటు లిరికల్ వీడియోనూ రిలీజ్ చేయనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని..కృష్ణ, అర్జున్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
’వర్ష’ ప్రతిభను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే!
-
భయం
చెన్నకేశవులు మాచర్ల నుంచి శ్రీశైలం బయల్దేరాడు. యర్రగొండపాలెంలో వున్న చెల్లెలు యశోదను చూడాలనిపించి అక్కడ దిగాడు.ఇంటికి వెళ్లేసరికి మేనల్లుడు విజయ్ గాబు దగ్గర స్నానం చేస్తూ కనిపించాడు.‘‘ఏంట్రా విజయ్! బాత్రూమ్లో స్నానం చెయ్యకుండా గాబు పక్కన ఆరు బైట స్నానం చేస్తున్నావ్?’’ అని మేనల్లుడిని ప్రశ్నించాడు చెన్నకేశవులు.‘‘అన్నయ్యా! వీడు పెరిగేకొద్దీ భయపడడం ఎక్కువైంది. బాత్రూమ్లో బల్లి కనిపించేసరికి భయపడి ఆరుబైట స్నానం చేస్తున్నాడు.’’ అన్నది యశోద, ఇంట్లో నుంచి బైటకు వస్తూ.‘‘బల్లికి భయపడుతున్నాడా? ఏం మగాడివిరా నువ్వు? పల్నాడులో పుట్టినోళ్లు భయపడతారా?’’ అని ఎగతాళి చేశాడు చెన్నకేశవులు.విజయ్ సిగ్గుపడుతూ టవల్ ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. డ్రెస్ చేసుకుని, టిఫిన్ తిని లంచ్ బాక్స్ తీసుకుని, స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బయల్దేరాడు.‘‘అరేయ్ విజయ్! స్కూల్ నుంచి తొందరగా వచ్చెయ్. ఆటలాడుకుంటూ చీకటిపడేవరకు ఉండకు. మనం ఫస్ట్ షో సినిమాకు వెళ్దాం.’’ అన్నాడు చెన్నకేశవులు.‘‘సరే! మావయ్యా!!’’ అంటూ హుషారుగా బయల్దేరాడు విజయ్.తర్వాత యశోద కొడుకు భయం గురించి చెప్పుకొచ్చింది.‘‘అన్నయ్యా.. వీడికి పదేళ్లునిండినయ్. ఎందుకో వాడికి భయం ఎక్కువైంది. బొద్దింకల్ని, బల్లుల్ని చూసి భయపడతాడు. వీధిలో కుక్కల్ని, పిల్లుల్ని చూసినా భయమే. పావురాళ్లు ఇంట్లోకి వస్తే గూడా పరిగెత్తుతాడు. వీడికింత భయం ఎందుకో అర్థం కావడంలేదు.’’‘‘నువ్వేం వర్రీపడకు. నేను వాడి భయం పోగొడతాను చూస్తుండు’’ అన్నాడు. సాయంకాలం మేనల్లుడిని తీసుకుని సినిమాకు బయల్దేరాడు చెన్నకేశవులు.‘‘అరేయ్ విజయ్! నీకు రోజురోజుకీ భయం ఎక్కువైపోతున్నదని మీ అమ్మ చెప్పింది. నిజమేనా? అసలు భయం ఎందుకు?’’ అని అడిగాడు చెన్నకేశవులు.‘‘ఒకరోజు స్నానం చేస్తుంటే బాత్రూమ్లో బల్లి ఒంటిమీద పడింది. భయం వేసింది’’ అన్నాడు విజయ్.బల్లి మీద పడితే ఏదో కారణం ఉండి ఉంటుందని చెప్తారు పెద్దలు. బల్లి శాస్త్రం అనే పుస్తకం వుంది తెలుసా నీకు? భుజం మీద పడితే.. వీపుమీద పడితే.. తల మీద పడితే ఏం జరగబోతుందో ఆ శాస్త్రంలో వుంటుంది. అంతేగాని భయపడకూడదు. ఈ సారి నేను వచ్చినప్పుడు బల్లి శాస్త్రం పుస్తకం తెచ్చిస్తాను. చదువుకో. అదీగాక బల్లి మనకు స్నేహితుడు. గోడల మీద వాలిన ఈగల్ని, జబ్బులు తెచ్చే దోమల్ని,పురుగుల్ని తింటూ మనకు మేలు చేస్తుంది.’’ అన్నాడు చెన్నకేశవులు.విజయ్ అదంతా ఆశ్చర్యంగా విన్నాడు.అట్లాగే పిల్లులు ఎలుకల్ని పట్టి తింటాయి. కుక్కలు దొంగలు రాకుండా కాపలా కాస్తూ మనకి మేలు చేస్తున్న మచ్చికైన జంతువులనీ, వాటికి భయపడగూడదనీ, ఆహారం పెడుతూ అలవాటు చేసుకుంటే స్నేహంగా మెలగుతాయని మేనల్లుడికి వివరంగా చెప్పాడు చెన్నకేశవులు.‘‘నీ పూర్తి పేరు ఏంట్రా?’’ అని రాత్రి పడుకోబోయే ముందు అడిగాడు మేనల్లుడ్ని.యశోద నవ్వుతూ.. ‘‘అదేంటి అన్నయ్యా! వాడికి విజయసింహ అని పేరు పెట్టిందే నువ్వుకదా? అన్నది.‘‘ఔన్లే..! కానీ నీ కొడుక్కి తన పూర్తి పేరు గుర్తుండడంలేదు. అందరూ విజయ్ అని పిలుస్తున్నారు. అది సరేగానీ విజయ్ నీకు ‘విజయసింహ’ అని పేరు ఎందుకు పెట్టానో తెలుసా?’’ అన్నాడు. ‘‘లేదు మావయ్యా!’’ అని తల అడ్డంగా ఊపాడు విజయ్.‘‘మీ అమ్మకు నెలలు నిండినప్పుడు యర్రగొండపాలెం నుంచి మాచర్లకు అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నాం. పదేళ్ల క్రితం నల్లమల అడవి దట్టంగా చెట్లతో ఉండేదిలే. అంబులెన్స్‌లో పోతుండగా రోడ్డుకి అడ్డంగా సింహం, సివంగి, దాని పిల్లలు మూడు పడుకుని వున్నాయి. డ్రైవర్ అంబులెన్స్ ఆపేశాడు. అప్పుడప్పుడు హెడ్లైట్లు వెలిగిస్తూ, ఆర్పుతూ, హారన్ కొడుతున్నాడు. అయినా అవి గంటసేపు కదలలేదు. అప్పుడప్పుడూ సింహం గర్జిస్తూవుంది. గంట తర్వాత అవన్నీ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయాయి. ఐతే ఈ లోపలే అంబులెన్స్‌లో వున్న మీ అమ్మకు ప్రసవమైంది. నువ్వు పుట్టావు..’’ అన్నాడు చెన్నకేశవులు.విజయ్ నోరు తెరిచి ఆశ్చర్యంగా విన్నాడు మేనమామ చెప్పింది.‘‘సింహాల వలన నువ్వు అడవి మధ్యలో అంబులెన్స్‌లో పుట్టావు. అందువలన నువ్వు సింహంలా ధైర్యంగా జీవించాలని విజయసింహ అని పేరు పెట్టాను. కాబట్టి నువ్వు సింహంలా ధైర్యంగా వుండాలి. ఎప్పుడూ దేనికీ భయ పడగూడదు. అర్థమైందా? అన్నాడు చెన్నకేశవులు. విజయ్ తల వూపాడు.‘‘నువ్వు తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ, దేనికీ భయపడగూడదు. భయం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.’’ చెప్పాడు చెన్నకేశవులు.విజయ్ మేనమామ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు.‘‘అన్నయ్యా.. నువ్వు మేనల్లుడికి భలే కథ అల్లి చెప్పావే. నల్లమల అడవిలో సింహాలున్నాయని నువ్వు చెప్తుంటేనే విన్నాను.’’ అన్నది యశోద నవ్వుతూ.‘‘వాడికి భయం పోగొట్టడానికి కథ అల్లి చెప్పడం మంచిదే. పిల్లల మనోవికాశానికి కథలు చెప్పడం మన సంప్రదాయం. ఐతే ఇప్పుడు అది మర్చి పోతున్నారు ఎందుకో!’’ అన్నాడు చెన్నకేశవులు. -
చూపరులను అబ్బుర పరచిన సుడిగాలి
-
డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!
ముంబైః ఉత్తమ నృత్య దర్శకుడు, ఫిల్మ్ మేకర్ రెమో డిసౌజా కు ఫ్లాష్ మాబ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. యాక్టర్ ఫైసల్ ఖాన్, డ్యాన్సర్స్ కున్వర్ అమర్, సిద్ధేష్ పాయ్ లతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో.. 'డ్యాన్స్ ప్లస్' సీజన్ టు సెట్ లో ఆర్టిస్టులకు సైతం ప్రత్యేక అనుభూతిని పంచారు. డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షో.. సీజన్ టు సెట్ కు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాను సహ నృత్యకారులు ఫ్లాష్ మాబ్ ప్రదర్శనతో సర్ ప్రైజ్ చేశారు. మెంటర్స్ శక్తి మోహన్, పునిత్ జె పాఠక్, ధర్మేష్ యలండే కూడా ఫ్లాష్ మాబ్ లో చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. అంతేకాదు పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ తోపాటు, ఆర్టిస్టులు, హోస్ట్.. రాఘవ్ జూయల్ సైతం ఫ్లాష్ మాబ్ లో పాల్గొని రెమో పాపులర్ సాంగ్స్.. 'బడ్తమీజ్ దిల్', 'దిల్లీవాలీ గర్ట్ ఫ్రెండ్' కు హుషారెత్తించేట్టు స్టెప్పులేస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డ్యాన్స్ ప్లస్ నిర్వాహకులు నన్ను పిలిచి రెమో గారి ఫ్లాష్ మాబ్ గురించి చర్చించారని, ఆమాట అనడమే అదృష్టంగా భావించిన తాను వెంటనే సరేనని చెప్పేశానని డ్యాన్సర్ అమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను, కొరియోగ్రాఫర్లను తయారు చేసిన రెమో డిసౌజా కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఆయనకోసం ఫ్లాష్ మాబ్ అంటే మరోమాట లేకుండా ఒప్పేసుకున్నానని అమర్ ఓ ప్రకటనలో చెప్పారు. స్పెషల్ పెర్ఫామెన్స్ గురించీ ఏమీ తెలియకపోయినా.. గొప్ప నృత్యకారుడైన రెమో, సూపర్ జడ్జి.. డ్యాన్స్ ప్లస్ సీజన్ 2 లో ఉండటం కంటెస్టెంట్లకు అదే గొప్ప వరం అంటూ అమర్ అభివర్ణించారు. అయితే తనకోసం డ్యాన్సర్లు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఎంతో ఆనందాన్నిస్తుందంటూ ఈ సందర్భంలో రెమో తెలిపారు. విద్యార్థులంతా తనకు కేవలం స్టూడెంట్స్ గా మాత్రమే కాదని, వారంతా తన పిల్లల్లాంటివారని, తన జీవితంలో ఓ భాగమని రెమో అన్నారు. తనవల్లే ఇక్కడవరకూ వచ్చామని విద్యార్థులు చెప్పినా.... వారివల్లే నేనిక్కడున్నానని నేనంటాను అంటూ చెప్పడం.. ఆయన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. -
నాని సినిమాలో అతిథిగా?
దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాల్లో ఏదో పాత్రలో కనిపించి, ప్రేక్షకులకు చిన్న సర్ప్రైజ్ ఇస్తుంటారు. గత ఏడాది విడుదలైన ‘బాహుబలి’లో ఐటమ్ సాంగ్‌కి ముందు సీన్లో కాసేపు కనిపించారు. ఇప్పుడు నాని సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్నారన్న వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ఓ దర్శకుడికి అసిస్టెంట్ డెరైక్టర్ పాత్రలోకనిపించనున్నారు. ఆ దర్శకుడి పాత్రలో కనిపించమని రాజమౌళిని అడిగితే, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
ప్రయాణికులను థ్రిల్ చేసిన సోనూ
ముంబై: విమానంలో ప్రయాణించేటపుడు 'సీటు బెల్టు పెట్టుకోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లాంటి అనౌన్స్ మెంట్లు ప్రయాణికులకు అలవాటే. టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైనపుడు విమాన సహాయకురాలు ఇలాంటి సూచనలను మైక్ ద్వారా అందించడం కామనే.. అయితే ఓ గాయకుడు తన మధురమైన కంఠస్వరంతో ప్రయాణికులను పలకరిస్తే ఎలా ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తన స్వీట్ అండ్ మెలోడీ వాయస్ తో సరిగ్గా ఇలాగే చేశాడు. విమానంలోని మైక్రోఫోన్ అందుకుని తాను ఆలపించిన హిట్ సాంగ్స్ ను పాడి ప్రయాణికులను థ్రిల్ చేశాడు. 'వీర్ జారా'లోని దో పల్ రుకో పాటను హమ్ చేశాడు. సోనూ నిగమ్ ను అకస్మాత్తుగా చూసి సంబరపడిపోయిన అభిమానులు కొంతమంది అతడితో పాటు గొంతు కలిపారు. దీంతో మరింత థ్రిల్ అయ్యాడట సోనూ. విమానంలో సోనూ నిగమ్ చేసిన ఈ వెరైటీ కన్సర్ట్ ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
ప్రయాణికులను థ్రిల్ చేసిన సోనూ నిగమ్
-
మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకోండి
2016 జనవరి 16 నుంచి 22 వరకు టారో బాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) మీకిది ఎంతో సంతోషకరమైన వారం. పుష్కలంగా డబ్బందుతుంది. కోరిక నెరవేరుతుంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మీకు అన్ని విధాలైన శుభఫలితాలనిస్తుంది. ఇంటిలో ఉత్తరంవైపు నీటి కుండ లేదా బిందెను ఉంచితే మరిన్ని శుభఫలితాలను పొందవచ్చు. సంపద, సమృద్ధి, అదృష్ట దిశగా మీ ప్రయాణం సాగుతుంది. కలిసొచ్చేరంగు: మబ్బు రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఒక కొత్త అవకాశం మీ తలుపుతట్టి, మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. దాన్ని స్వీకరించండి. త్వరలో మీరు ఒక మార్గదర్శకుని లేదా గురువును కలుసుకుంటారు. వారి అడుగుజాడలలో నడుస్తారు. గెలుపు దిశగా పయనిస్తారు. అలాగే మీరొక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారితో రొమాంటిక్‌గా గడుపుతారు. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు జెమిని (మే 21-జూన్ 21) పనికి కాస్తంత విరామం ఇవ్వండి. మానసిక అశాంతి, అస్థిరత నుంచి బయట పడడానికి వినోద లేదా విహార యాత్ర చేయడం వల్ల మీకు స్వాంతన లభిస్తుంది. ఏదైనా నూతన ప్రారంభానికి స్వాగతం చెప్పండి. మీరు చేయాలనుకున్న దానిని శ్రద్ధగా చేయండి. నాయకుడిగా ఎద గండి. పాజిటివ్‌గా ఆలోచించ ండి. కలిసొచ్చే రంగు: తెలుపు క్యాన్సర్ (జూన్22-జూలై 23) జీవితం మీరు అనుకున్నట్లుగా సజావుగా సాగుతుంది. శుభం జరుగుతుంది. మీ సోమరితనం, భావోద్వేగాలు, చొరబాటు ధోరణి వంటివాటిని అదుపు తప్పనివ్వకండి. ఆర్థికపరంగా కష్టపడవలసి ఉంటుంది. దుబారాకు చోటివ్వకండి. మీ చిరకాల స్వప్నం ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) అనుకోని విధంగా బహుమతులు అందుతాయి. అదేవిధంగా కొన్ని అనుకోని సమస్యలు, సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఇది మీకు అడ్వంచరస్‌గా ఉంటుంది. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసి, సమర్థతను నిరూపించుకునే అవకాశమిది. ఆఫీసు లేదా వృత్తిపరమైన ప్రయాణం ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పశక్తిని నిరూపించుకోవలసిన తరుణమిది. మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకుని, తగ్గట్టు వ్యవహరించండి. ఇంటి ఆవరణలో లేదా ఆఫీస్‌లో కొత్త పనులు లేదా నిర్మాణాలు తలపెడతారు తద్వారా ప్రయోజనం పొందుతారు. ఎంతోకాలం నుంచి ఉన్న ఒక సంబంధానికి ముగింపు పలకవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈ నెల మిమ్మల్ని ధనికుల సరసన నిలబెడుతుంది. మీ ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. మీ శక్తిసామర్థ్యాలు, మీలో ఉత్సాహం, ఉల్లాసం ఇనుమడిస్తాయి. లవర్‌తో మీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నూత్న వాహనం కొంటారు లేదా ప్రయాణం చేస్తారు. ఆశావాదుల సరసనే ఉండేలా చూసుకోండి. కలిసొచ్చేరంగు: నారింజ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) సంతోషం కలిగే వార్తలను అనూహ్యంగా వింటారు. పనిపరంగా, ఆదాయపరంగా, కెరీర్ పరంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలా బాగుంటుంది. మీ ప్రియతములతో మీ బంధం బలపడుతుంది. కుటుంబంలోకి కొత్త సభ్యులు వస్తారు. బంధువుల నుంచి అనూహ్యంగా బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: గులాబీరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) సాజిటేరియన్స్: మీ కలలను తేలిగ్గా తీసిపారేయవద్దు. నిజమయ్యేలా చేసుకోండి. మీ ఆశయాలు, పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే కొద్దిపాటి విసుగు జనించడం, అనుకోని సమస్యలలో చిక్కుకోవడం జరగవచ్చు. మీ సామాజిక జీవితం మరింత సరదాగా, సంబరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: గులాబీ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అన్నివిధాలా విజయాన్ని, ధన సమృద్ధిని ఇచ్చే వారమిది. వ్యాపారంలో మీకు తెలిసిన వారొకరు మీకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వడమేగాక, వాటిని అమలు చేయడానికి ధనసాయం చేస్తారు. మీ అంతరాత్మ సాయంతో తెలివితేటలతో విజయం సాధిస్తారు. ప్రేమికులు, ప్రియతముల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: ఇంద్రధనుసు రంగు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. అవిశ్రాంతంగా గడుపుతారు. చేసే ఉద్యోగం గాక అనుబంధంగా మరో పని ద్వారా ఆదాయాన్ని పొందుతారు. రొమాంటిక్ జీవితానికి స్వస్తి పలక వలసి వస్తుంది. మీ ముక్కుసూటి తనం వల్ల చికాకులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కొత్త పనులకు శుభారంభం పలుకుతారు. ఇతర విధాలుగా ఆనందాన్ని, ఆదాయాన్ని ఇచ్చే మార్గాలకోసం అన్వేషిస్తారు. మరింత ఓర్పును, సహనాన్ని, శ్రద్ధను చూపవలసిన వారమిది. సహోద్యోగులు మీకు అన్నివిధాలా అండగా నిలుస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారు. కలిసొచ్చే రంగు: నీలం. టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కుటుంబమంతా సుఖశాంతులతోనే ఉంటున్నప్పటికీ అనవసరమైన వాదాలకీ చర్చలకీ అవకాశమున్న కారణంగా దంపతిలో ఎవరో ఒకరు వాదానికి సిద్ధపడకుండా ఉండడం ఎంతైనా అవసరం. గ్రహ అననుకూల పరిస్థితుల కారణంగా ఈ చ ర్చల్లో మరో మనిషి చేరే అవకాశం చేరే అవకాశం రావచ్చు. అదే జరిగినట్లయితే మీ ఇంటికి చుట్టూరా గోడలేమీ లేనట్లే! టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఎంతెంతో ఎదురు చూసి- దాదాపు ప్రయోజనం సిద్ధించినట్లే- అని అనుకునే వేళ ఆ కార్యం చేజారిపోవచ్చు- తీవ్ర నిరాశ కలగవచ్చు- బాధపడకండి ఇంతకంటే మంచి అవకాశం వచ్చేదుంది మీకు. అనవసరంగా మీమీద నింద పడడం గాని లేదా మీరే ఒకర్ని శత్రువుగా చేసుకునే పరిస్థితిగాని కనిపిస్తోంది. వీలయినంతవరకు నోటికి పని చెప్పకుండా జాగ్రత్తపడండి. జెమిని (మే 21-జూన్ 21) మీ దాంపత్యంలో అన్యోన్యత లేదని చెప్పలేంగాని అంతటి మైత్రీబంధం ఉండకపోవచ్చు. ఉద్యోగం లేదా వృత్తి లేదా వ్యాపార రీత్యా మీరూ ఆమె దూరదూర ప్రాంతాల్లో ఉండే అవకాశముంది. ఈ ఒంటరితనం జరుగుతున్న కాలంలో ఆమెగానీ మీరు గానీ ఇతరుల సలహాలని విననే వద్దు- విని, కోరి ఇబ్బందుల్ని తెచ్చుకోవద్దు- అపార్థపడనే వద్దు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కుటుంబంలో వచ్చిన సమస్య పరిష్కారపు దిశగా లేకుండా అయోమయంలో ఉంచిన కారణంగా చిరాకూ ఆందోళనా కలగవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయుడూ మాటలాడడంలో నేర్పరీ అయిన వానిద్వారా ధర్మబద్ధంగా రాయబారాన్ని పంపండి. పరిష్కారం ఏవిధంగా ఉండబోతోందో ఆ మార్గం మీకు అర్థమవుతుంది. వాయిదా వేయకండి. లియో (జూలై 24-ఆగస్టు 23) సమయం లేని కారణంగా అప్పటికప్పుడు తోచిన ఓ ఆలోచనని నిర్ణయంగా చేసేస్తారు. భార్య అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. సంతానం రాకపోకలూ, బంధువుల సమాగమాల కారణంగా పని ఉన్నట్టూ, లేనట్టూ ఉంటుంది. మొత్తానికి ఈవారం దాదాపుగా కార్యశూన్యంగానే దొర్లిపోవచ్చు. అయితే బంధు మిత్రజనం ఉన్నారనే ఓ ధైర్యం వస్తుంది మీకు. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఎదురు చూసిన శుభకార్యానికి అవకాశం రావచ్చు. తగినంత ఆర్థిక పరిపుష్టికోసం ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇచ్చిపుచ్చుకోవడం కాగితాలు రాసుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లో నోటిమాటలు వద్దు. భద్రతతో వ్యవహరించని పక్షంలో మొదటికే ఇబ్బంది కలగవచ్చు కాబట్టి భద్రంగా ఉండండి. ఏమైనా శుభకార్యాలోచన జరుగుతుంది. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఏదో తెలియని మానసికాందోళన ప్రారంభం కావచ్చు. అది మీ కుటుంబం పట్ల కావచ్చు. దీన్ని మించిన అధైర్యం మీ సంతానం- విద్య గురించి కలగవచ్చు. ధైర్యంగా ఉండండి. అశుభమంటూ ఏమీ లేదు. మన కంటిలో ఉన్న దోషం వల్ల ఎదుటి వస్తువు మరోలా కనిపిస్తోంది తప్ప, అది వస్తువులో ఉన్న దోషం కాదనే భావాన్ని ప్రతి విషయంలోనూ అన్వయించుకోండి. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) వాహనాన్ని నడుపుతుంటే అది తన మార్గంలో ప్రయాణిస్తూ నీడనీ ఎండనీ మంచునీ చలినీ.. ఎలా దాటుకుంటూ సాగిపోతుందో, అలా, ఏ నిరుత్సాహమూ లేకుండా మీరు ముందుకు దూసుకుని పోతూ ఉండండి. గ్రహ అననుకూలత కారణంగా మానసిక భయం ఎక్కువగా ఉంటుంది కానీ, విజయం మీదేనని గ్రహించండి. ధైర్యాన్ని చెప్పే వారితో కలిసి గడపండి. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) ప్రతి పనీ ఎంతో ప్రయత్నిస్తే కానీ పూర్తి కాకపోవచ్చు. ఏ క్షణానికి ఆ క్షణమే ఆశించిన పని ఆగిపోవచ్చనే మానసింకాదోళన ఉండవచ్చు. విజయం సిద్ధించినా పెద్ద ఆనందాన్ని- ఈ ప్రతిషంఘంభనా అవరోధాలూ ఆందోళనా కారణంగా పొందలేకపోవచ్చు. విదేశీ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్థానచలనం తప్పనిసరి కావచ్చు. నూతన స్థానం తప్పక లాభిస్తుంది. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) అనుకోని ఆదాయం లభిస్తుంది. ఆర్థిక పరిపుష్టికోసం ఇతర ధనాదాయమార్గాలకి అన్వేషణ, ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి. వృద్ధులూ అనుభవజ్ఞులూ అయిన వాళ్లని సంప్రదించడాన్ని మీరు అవమానంగానూ తక్కువదనంగానూ భావింపని మనస్తత్వం కలవాళ్లు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో లోటుపాట్లుండవు. ధైర్యంగా ముందుకు సాగండి. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) తీర్థయాత్రాసక్తి పెరుగుతుంది. సంతానానికి కానీ, మీకు కానీ కలిగిన- కలుగుతున్న అభ్యంతరాలు తొలగిపోవడం కోసం శాంతులూ జపాలూ వంటివి చేయించుకోవచ్చు. మీరనుకున్నదే మీరు సాధించుకునే మనస్తత్వమున్నవారు కాబట్టి ధైర్యంగానో లౌక్యంగానో మీరనుకున్నదే నెరవేర్చుకుంటారు. ఇతరులకి బాధ కలిగించే విధంగా మీ ప్రయోజనం నెరవేతుంది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కుటుంబమంతా కలిసికట్టుగా ఉన్న కారణంగా మీకు చెప్పలేనంత అండ ఉన్నదనే మానసిక ధైర్యం కలుగుతుంది. తల్లీతండ్రీ కూడ ఆర్థికంగానో పనిపాటలకో మీ కుటుంబం పట్ల శ్రద్ధని చూపుతుండే కారణంగా ఈ వారం సుఖంగా గడుస్తుంది. సొమ్ముతో సొమ్ముని సంపాదించే (షేర్లవంటివి) వ్యాపారాన్ని వీలయినంత తక్కువ చేయడం మంచిది ఈ వారంలో. -
'ఎందుకు ఏడ్చానో.. నాకే ఆశ్చర్యంగా ఉంది'
వాషింగ్టన్: గన్ కల్చర్ కారణంగా మృతిచెందిన అమాయక చిన్నారులను గుర్తుచేసుకొని పబ్లిక్‌గా కన్నీరు పెట్టుకున్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా.. తాను అలా ఏడవడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు. అగ్రరాజ్య అధినేత దీనిపై మాట్లాడుతూ.. 'నేను అలా కన్నీరు పెట్టుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. అయితే నేను వాస్తవవికతతో ప్రవర్తిచాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే.. చిన్నారుల మరణం నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. నేను అధ్యక్షుడిగా గా ఉన్న కాలంలో కనెక్టికట్‌లో చిన్నారుల కాల్చివేత ఘటన జరిగిన రోజే అత్యంత చెత్త రోజు' అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా దేశంలోని గన్ కల్చర్ కారణంగా బలి కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ తన వద్ద మాత్రం గన్ లేదని ఒబామా వెల్లడించారు. -
హైదరాబాద్ కాటేదాన్‌లో SOT పోలీసుల దాడి
-
భారత్ పాక్ 'భాయ్ భాయ్'
-
మారుతి సుజుకి సెప్టెంబర్ సర్ప్రైజ్
హైదరాబాద్: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబర్ సర్ప్రైజ్ను ప్రకటించింది. ఇందులో భాగంగా బుకింగ్ కోసం చెల్లించిన మొత్తంపై 100 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. తద్వారా కస్టమర్లు అదనంగా రూ.20,000 వరకు ఆదా చేయొచ్చని కంపెనీ రీజినల్ మేనేజర్ మునీష్ బాలి తెలిపారు. దీనితోపాటు మరిన్ని ఆకర్షణీయ ఆఫర్లను మారుతి సుజుకి అందిస్తోందని చెప్పారు. కారును సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. సెప్టెంబర్ సర్ప్రైజ్ ఈ నెల 17 వరకు జరిగే బుకింగ్స్‌కు వర్తిస్తుంది. -
అంతా విచిత్రం
అక్షర తూణీరం అంతా విచిత్రంగా ఉంది. ఏమీ అంతుబట్టడం లేదు. ఏపీ మొత్తం సాలెగూళ్లులా అల్లుకు పోయి ఉంది. కొంద రు యోగా చేస్తున్నారో, శిక్ష అనుభవిస్తున్నారో తెలియరా కుండా మెలికలు తిరిగి కని పిస్తున్నారు. అక్కడ ప్రశ్నార్థ కాలు, ఆశ్చర్యార్థకాలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొన్ని కామాలు, మరికొన్ని చుక్కలు ఇప్పుడే హెలికాప్టర్ దిగు తున్నాయి. సమానార్థకాలు, కాకువు దీర్ఘాలు, చప్ప రింతలు, నిష్టూరాలు, కొన్ని పలకరింతలు, కాసిని పుల కరింతలు పోలీసు వ్యానులో వచ్చి చోటు కోసం కాచు క్కూచున్నాయి. ‘చట్టం తన పని తాను చేసుకు వెళ్తుం ది’- ఇదొక ఆధునిక మహావాక్యం. పీవీ ప్రతిపాదించి దేశం మీదకు వదిలారు. దాని అవసరం, వినియోగం దినదినాభివృద్ధి చెందుతూ, ఆ వాక్యం వర్థిల్లుతోంది. చుట్టం కూడా అంతే, తన పని తాను చేసుకు వెళ్తాడు. తర్వాత ఉండమన్నా నిమిషం ఉండడు. సంభాషణలను చెరపట్టడం మీద చర్చలు నడుస్తు న్నాయి. భారత దేశ రాజ్యాంగాన్ని కూలంకషంగా కాచి వడబోయాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాల్లో రచ్చబండలనించి సమస్త మాధ్యమాలూ ఫోన్ ట్యాపిం గ్ మీద చర్చిస్తున్నాయి. ఇతరుల రహస్యాలు వినడం తప్పా, ఒప్పా అనేది ముందు తేలాలి. ఆ తరువాత ఆ మాటల్లోని అవాకుల్నీ చెవాకుల్నీ పరీక్షించాలి. ఒక సారి దిగాక అక్కడిక ధర్మయుద్ధం, అధర్మయుద్ధం అంటూ ఉండదు. పద్మవ్యూహాలూ ఉంటాయి. అశ్వత్థామ హతః కుంజరఃలూ తప్పవు. సైంధవులూ ఉంటారు. శిఖండీ వస్తాడు. శల్య సారథ్యం నడుస్తూనే ఉంటుంది. అంతా బానే ఉంటుంది. పాపం ప్రజల మాటేమిటని ప్రజలు కాక మరెవరన్నా ప్రశ్నించుకున్నారా? ఉపన్యాసాలు, పరస్పర ఆరోపణలు కాకుండా విశేషాలేమన్నా ఉన్నాయా? వెనకటికి ఓ కథ చెబుతారు. భర్త క్యాంపుకి పొరు గూరు వెళ్లాడు. కొన్ని వారాల తర్వాత ఫలానా రోజు వస్తున్నానని ఇంటికి తంతి కొట్టాడు. ఏదో తేడా వచ్చి చెప్పిందాని కంటే ఒకరోజు ముందే దిగాడు. ఇంటికి రాగానే భర్త చూడరాని దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఎలాగో వాక్కు తెచ్చుకుని ‘‘ఏమిటిది, తగునా?’ అని భార్యను ప్రశ్నించాడు. ‘‘ఏదైనా సహిస్తాను గాని మాట తప్పేతనాన్ని నేను భరించలేను. మీరు రేపొస్తానని ఇవ్వాళ రావడం ఘోరం. ఇది దుర్మార్గం. స్త్రీజాతినే అవమానించడం....’’ అంటూ పెద్ద దండకం అందు కుంది భార్య. ఈసారి ఆయన గారు నిజంగానే అవాక్క య్యారు. ఎందుకో ఈ మధ్య ఇలాంటి పాత కథలు గుర్తుకొస్తున్నాయి. నిజానికి ఇప్పుడు తలుచుకోవల్సింది కొత్త కథల్ని. రాబోయే కథలని. అమరావతి ఆధు నిక-ప్చ్ కాదు, విశ్వవిఖ్యాత విశాల నగరంలో ఫోన్ ట్యాపింగ్‌లకు అవకాశం ఉండదు. నిక్షిప్తం అవుతాయి గాని ఆ మాటలు ఏ పైశాచిక భాషలోనో రికార్డ్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఏలిన వారు మాత్రమే దాన్ని స్వార్థానికి గాని, నిస్వార్థానికి గాని వినియోగించుకో వచ్చు. అబ్బో, ఇంకా చాలా మతలబులుంటాయి. అవ న్నీ గోప్యం. చెప్పకూడదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘పద్మశ్రీ’ అవార్డు ఆశ్చర్యపరిచింది
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల్లో భారత క్రికెట్ సూపర్స్టార్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి కూడా రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నప్పటికీ వారిని కాదని అవార్డు తనను వరిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. జరిగింది మాత్రం అదే... ఎవరూ ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం మిథాలీని ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో 32 ఏళ్ల ఈ హైదరాబాదీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇది నిజంగా ఏమాత్రం ఊహించని పరిణామమని, చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటిదాకా 153 వన్డేలు, 10 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పురస్కారాన్ని అందుకోనున్న మిథాలీ రాజ్ తన భావాలను మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.... కోహ్లితో పోటీ అనగానే ఆశ వదులుకున్నా: నిజాయితీగా చెప్పాలంటే పద్మశ్రీ అవార్డుకు క్రికెటర్ల నుంచి నాకు పోటీగా కోహ్లి ఉన్నాడనగానే ఆశలు వదులుకున్నాను. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మేమెక్కడో ఉంటాం. అందుకే కోహ్లిలాంటి స్టార్‌ను కాదని నాకిస్తారనుకోలేదు. కానీ జాబితాలో నా పేరు చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాను. అసలే మాత్రం ఊహించని విషయమిది. ప్రతిభకు తగిన పురస్కారమిది: మన చిత్తశుద్ధిని, అంకితభావాన్ని గుర్తించారనడానికి కేంద్ర అవార్డులు నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే నేను ఆడటం ప్రారంభించే నాటికి మహిళల క్రికెట్‌పై ఎక్కడా అవగాహన లేదు. అసలు మాకు కూడా క్రికెట్ జట్టు ఉందనే విషయం ప్రజలకు తెలీదు. అలాంటి స్థితి నుంచి మహిళల క్రికెట్‌ను కూడా ఫాలో కావాలనే కోరిక ప్రజల్లో కలిగించేలా చేశాం. దీనికి చాలా సమయమే పట్టింది. తల్లిదండ్రులకు అంకితం: నా కెరీర్ కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారు. చాలా వాటిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఈ అవార్డు వారికే అంకితం అని చె ప్పేందుకు సంతోషిస్తున్నాను. ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుంది: భారత్‌లో క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకునేందుకు నాకు దక్కిన ఈ అవార్డు యువ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇక నుంచి ముఖ్యంగా క్రికెట్ అభిమానులు... మహిళా క్రికెట్‌ను మరింత ఆసక్తిగా అనుసరిస్తారేమో! కొందరిలా నేను డిమాండ్ చేయలేను: కొందరు ఆటగాళ్లు ఫలానా అవార్డుకు, గుర్తింపునకు తాము అర్హులమేనని భావిస్తుం టారు. అయితే నేను మాత్రం ఆ కేటగిరీకి చెందను. నాకు దక్కినప్పుడే తీసుకుంటాను. ప్రస్తుతానికి నాకు అవార్డు వచ్చింది. కాబట్టి సంతోషమే. మాకు మరిన్ని మ్యాచ్‌లు దక్కుతాయి: ఐసీసీ కొత్త ఫార్మాట్ ప్రకారం మేం మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడగలమని అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా తక్కువ అంతర్జాతీయ సిరీస్‌ల గురించి అభిమానులు, మీడియా పట్టించుకునేది. అయితే ఇకనుంచి ఎక్కువగా మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. -
తొలి సవ్వడి
ఫొటో స్టోరీ అమాయకతను ఒలకబోసే కన్నులు ఆశ్చర్యంతో అరమోడ్పు లయ్యాయెందుకు అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తే! ఈ చిన్నారి ముఖంలో కనిపించిన ఈ భావం వెనుక ఓ కథ ఉంది. ఓ ఆశ్చర్యం ఉంది. ఓ ఆనందం ఉంది. ఓ కొత్త అనుభవం ఉంది! హెరాల్డ్ విటిల్స్ అనే ఈ బుజ్జిగాడికి పుట్టుకతోనే చెవులు వినిపించవు. తండ్రి పిలుపు వినలేడు. తల్లి జోలపాటనూ ఆస్వాదించలేడు. ప్రపంచం లోని ఏ శబ్దమూ అతడిని కదిలించలేదు. అది అతడి తల్లిదండ్రుల్ని చాలా బాధించింది. వాళ్లు ఎలాగైనా తమ కొడుకుని బాగు చేసుకోవాలని తపించారు. వైద్యులకు చూపించారు. వైద్యులు పరీక్షలు చేసి, హెరాల్డ్ ఎడమ చెవిలో ఓ మిషన్‌ని బిగించారు. దాని పనితీరు తెలుసుకోవడం కోసం ‘హెరాల్డ్’ అని పిలిచారు. తొలిసారి ఒక శబ్దం తన చెవుల గుండా మనసుకు చేరడంతో ఆ చిన్నారి అవాక్కయిపోయాడు. సరిగ్గా అప్పుడే ఫొటోగ్రాఫర్ జాక్ బ్రాడ్లీ ఈ ఫొటో తీశాడు. దశాబ్దాల నాటి ఈ చిత్రం... బ్రాడ్లీకి ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది! -
సాక్షి పుణ్యమా అని...
శుక్రవారం... సెప్టెంబర్ 5... టీచర్స్‌డే... ఉదయం ఎనిమిదన్నరకు బ్రహ్మానందం నుంచి ఫోన్ కాల్. ‘‘ఈ రోజు ‘సాక్షి’లో వచ్చిన ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ ఎక్స్లెంట్... నాకు చెప్పకుండా నా శిష్యుల ఇంటర్వ్యూలు చేసి నన్ను భలే సర్ప్రైజ్ చేశారే’’ అని ఆనందం వెలిబుచ్చారు బ్రహ్మానందం. మళ్లీ వెంటనే ఆయన ‘‘ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. నా శిష్యులు చాలా మంది మాట్లాడారు. మీ ‘సాక్షి’ పుణ్యమా అని 35 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను’’ అన్నారు. పత్రికల్లో వచ్చే తన ఇంటర్వ్యూలకు ఎప్పుడూ పెద్దగా స్పందించనట్టు కనపడే బ్రహ్మానందం ఈ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ విషయంలో ఉద్వేగానికి గురయ్యారని అర్థమైంది. కట్ చేస్తే... ఆయన దగ్గర వాలిపోయాం. మళ్లీ ఆ ఆర్టికల్‌ను చూస్తూ ‘‘నేను పనిచేసిన డిగ్రీ కాలేజ్ ఫొటో, స్టాఫ్‌తో నేను దిగిన స్టిల్స్ చూస్తుంటే... నా మనసు ఆ రోజుల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బ్రహ్మానందం. ఈలోగా ఆయన ఫోన్ మోగింది. మళ్లీ మరో అభినందన కాల్. మధ్య మధ్య అలా ఫోన్లు మాట్లాడుతూనే ‘సాక్షి’తో లెక్చరర్‌గా తన అనుభవాలను నెమరు వేసుకుంటూ... అనేక విషయాలు ముచ్చటించారు. కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని మీరు బాగా డీల్ చేసేవారని మీ శిష్యులే చెప్పారు. ఆ టెక్నిక్ మీకు ఎలా అలవడింది? అది టెక్నిక్ అని నేననుకోవడం లేదు. మొదటి నుంచీ మనుషుల్ని బాగా డీల్ చేసే వరమేదో దేవుడు నాకిచ్చినట్టున్నాడు. అంతకుమించి నా వైపు ప్రిపరేషనేమీ లేదు. మామూలుగా హైస్కూలు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లు కాబట్టి, దండించి అయినా దారిలోకి తీసుకురావచ్చు. ఇక్కడేమో డిగ్రీ స్టూడెంట్స్. టీనేజ్ దాటిపోయి ఉంటారు కాబట్టి, చెప్పిన మాట అస్సలు వినరు. కానీ మనదైన శైలిలో దారిలోకి తెచ్చుకోవాల్సిందే. మీ దగ్గర అలా తోక జాడించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ఎందుకుండరండీ... ఉంటారు. ఇట్స్ నేచురల్. ఒకసారి నేను క్లాస్ చెబుతుంటే, ఓ తుంటరి ‘‘సార్... టైమైపోయింది’’ అని అరిచాడు. నేను వెంటనే ‘‘అప్పుడే నీకు టైమ్ అయిపోవడమేంటి? నీకు చాలా భవిష్యత్తు ఉందే’’ అన్నాను. దాంతో అమ్మాయిలంతా ఘొల్లుమని నవ్వారు. అతనికి అవమానమనిపించి ‘‘నాకు కాదు సార్... బెల్ కొట్టడానికి టైమైపోయింది’’ అన్నాడు. నేను వెంటనే దానికి కౌంటర్ ఇస్తూ, ‘‘బెల్ కొట్టడానికి ఓ మనిషి ఉన్నాడుగా... నీకెందుకు కంగారు’’ అన్నాను. అంతే! ఇక మళ్లీ అతను నోరెత్తితే ఒట్టు. ఇలా సీరియస్ వేలో కాకుండా, నవ్వుతూనే చురకలంటించేవాణ్ణన్నమాట. అందుకే నా దగ్గర వాళ్లు జాగ్రత్తగా ఉండేవారు. అదే పద్ధతి సినిమా ఇండస్ట్రీలో కూడా అనుసరిస్తున్నాట్టున్నారు? తప్పదు మరి. వెంకటేశ్వరస్వామి గుడికెళ్లి ‘ఓం నమఃశివాయ’ అంటే దేవుడికి కోపం వస్తుంది కదా! ఎక్కడ చదవాల్సిన మంత్రాలు అక్కడే చదవాలి. అయినా నేనెప్పుడూ నా హద్దుల్లో నేనుంటాను. మిగతావాళ్లను కూడా హద్దులు దాటనివ్వను. ఆ సూత్రం తెలిస్తే అందరికీ హాయి. సార్! మళ్లీ మీ లెక్చరర్ రోజుల్లోకి వెళ్దాం. మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్‌గా కూడా చేశారట? అవును. మా డిగ్రీ కాలేజ్‌లోనే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాలతో పాటు ఎలాంటి భోజనం పెట్టాలి లాంటి అంశాలన్నీ వార్డెన్ చూసుకోవాలి. ఈ బాధ్యతలను ఒక్కోసారి ఒక్కో లెక్చరర్ చూసుకోవాలి. అలా నేను కొన్నాళ్లు వార్డెన్‌గా చేశా. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్‌గా కూడా చేశా. అప్పట్లో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? అలా జడ్జ్ చేయడం కష్టం. బాగా చదివేవాడికి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. బిహేవియర్ బాగున్నవాడు చదువులో రాణించకపోవచ్చు. మీరు మిమిక్రీ బాగా చేసేవారట కదా? అప్పట్లో ప్రముఖుల ముందు ఎప్పుడైనా చేశారా? పేర్లు గుర్తుకు రావడం లేదు. సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి... ఇలా చాలామంది ఉన్నారు. జంధ్యాల గారు నా మిమిక్రీ టాలెంట్ చూసే కదా, నాకు సినిమా చాన్స్ ఇచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలుపెడితే, తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఆయన ముందు మిమిక్రీ చేశా. మీ స్కూల్ వైస్ ప్రెసిడెంట్‌ను కూడా అనుకరించేవారట! అదంతా సరదా కోసమే. ఆ మాత్రం సరదా లేకపోతే ఊరు కాని ఊళ్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి! మీ శిష్యులంతా మీకన్నా పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. మీరేమో ఇంకా...? అర్థమైంది మీ ప్రశ్న. ఇంత వయసు వచ్చినా నా ముఖంపై ముడతలు రాలేదేంటని ఈ మధ్యనే ఒకరడిగారు. దానికి నా సమాధానం ఒకటే. మనసులో మడతలు లేకపోతే, ముఖాన ముడతలు రావు. మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో, చెడ్డ ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మనకే ఆ రహస్యం తెలిసిపోతుంది. ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే... "God is always ready with the camera. That's your responsibility to give him a good pose". మీరు రామాయణ, భారత, భాగవతాలు బాగా చదువుకున్నట్టున్నారు? చదువుకోవాలి కదండీ! వాటిపై నాకెంత పట్టు ఉందో, నాకు నేనుగా చెప్పుకోకూడదు. భాగవతం మీద కొన్ని గంటలు మాట్లాడగలను. అసలు మన దగ్గరున్న సాహితీ సంపద ఇంకెవరి దగ్గర ఉంది చెప్పండి! పోతన భాగవతంలోని ‘ఎవ్వనిచే జనియించు’ పద్యం ఒకసారి చదవండి. దీనిముందు ఓషో ఫిలాసఫీ లాంటివి ఎక్కడ నిలుస్తాయి! గురువుగా మీ ప్రత్యేక ముద్ర ఏంటి? నేను చాలా యాక్టివ్‌గా, జోవియల్‌గా ఉంటాను. నా చుట్టుపక్కల వాతావరణం డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు. మనం యాక్టివ్‌గా ఉంటే, మన లైఫ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇందిరాగాంధీ వాకింగ్ స్టయిల్ ఎప్పుడైనా చూశారా? అంత ఎనర్జీ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని గురువుగా భావించేవాళ్లు ఉన్నారు. వాళ్లను మీరెలా గైడ్ చేస్తుంటారు? ఇక్కడ గైడ్లు, క్లాస్‌లూ అంటూ ఏమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తుంటాయ్. అన్ని సమస్యలూ పరిష్కారం అవుతుంటాయ్. అప్పుడప్పుడూ సరదాగా పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ లాంటివాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. నేనేమీ వాళ్లకు గురువును కాదే! ఇది సత్సంగం లాంటిది. ఒక అంశం మీద గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒకసారి వాళ్లిద్దరూ ఉదయం 9 గంటలకు మా ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. ముగ్గురం అంతసేపూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రకరకాల టాపిక్స్ మా మధ్య నడిచాయి. అన్నట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మళ్లీ పాఠం చెబుదామనిపించిందా? ఒకవేళ అనిపించినా, చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే బ్రహ్మానందం కామెడీ మానేసి పద్యాలూ పాఠాలూ చెబుతున్నాడని రకరకాలుగా అనుకుంటారు. ఎందుకంత బాధ! నన్ను ఇలా ఉండనివ్వండి బాబూ..! - పులగం చిన్నారాయణ సడన్‌గా శంకర్ ఫోన్... ఓ పక్క ‘సాక్షి’తో సంభాషిస్తూనే, మరోపక్క వరుసగా వస్తున్న ఫోన్లు మాట్లాడుతున్నారు బ్రహ్మానందం. దాదాపుగా అన్నీ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ గురించే. ఒకతనైతే ఫుల్స్టాప్, కామాలు లేకుండా ఆయనను పొగుడుతూనే ఉన్నాడు. అప్పుడు చూడాలి బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్. ఈ హడావిడిలో ఇంకో ఫోన్ వచ్చింది. ‘‘నేను సార్... డెరైక్టర్ శంకర్‌ని’’ అనగానే, బ్రహ్మానందానికి మొదట ఏమీ అర్థం కాలేదు. ‘ ‘ఎవరు?’’ అని మళ్లీ రెట్టించి అడిగారు. ‘‘డెరైక్టర్ శంకర్‌ని సార్... చెన్నై నుంచి మాట్లాడుతున్నా’’ అనగానే, బ్రహ్మానందానికి అర్థమైపోయింది. ‘‘శంకర్గారూ... ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా అడిగారు బ్రహ్మానందం. ‘‘బావున్నాను సార్... మొన్న ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. దూకుడు, రేసుగుర్రం సినిమాల్లో మీ కామెడీ అదిరిపోయింది. నా వైఫ్, పిల్లలకు తెలుగు తెలియదు కానీ, మీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ‘ఆగడు’లో కూడా చేశారుగా. అది కూడా చూస్తా. మీ గురించి నిర్మాత ఏఎమ్ రత్నంగారు అప్పట్లో చాలాసార్లు చెప్పారు. త్వరలో మీతో నా సినిమాలో ఫుల్ లెంగ్త్ కేరెక్టర్ చేయించుకుంటా’’ అన్నారు శంకర్. ఇలా ఇద్దరూ చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.