అయోధ్యలోని భవ్యరామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్టుతుడైనప్పటి నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ రామ్‌లల్లాను బాలా రాముడి విగ్రహాన్ని ముగ్ధమనోహారంగా అందర్నీ చూపుతిప్పుకోని రీతీలో ఆకర్షణగా తీర్చిదిద్దారు ప్రముఖ శిల్పి యోగిరాజ్. ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కృష్ణ శిలను ఎంపిక చేసుకోవడమే గాక రాముడి కళ్లను చక్కగా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నట్లు తీర్చిదిద్దడం అందర్నీ భక్తితో తన్మయత్వానికి గురయ్యేలా చేసింది.
ప్రతి ఒక్కరూ ..శిల్పి యోగిరాజ్ కళా నైపుణ్యాన్ని వేన్నోళ్ల కొనియాడారు. ఎవరికి దక్కుతుంది ఇంతటి అదృష్టం అంటూ ప్రశంసించారు. తానుచెక్కిన శిల్పమే పూజలందుకోవడం కంటే గొప్ప వరం ఓ శిల్పికి ఏం ఉంటుంది, అలాంటి అదృష్టం ఎవరీ దక్కుతుందంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు శిల్పి యోగిరాజ్ తాను రామలల్లా విగ్రహాన్ని, ఆ దివ్య నేత్రాల్ని చెక్కడానికి ఉపయోగించిన సుత్తి, ఉలి వంటి పనిముట్లను నెట్టింట షేర్ చేశారు.
వెండి సుత్తితో కూడిన బంగారు ఉలి పోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వాటితోనే రాముడి దివ్య నేత్రాలను చెక్కానని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆయన తీర్చిదిద్దిన..పద్మాసనంపై ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది. ఇక శిల్పి యోగిరాజ్ ప్రసిద్ధ శిల్పాల వంశానికి చెందినవాడు. మొదట్లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తన కులవృత్తినే వృత్తిగా మార్చుకుని పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి ప్రముఖ శిల్పిగా మారాడు. 2008 నుంచి యోగిరాజ్ విగ్రహాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
(చదవండి: ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్)
Comments
Please login to add a commentAdd a comment