eyes
-
మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?
చిన్నపిల్లలు తమ కళ్లను అటు ఇటు తిప్పి చూస్తున్నప్పుడు వాళ్ల రెండు కన్నులు సమానంగా ఉండాలి. అలా కాకుండా వాటిలో ఏదైనా కనుపాప పక్కకు చూస్తున్నట్లుగా ఉండి. కన్నుల మధ్య అలైన్మెంట్ లోపించడాన్ని మెల్ల కన్నుగా చెప్పవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పిల్లల్లో చూపు కాస్త మసగ్గా ఉండవచ్చు లేదా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. అందుకే చిన్నారులు తమ మూడో నెల వరకు ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. మూడు నెలల వయసప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలుపెడతారు. మూడు నెలల వయసు దాటాక పిల్లల్లో మెల్లకన్ను కనిపిస్తుంటే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. అంతేతప్ప మెల్ల అదృష్టమనే అపోహతో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి అది దురదృష్టం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా, కారణాలూ, చికిత్స త్వరగా ఎందుకు చేయించాలనే అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? పిల్లల కన్నులు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు చూసినప్పుడు వాళ్లలో కేవలం ఒక కన్నుకు మాత్రమే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘మెల్ల’ అని అనుకోవచ్చు. పసిపాపలు బలహీనంగా ఉండి, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉండటం వల్ల ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అవే లక్షణాలు కనిపిస్తే వెంటనే పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.కారణాలు... మెల్లకన్ను రావడానికి ఇదీ కారణమని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం, మజిల్ ఇంబాలెన్సెస్, నరాల సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అయితే స్పష్టంగా కనిపించడం అన్నది కాస్త పిల్లలు పెద్దయ్యాక జరుగుతుంటుంది. మెదడుకు సంబంధించిన రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా మెల్ల కన్ను వస్తుంది. త్వరిత నిర్ధారణ చాలా ముఖ్యం చిన్నారుల్లో మెల్ల కన్ను ఉన్నట్లు చూడటంగానీ లేదా అనుమానించడం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. వుూడు నెలలు దాటాక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, తగిన చికిత్స అందించక΄ోతే ఆ కండిషన్ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. ఆ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన విధంగా పిల్లలను కంటి డాక్టర్ ఫాలో అప్‌లో ఉంచాలి. మెల్లకన్నుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించకోకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు / కాంప్లికేషన్కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్ల లోపు దీన్ని చక్కదిద్దకోకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతమయ్యే అవకాశాలూ ఎక్కువే.చికిత్సమెల్ల కన్నుల్లోని అకామడేటివ్, ఈసోట్రోపియా అనే రకాలకు ‘ప్లస్’ కళ్లజోళ్లను డాక్టర్లు సూచిస్తారు. ఒక కన్నులో దృష్టిలోపం ఉండి, ఒక కన్ను నార్మల్‌గా ఉన్నప్పటికీ... దృష్టిలోపం ఉన్న కన్ను క్రమంగా మెల్లకన్నులా మారుతుంది. రానురానూ ఇది ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా) అనే కండిషన్‌కు దారితీస్తుంది. దీనికి కూడా కళ్లజోడు వాడటమే సరైన చికిత్స. అప్పుడప్పుడూ కనిపించే మెల్ల కన్ను (ఇంటర్మిటెంట్ స్క్వింట్) అనేది కంటి కండరాల బలహీనత వల్ల వస్తుంది. కంటి వ్యాయామాల ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కొందరు చిన్నారులు పుట్టుకతోనే మెల్లకన్ను కలిగి ఉంటారు. దీనికి న్యూరాలజిస్ట్ సహాయంతో చికిత్స అందించాల్సి వస్తుంది. వీటన్నింటితోనూ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కంటి వైద్య నిపుణులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఈ శస్త్రచికిత్స చాలా సులువైనదీ, ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. ఇప్పటికీ చాలాచోట్ల మారుమూల పల్లెల్లో మెల్ల కన్ను అదృష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. చిన్నారులు తమ దృష్టి జ్ఞానం కోల్పోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మెల్లకన్నుకు చికిత్స అందించడం అవసరం.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!) -
కంటిపై సోరియాసిస్ ప్రభావం!
ఒళ్లంతా పొడిబారిపోయి చర్మంపైనుండే కణాలు పొట్టులా రాలిపోయే చర్మవ్యాధి సోరియాసిస్ గురించి తెలియనివారుండరు. తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్) వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. చర్మవ్యాధిగానే చూసే దీని ప్రతికూల ప్రభావాలు కొంతవరకు కంటిపైనా ఉంటాయి. అదెలాగో చూద్దాం.ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు). కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్). కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి. కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు.జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్‌కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్‌ను వీలైనంతగా అదుపులో పెట్టడం సాధ్యమవుతోంది. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్‌కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించడం చాలా అవసరం. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్ని డార్క్ సర్కిల్స్ ఒకటి కాదు..
చాలా మంది.. కంటికింద నల్లని వలయాలు కనిపిస్తుంటే ఒత్తిడికి గురవుతున్నామనో నిద్ర సరిగా పోవడం లేదనో అనుకుంటూ ఉంటారు. మార్కెట్లో లభించే క్రీములను రాస్తూ ఉంటారు. కానీ, సరైన పరిష్కారం లభించదు. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అనారోగ్యం అని తెలుసుకుంటే పరిష్కారం కూడా సులువు అవుతుంది.΄ాతికేళ్ల ఏంజెల్ మెడిసిన్ విద్యార్థిని. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తన శరీరంలో ఏదో తీవ్రమైన సమస్యకు సంకేతమని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఒక ఈవెంట్లో ఏంజెల్‌ను కలిసిన డెర్మటాలజిస్ట్ ఆమె కళ్లకింద నల్లటి వలయాలను చూసి, అలెర్జీల సమస్యలను సూచిస్తున్నాయనిచెప్పాడు. అందరిలో ఆ విషయం గురించి ఎక్కువ చర్చించలేక ఇంటికి వెళ్లాక డెర్మటాలజిస్ట్కు ఫోన్ చేసింది. డెర్మటాలజిస్ట్ లారెన్ మాట్లాడుతూ – ‘ఈ సమస్యను పెరియార్బిటల్ హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. రక్తనాళాలకు సంబంధించిన సమస్య వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయ’ని వివరించారు. ఇన్నాళ్లూ నిద్రలేమి వల్ల కలిగే సాధారణ సమస్య ఇది అనుకుంది. డాక్టర్ చెప్పిన విధంగా తన కుటుంబంలో జన్యుపరంగా ఉబ్బసం, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంది. ‘మీకున్న అలెర్జీ ఏంటో కనుక్కొని, దానికి తగిన మందులు తీసుకుంటే నల్లని వలయాల సమస్య దూరం అవుతుంది’ అని డాక్టర్ చెప్పడంతో తగిన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టింది. రోగనిరోధక శక్తి తగ్గుదలకళ్ల కింద వలయాలు మాత్రమే కాదు చర్మం ముడతలు పడటం, ముక్కుకు అడ్డంగా ఉన్న అలెర్జీ మచ్చలు కూడా తగ్గుతుండే రోగనిరోధక శక్తికి సూచికలు అంటున్నారు వైద్యులు. పోషకాహార నిపుణులు, బ్యూటీషియన్స్ కూడా నల్లటి వలయాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వాటిలో... ∙జన్యుపరమైనవి, పోషకాహార లో΄ాలు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలసట, జీర్ణకోశ సమస్యలు, ఏదీ తినాలని లేకపోవడం.. వంటివన్నీ కంటికింద భాగాన్ని నల్లగా చేస్తాయి. రకరకాల అలెర్జీలు, సైనస్ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కారణాన్ని గుర్తించి, వాటికి దూరంగా ఉంటే అవే తగ్గిపోతాయి. క్రీములకన్నా మేలైనవి.. నల్లటి వలయాలు తగ్గడానికి మార్కెట్లో రకరకాల క్రీములు లభిస్తుంటాయి. వీటిని వాడినా మార్పు రాలేదంటే సాధారణ సమస్య కాదని గుర్తించాలి. ∙రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత ద్రవాహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. →ఫేషియల్ ఎక్సర్సైజ్ల వల్ల చర్మ కణాలు చురుకు అవుతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. → అలోవెరా, తేనె .. వంటి వాటిని అప్లై చేస్తూ సాధారణ చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఅనర్థాలను నివారించాలంటే.. తీవ్ర అనారోగ్య సమస్యలను గుర్తించడానికి నల్లని వలయాలను ఒక సూచికగా తీసుకోవాలి. ఆస్తమా, బ్రాంకైటిస్, డస్ట్ అలెర్జీల వల్ల నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మం ΄÷డిబారినా, బి12, ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బరువు పెరగడంతో చర్మం మందం అవడం, బరువు తగ్గినప్పుడు చర్మం పలచబడటం, వయసు పైబడటం వల్ల చర్మంలో వచ్చిన మార్పుల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కంటి దగ్గర ఉండే భాగాన్ని అలెర్జీ ఉన్నప్పుడు రుద్దుతూ ఉన్నా, మొబైల్, లాప్టాప్.. వంటి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉపయోగించినా, నైట్ షిఫ్ట్స్ వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. డ్రై స్కిన్ ఉందంటే మాయిశ్చరైజర్ వాడాలి. బరువు పెరుగుతున్నారంటే ఫిట్నెస్, పోషకాహారం జాగ్రత్తలు తీసుకోవాలి. అలెర్జీ సమస్యలకు వైద్య చికిత్స తప్పనిసరి. – డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
మధుమేహం ముప్పు : ‘కళ్లు’ చెబుతాయి!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్నసమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. మారుతున్న జీవనశైలి, ఆహారం తదితర కారణాలరీత్యా వయసుతో సంబంధం లేకుండా తొందరగా షుగర్వ్యాధికి గురవుతున్నారు. కేసుల సంఖ్యకూడా వేగంగానే పెరుగు తోంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ , శాశ్వత నరాల, కంటి, పాదాల సమస్యలకు దారితీస్తుంది. అయితేఏ వ్యాధినైనా ముందుగా గుర్తించడం కీలకం. అలాగే డయాబెటిస్‌ను వార్నింగ్ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు,సరైన చికిత్స తీసుకుంటే, ప్రభావం తీవ్రతనుంచి బయటపడవచ్చు. అయితే దీన్ని గుర్తించడం ఎలా? ముఖ్యంగా కంటి చూపులో ఎలాంటి మార్పులొస్తాయి? తెలుసుకుందాం!డయాబెటిస్ లేదా ప్రమాదం పొంచి ఉందని మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం, తొందరగా ఆలసిపోవడం లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్‌కు ముందస్తు లక్షణమని వైద్యులు చెబుతున్న మాట. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఉదయం లేవగానే కళ్లు మసకగా అనిపించడం, దృష్టి మసక బారుతుంది. అంతేకాదు కళ్లలో నొప్పి, అలసట ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించి అలర్ట్ అవ్వాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి కంటి నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించు కోవాలి. చికిత్స చేయించు కోవాలి. లేదంటే డయాబెటిక్ రెటినోపతికి దారికావచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశదృష్టిలో మచ్చలు లాగా, ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అస్పష్టమైన దృష్టిదృష్టిలో హెచ్చుతగ్గులు నల్లటి చుక్కల్లాగా, ఖాళీ ప్రదేశం ఉన్నట్టుచూపు కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి శాశ్వతంగా కంటి చూపును కోల్పోవచ్చు. నోట్: లక్షణాలు కనిపించినా, వ్యాధి నిర్ధారణ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మా లైఫ్‌స్టయిల్ తో సంబంధమున్న వ్యాధులు చాలా జీవనశైలి మార్పులు, కొద్దిపాటి వ్యాయామం, ఆహారమార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా నిపుణులైన వైద్యుల సలహాల మేరకు ఈ మార్పులు చేసుకోవాలి. -
‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!
కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్‌గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..స్పెయిన్‌లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్‌కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్‌కు తరలించారు. మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.ఈ వ్యాధి లక్షణాలు..తీవ్ర జ్వరంతీవ్రమైన తలనొప్పివెన్ను, కీళ్ల నొప్పులుకడుపు నొప్పి, వాంతులుఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖంనోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలుకామెర్లుమానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులుఆందోళననిద్రమత్తురక్తస్రావం.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది. నివారణటిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.సీసీహెచ్ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి. (చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!) -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్‌కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!
అయోధ్యలోని భవ్యరామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్టుతుడైనప్పటి నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ రామ్‌లల్లాను బాలా రాముడి విగ్రహాన్ని ముగ్ధమనోహారంగా అందర్నీ చూపుతిప్పుకోని రీతీలో ఆకర్షణగా తీర్చిదిద్దారు ప్రముఖ శిల్పి యోగిరాజ్. ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కృష్ణ శిలను ఎంపిక చేసుకోవడమే గాక రాముడి కళ్లను చక్కగా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నట్లు తీర్చిదిద్దడం అందర్నీ భక్తితో తన్మయత్వానికి గురయ్యేలా చేసింది. ప్రతి ఒక్కరూ ..శిల్పి యోగిరాజ్ కళా నైపుణ్యాన్ని వేన్నోళ్ల కొనియాడారు. ఎవరికి దక్కుతుంది ఇంతటి అదృష్టం అంటూ ప్రశంసించారు. తానుచెక్కిన శిల్పమే పూజలందుకోవడం కంటే గొప్ప వరం ఓ శిల్పికి ఏం ఉంటుంది, అలాంటి అదృష్టం ఎవరీ దక్కుతుందంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు శిల్పి యోగిరాజ్ తాను రామలల్లా విగ్రహాన్ని, ఆ దివ్య నేత్రాల్ని చెక్కడానికి ఉపయోగించిన సుత్తి, ఉలి వంటి పనిముట్లను నెట్టింట షేర్ చేశారు. వెండి సుత్తితో కూడిన బంగారు ఉలి పోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వాటితోనే రాముడి దివ్య నేత్రాలను చెక్కానని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆయన తీర్చిదిద్దిన..పద్మాసనంపై ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది. ఇక శిల్పి యోగిరాజ్ ప్రసిద్ధ శిల్పాల వంశానికి చెందినవాడు. మొదట్లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తన కులవృత్తినే వృత్తిగా మార్చుకుని పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి ప్రముఖ శిల్పిగా మారాడు. 2008 నుంచి యోగిరాజ్ విగ్రహాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arun Yogiraj (@arun_yogiraj) (చదవండి: ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్) -
షాకింగ్ ఘటన: అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి!
కళ్లు లేకుండా శిశువు జన్మించడం అంటే మాములుగా కొద్దిమందిలో జరిగేదేగా అనేకోకండి. ఎందుకుంటే కళ్లే ఏర్పడకుండా పుట్టడం వేరు. కళ్లు లేకపోవడం వేరు. అంటే.. చూపు కనిపించని అంధులకైనా కంటి నిర్మాణం ఉంటుంది. కాకపోతే దృష్టి లోపం ఉంటుంది. అసలు కంటి స్థానంలో కణజాలం లేదా ఆప్టికల్ నరాలే లేకుండా పుడితే వారిని కళ్లే ఏర్పడకుండా జన్మించిన శిశువు అంటాం. ఈ పరిస్థితి అరుదైనా జన్యు సమస్య కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మంది దాక ఉన్నారట. అలాంటి చిన్నారే యూఎస్‌లోని మిస్సౌరీలో ఓ ప్రవేటు ఆస్పత్రిలో జన్మించాడు. ఆ చిన్నారి పేరు రెన్లీ. ఆ శిశువు పుట్టుకతో అనోఫ్తాల్మియాతో జన్మించాడు. అందువల్ల ఆ చిన్నారికి కంటి కణజాలం లేదా ఆప్టిక్ నరాలు ఉండని ఒక విధమైన జన్యు పరిస్థితి అని చెప్పారు వైద్యులు. ఈ మేరకు సదరు చిన్నారి తల్లి మాట్లాడుతూ..సిజేరియన్ ద్వారా జన్మించిన తన చిన్నారి రోగ నిర్థారణ కోసం తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే వేచి ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యింది. చివరికి వైద్యలు కార్టిసాల్ లేకుండానే జన్మించాడని, అందువల్లే కళ్లు మూసుకుపోయాయని చెప్పారని తెలిపింది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే జన్యు మార్పు కొంతమందికి ఒక కన్ను మాత్రమే ప్రభావితమవుతుందని, కానీ చిన్నారి రెన్లీ విషయంలో అందుకు విరుద్ధంగా రెండు కళ్లు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి అతడి మేథస్సును, శారిరీక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రెన్లీకి భవిష్యత్తులో వచ్చే తన పిల్లలకు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేల్చి చెప్పారు వైద్యులు. ప్రస్తుతం రెన్లీకి కళ్లుని తెప్పించే చికిత్సలు ఏమీ లేనప్పటికీ కంటి సాకెట్ల చుట్టూ ఎముక, మృదు కణజాల పెరుగుదలకు సహాయపడటానికి ప్రొస్టెటిక్ కళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్ది వారాల్లో రెన్లీకి కృత్రిమ కళ్లు అమర్చడానికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు వైద్యులు. అనోఫ్తాల్మియాకు కారణం.. ఇది ఎందువల్ల వస్తుందనడానికి కారణాలు తెలియాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది శిశువుల్లో వారి జన్యువులు లేదా క్రోమోజోమ్‌లలో మార్పు కారణంగా ఈ పరిస్థితిని కలిగి ఉంటారు. అలాగే గర్భధారణ సమయంలో ఐసోట్రిటినోయిన్ వంటి మందులను తీసుకోవడం వల్ల కూడా అనోఫ్తాల్మియా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు లేదా ఇతర రకాల రేడియేషన్లకు గురికావడం లేదా మందులు లేదా పురుగులమందుల రసాయానాలు తదితరాలు పిండంలో ఈ లోపం ఏర్పడటానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు.. ⇒ ప్రీ మెచ్చూర్ కంటి శుక్లం: కంటిపై మేఘావృతమైన ఫిల్మ్ కలిగి మబ్బుగా ఉంటుంది. దృష్టి బలహీనమై రంగులను గుర్తించడానికి కష్టమవుతుంది. ⇒ కోలోబోమా కణాజాలం కనిపించకుండా పోతుంది. ఎక్కువగా కనుపాపలో జరుగుతుంది. ⇒ వేరు చేసిన రెటీనా ఇది పూర్తి అంధత్వానికి దారితీసే పరిస్థితి ⇒ ప్టోసిస్ ప్టోసిస్ లేదా సైడోప్టోసిస్, అనేది కండరాలు, నరాలు ఉన్నప్పటికీ పడిపోతున్న కనురెప్పను సూచిస్తుంది. (చదవండి: మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!) -
'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..!
ఈ రోజుల్లో కొంతమందికి చిన్న వయసులోనే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గాని, కొన్ని అలవాట్ల వల్ల గాని కంటి చూపు మందగిస్తుంది. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. పోషకాల లోపం.. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు, క్యారట్, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోండి. చత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం.చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇవి కూడా చదవండి: 'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!? -
కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు శాశ్వతంగా పోవాలంటే..?
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్‌లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్‌పెట్టొచ్చు. కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే... రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్‌గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ను కళ్లకింద రాసి మర్దన చేయాలి. పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది. (చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్‌గా ఉంటుందా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్‌పెట్టండి!) -
అందమైన కనుబొమ్మలకు కలోంజీ!
నల్ల జీలకర్ర (కలోంజీ) విత్తనాలను పొడిచేయాలి. ఈ పొడిలో ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్‌ను వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు తడి కాటన్ వస్త్రంతో కనుబొమ్మలను శుభ్రంగా తుడిచి.. నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. కనుబొమ్మలను తడిలేకుండా తుడిచి కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను కనుబొమ్మలపైన రాసి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి కనుబొమల మీద వెంట్రుకలు పెరుగుతాయి. నల్లజీలకర్ర ప్యాక్ పలుచటి కనుబొమలను ఒత్తుగా మారుస్తుంది. కనుబొమలు తీరైన ఆకృతిలో చక్కగా మెరుస్తాయి. కలోంజిలోని ΄ోషకాలు కనుబొమల వెంట్రుకలు రాలకుండా చేస్తాయి. కనుబొమలు తెల్లబడడం మొదలైన వారు సైతం ఈ ΄్యాక్‌ను వాడితే వెంట్రుకలు నల్లగా మారతాయి. (చదవండి: తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!) -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
భారీ లాభాలపై అదానీ గురి..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ భారీ లాభాలపై గురి పెట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల నిర్వహణ లాభాల(ఇబిటా)ను అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు విమానాశ్రయాలుసహా.. సిమెంట్, పునరుత్పాదక ఇంధనం తదితర పలు బిజినెస్‌లను పటిష్ట వృద్ధి బాటలో నిలపాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. గ్రూప్ నిర్వహణలోగల పోర్టులు, రవాణా, లాజిస్టిక్స్, విద్యుత్ ప్రసారం, సోలార్ ప్యానెళ్లు తదితర విభాగాలను పరుగు తీయించే యోచనలో ఉంది. ఈ బాటలో గ్రూప్ చేపడుతున్న మౌలిక సదుపాయాల కొత్త పెట్టుబడులు రానున్న కాలంలో నగదును సృష్టించగలదని అంచనా వేస్తోంది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ నెల మొదట్లో 2.65 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. తద్వారా ఇన్వెస్టర్లలో గ్రూప్‌పట్ల నమ్మకం మరింత బలపడేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 20 శాతం వృద్ధి బాటలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇబిటాలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల ఇబిటాకు చేరుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)కి గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల ఇబిటా ఉమ్మడిగా 36 శాతం జంప్‌చేసి రూ. 57,219 కోట్లను తాకింది. గ్రూప్‌లో 83 శాతం వాటా కలిగిన మౌలిక సదుపాయాల కీలక బిజినెస్‌లు వార్షికంగా 23 శాతం పురోగతిని సాధించాయి. ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్‌తోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్కుగల ఇన్ఫ్రా వెంచర్లతో కూడిన విభాగాలు ఉమ్మడిగా రూ. 47,386 కోట్ల ఇబిటాను అందుకున్నాయి. -
మెల్లను నయంచేసే హెడ్సెట్.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!
కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్ డిజైనర్ హేచాన్ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ని రూపొందించారు. ‘సింప్లిసిటీ విత్ ప్రొఫెషనలిజం’ (ఎస్‌డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్‌సెట్‌ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్‌సెట్‌లోని మోటరైజ్డ్ ప్రిజమ్ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
చిన్నారి కంటి నుంచి వస్తోన్న ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు
-
పాప కళ్లలోంచి బియ్యం గింజలు, గోర్లు.. వైద్యులు ఏం చెప్పారంటే..?
ఖమ్మం: సహజంగా ఎవరి కంటి నుంచైనా నీరు కారడం, పూసులు రావడం సహజమే. కానీ ఓ చిన్నారి కంటి నుంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, గోర్లు ఇలాంటివి వస్తున్నా యి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. పాప కంట్లో వ్యర్థాలను పెట్టుకోవడంతో అవి కాసేపటికి బయటకు వస్తున్నాయని తేల్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన భూక్యా దస్రూ, దివ్య దంపతుల కుమార్తె ఆరేళ్ల సౌజన్యకు మూడు నెలల క్రితం కంట్లో నుంచి పత్తి గింజ పడగా.. తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా మళ్లీ కంట్లో నుంచి పేపర్, ప్లాస్టిక్ ముక్కలు, బియ్యం గింజలు పడడంతో ఆందోళనకు గురైన వారు శనివారం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో వైద్యులు పరీక్షించి పాప గోళ్లు కొరికి ఆ ముక్కలను కంట్లో పెట్టుకుంటుండడంతో పాటు ఇతర వ్యర్థాలను కంట్లో పెట్టుకోగా, ఆతర్వాత బయటకు వస్తున్నాయని తెలిపారు. పాపను రెండు గంటల గాటు పరిశీలనలో ఉంచగా, ఆమె గోర్లు కొరికి కంట్లో పెట్టుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తేల్చారు. కౌన్సెలింగ్ ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెప్పినా.. తల్లిదండ్రులు మాత్రం వాటంతట అవే కంట్లోంచి వస్తున్నాయంటూ వాపోయారు. దీంతో రెండు రోజులు సౌజన్యను ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాక డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి ఆర్ఎంఓ సంతోష్‌రెడ్డి, సూపరింటెండెంట్ రామస్వామి తెలిపారు. చదవండి: షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి -
కంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు..
-
వాలు కనుల కోసం ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్.. ఎలా పనిచేస్తుందంటే!
కళైన ముఖానికి.. వాలు కనులు తెచ్చిపెట్టే అందమే వేరు. అందుకే కొంతమంది అమ్మాయిలు.. తమ కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తూ.. ఐలాష్ స్టిక్కర్స్ అతికించుకుంటూ తమ కన్నుల సోయగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి బ్యూటీ లవర్స్ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్! ఇందులో చాలా మోడల్స్.. చాలా ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. 1. ఈ మోడల్ టూల్.. త్రీ టెంపరేచర్ మోడ్స్‌తో పనిచేస్తుంది. మొదటి మోడ్ షార్ట్ ఐలాషెస్‌కి బ్లూ లైట్‌తో లో – టెంపరేచర్ని, రెండవ మోడ్.. స్టాండర్డ్ ఐలాషెస్‌కి ఎల్లో కలర్‌తో మీడియం టెంపరేచర్ని అందించగా.. మూడవ మోడ్ హార్డ్ ఐలాషెస్‌కి రెడ్ కలర్‌తో హై టెంపరేచర్ని అందిస్తుంది. 10 సెకండ్స్లో ఫాస్ట్ హీటింగ్, 40 సెకండ్స్లో రాపిడ్ కర్లింగ్ సెట్ చేస్తుంది. పైగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 24 గంటల పాటు కనురెప్పలు అలానే బ్యూటీపుల్ లుక్‌తో ఉంటాయి. ఈ టూల్‌కి ఉండే మినీ హీటర్.. డబుల్ లేయర్ కోంబ్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలా కాలం నడుస్తుంది. 2. ఈ టూల్ కూడా మల్టీ ఫంక్షనల్ డివైజే. ఒకే ఒక్క నిమిషంలో త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్‌తో పనిచేస్తుంది. దీనికి సుమారు 2 గంటలు చార్జింగ్ పెడితే... కొన్ని రోజుల పాటు చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్ అచ్చం హెయిర్ కర్లర్లా.. మినీ హీటర్ విచ్చుకుని.. రెండు భాగాలుగా విడిపోయి.. కనురెప్పలను అందంగా మెలి తిప్పుతుంది. అందుకు ఈ టూల్ ముందున్న చిన్న బటన్ యూజ్ అవుతుంది. 3.ఈ టూల్.. పైవాటిలానే పని చేస్తుంది. అయితే ఆప్షన్స్, టెంపరేచర్ వంటివి డివైజ్‌కి ఉన్న డిస్ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో వినియోగదారులకు మరింత ఈజీగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ? వీటిని ఒక పెన్ మాదిరి సులభంగా హ్యాండ్ బ్యాగ్‌లోనో లేదా మేకప్ కిట్లోనో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మరింకెందుకు ఆలస్యం? క్వాలిటీపై వినియోగదారుల రివ్యూస్‌ని గమనించి.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి. -
వేసవి గాలుల తీవ్రరూపం.. కళ్లు పొడి బారుతున్నాయ్ జాగ్రత్త!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావంతో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్ పొర (కన్నీటి గ్రంధి) దెబ్బతిని కంటికి తేమ అందక డ్రై అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలు ఇంట్లోనే స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లల్లో అత్యధికులు రోజులో 3నుంచి 5గంటల పాటు స్మార్ట్ఫోన్లు చూస్తున్నారు. అలాంటి వారిలో కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిమిషానికి 8 సార్లు కంటి రెప్పల్ని ఆర్పుతుంటాం. అలా చేయడం వల్ల కార్నియాకు అవసరమైన నీరుచేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. స్మార్ట్‌ఫోన్ చూసే సమయంలో కనురెప్పలు నిమిషానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కళ్లు డ్రై అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కంటి దురదలు, కళ్ల మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలుంటాయంటున్నారు. చికిత్స పొందకుంటే నల్లగుడ్డుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స పొందాలి కళ్లు డ్రై అయిన వారిలో దురదలు, కళ్లు మంటలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే క్రమేణా నల్లగుడ్డుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం వలన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మందులు దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. సమస్య రాకుండా ఉండాలంటే కంటికి దూరంగా.. బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లను వినియోగించాలి. – సి.త్రివేణి, నేత్ర వైద్య నిపుణురాలు, విజయవాడ ఏం చేయాలంటే.. ► వేసవిలో ప్రయాణాలు చేసేవారు విధిగా కళ్లజోడు వినియోగించాలి. ► తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. ► స్మార్ట్‌ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. ► కళ్లకు ఫోన్‌ను 15 సెం.మీ. దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు. ► 20 నిమిషాలపాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడం ద్వారా కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా చేస్తుంది. ► ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్‌ఫోన్ వినియోగించకూడదు. ► కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాస్ వాడితే మేలు. ► రోజులో ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. -
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలకు చెక్! ధర ఎంతంటే
Manual Eye And Face Massager: ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్‌ని వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్‌ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్‌ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్‌ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది. ముఖ కండరాలకు రిలాక్స్ మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్‌తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్‌తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో లేదా కాస్మెటిక్ బ్యాగ్‌లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
మానవ నిర్మిత రెటీనా త్వరలోనే సాధ్యం కానుందా?! మృతకణాల స్థానంలో..
కంటి చూపుకు రెటీనా తెర ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో తెలిసిందే. వయసు పెరగడంతో వచ్చే కొన్ని కంటి సమస్యలతో రెటీనా దెబ్బతిని చాలామంది కనుచూపు కోల్పోవడం పరిపాటి. అయితే చాలా తొందర్లోనే మానవులకు ‘ల్యాబ్’లో నిర్మించిన రెటీనా సాకారం కానుందా? దాన్ని మనుషుల్లో ప్రయోగించి చూశాక... అది విజయవంతమైతే... త్వరలోనే చూపు లేని ఎంతో మందికి చూడటం సాధ్యపడనుందా? అవుననే అంటున్నారు యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మేడిసన్‌కు చెందిన పరిశోధకులు. ఆ వివరాలేమిటో చూద్దాం. కాంతి వల్ల కంటి వెనక ఉండే పలుచని పొర అయిన ‘రెటీనా’ వల్లనే దృష్టిజ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రమాదాల్లో రెటీనా ఊడిపోవడం, వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బుల కారణంగా రెటీనా బలహీనపడి చూపు మందగించడం... ఇలాంటి కారణాలతో చాలా మంది అంధత్వానికి లోనవుతున్నారు. వీళ్లందరికీ దృష్టిజ్ఞానం ఇవ్వడం కోసం చాలా పరిశోధనలే చోటు చేసుకుంటున్నాయి. అందునా పరిశోధనశాల (ల్యాబ్)లో రెటీనాను రూపొందించడానికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ‘ఆర్గనాయిడ్స్’ అనే తరహా కణాలను 2014లోనే రూపొందించారు. ఇవి అచ్చం రెటీనా పనే చేస్తాయి. అంటే తమపై ‘3–డి’ ఇమేజ్ను ప్రతిబింబించేలా చేయగల కణాల సమూహాలివి. మనిషి చర్మం నుంచి ‘మూలకణాల్లాంటి (స్టెమ్సెల్స్లాంటి) వాటిని సేకరించడంతో ఈ ప్రయత్నం సాకారమైంది. అటు తర్వాత మరో అడుగు ముందుకేసి రకరకాల రెటీనాలను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతకణాల స్థానంలో పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందాలే.. ల్యాబ్‌లో రూపొందించిన రెటీనా కణాలు వివిధ వేవ్లెంత్ గల కాంతి కిరణాలకు స్పందిస్తున్నాయనీ, అవి పొరుగున ఉన్న ఇతర కణాలతోనూ అనుసంధానమవుతున్నాయంటూ గతేడాది (2022)లో నిరూపించగలిగారు. ‘‘మేము ఆర్గనాయిడ్స్ నుంచి కొన్ని కణాలను సేకరించి, వాటిని రకరకాల జబ్బుల కారణంగా దెబ్బతిన్న రెటీనాలోని మృతకణాల స్థానంలో అమర్చాడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఇదే మాముందున్న సవాలు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఆఫ్తాల్మాలజిస్టు డాక్టర్ డేవిడ్ గామ్. తమ ముందున్న ప్రతిబింబాన్ని తీసుకున్న ఆ కణాలు యాగ్జాన్స్ అనే పురికొసలాంటి కణాల ద్వారా... వెనక ఉన్న ‘సైనాప్స్’ అనే ఓ సిగ్నల్ బాక్స్ లాంటి దాన్నుంచి వెలువడాలి. ఆ సమాచారాన్ని ఎట్టకేలకు మెదడుకు చేరవేయాలి. కణాల్లోంచి వేరు చేసి అమర్చాక కూడా అవి రెటీనా నుంచి బయల్దేరి యాగ్జాన్స్ ద్వారా మెదడు కేంద్రం వరకు చక్కగా అనుసంధానితమవుతూనే (రి–కనెక్ట్ అవుతూనే) ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడా సిగ్నల్స్‌ను కోల్పోకూడదు. అప్పుడే ‘చూడటం’ అనే ప్రక్రియ (విజన్ ప్రాసెస్) పూర్తవుతుంది. ‘రేబీస్ వైరస్’ను అంటించి శాస్త్రవేత్తలు ఇక్కడో విచిత్రాన్ని చేసి చూశారు. ఎక్కడా సిగ్నల్స్ కోల్పోని విధంగా అంతటా అనుసంధానం చక్కగా జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం ఈ రెటీనా కణాలకు కావాలనే ‘రేబీస్ వైరస్’ను అంటించారు. ఇది న్యూరోవైరస్ కావడం వల్ల దీన్ని ఎంచుకుని, వారం రోజుల వ్యవధిలో ఈ వైరస్ చివరి కణం వరకూ చేరిందంటే అన్ని కణాలూ చక్కగా అంటుకుని, అనుసంధానితమై ఉన్నాయని అర్థం. ‘‘ల్యాబ్‌లో కొనసాగిన ఈ ఫలితాలన్నీ పరిశోధనశాల వరకైతే చక్కగానే ఉన్నాయి. ఇక చివరి టాస్క్ ఏదైనా ఉందంటే... అది మానవులపై పరిశోధనలు (హ్యూమన్ ట్రయల్స్) సాగించడమే. ఈ కణాల అమరిక బాగా జరిగి అవి రెటినాలోని కణాలుగా మనగలుగుతూ, రెటినల్ గ్యాంగ్లియాన్ సైనాప్సెస్ అమరికతో మనకు దృష్టిజ్ఞానాన్నిచ్చే ‘ఆప్టిక్ నర్వ్’తో చక్కగా అనుసంధానమైతే చాలు! అదే జరిగితే రెటినైటిస్ పిగ్మెంటోజా, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్, గ్లకోమా వంటి అనేక జబ్బుల కారణంగా చూపుకోల్పోయిన / చూపు మందగించిన వారికి చూపును ఇవ్వగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అంటూ ఎంతోమందిలో ఓ ఆశాభావాన్ని రేకెత్తేంచే చల్లటి కబురు చెబుతున్నారు ఆఫ్తాల్మాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ గామ్. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘పీఎన్ఏఎస్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే -
Beauty: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం
Eye Care- Beauty Tips In Telugu: కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కళ్లు వ్యక్తపరుస్తాయి. అలాంటి కళ్లకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే కలువల్లాంటి కళ్లు మీసొంతం అవుతాయి ఇలా... ఒత్తైన కనుబొమ్మలు ►పడుకోబోయే ముందు రోజ్ వాటర్‌లో కాటన్ని ముంచి, కళ్ల చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి పోయి కళ్లు తేజోవంతమవుతాయి. ►రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి, తెల్లవారి కడిగేస్తే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి. ముడతలు మాయం ►కళ్ల చుట్టూ తేనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్లచుట్టూ ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి. నల్లని వలయాలు తగ్గుముఖం ►పచ్చిపాలలో కాటన్ ముంచి, కళ్లచుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ►కీరా జ్యూస్‌లో, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ►టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి అర గంట తరువాత కడిగెయ్యాలి. ►కొబ్బరినూనెతో కళ్ల చుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్లకి అలసటతగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా నయం అవుతాయి. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్‌లో ఈ సమస్యలు..