మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకోండి | Learn your prioritization | Sakshi
Sakshi News home page

మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకోండి

Published Fri, Jan 15 2016 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకోండి

మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకోండి

2016 జనవరి 16 నుంచి 22 వరకు
టారో బాణి
 
ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)
 మీకిది ఎంతో సంతోషకరమైన వారం. పుష్కలంగా డబ్బందుతుంది. కోరిక నెరవేరుతుంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మీకు అన్ని విధాలైన శుభఫలితాలనిస్తుంది. ఇంటిలో ఉత్తరంవైపు నీటి కుండ లేదా బిందెను ఉంచితే మరిన్ని శుభఫలితాలను పొందవచ్చు. సంపద, సమృద్ధి, అదృష్ట దిశగా మీ ప్రయాణం సాగుతుంది. కలిసొచ్చేరంగు: మబ్బు రంగు
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 ఒక కొత్త అవకాశం మీ తలుపుతట్టి, మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. దాన్ని స్వీకరించండి. త్వరలో మీరు ఒక మార్గదర్శకుని లేదా గురువును కలుసుకుంటారు. వారి అడుగుజాడలలో నడుస్తారు. గెలుపు దిశగా పయనిస్తారు. అలాగే మీరొక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారితో రొమాంటిక్‌గా గడుపుతారు. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు
 
జెమిని (మే 21-జూన్ 21)
పనికి కాస్తంత విరామం ఇవ్వండి. మానసిక అశాంతి, అస్థిరత నుంచి బయట పడడానికి వినోద లేదా విహార యాత్ర చేయడం వల్ల మీకు స్వాంతన లభిస్తుంది. ఏదైనా నూతన ప్రారంభానికి స్వాగతం చెప్పండి. మీరు చేయాలనుకున్న దానిని శ్రద్ధగా చేయండి. నాయకుడిగా ఎద గండి. పాజిటివ్‌గా ఆలోచించ ండి. కలిసొచ్చే రంగు: తెలుపు
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
జీవితం మీరు అనుకున్నట్లుగా సజావుగా సాగుతుంది. శుభం జరుగుతుంది. మీ సోమరితనం, భావోద్వేగాలు, చొరబాటు ధోరణి వంటివాటిని అదుపు తప్పనివ్వకండి. ఆర్థికపరంగా కష్టపడవలసి ఉంటుంది. దుబారాకు చోటివ్వకండి. మీ చిరకాల స్వప్నం ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: నారింజ
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

అనుకోని విధంగా బహుమతులు అందుతాయి. అదేవిధంగా కొన్ని అనుకోని సమస్యలు, సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఇది మీకు అడ్వంచరస్‌గా ఉంటుంది. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసి, సమర్థతను నిరూపించుకునే అవకాశమిది. ఆఫీసు లేదా వృత్తిపరమైన ప్రయాణం ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీ ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పశక్తిని నిరూపించుకోవలసిన తరుణమిది. మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకుని, తగ్గట్టు వ్యవహరించండి. ఇంటి ఆవరణలో లేదా ఆఫీస్‌లో కొత్త పనులు లేదా నిర్మాణాలు తలపెడతారు తద్వారా ప్రయోజనం పొందుతారు. ఎంతోకాలం నుంచి ఉన్న ఒక సంబంధానికి ముగింపు పలకవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ.     
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఈ నెల మిమ్మల్ని ధనికుల సరసన నిలబెడుతుంది. మీ ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. మీ శక్తిసామర్థ్యాలు, మీలో ఉత్సాహం, ఉల్లాసం ఇనుమడిస్తాయి. లవర్‌తో మీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నూత్న వాహనం కొంటారు లేదా ప్రయాణం చేస్తారు. ఆశావాదుల సరసనే ఉండేలా చూసుకోండి. కలిసొచ్చేరంగు: నారింజ
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)

సంతోషం కలిగే వార్తలను అనూహ్యంగా వింటారు. పనిపరంగా, ఆదాయపరంగా, కెరీర్ పరంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలా బాగుంటుంది. మీ ప్రియతములతో మీ బంధం బలపడుతుంది. కుటుంబంలోకి కొత్త సభ్యులు వస్తారు. బంధువుల నుంచి అనూహ్యంగా బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: గులాబీరంగు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
సాజిటేరియన్స్: మీ కలలను తేలిగ్గా తీసిపారేయవద్దు. నిజమయ్యేలా చేసుకోండి. మీ ఆశయాలు, పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే కొద్దిపాటి విసుగు జనించడం, అనుకోని సమస్యలలో చిక్కుకోవడం జరగవచ్చు. మీ సామాజిక జీవితం మరింత సరదాగా, సంబరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: గులాబీ
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
అన్నివిధాలా విజయాన్ని, ధన సమృద్ధిని ఇచ్చే వారమిది. వ్యాపారంలో మీకు తెలిసిన వారొకరు మీకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వడమేగాక, వాటిని అమలు చేయడానికి ధనసాయం చేస్తారు. మీ అంతరాత్మ సాయంతో తెలివితేటలతో విజయం సాధిస్తారు. ప్రేమికులు, ప్రియతముల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: ఇంద్రధనుసు రంగు
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. అవిశ్రాంతంగా గడుపుతారు. చేసే ఉద్యోగం గాక అనుబంధంగా మరో పని ద్వారా ఆదాయాన్ని పొందుతారు. రొమాంటిక్  జీవితానికి స్వస్తి పలక వలసి వస్తుంది. మీ ముక్కుసూటి తనం వల్ల చికాకులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)

 కొత్త పనులకు శుభారంభం పలుకుతారు. ఇతర విధాలుగా ఆనందాన్ని, ఆదాయాన్ని ఇచ్చే మార్గాలకోసం అన్వేషిస్తారు. మరింత ఓర్పును, సహనాన్ని, శ్రద్ధను చూపవలసిన వారమిది. సహోద్యోగులు మీకు అన్నివిధాలా అండగా నిలుస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారు. కలిసొచ్చే రంగు: నీలం.
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
 
సౌర వాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

కుటుంబమంతా సుఖశాంతులతోనే ఉంటున్నప్పటికీ అనవసరమైన వాదాలకీ చర్చలకీ అవకాశమున్న కారణంగా దంపతిలో ఎవరో ఒకరు వాదానికి సిద్ధపడకుండా ఉండడం ఎంతైనా అవసరం. గ్రహ అననుకూల పరిస్థితుల కారణంగా ఈ చ ర్చల్లో మరో మనిషి చేరే అవకాశం చేరే అవకాశం రావచ్చు. అదే జరిగినట్లయితే మీ ఇంటికి చుట్టూరా గోడలేమీ లేనట్లే!
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)

ఎంతెంతో ఎదురు చూసి- దాదాపు ప్రయోజనం సిద్ధించినట్లే- అని అనుకునే వేళ ఆ కార్యం చేజారిపోవచ్చు- తీవ్ర నిరాశ కలగవచ్చు- బాధపడకండి ఇంతకంటే మంచి అవకాశం వచ్చేదుంది మీకు. అనవసరంగా మీమీద నింద పడడం గాని లేదా మీరే ఒకర్ని శత్రువుగా చేసుకునే పరిస్థితిగాని కనిపిస్తోంది. వీలయినంతవరకు నోటికి పని చెప్పకుండా జాగ్రత్తపడండి.
 
జెమిని (మే 21-జూన్ 21)

మీ దాంపత్యంలో అన్యోన్యత లేదని చెప్పలేంగాని అంతటి మైత్రీబంధం ఉండకపోవచ్చు. ఉద్యోగం లేదా వృత్తి లేదా వ్యాపార రీత్యా మీరూ ఆమె దూరదూర ప్రాంతాల్లో ఉండే అవకాశముంది. ఈ ఒంటరితనం జరుగుతున్న కాలంలో ఆమెగానీ మీరు గానీ ఇతరుల సలహాలని విననే వద్దు- విని, కోరి ఇబ్బందుల్ని తెచ్చుకోవద్దు- అపార్థపడనే వద్దు.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కుటుంబంలో వచ్చిన సమస్య పరిష్కారపు దిశగా లేకుండా అయోమయంలో ఉంచిన కారణంగా చిరాకూ ఆందోళనా కలగవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయుడూ మాటలాడడంలో నేర్పరీ అయిన వానిద్వారా ధర్మబద్ధంగా రాయబారాన్ని పంపండి. పరిష్కారం ఏవిధంగా ఉండబోతోందో ఆ మార్గం మీకు అర్థమవుతుంది. వాయిదా వేయకండి.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
సమయం లేని కారణంగా అప్పటికప్పుడు తోచిన ఓ ఆలోచనని నిర్ణయంగా చేసేస్తారు. భార్య అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. సంతానం రాకపోకలూ, బంధువుల సమాగమాల కారణంగా పని ఉన్నట్టూ, లేనట్టూ ఉంటుంది. మొత్తానికి ఈవారం దాదాపుగా కార్యశూన్యంగానే దొర్లిపోవచ్చు. అయితే బంధు మిత్రజనం ఉన్నారనే ఓ ధైర్యం వస్తుంది మీకు.
 
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఎదురు చూసిన శుభకార్యానికి అవకాశం రావచ్చు. తగినంత ఆర్థిక పరిపుష్టికోసం ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇచ్చిపుచ్చుకోవడం కాగితాలు రాసుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లో నోటిమాటలు వద్దు. భద్రతతో వ్యవహరించని పక్షంలో మొదటికే ఇబ్బంది కలగవచ్చు కాబట్టి భద్రంగా ఉండండి. ఏమైనా శుభకార్యాలోచన జరుగుతుంది.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 ఏదో తెలియని మానసికాందోళన ప్రారంభం కావచ్చు. అది మీ కుటుంబం పట్ల కావచ్చు. దీన్ని మించిన అధైర్యం మీ సంతానం- విద్య గురించి కలగవచ్చు. ధైర్యంగా ఉండండి. అశుభమంటూ ఏమీ లేదు. మన కంటిలో ఉన్న దోషం వల్ల ఎదుటి వస్తువు మరోలా కనిపిస్తోంది తప్ప, అది వస్తువులో ఉన్న దోషం కాదనే భావాన్ని ప్రతి విషయంలోనూ అన్వయించుకోండి.
 
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
వాహనాన్ని నడుపుతుంటే అది తన మార్గంలో ప్రయాణిస్తూ నీడనీ ఎండనీ మంచునీ చలినీ.. ఎలా దాటుకుంటూ సాగిపోతుందో, అలా, ఏ నిరుత్సాహమూ లేకుండా మీరు ముందుకు దూసుకుని పోతూ ఉండండి. గ్రహ అననుకూలత కారణంగా మానసిక భయం ఎక్కువగా ఉంటుంది కానీ, విజయం మీదేనని గ్రహించండి. ధైర్యాన్ని చెప్పే వారితో కలిసి గడపండి.
 
 శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)

ప్రతి పనీ ఎంతో ప్రయత్నిస్తే కానీ పూర్తి కాకపోవచ్చు. ఏ క్షణానికి ఆ క్షణమే ఆశించిన పని ఆగిపోవచ్చనే మానసింకాదోళన ఉండవచ్చు. విజయం సిద్ధించినా పెద్ద ఆనందాన్ని- ఈ ప్రతిషంఘంభనా అవరోధాలూ ఆందోళనా కారణంగా పొందలేకపోవచ్చు. విదేశీ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్థానచలనం తప్పనిసరి కావచ్చు. నూతన స్థానం తప్పక లాభిస్తుంది.
 
క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20)
అనుకోని ఆదాయం లభిస్తుంది. ఆర్థిక పరిపుష్టికోసం ఇతర ధనాదాయమార్గాలకి అన్వేషణ, ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి. వృద్ధులూ అనుభవజ్ఞులూ అయిన వాళ్లని సంప్రదించడాన్ని మీరు అవమానంగానూ తక్కువదనంగానూ భావింపని మనస్తత్వం కలవాళ్లు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో లోటుపాట్లుండవు. ధైర్యంగా ముందుకు సాగండి.
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
తీర్థయాత్రాసక్తి పెరుగుతుంది. సంతానానికి కానీ, మీకు కానీ కలిగిన- కలుగుతున్న అభ్యంతరాలు తొలగిపోవడం కోసం శాంతులూ జపాలూ వంటివి చేయించుకోవచ్చు. మీరనుకున్నదే మీరు సాధించుకునే మనస్తత్వమున్నవారు కాబట్టి ధైర్యంగానో లౌక్యంగానో మీరనుకున్నదే నెరవేర్చుకుంటారు. ఇతరులకి బాధ కలిగించే విధంగా మీ ప్రయోజనం నెరవేతుంది.
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
కుటుంబమంతా కలిసికట్టుగా ఉన్న కారణంగా మీకు చెప్పలేనంత అండ ఉన్నదనే మానసిక ధైర్యం కలుగుతుంది. తల్లీతండ్రీ కూడ ఆర్థికంగానో పనిపాటలకో మీ కుటుంబం పట్ల శ్రద్ధని చూపుతుండే కారణంగా ఈ వారం సుఖంగా గడుస్తుంది. సొమ్ముతో సొమ్ముని సంపాదించే (షేర్లవంటివి) వ్యాపారాన్ని వీలయినంత తక్కువ చేయడం మంచిది ఈ వారంలో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement