మూడు కన్నుల ఎద్దు.. వైరల్‌ వీడియోలో నిజమెంత? | Bull with 3 eyes 3 Horns People Surprise Video Viral | Sakshi
Sakshi News home page

మూడు కన్నుల ఎద్దు.. వైరల్‌ వీడియోలో నిజమెంత?

Published Wed, May 22 2024 12:32 PM | Last Updated on Wed, May 22 2024 12:32 PM

Bull with 3 eyes 3 Horns People Surprise Video Viral

మూడు కన్నులు  ఉండే  ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు.  ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా  ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

కొందరు సోషల్ మీడియా యూజర్స్‌ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్‌ చేశారని, అది ఫేక్‌ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్‌ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.

కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్‌ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్‌కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్‌ అని రాశారు.  ఇంకో యూజర్‌ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement