అదృశ్యమైన బాలిక హత్య
బిల్లలమెట్ట ప్రాంతంలో శవమై కనిపించిన దివ్య
కిరాతకంగా గొంతుకోసి హత్యచేసిన వైనం
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
ఏ పాపం ఎరుగని ముక్కుపచ్చలారని ఈ పాపాయి చేసిన నేరమేంటో తెలియదు... ఆ చిట్టితల్లి గొంతును అత్యంత కిరాతంగా కోసి హత్య చేశారు...నిర్యానుష్య ప్రాంతంలో నిర్దాక్షణ్యంగా పడేశారు... వేల దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులు నిష్ఫలమయ్యాయి...తమ గారాల పట్టి క్షేమంగా వస్తుందనుకున్న వారి ఆశలు ఆడియాసలయ్యాయి... మంగళవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దివ్య గురువారం శవంగామారింది...
దేవరాపల్లి: మేనమామ ఇచ్చిన డబ్బులతో తినుబండారాలు కొనుక్కునేందుకు వెళ్లి అదృశ్యమైన బాలిక మూడో రోజు రైవాడ జలాశయం గేట్లుకు ఆనుకొని ఉన్న బిల్లల మెట్ట ప్రాంతంలో శవమై కనిపించడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. తన కుమార్తె దివ్య అదృశ్యమైందని స్థానిక మహేశ్వరి థియేటర్ సమీపంలో నివాపముంటున్న ధనలక్ష్మి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుం బ సభ్యులు అనుమానం మేరకు బాలికకు మేనమామ వరుసైన గుణశేఖర్‌పైను విచారించినా ఫలితం లేకపోయింది. పోలీసు జాగిలాలు జీనబాడు రహదారిలో బ్లిల మెట్ట క్వారీ ప్రాంతం, రైవాడ జలాశయం పరిసరాలకు వెళ్లి గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో అప్పటికి గాలింపు నిలిపివేసి, గురువారం ఉదయం ప్రారంభించారు. జాగిలాల సహాయంతో గాలిస్తుం డగా ఆ బాలిక శవమై కనిపించింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్యచేసినట్టు ఆనవాళ్లున్నాయి. దేవరాపల్లికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ఉన్న నిర్మాణుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి బాలిక గొంతుకోసి హతమార్చారు.
మేనమామే హత్యచేశాడు..
అన్యంపుణ్యం ఎరుగని తమ కుమార్తెను వరుసకు మేనమామ అయిన సుబ్బాచారి గుణశేఖర్ హత్య చేశాడని బాలిక తల్లిదండ్రులు మురుగాన్, ధనలక్ష్మిలు ఆరోపిస్తున్నారు. పోలీ సులు కూడా గుణశేఖర్‌పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నా రు.అలాగే వివాహేతర సంబంధాలేమైనా కారణమా? అన్నకోణంలో కూడాదర్యాప్తుచేస్తున్నట్టు తెలిసింది.
మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ..
దివ్య హత్యకు గురైన ప్రాంతాన్ని, బాలిక మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం స్థానిక సీఐ కిరణ్‌కుమార్, ఎస్‌ఐ జి.ఎన్.అప్పన్నలు పరిశీలించి ఆధారాలు సేకరిం చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణ నిమితం ఏఎస్పీ కె.సత్యనారాయణ ఇక్కడకు వచ్చారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుమార్తే అత్యంత కిరాతకంగా హత్యకు గురికావడంతో దివ్య తల్లిదండ్రులు మురుగన్,ధన లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. బాలిక హత్యకు గురైందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కిరాతకం !
Published Thu, Dec 24 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement
Advertisement