'మనం సాధారణంగా కోడిగుడ్లల్లో పెద‍్దవిగానో, చిన‍్నవిగానో చూసి ఉంటాం. అలాగే కొన్నింటినీ గండ్రంగా గానీ, పొడవుగా గానీ, తోలుగుడ్లలాంటివి కూడా చూసుంటాం. కానీ ఇలాంటి అసలు సిసలైన, గమ్మత్తైన కోడిగుడ్డును చూశారా! మరెందుకు ఆలస్యం.. అదేంటో చూద్దాం!'
ఈ ఫొటోలో చూస్తుంది.. మామిడిపిందె అనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాదు కాదు.. తప్పులో కాలేసినట్లే.. అవును ఇది నిజం.. ఇది మామిడిపిందె కాదు.. మామిడి పిందె ఆకారంలో ఉన్న అసలు సిసలైన ‘కోడిగుడ్డు’.. ఇది నమ్మాల్సిన నిజమే.. మామిడి పిందెలాంటి గుడ్డు కథలోకి వెళ్తే..
హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఎదురుగా ఉన్న దుమ్మల శ్రీనివాస్‌యాదవ్ కిరాణంలో గురువారం ఈ మామిడిపిందె ఆకారంలో ఉన్న కోడిగుడ్డు కనిపించింది. అప్పుడే వచ్చిన కోడిగుడ్ల నిల్వను దుకాణంలో ఓ చోట పెడుతూ ఉండగా ఒక్కసారిగా గుడ్ల ట్రేలో తేడా కనిపించడంతో పరీక్షించి చూడగా కోడిగుడ్డు రూపం గమ్మత్తుగా అగుపించింది. కోడిగుడ్డు అచ్చంగా ‘మామిడిపిందె’ ఆకారంలో విచిత్రంగా కనబడటంతో ఆ గుడ్డును అంతా విచిత్రంగా చూస్తూ ఔరా.! ఇదేంటీ ఈ విచిత్రం సుమా.. అనుకోవడం కొసమెరుపే.
ఇవి చదవండి: ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ! కానీ ఆమెకు..
Comments
Please login to add a commentAdd a comment