Divine
-
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి -
భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!
అయోధ్యలోని భవ్యరామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్టుతుడైనప్పటి నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ రామ్‌లల్లాను బాలా రాముడి విగ్రహాన్ని ముగ్ధమనోహారంగా అందర్నీ చూపుతిప్పుకోని రీతీలో ఆకర్షణగా తీర్చిదిద్దారు ప్రముఖ శిల్పి యోగిరాజ్. ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కృష్ణ శిలను ఎంపిక చేసుకోవడమే గాక రాముడి కళ్లను చక్కగా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నట్లు తీర్చిదిద్దడం అందర్నీ భక్తితో తన్మయత్వానికి గురయ్యేలా చేసింది. ప్రతి ఒక్కరూ ..శిల్పి యోగిరాజ్ కళా నైపుణ్యాన్ని వేన్నోళ్ల కొనియాడారు. ఎవరికి దక్కుతుంది ఇంతటి అదృష్టం అంటూ ప్రశంసించారు. తానుచెక్కిన శిల్పమే పూజలందుకోవడం కంటే గొప్ప వరం ఓ శిల్పికి ఏం ఉంటుంది, అలాంటి అదృష్టం ఎవరీ దక్కుతుందంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు శిల్పి యోగిరాజ్ తాను రామలల్లా విగ్రహాన్ని, ఆ దివ్య నేత్రాల్ని చెక్కడానికి ఉపయోగించిన సుత్తి, ఉలి వంటి పనిముట్లను నెట్టింట షేర్ చేశారు. వెండి సుత్తితో కూడిన బంగారు ఉలి పోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వాటితోనే రాముడి దివ్య నేత్రాలను చెక్కానని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆయన తీర్చిదిద్దిన..పద్మాసనంపై ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది. ఇక శిల్పి యోగిరాజ్ ప్రసిద్ధ శిల్పాల వంశానికి చెందినవాడు. మొదట్లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తన కులవృత్తినే వృత్తిగా మార్చుకుని పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి ప్రముఖ శిల్పిగా మారాడు. 2008 నుంచి యోగిరాజ్ విగ్రహాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arun Yogiraj (@arun_yogiraj) (చదవండి: ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్) -
Grammy Awards 2023: నవరాగాల తేజం..రిక్కీ కేజ్
గత సంవత్సరం గ్రామీ గెలుచుకున్న తరువాత లాస్ వేగాస్లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యు బాల్రూమ్లో భారతీయత ఉట్టిపడేలా ‘నమస్తే’ అంటూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. భారతీయత అతడి బలం. తనను ముందుకు నడిపించే ఇంధనం. లాస్ ఏంజెల్స్(యూఎస్) మైక్రోసాఫ్ట్ థియేటర్లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన 65 వ గ్రామీ పురస్కార ప్రదానోత్సవంలో రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి ‘గ్రామీ’ అవార్డ్‌ను అందుకున్నాడు రిక్కీ కేజ్. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో గ్రామీ దక్కింది. రిక్కీకి కెరీర్లో ఇది మూడో గ్రామీ... సంగీతరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్‌ను ముచ్చటగా మూడోసారీ సొంతం చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. 2015లో అమెరికన్ రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘విండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బమ్‌కు తొలిసారిగా గ్రామీ అవార్డ్ దక్కింది. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు మూడోసారి గ్రామీ అవార్డ్ (బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగం)లో అందుకున్నాడు రిక్కీ. గత సంవత్సరం ఇదే ఆల్బమ్ ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో రెండోసారి గ్రామీ దక్కింది. డివైన్ టైడ్స్... ప్రకృతి ప్రపంచానికి నివాళి. ఈ ఆల్బమ్‌లో తొమ్మిది పాటలు ఉన్నాయి. మన హిమాలయాల అందాల నుంచి స్పెయిన్ అరణ్యాల అందాల వరకు మ్యూజిక్ వీడియోల్లో కనువిందు చేస్తాయి. ‘నా సంగీతంలో భిన్న సంస్కృతుల ప్రభావం కనిపించినప్పటికీ నా మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి’ అంటాడు రిక్కీ కేజ్. మూడోసారి ‘గ్రామీ’ వరించిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోప్లాండ్తో ఉన్న ఫోటో పోస్ట్ చేసి ‘సూపర్ గ్రేట్ఫుల్, మై థర్డ్ గ్రామీ అవార్డ్’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు రిక్కీ కేజ్. నార్త్ కరోలినా (యూఎస్)లో జన్మించాడు రిక్కీ. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉంటున్నాడు. స్థానిక బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో సంగీతంలోనే కెరీర్ వెదుక్కుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ఇలా చెప్పడం తండ్రికి నచ్చలేదు. ఆ తరువాత మాత్రం ఆయన కాస్త మెత్తబడ్డాడు. డెంటల్ సర్జరీలో డిగ్రీలో పూర్తి చేసిన తరువాత, పట్టా తండ్రి చేతికి ఇచ్చి తనకు ఇష్టమైన సంగీతపు దారిలో ప్రయాణం ప్రారంభించాడు. టీవీలోని మ్యూజిక్ షోల ద్వారా చిన్నప్పుడే రిక్కీకి సంగీతంపై ఆసక్తి మొదలైంది. ఇంట్లో పెద్ద మ్యూజిక్ కలెక్షన్ ఉండేది. రాక్ బాండ్ ‘ఏంజెల్ డస్ట్’లో గిటార్ ప్లేయర్‌గా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిక్కీ ఆ తరువాత ఫుల్‌టైమ్ కంపోజర్‌గా మారాడు. నస్రత్ ఫతే అలీఖాన్, పండిట్ రవిశంకర్, పీటర్ గాబ్రియెల్ తనకు ఇష్టమైన సంగీతకారులు. జింగిల్స్ చేయడం అంటే రిక్కీకి చాలా ఇష్టం. జింగిల్స్ చేయడం అంటే తన దృష్టిలో రోజూ వ్యాయామం చేయడం లాంటిది. సృజనాత్మక పరిధిని పెంచుకోవడంలాంటిది. ఎన్నో భాషల్లో, ఎన్నో జానర్స్‌లో జింగిల్స్ చేస్తున్నప్పుడల్లా తనలో అదనపు శక్తి వచ్చినట్లుగా భావిస్తాడు. ఇప్పటివరకు మూడువేలకు పైగా జింగిల్స్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వంద మ్యూజిక్ అవార్డ్లు గెలుచుకున్నాడు. రిక్కీకి నచ్చిన పుస్తకం రిచర్డ్ డాకిన్స్ ది గాడ్ డిలూజన్. నిజానికి రిక్కీ తండ్రి, తాతతో సహా బంధువుల్లో చాలామంది వైద్యులుగా పనిచేశారు. ‘రిక్కీలో ఆర్టిస్టి్టక్ జీన్స్ తాత నుంచి వచ్చాయి’ అని మురిసిపోతుంది తల్లి పమ్మి. తాత జానకిదాస్ నటుడు, భావుకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. 2014లో తన గర్ల్‌ఫ్రెండ్ వర్షను వివాహం చేసుకున్నాడు రిక్కీ కేజ్. నవ రత్నాలు ‘డివైన్ టైడ్స్’ విడుదల అయిన కొత్తలో ఈ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డ్ గెలుచుకునే సంపూర్ణ అర్హతలు ఉన్నాయని కితాబు ఇచ్చారు సంగీత విశ్లేషకులు. వారి మాట నిజమైంది. ‘డివైన్ టైడ్స్’ లోని వండర్స్ ఆఫ్ లైఫ్, హిమాలయాస్, అవర్హోమ్, ఆర్డ్ ఆఫ్ డివోషన్, పాస్టోరల్ ఇండియా, ఐయామ్ ఛేంజ్, ఏ ప్రేయర్, గాంధీ, మదర్ ఎర్త్... తొమ్మిది ట్రాక్స్ నవరత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఆల్బమ్‌లో మూలసూత్రం ఏమిటి? మనతో మనం... అంటే ఎవరికి వారు తమ వ్యక్తిగత ప్రంచంలోకి వెళ్లి తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడం. తమను తాము విశ్లేషించుకోవడం, విశ్లేషణ ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం. కాలంతో పాటు మనం... కాలంపై మనదైన సంతకం ఉండాలి. కాలం చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. కాలం విసిరే ప్రశ్నలకు జవాబు వెదుక్కోవాలి. కాలం విసిరే సవాళ్లకు పరిష్కారాలు ఆలోచించాలి. మన గ్రహంతో మనం... భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీరేది కాదు. మనం చేయాల్సిందల్లా చెట్టును కాపాడుకోవాలి. చెట్టుపైన పిట్టను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ నినాదం మన శ్వాసలో భాగం కావాలి. వ్యక్తిత్వ నిర్మాణంలో నేస్తం ఆసక్తిగా మొదలై, అభిరుచిగా మారి రిక్కీ జీవితంలోకి వచ్చిన సంగీతం ‘సంగీతమే నా వ్యక్తిత్వం’ అనే స్థాయికి చేరుకుంది. అదే శ్వాస అయింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సంగీతంలో కెరీర్‌ను వెదుక్కోవడానికి ఇష్టంగా లేరు. దీని గురించి ప్రస్తావిస్తూ ‘మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను పాషన్పై కాకుండా భయంపై తీసుకుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థికకోణాన్ని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంచుకోవడం కాకుండా ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వృత్తులకు దూరంగా తాము ఎంచుకున్న మార్గం ద్వారా మీ పిల్లలు పెద్దగా డబ్బు సంపాదించలేకపోవచ్చు. అయితే డబ్బు కంటే విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు’ అంటాడు రిక్కీ కేజ్. గ్రామీ అవార్డ్ అందుకున్న యంగెస్ట్ ఇండియన్, మూడు గ్రామీలు అందుకున్న ‘వోన్లీ ఇండియన్’గా తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న రిక్కీ కేజ్ (41)... ‘సంగీతం అనేది హాయిగా విని ఆస్వాదించడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వ నిర్మాణంలో సహాయపడుతుంది. మన పాటలలో ఎక్కువగా ప్రేమ, శాంతి, మంచితనం చుట్టూ అల్లుకున్నవే’ అంటాడు. -
కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ఏ వ్యక్తికి దైవదత్తంగా సంక్రమించే హక్కు కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నేతృత్వం వహించే హక్కు దానంతట అదే రాదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ యూపీఏ కూటమి లేదంటూ కామెంట్లు చేసిన మర్నాడు గురువారం రాహుల్‌గాంధీపై ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా మాటల దాడికి దిగారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం ఉందని, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష కూటమికి సారథి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ లేని కూటమి ఆత్మ లేని శరీరమే: సిబల్ యూపీఏ కూటమే లేదంటూ మమత చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ లేని యూపీఏ అంటే ఆత్మ లేని శరీరం వంటిదన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలనూ తిప్పికొట్టారు. ఇతర పార్టీల ఎజెండా ఏంటో ప్రశాంత్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో సలహాలిచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని, కానీ మరో పార్టీ ఎజెండాపై ఎలా మాట్లాడాతారని నిలదీశారు.‘మమతది పచ్చి రాజకీయ అవకాశవాదం. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటున్నట్లు నటిస్తూ అదే ఫాసిస్టు శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు’ అని రణ్‌దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు. -
కిరాతకం !
అదృశ్యమైన బాలిక హత్య బిల్లలమెట్ట ప్రాంతంలో శవమై కనిపించిన దివ్య కిరాతకంగా గొంతుకోసి హత్యచేసిన వైనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ఏ పాపం ఎరుగని ముక్కుపచ్చలారని ఈ పాపాయి చేసిన నేరమేంటో తెలియదు... ఆ చిట్టితల్లి గొంతును అత్యంత కిరాతంగా కోసి హత్య చేశారు...నిర్యానుష్య ప్రాంతంలో నిర్దాక్షణ్యంగా పడేశారు... వేల దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులు నిష్ఫలమయ్యాయి...తమ గారాల పట్టి క్షేమంగా వస్తుందనుకున్న వారి ఆశలు ఆడియాసలయ్యాయి... మంగళవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దివ్య గురువారం శవంగామారింది... దేవరాపల్లి: మేనమామ ఇచ్చిన డబ్బులతో తినుబండారాలు కొనుక్కునేందుకు వెళ్లి అదృశ్యమైన బాలిక మూడో రోజు రైవాడ జలాశయం గేట్లుకు ఆనుకొని ఉన్న బిల్లల మెట్ట ప్రాంతంలో శవమై కనిపించడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. తన కుమార్తె దివ్య అదృశ్యమైందని స్థానిక మహేశ్వరి థియేటర్ సమీపంలో నివాపముంటున్న ధనలక్ష్మి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుం బ సభ్యులు అనుమానం మేరకు బాలికకు మేనమామ వరుసైన గుణశేఖర్పైను విచారించినా ఫలితం లేకపోయింది. పోలీసు జాగిలాలు జీనబాడు రహదారిలో బ్లిల మెట్ట క్వారీ ప్రాంతం, రైవాడ జలాశయం పరిసరాలకు వెళ్లి గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో అప్పటికి గాలింపు నిలిపివేసి, గురువారం ఉదయం ప్రారంభించారు. జాగిలాల సహాయంతో గాలిస్తుం డగా ఆ బాలిక శవమై కనిపించింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్యచేసినట్టు ఆనవాళ్లున్నాయి. దేవరాపల్లికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ఉన్న నిర్మాణుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి బాలిక గొంతుకోసి హతమార్చారు. మేనమామే హత్యచేశాడు.. అన్యంపుణ్యం ఎరుగని తమ కుమార్తెను వరుసకు మేనమామ అయిన సుబ్బాచారి గుణశేఖర్ హత్య చేశాడని బాలిక తల్లిదండ్రులు మురుగాన్, ధనలక్ష్మిలు ఆరోపిస్తున్నారు. పోలీ సులు కూడా గుణశేఖర్పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నా రు.అలాగే వివాహేతర సంబంధాలేమైనా కారణమా? అన్నకోణంలో కూడాదర్యాప్తుచేస్తున్నట్టు తెలిసింది. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ.. దివ్య హత్యకు గురైన ప్రాంతాన్ని, బాలిక మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం స్థానిక సీఐ కిరణ్‌కుమార్, ఎస్ఐ జి.ఎన్.అప్పన్నలు పరిశీలించి ఆధారాలు సేకరిం చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణ నిమితం ఏఎస్పీ కె.సత్యనారాయణ ఇక్కడకు వచ్చారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుమార్తే అత్యంత కిరాతకంగా హత్యకు గురికావడంతో దివ్య తల్లిదండ్రులు మురుగన్,ధన లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. బాలిక హత్యకు గురైందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
వీరి ప్రాణాలు నిలపండి
ఆడుతూ.. పాడుతూ.. సంతోషంగా గడపాల్సిన బాల్యం మంచానికే పరిమితమైంది. కూలీకి వెళ్తేనే జీవనం గడిచే పేద కుటుంబాల పిల్లలు పెద్ద జబ్బుతో బాధ పడుతున్నారు. డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్య, అదే గ్రామ శివారులోని ఎర్రకుంటతండాకు చెందిన సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు తలసేమియూ వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లలకు రక్తం ఎక్కించేం దుకు నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ఎముకల్లోని గుజ్జును మార్చాలని, అందుకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దాతల సాయం కోసం ఆ పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నారుు. పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వారు మంచానికే పరిమితమయ్యూరు. తోటి పిల్లలతో ఎంచక్కా ఆడి పాడాల్సిన వయస్సులో నరకయూతన అనుభవిస్తున్నారు. రక్తం ఎక్కిస్తేనే బతికే జబ్బు (తలసేమియూ)తో వారు నిత్యం దిగులు చెందుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో మంచం పట్టిన కంటి పాపలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మానవతావాదులు తమ పిల్లల వైద్యం కోసం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. తలసేమియూ వ్యాధితో తల్లడిల్లుతున్న ఇద్దరు నిరుపేద బాలికల కన్నీటిగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. డోర్నకల్ : మండలంలోని చిలుకోడు శివారు ఎర్రకుంట తండాకు చెందిన మాలోత్ సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు, చిలుకోడు గ్రామానికి చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్యలు కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో బాధపడుతున్న తమ కంటిపాపలను కాపాడుకునేం దుకు తల్లిదండ్రులు ప్రతీ నెలా హైదరాబాద్ విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు తీసుకెళ్లి రక్తం ఎక్కించి తీసుకొస్తున్నారు. కాగా, నెలనెల ఇద్దరికి రక్తం ఎక్కిస్తుండడంతోపాటు మందుల ఖర్చుకు రూ. 10 వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, సింధుకు ప్రస్తుతం 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోం దని తల్లిదండ్రులు సర్వాన్, పద్మలు తెలిపారు. పది రోజుల క్రితం సింధును హైదరాబాద్‌కు తీసుకెళ్లగా రక్తం లేదని రెడ్‌క్రాస్ ప్రతినిధులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం అందక నీరసం.. సింధుకు పది రోజుల నుంచి రక్తం అందకపోవడంతో పూర్తిగా నీరసించి పోరుుందని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. రక్త కణాలు బాగా తగ్గిపోవడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా, దివ్యకు కూడా రక్తం దొరకకపోవడంతో శరీరం ఉబ్బి, తరచు జ్వరం వస్తోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కూలీ పనులు చేస్తేనే కుటుంబాన్ని పోషించుకునే తమ ఇళ్లలో పెద్దజబ్బు పీడిస్తోందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, తలసేమియా వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలంటే పిల్లల ఎముకల్లోని గుజ్జును తొలగించే ఆపరేషన్ చేయించాలని, ఇందు కోసం రూ. లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారని సింధు, దివ్యల తల్లిదండ్రు లు చెబుతున్నారు. పిల్లలకు ప్రాణభిక్ష పెట్టండి.. తలసేమియూతో బాధపడుతున్న తమ పిల్లల వైద్యం కోసం సాయం అందించాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను, కలెక్టర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని సింధు, దివ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, దయూమయులు స్పందించి తమ పిల్లల వైద్య చికిత్స కోసం తమవంతు ఆర్థిక సాయం అందించి ప్రాణభిక్ష పెట్టాలని వారు చేతులెత్తి వేడుకుంటున్నారు. -
కత్తిగాటు లేకుండా గుండె ఆపరేషన్
14 ఏళ్ల బాలికకు బెలూన్ పద్ధతిలో చికిత్స చెన్నై: గుండె కవాటం మూసుకుపోయిన ఓ బాలికకు తమిళనాడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు కత్తిగాటు లేకుండానే బెలూన్ పద్ధతి ద్వారా సమస్యను నివారించారు. అమిన్జికరాయ్కి చెందిన దివ్య(14) అనే బాలికకు ఐదేళ్ల వయసులోనే కీళ్లవాపు సంబంధ జ్వరం వచ్చింది. దీంతో గుండెపై ప్రభావం పడి ఆమె గుండెకు చెందిన ఓ కవాటం దెబ్బతింది. ఫలితంగా 6 సెం.మీ. వెడల్పు ఉండాల్సిన ఆ కవాటం ఒక సెం.మీ. వెడల్పుకు కుంచించుకుపోయింది. దీంతో ఆమె తరచూ తీవ్ర తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. ఐదేళ్ల క్రితం దివ్యకు ఓ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసినా సమస్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి శస్త్రచికిత్సకు బదులుగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు బెలూన్ పద్ధతిలో చికిత్స నిర్వహించారు. రక్తనాళం గుండా సూక్ష్మకేశనాళిక సాయంతో ఓ బెలూన్ను పంపించి, కవాటం వద్ద విచ్చుకునేలా చేయడంతో కవాటం తగిన మేరకు వెడల్పు అయింది. సాధారణంగా ఈ చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని, కానీ పేద కుటుంబానికి చెందిన దివ్యకు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఉచితంగానే చికిత్స చేశామని వైద్యులు తెలిపారు.