Disappear
-
భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి ఉపాధి లభిస్తుంటే, ఇంకొందరు తమ కొలువులు కోల్పోయేందుకు కారణం అవుతుంది. కృత్రిమ మేధ(AI) వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగ మార్కెట్(Job Market)పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. గతంలో వివిధ రంగాల్లో భిన్న విభాగాల్లో పని చేసేందుకు మానవవనరుల అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. రానున్న పదేళ్లలో ఇప్పుడు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా కింది విభాగాలకు ముప్పు వాటిల్లబోతున్నట్లు చెబుతున్నారు.క్యాషియర్లు: సెల్ఫ్ చెక్ అవుట్ కియోస్క్‌లు, ఆన్లైన్ షాపింగ్(Online Shopping) వల్ల క్యాషియర్ల అవసరం తగ్గిపోతోంది.ట్రావెల్ ఏజెంట్లు: ఎక్స్ పీడియా వంటి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్(YouTube), వెబ్ కంటెట్.. వంటి విభిన్న మార్గాలు ఉండడంతో ట్రావెల్ ఏజెంట్ల అవసరం తగ్గిపోతోంది.లైబ్రరీ క్లర్కులు: డిజిటల్ వనరులు, ఈ-బుక్స్(E-Books) అధికమవుతున్నాయి. దాంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవసరం తక్కువగా ఉంది.పోస్టల్ సర్వీస్ వర్కర్స్: ఈ-మెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్(Digital Communication) కారణంగా ఫిజికల్ మెయిల్ తగ్గడం పోస్టల్ వర్కర్ల అవసరాన్ని తగ్గిస్తోంది.డేటా ఎంట్రీ క్లర్క్‌లు: మాన్యువల్‌గా డేటా ఎంట్రీ చేసే క్లర్క్‌ల స్థానంలో ఏఐ, ఆటోమేషన్ డేటా ప్రాసెసింగ్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వీరి అవసరం ఉండకపోవచ్చు.ఫ్యాక్టరీ వర్కర్స్: తయారీ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త మోడళ్లను రూపొందించడానికి వీలుగా రోబోటిక్స్‌ను వాడుతున్నారు. గతంలో ఈ పనంతా ఫిజికల్‌గా ఉద్యోగులు చేసేవారు.బ్యాంక్ టెల్లర్స్: గతంలో బ్యాంకింగ్ సమస్యలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే కాల్ సెంటర్‌కు కాల్ చేసిన కనుక్కునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బ్యాంకింగ్ సిస్టమ్‌లో వచ్చిన మార్పులు, చాట్బాట్లు, మొబైల్ యాప్స్ వల్ల సంప్రదాయ బ్యాంకు టెల్లర్ల అవసరం తగ్గిపోతోంది.ట్యాక్సీ డ్రైవర్లు: సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో.. వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ(Taxi) సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్లకు ఉపాధి కరవైంది.ఫాస్ట్ ఫుడ్ కుక్స్: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఆటోమేషన్ పెరుగుతోంది. మాన్యువల్‌గా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్‌ఫుడ్ తయారు చేసే సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.మెషిన్‌కు అలసట, సెలవులు ఉండవు!మానవుల కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్‌బాట్స్.. పనులను నిర్వహించగలవు. ఫిజికల్‌గా ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా పని చేస్తుంటారు. మెషిన్‌కు అలాంటివి ఉండవు. ఉద్యోగులకు అలవెన్స్‌లు, జీతాలు, సెలవులు, వీక్‌ఆఫ్‌లు.. వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోబోట్స్‌కు అలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇది డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.అసలు ఏఐ వల్ల కొలువులే దొరకవా..?ఏఐ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఒకవేళ చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తిరిగి అంతకంటే ఉన్నతమైన కొలువులు ఎలా సాధించవచ్చో దృష్టి కేంద్రీకరించి స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుఇప్పుడేం చేయాలి..కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా నిర్వహించడానికి శ్రామిక శక్తికి తగినంత శిక్షణ ఇవ్వకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత పాత్రలకు కార్మికులను సిద్ధం చేయడానికి శిక్షణ, అప్ స్కిల్ కార్యక్రమాల అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆర్థిక, ఆర్థికేతర మార్గాల ద్వారా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. -
లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గత మూడు నెలలుగా వింత చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చొరబడిన దొంగలు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుండటంతో విసుగెత్తిన స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.అజ్మీర్‌లోని విజయనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు గత మూడు నెలలుగా తమ లోదుస్తులు మాయయవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో దీనిపై మౌనం వహించిన వారు పలు ఇళ్లలో ఇదే తరహా దొంగతనాలు తరచూ జరుగుతుండటంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. విజయనగర్ నివాసి లక్ష్మీకాంత్ చిపా మాట్లాడుతూ లోదుస్తుల దొంగ కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోని పలు ఇళ్లలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇళ్లలోకి చొరబడుతున్న దొంగలు పలు విలువైన వస్తువులతోపాటు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ చోరీల ఘటనపై స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ మహిళల లోదుస్తుల చోరీ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దొంగల ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని, ఈ తరహా దొంగలు తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి -
మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?
మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. అయితే ఈ వై క్రోమోజోముకు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్‌లలో ఒకటైనవై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధాన మవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్‌లో ఆఅధ్యయన పేపర్ ను ప్రచురించారు.మగవారిలో సాధారణంగా ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ (XY) ఉంటాయి. అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) లుంటాయి. ఈ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది. తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో వై క్రోమోజోమ్ క్రమంగా మాయవుతోందని పరిశోధకులు తేల్చారు.ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ , శాస్త్రవేత్త జెన్నిఫర్ ఎ. మార్షల్ గ్రేవ్స్ ప్రకారం, వై క్రోమోజోమ్ సమయం గతించిపోతోంది ఈ ధోరణి కొనసాగితే, వై క్రోమోజోమ్ 11 మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది, ఇది మగ సంతానం , మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుంది.అయితే అంత భయపడాల్సిన పనిలేదుఅయితే జపాన్‌కు చెందిన ఎలుకల జాతి, దాని అంతర్ధానమైనందున, మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకుంది. కనుక 1.1 కోట్ల ఏళ్ల కాలంలో వై క్రోమోజోమ్ కనుమరుగైనా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల (Genes) సంఖ్య భారీగా పడిపోయింది. 1393 జీన్స్ మటుమాయమై, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.జపాన్‌లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా Y క్రోమోజోమ్ జన్యువులు ఇతర క్రోమోజోమ్‌లకు మారినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, వారు క్రోమోజోమ్ 3పై SOX9 జన్యువు దగ్గర చిన్న DNA ను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్ SOX9ని యాక్టివేట్ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన SRY జన్యువు పాత్రను తీసుకుంటుంది. Y క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్ వోల్ కూడా దాని వై క్రోమోజోమ్‌ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.సర్వైవల్ కీలకంమానవ వై క్రోమోజోమ్‌ల క్షీణత అంశం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువును అభివృద్ధితో మగ జాతి ఉనికికి వచ్చే నష్టమేమీ ఉండదంటున్నారు. అయినప్పటికీ, ఇటువంటి పరిణామాత్మక మార్పులు వివిధ మానవ జనాభాలో బహుళ లింగ-నిర్ధారణ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయని సూచించారు. -
తెలంగాణ రాజకీయంలో తారల కనుమరుగు
‘‘తెరమీద బొమ్మలు పరిపాలన చేస్తాయి’’ అని అప్పుడెప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పాడంటారు!. ఆ తర్వాత అది అక్షరం పొల్లుబోకుండా జరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో సినీతారలు రాజకీయాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ఉన్నత పదవులూ సైతం చేపట్టిన వాళ్లు కొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు అందుకు మినహాయింపేం కాదు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జన సముద్రం మధ్య నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని (టీడీపీ) ప్రారంభించి.. దేశ రాజకీయాల్లోనే పెను ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో సినీ తారలెవరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలోనూ రాజకీయంగా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. అంతెందుకు తెలంగాణ నుంచి పురుడు పోసుకున్న టీడీపీ.. చంద్రబాబు వైఖరి కారణంగా నేడు అదే రాష్ట్రంలో కనుమరుగైన స్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో సినీ తారల ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. విజయశాంతి, బాబూ మోహన్ లాంటి ఒకరిద్దరు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా.. తెర ముందుకు వచ్చి వాళ్లు చేస్తున్న రాజకీయం అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. ఇక బండ్ల గణేష్ లాంటి వాళ్లు పరోక్ష రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ వాళ్ల ప్రభావం కూడా అంతంత మాత్రమే ఉంటోంది. 2014లో 'బాబు మోహన్' ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్గం నుంచి గెలిచినప్పటికీ.. 2018లో ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి రేవంత్ రెడ్డి కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. 2018లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి రేష్మా రాథోడ్.. నోటా కంటే తక్కువ ఓట్లను పొంది ఓటమిపాలైంది. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నటి 'జయసుధ' సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీలో నటుడు నందమూరి బాలకృష్ణ, వైఎస్సార్సీపీలో ఆర్కే రోజా వంటి సినీతారలు మాత్రమే బరిలో ఉన్నారు. ముందుకు రారేం! ఒకప్పుడు తారలు ప్రచారం చేస్తే ఓట్లు రాలేవన్న నమ్మకం ఒకటి నడిచేది. కానీ, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం ప్రచారం చేసే నటులు కూడా కరువైపోయారు. మొన్నటి అసెంబ్లీ, ఇప్పటి లోక్‌సభ ఎన్నికలకు సినీతారలంతా రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఆ లోటును కాస్తో కూస్తో భర్తీ చేసే యత్నం మాత్రం చేస్తున్నారు. -
కెనడాలో పాక్ ఎయిర్ హోస్టెస్ అదృశ్యం? 2018 నుంచి ఎందుకిలా?
పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ పీఐఏ ప్రస్తుతం విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ ఎయిర్ హోస్టెస్‌లు ఫ్లైట్ డ్యూటీ చేస్తూ కెనడా వెళుతున్నారు. కానీ తిరిగి రావడం లేదు. కొద్ది రోజుల క్రితం పిఐఎ విమానంలో టొరంటో చేరుకున్న విమాన సహాయకురాలు మరియం రజా తిరిగి రాలేదు. హోటల్లో ఆమె గదిని వెతకగా ఆమె పీఐఏ యూనిఫాంతో పాటు ‘ధన్యవాదాలు పీఐఏ’ అని రాసివున్న చీటీ లభ్యమయ్యింది. కెనడాలో దిగిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది కనిపించకుండా పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వ్యవహారం కొనసాగుతోంది. పలువురు పీఐఏ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు. ఇందుకోసం వారు పీఐఏ ఆమోదం తీసుకోవడం లేదు. అలాగే ముందుగా ఎటువంటి వీసా కోసం కూడా దరఖాస్తు చేయడం లేదు. 2024, జనవరిలో కెనడాలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ అదృశ్యమైన నెల రోజల తర్వాత మరియం అదృశ్యమైంది. పీఐఏ సిబ్బంది 2018 నుండి కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. పీఐఏకి ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. పాక్‌కు చెందిన పలువురు నిపుణులు తమ భవిష్యత్ కలలను నెరవేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళుతున్నారు. ఏవియేషన్ న్యూస్ వెబ్సైట్ సింప్లీ ఫ్లయింగ్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాకు వెళ్లిన పాకిస్తాన్ వైమానిక సిబ్బంది అదృశ్యమవడం అనేది 2019లో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఇది మరింతగా పెరిగింది. 2023లో కెనడాలో దిగిన ఏడుగురు పీఐఏ ఫ్లైట్ అటెండెంట్లు అదృశ్యమయ్యారు. పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ నుండి టొరంటోకు వచ్చిన ఇద్దరు పీఐఏ క్యాబిన్ సిబ్బంది డిసెంబర్ 2023లో తమ డ్యూటీని రిపోర్ట్ చేయలేదు. దీంతో సిబ్బంది లేకుండా ఆ పీఐఏ విమానం ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చిందని తెలిపారు. -
తెలంగాణలో టీడీపీ కనుమరుగు
ఎనభయ్యో దశకలో ఉవ్వెత్తున లేచిన ఒక రాజకీయ కెరటం ఇపుడు విరిగి పడింది. నాలుగ దశాబ్ధాల రాజకీయ జీవితానికి ఇపుడా పార్టీ ఫులుస్టాప్ పెడుతోంది. ఇక, తెలంగాణలో ఆ పార్టీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది. తెలంగాణ రాష్ట్రంలో అలా అలా కనుమరుగవుతున్న తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిందే. 1982లో పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల కాలంలోనే అప్పటి దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయాలకు తెరదించుతూ.. టీడీపీ 203 స్థానాలను గెలుచుకుని 1983లో అధికారాన్ని చేబట్టింది. పార్టీ అంతర్గత సంక్షోభం తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 1985లో సైతం 202 సీట్లు పొందింది. కానీ, 1989లో వెల్లకిలా పడిన టీడీపీ కేవలం 74 సీట్లతోనే సరిపుచ్చుకుంది. ఆ తర్వాత 1994లో 216 స్థానాలతో ఫీనిక్స్ పక్షిలా పైకి లేచి అధికారంలోకి వచ్చింది. 1995లో పార్టీ అంతర్గత సంక్షోభం, సొంత మామ ఎన్టీరామారావుకు వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న వైనం ఆంధ్రదేశమంతా చూసింది. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో 180 స్థానాలతో అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత మొదలైన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సునామిలో కొట్టుకుపోయి 2004 ఎన్నికల్లో కేవలం 47 సీట్లను ముక్కీ మూలిగి తెచ్చుకోగలింది. 2009లో మహా కూటమి అంటూ అన్న పార్టీలు కలిసినా నాటి సీఎం డాక్టర్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా ముందు నిలవలేక 92 సీట్లకు పరిమితం అయ్యింది. ఇక్కడి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ గత చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు బలవంతంగా టీడీపీని ఎన్టీరామారావు నుంచి లాగేసుకున్నాక ఆయన నాయకత్వంలోని టీడీపీ ఎన్నికల చరిత్ర ఏమంత గొప్పగా లేదు. 1999 తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో టీడీపీని చంద్రబాబు గట్టెక్కీయలేక పోయారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో... తెలంగాణలో పార్టీ మాయం నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసిపడింది. కాంగ్రెస్ ఇద్దరు సీఎంలు కొణిజేటి రోశయ్య, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిలతో ప్రయోగం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర విభజనకు పచ్చ జెండా ఊపగా.. నాటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతాన్న వల్లించారు. ఈ నక్కజిత్తులను అర్థం చేసుకున్న తెలంగాణ సమాజం, తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 15 సీట్లు గెలుచుకున్నా.. రాజకీయ పునరేకీకరణ నినాదంతో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) విసిరిన పాచికతో టీడీపీ ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరారు. టీడీపీ శాసన సభా పక్షాన్ని నాటి టీఆర్ఎస్ శాసన సభాపక్షంలో విలీనం చేశారు. ఈ దెబ్బ ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కనిపించింది. ఆ ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇపుడు, వచ్చే నెల (నవంబరు, 2023) 30న జరగనున్న ఎన్నికల్లో అసలు పోటీకే దూరంగా ఉంటూ దుకాణం బంద్ పెట్టింది. పేరుకే జాతీయ పార్టీ .. తెలంగాణలో చిక్కి శల్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ గా ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుంది కనుక జాతీయ పార్టీగా నామకరణం చేసి, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీ భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించక పోవడం వల్లే పార్టీ చిక్కిశల్యం అయ్యిందన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్ల నుంచే వినిపిస్తోంది. రాష్ట్రం విడిపోయాక ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైనా.. తెలంగాణ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టి, తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు, బీఆర్ఎస్ కు చెందిన గవర్నర్ నామినేటెడ్, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకు రూ.50లక్షలు ఇవ్వజూపిన కేసులో దొరికిపోయిన నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో రాజీచేసుకుని హైదరాబాద్ ను వీడిపోవడం కూడా పార్టీ భవిష్యత్ కు పెద్ద దెబ్బగా చెబుతున్నారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ కనీస ఉనికి కూడా కాపాడుకోలేక పోయింది. ఈ సారి ఎన్నికలకు దూరం దూరం తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కనీసం 90 స్థానాల్లో పోటీ చేయాలని ఇక్కడి నాయకత్వం భావించింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు కూడా. కానీ, ఏపీ రాష్ట్రంలో అవినీతి కేసులో అరెస్టై , జైల్లో నిందితునిగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు చేతులు ఎత్తేయడంతో ఇక్కడ అక్కడక్కడా నామమాత్రంగానైనా మిగిలి ఉన్న టీడీపీ శ్రేణులను నట్టేట ముంచినట్లు అయ్యిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలోనే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో.. తెలంగాణపై ఏమీ చేయలేమని తేల్చేయడంతో కాసాని ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కునే పనిలో పడ్డారు. అంటే.. 2023 తెలంగాణ శాసన సభ ఎన్నికల సాక్షిగా.. నాలుగు దశబ్ధాల రాజకీయ జీవితం ఉన్న టీడీపీ ఇక చరిత్ర పుటలకే పరిమితం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అయ్యో పాపం నెప్ట్యూన్...మేఘాలన్నీ మటుమాయం
అవున్నిజమే! నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఎవరో మంత్రం వేసినట్టు ఉన్నట్టుండి మటుమాయం అయిపోయాయి. ఈ వింతేమిటి? అందుకు కారణమేమిటి...? నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకుదనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణమూ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగి్వషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు. ఏమిటి కారణం? ► సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. ► సౌర శక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. ► 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. ► కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే! ► దాంతో నెప్ట్యూన్‌కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే! ► నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. ► అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వేడెక్కాల్సింది పోయి... చల్లబడుతోంది నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది... ► ఎందుకంటే... ఈ సమయంలో ఆ ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. ► 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ► గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. ► హబుల్‌తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్‌లు అందించిన డేటాను విశ్లేíÙంచిన మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచి్చంది. ► అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018–2020 మధ్య కాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం ► ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ► అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. ► ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. -
కలకలం రేపిన విద్యార్థినుల అదృశ్యం
ఒడిశా: స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ గ్రూప్ ఎంపీహెచ్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు శనివారం రాత్రి అదృశ్యం కావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆచూకీ కనుగొనడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందడంతో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నిమ్మక ప్రేమ్‌కుమార్, సూపరెంటెండెంట్ రంగాచారి, డిప్యూటీఈవో విజయకుమారి, జీసీడీవో రోజారమణి, ఎంఈవో–2 సూర్యచంద్రరావులు వెంటనే కేజీబీవీని ఆదివారం సందర్శించి సుదీర్ఘ విచారణ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అదృశ్యమైన విద్యార్థినుల్లో ఒకరికి జన్మదినం కావడంతో వారి బంధువులు శనివారం ఉదయం కేక్, స్వీట్లు తెచ్చి ఇచ్చేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి బర్త్‌డే జరుపుకుని రోల్‌కాల్ వరకు ఉన్న విద్యార్థినులు వాష్‌రూమ్‌కు వెళ్తామని చెప్పి పాఠశాల నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వారిద్దరూ పాఠశాలలో లేకపోవడంతో ప్రిన్సిపాల్ రూప అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై వెంకటరమణ, స్థానిక ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టి విద్యార్థినుల ఆచూకీ కనుగొన్నారు. వారిద్దరూ కేజీబీవీ సమీపంలో ఉన్న ఒక అమ్మాయి ఇంటివద్ద ఉన్నారు. దీంతో వారిని పోలీసులు తీసుకువచ్చి విద్యాశాఖాధికారులు, కేజీబీవీ సిబ్బంది సమక్షంలో పేరెంట్స్‌కు అప్పగించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీలు అంటే క్రమశిక్షణకు నిలయాలని ఇటువంటి విద్యాసంస్థలో ఎవ్వరికీ చెప్పకుండా విద్యార్థినులు బయటకు వెళ్లారంటే సిబ్బంది బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. -
ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!
మరో యాభై ఏళ్లలో ఆ దేశం ఉనికిలో ఉండకపోవచ్చు. పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు. ఇప్పటికే ఆ దేశం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. ఆ దేశం ఏమిటి? ఎక్కడుంది అనుకుంటన్నారా? ఫిజీకి ఉత్తరాన వెయ్యి కిలోమీటర్ల దరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ న్న ద్వీపదేశం పేరు ‘తువాలు’. దీని విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు, జనాభా 11,900. ఈ దేశానికి ఒక విమానాశ్రయం ఉంది. వారానికి మూడు విమానాలు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతాయి. విమానాల రాకపోకలు లేని సమయంలో పిల్లలు రన్‌వే మీద ఆటలాడుకుంటూ కనిపిస్తారు. ఈ దేశం పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. తువాలును ఏటా సందర్శించే పర్యాటకులు సగటున 3,700 మంది మాత్రమే! ఈ దేశంలోని ప్రధాన ద్వీపంలో మనుషులు నివసిస్తుంటారు. ఈ దేశంలో భాగంగా నాలుగు పగడపు దీవులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా తక్కువే! విత్రమైన ప్రదేశాలను చూడాలనుకునే ఉబలాటం గల కొద్దిమంది తప్ప వినోదయాత్రల కోసం పర్యటనలకు వెళ్లేవారెవరు ఈ దేశంవైపు చూడరు. ఈ దేశంలో ఏటీఎంలు ఉండవు. అందువల్ల డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే! పర్యావరణ మార్పుల కారణంగా సముద్రజలాలు పెరుగుతూ వస్తుండటంతో ఈ దేశం మరో యాభయ్యేళ్లలోగా పూర్తిగా నీట మునిగిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయాయి. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
హనీమూన్‌లో భర్తకు షాక్: సినిమా మధ్యలో భార్య పరార్!
పోలీస్ స్టేషన్‌కు పరుగుపరుగున వచ్చిన ఒక యువకుడు తనకు ఇటీవలే పెళ్లయ్యిందని, తన భార్య సినిమాహాల్లో తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించేంతలోనే ఆ యువకుని భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన వాదన వినిపించింది. దీంతో ఆ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఇంటర్వెల్ సమయంలో.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక భర్త తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలిద్దలం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లామని, ఇంటర్వెల్ సమయంలో తన భార్య కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లానని, తిరిగి వచ్చిచూసేసరికి ఆమె కనిపించలేదని తెలిపాడు. హనీమూన్‌కు వచ్చి.. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు అతని భార్య గురించి గాలింపు చేపట్టేంతలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే థియేటర్లో భర్తను వదిలేసి బయటకు వచ్చేశానని తెలిపింది. వివరాల్లోకి వెళితే సీకర్‌కు చెందిన ఒక యువకుడు పెళ్లయిన 7 రోజుల తరువాత తన భార్యతో పాటు హనీమూన్ కోసం జైపూర్ వచ్చాడు. వారు ఒక హోటల్లో బసచేశారు. పింక్ స్క్యేర్ మాల్లో అతను భార్యలో పాటు సినిమా చూసేందుకు ప్లాన్ చేశాడు. మధ్యాహ్నం 12 గంటల షో చూసేందుకు టిక్కెట్లు బుక్ చేశాడు. తినుబండారాలు కొనుగోలు చేసి వచ్చేంతలో.. అనంతరం ఇద్దరూ ఆనందంగా సినిమా థియేటర్‌కు వెళ్లారు. సినిమా మధ్యలో అంటే 1:30కి ఇంటర్వెల్ సమయంలో భర్త తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడు. అతను తిరిగివచ్చి చూసే సరికి భార్య ఆ సీటులో కనిపించలేదు. వెంటనే అతను థియేటర్‌తో పాటు మాల్ అంతటా వెదికాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. షాక్ అయిన పోలీసులు.. భార్యకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భార్య మాయమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. ఇంతలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సినిమా హాలు నుంచి పరారైన ఆమె కొద్ది సేపటికి జైపూర్‌లోని షాహ్పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని, అందుకే థియేటర్లో భర్తను విడిచిపెట్టి వచ్చేశానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ విషయాన్ని ఫోనులో ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరు కుటుంబాల వారు ఆమెకు వివాహం విషయంలో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లయిన 7 రోజులకే కొత్త జంట ఇలా విడిపోవడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఇది కూడా చదవండి: కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు? -
ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు!
సాక్షి, అమరావతి: తేనెటీగలు.. సృష్టిలోనే ఓ గొప్ప సహజసిద్ధ ఇంజనీర్లు. షడ్భుజాలతో ఆరు వేల గదుల ఇళ్లను పక్కపక్కనే నిరి్మంచుకోగల సామర్థ్యం వీటి సొంతం. సమైక్య జీవనానికి ప్రతీకలైన మధుమక్షికలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి.. పూలలోని మకరందాన్ని సేకరించుకొస్తాయి. వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు, మొక్కలు మనగలుగుతున్నాయి. ఎన్నో పంటలు వీటివల్లే పండుతున్నాయి. ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే.. తేనెటీగలు మొత్తం అంతరించిపోతే కేవలం 30 రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించిపోతుంది. అంతటి విశిష్టత గల తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచి్చపడింది. 180 రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్య సమితి తేల్చింది. వీటిని సంరక్షించేందుకు రంగంలోకి దిగింది. భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు (మధుమక్షికలు) కూడా అంతే అవసరం. నేలపై ఉన్న వృక్ష జాతులతోపాటు 90 శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ. ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు, కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతోందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగం. మానవ మనుగడ అంతా వాటిపైనే ఆధారపడి ఉంది. పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వాçßæకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే, ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారమైన తేనె, రాయల్ జెల్లీ, మైనం వంటి వాటిని అందించడంతో పాటు తేనెటీగల విషాన్ని సేకరించి ఇతర ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. పురుగు మందుల వాడకంతో.. పంటల రక్షణ కోసం పురుగు మందులను మితిమీరి వినియోగిస్తుండటంతో తేనెటీగల జాతి తగ్గిపోతోందని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్టు యూకే అగ్రికల్చరల్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో గత పదేళ్లలో 13 జాతులు అంతరించిపోగా.. మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది. అందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ (ఐయూసీఎన్) ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్‌లో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. రక్షణకు తక్షణ చర్యలు అవసరం మొక్కలు, పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ 2018 మేలో నియోనికోటినాయిడ్స్ అని పిలిచే మూడు రకాల పురుగుమందులపై నిషేధాన్ని విధించింది. అయితే, అంతకు ముందే 2011లో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. కాగా, 2019 చైనాలోని కుని్మంగ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (కాప్–15)లో 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులు తగ్గించాలని నిర్ణయించింది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని.. ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారమని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు. తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. మూడో వంతు ఆహారోత్పత్తి వీటివల్లే.. ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టం సరీ్వస్ (ఐపీబీఈఎస్) పేర్కొంటున్న ప్రకారం దాదాపు 80 మిలియన్ల సంవత్సరాలుగా తేనెటీగల ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి. ఏటా 1.77 మిలియన్ మెట్రిక్ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడోవంతు తేనెటీగల పైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, పక్షులు, కొన్ని జంతువులు, కీటకాలు పరాగ సంపర్కానికి, మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్నా.. అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందున్నాయి. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? -
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గుడ్‌బై
శాన్ ఫ్రాన్సిస్కో: ఒకప్పుడు వెబ్ బ్రౌజర్‌కు పర్యాయపదంగా నిల్చిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఈ) పూర్తిగా కనుమరుగు కానుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నెటిజన్లు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమ అనుభవాలను ట్విటర్లో (సానుకూలంగాను, ప్రతికూలంగాను) పంచుకున్నారు. అయితే, ఇది ఎకాయెకిన చోటు చేసుకున్న పరిణామం కాదు. 2022 జూన్ 15 నుంచి ఐఈని నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. 2015 లో ప్రవేశపెట్టిన కొత్త ఎడ్జ్ బ్రౌజర్‌ను వినియోగించుకోవచ్చని సూచించింది. ‘ఐఈతో పోలిస్తే ఎడ్జ్ మరింత వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక బ్రౌజర్‘ అని 2021 మేలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటర్ప్రైజ్ జనరల్ మేనేజర్ షాన్ లిండర్సే ఒక బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. -
కనుమరుగవుతున్న పాలపిట్ట!
సాక్షి, కామారెడ్డి: దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. పాలపిట్టను దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయన్న నమ్మకం. తాతల కాలం నుంచి ఇది ఆచారంగా వస్తోంది. అందరూ పాటిస్తూ వస్తున్నారు. పండుగ పూట పొలం గట్ల వెంట వెళ్లి పాలపిట్టను దర్శించుకోవడం ద్వారా ఎంతో అనుభూతిని పొందుతారు. పిల్లలకు పాలపిట్ట గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అయితే అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మూలంగా పర్యావరణం దెబ్బతినడంతో ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అందులో పాలపిట్ట ఒకటిగా చెప్పవచ్చు. వానాకాలం పంటల సీజన్లో పాలపిట్టలు పొలాల వెంట తిరుగాడుతుంటాయి. దసరా నాటికి వరి పంట చేతికందుతుంది. పక్షులన్నీ వరి గింజలు తింటూ తిరుగుతాయి. అయితే ప్రకృతి దెబ్బతినడంతో అన్ని పక్షుల్లాగే పాల పిట్టలు కూడా కనుమరుగవుతున్నాయి. దసరా రోజున చాలామంది పాలపిట్ట దర్శనానికి వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు అడుగులు నడిస్తే చాలు పొలాల వెంట చెట్లపై, విద్యుత్తు తీగలపై పాలపిట్టలు దర్శనమిచ్చేవి. గత పది పదిహేనేళ్లుగా పాలపిట్టలు కరువవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటే పట్టణాలు, నగరాల్లో మరీ ఘో రంగా ఉంది. అయితే కొందరు పాలపిట్టలను పంజరంలో బంధించి ఆలయాల దగ్గర దర్శనం కలిగిస్తున్నారు. ఇండియన్ రోలర్‌గా పిలుస్తారు.. పాలపిట్టను ఇంగ్లీష్‌లో ఇండియన్ రోలర్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కొరాసియా బెంగాలినిసిస్. బ్లూబర్డ్ అని కూడా పిలుస్తారు. రాష్ట్ర పక్షిగా గుర్తించారు. అయినప్పటికీ దీని ఉనికి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. భావితరాలు గూగుల్‌లో చూడాల్సిందే.. ఇప్పటికే పాలపిట్ట కనిపించని పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తు తరాలు పాలపిట్ట గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దసరా రోజు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్త బట్టలు ధరించి పొలం గట్ల వెంట తిరుగుతూ పాలపిట్ట దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వచ్చేది. పాలపిట్టను చూసి అందరూ దండం పెట్టి పంట చేనులో వరి కంకులు తెంపుకుని ఆలయానికి వెళ్లడం దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. స్నేహితులు, బంధువులకు జమ్మి ఆకులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. -
ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం
సాక్షి, రాజేంద్రనగర్: ఇద్దరు పిల్లలతో సహా గృహిణి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ కేపీఆర్ కాలనీకి చెందిన బాల్‌రెడ్డి, రాధిక(23) భార్యాభర్తలు. వీరికి గౌరీష్రెడ్డి(4), రిత్విక్‌రెడ్డి(5 నెలలు) సంతానం. ప్రైవేటు ఉద్యోగి అయిన బాల్‌రెడ్డి సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం ఉండడంతో భార్య, పిల్లలు బజారుకు వెళ్లి ఉంటారని వేచి చూశాడు. రాత్రి వరకు భార్యాపిల్లలు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానిక ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వాకబు చేశాడు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉదయం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేటీఎం అప్డేట్ కేటుగాళ్లకు సంకెళ్లు! సాక్షి, హైదరాబాద్: పేటీఎం ఖాతాలోని ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ వివరాలు అప్డేట్ పేరుతో బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం జమ్తారా, దేవ్గఢ్లో పట్టుకున్న వీరిని ట్రాన్సిట్ వారంట్‌పై మంగళవారం తీసుకొచ్చారు. నిందితుల నుంచి రూ.1,47,000ల నగదుతో పాటు ఆరు సెల్ఫోన్లు, రెండు ఆధార్ కార్డులు, మూడు డెబిట్‌కార్డులు, ఐదు విద్యుత్ బిల్లుల చెల్లింపు కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ ఏసీపీ వి.శ్యాంబాబుతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. విద్యుత్ బిల్లులు చెల్లించి నగదుగా మార్పు... ఈజీ మనీ కోసం అలవాటు పడిన జార్ఖండ్‌కు చెందిన నంకు మండల్, రాజేష్ మండల్లు పేటీఎం అప్డేట్ పేరుతో బాధితుల ఖాతా నుంచి డబ్బును మొబిక్విక్, ఫోన్‌పే,పేటీఎం వ్యాలెట్స్‌కు బదిలీ చేసుకునేవారు. దానిని నగదు రూపంలోకి మార్చుకునేందుకు శివశక్తికుమార్ అలియాస్ అమిత్ బర్నవల్ను కలిశారు. ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు మదన్ లాల్ బజాజ్ కు చెందిన రూ.1,60,000 విద్యుత్ బిల్లులను గౌరవ్ అరుణ్ అనే వ్యక్తి శివశక్తికుమార్కు అందించాడు. ఇవే బిల్లులను నంకు, రాజేష్ మండల్లకు ఇవ్వడంతో తమ వ్యాలెట్‌లో ఉన్న కొట్టేసిన డబ్బులతో ఆన్లైన్లో బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత శివశక్తికుమార్ తన 30 శాతం కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులను వీరికి అందించాడు. కాగా, రష్యాలో మెడిసిన్ చేసి భారత్‌లో ఎంబీబీఎస్ వ్యాలిడిటీ కోసం నిర్వహించే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పరీక్షలో ఫెయిల్ అయిన గౌరవ్ అరుణ్ అనే వ్యక్తి 20 శాతం కమిషన్ తీసుకొని విద్యుత్ బిల్లులను శివశక్తికుమార్ ఇచ్చాడు. దిల్కుష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి నకిలీ బ్యాంక్ ఖాతాలను నంకు మండల్‌కు సమకూర్చేవాడు. వీరిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు టెక్నికల్ డాటాతో ఐదుగురినీ జార్ఖండ్‌లో పట్టుకొని ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. ఇలా మొసగించారు.. ‘ఈ ఏడాది సెప్టెంబర్ 1న డియర్ కస్టమర్...మీ కేవైసీ సస్పెండ్ అయింది. పేటీఎం ఆఫీసు నంబర్ 8345989385కు వెంటనే కాల్ చేయండి. లేకపోతే 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. థ్యాంక్ యూ పేటీఎం’ అంటూ సెల్‌ఫోన్‌కు వచ్చిన సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్)కు మియాపూర్‌కు చెందిన బాధితురాలు స్పందించారు. సదరు పేటీఎం ఉద్యోగిగా చెప్పుకున్న సైబర్ నేరగాడికి ఫోన్‌కాల్ చేశారు. అతడు చెప్పినట్టుగా సెల్ఫోన్లో టీవ్ వీవర్ క్విక్ సపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ ఐడీ నంబర్‌ను సైబర్ నేరగాడికి చెప్పడంతో సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత రూ.1 పేటీఎం వ్యాలెట్‌కు యాడ్ చేయమని చెప్పాడు. దీంతో బాధితురాలు పేటీఎం వ్యాలెట్‌కు వెళ్లి బ్యాంక్ ఖాతా వివరాలు పేటీఎంలో ఎంటర్ చేశారు. సెకన్లలోనే ఆమె సెల్‌ఫోన్‌కు మీ ఖాతా నుంచి రూ.4,29,360లు డెబిట్ అయ్యాయని ఎస్ఎంఎస్లు వచ్చాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సెప్టెంబర్ 2న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.’ భారీ డిస్కౌంట్ల పేరుతో రూ.6 లక్షలు స్వాహా సాక్షి, హైదరాబాద్: తమతో వ్యాపారం చేస్తే భారీ డిస్కౌంట్‌తో ఆయిల్స్ సరఫరా చేస్తామంటూ నగర వాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.6 లక్షలు కాజేశారు. బాధితుడు సోమవారం రాత్రి సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన అనిరుద్ధ్ అగర్వాల్‌కు ఇండియా మార్ట్ అనే ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ నుంచి కాల్ వచ్చింది. ఆ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నంటూ అజయ్ కులారియా అనే ఓ వ్యక్తి మాట్లాడాడు. గుజరాత్‌కు చెందిన శివ ఎంటర్ ప్రైజెస్ సంస్థ వివిధ రకాలైన ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటోందని, వీరితో కలిసి వ్యాపారం చేస్తే భారీ రాయితీతో వాటిని తీసుకోవచ్చని ఎర వేశాడు. ఇతర వివరాలు కోసమంటూ రాహుల్ పటేల్ అనే వ్యక్తిని సంప్రదించమని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనిరుద్ధ్ అతడితో మాట్లాడటంతో సరుకు విలువలో 50 శాతం ముందు చెల్లిస్తే ఆయిల్ పంపుతామని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు రూ.6 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత నుంచి నేరగాళ్లు స్పందించడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన అనిరుద్ధ్ బుధవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తొలిసారిగా ఒకే ఒక్క కేసు... నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ఎఫెక్ట్ సైబ ర్ క్రైమ్ బాధితుల పైనా పడింది. ఈ కారణంగానే మంగళ వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఒకే ఒక్క కేసు న మోదైంది. గడిచిన రెండుమూడేళ్ల కాలంలో ఇలా జరగడం మొదటిసారని అధికారులు చెప్తున్నారు. పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ అప్డేట్ చేయాలంటూ నగర వాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.70 వేలు కాజేశారు. బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆత్మహత్య చేసుకుంటున్నా... సాక్షి, బంజారాహిల్స్: తాను ఆ త్మహత్య చేసుకుంటున్నాన ని తండ్రికి మెసేజ్ పెట్టి ఓ యువ దర్శకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటగిరిలోని కమలా నిలయంలో ఒడిశాకు చెందిన దీపక్ రంజన్ బెహరా(27) అద్దెకుంటున్నాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో భోజనానికి వెళ్తున్నానని స్నేహితుడు సునీల్‌కి చెప్పి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తన తండ్రి హరిశ్చంద్ర బెహెరా ఫోన్‌కు దీపక్ ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడు. తనకు రూ. 6 లక్షల అప్పు ఉందని, దాన్ని తీర్చాలని మెసేజ్‌లో పేర్కొన్నాడు. వెంటనే దీపక్‌కు అతడి సోదరుడు దినేష్ ఫోన్ చేయగా కలవలేదు. దీపక్ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దిశ సినిమాను నిలుపుదల చేయాలి సాక్షి, బన్సీలాల్‌పేట్: దిశ సంఘటన ఆధారంగా రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న దిశ సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని రెడ్డి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రెడ్డి జేఏసీ ప్రతినిధులు మంగళవారం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని సెన్సార్ బోర్డు రీజినల్ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ గ్రేటర్ అధ్యక్షుడు కె. ధర్మారెడ్డి, మహిళా అధ్యక్షురాలు విజితా రెడ్డి, సుమతీరెడ్డి, శ్వేతారెడ్డి మాట్లాడుతూ...దిశ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే దిశ పేరిట రాంగోపాల్‌వర్మ సినిమా తీసి విడుదల చేస్తామనడం సరికాదన్నారు. నవంబర్ 26న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, వెంటనే సెన్సార్ బోర్డు దిశ సినిమాను నిలిపివేయాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ ప్రతినిధులు విజయారెడ్డి, రాంచంద్రారెడ్డి, రంగారెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గద్వాలలో అదృశ్యం.. ఆగ్రాలో ప్రత్యక్షం
సాక్షి, గద్వాల క్రైం: మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమైన ఓ మహిళ గద్వాలలో అదృశ్యమై.. ఆగ్రాలో ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని క్రిష్ణరెడ్డి బంగ్లాకు చెందిన పుట్ట లక్ష్మి అనే మహిళ మతిస్థిమితం కోల్పోయి గత మూడు నెలల కిందట అదృశ్యమైంది. అయితే సదరు మహిళ ఆదివారం ఆగ్రా పోలీసుల వద్దకు చేరింది. అక్కడి పోలీసులు అమెను గుర్తించి వివరాలు తీసుకుని గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గద్వాలలోని లక్ష్మి భర్త ఆదినారాయణ, కుటంబ సభ్యులకు ఆమె ఫొటో చూపించగా గుర్తు పట్టారు. అయితే భార్య మతిస్థిమితం కోల్పోయి గతంలోనూ ఇలా వెళ్లినట్లు తెలిపారు. దీంతో ఆగ్రా, గద్వాల పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెను తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యులు ఆగ్రాకు బయలు దేరారు. -
అక్కడ వాట్సాప్ మాయం!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైంది. ఈ పరిస్థితి వాట్సాప్‌ను కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించిన వారికే ఎదురైనట్లు వినియోగదారులు చెప్పారని ఎమ్ఎస్పవర్ యూజర్ వెబ్సైట్ తెలిపింది. ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. ఇప్పటికే వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు అన్ఇన్స్టాల్ చేసి ఉంటే, మై యాప్స్ సెక్షన్ ద్వారా తిరిగి డౌన్లోడ్ చేసుకోగలిగారని ఆ వెబ్సైట్ తెలిపింది. పాత యూజర్లు డౌన్లోడ్ చేసుకోగలిగారు కాబట్టి గూగుల్ ప్లేస్టోర్ నుంచి పూర్తిగా మాయం కాలేదని అర్థమవుతోందని విశ్లేషించింది. అయితే గూగుల్ ప్లేస్టోర్‌లో ‘వాట్సాప్ ఫర్ బిజినెస్’ యాప్ ఇప్పటికి ఉన్నట్టు గుర్తించామని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్సైట్ వెల్లడించింది. -
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
-
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్‌లో అలా క్రియేట్ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది. -
విమానం జాడపై తొలగని ఉత్కంఠ
ఈటానగర్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన విమానం జాడ కనిపెట్టేందుకు మంగళవారం భారతీయ నేవీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఏఎన్–32 విమానం అస్సాంలోని జోర్హత్ నుంచి టేకాఫ్ అయిన 33 నిమిషాలకే అదృశ్యమైన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా ప్రాంతానికి చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే గల్లంతైంది. అదృశ్యమైన విమానాన్ని వెతికేందుకు శక్తివంతమైన పీ8ఐ విమానం తమిళనాడులోని ఎర్నాకులంలో ఉన్న ఐఎన్ఎస్ రాజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ వెల్లడించారు. ఇది ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు విమానం కోసం మెంచుకా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది బృందాలుగా ఏర్పడి విమానం జాడ కోసం వెతుకుతున్నాయని తెలిపారు. సోమవారం ఓ చోట విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని.. వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా అలాంటిదేం లేదని గుర్తించామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. అస్సాంకు చేరిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కుటుంబసభ్యులు పటియాలా: అదృశ్యమైన విమానంలో ఎనిమిది మంది వైమానిక సిబ్బంది సహా ఐదుగురు ప్యాసింజర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పటియాలాలోని సమానా ప్రాంతానికి చెందిన ఫ్లైట్ లెఫ్లినెంట్ మోహిత్ గార్గ్ కూడా ఉన్నారు. విమానం గల్లంతైన వార్త తెలియగానే మోహిత్ తండ్రి సురీందర్ గార్గ్, అంకుల్ రిషీ గార్గ్ అస్సాంకు చేరుకున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. మోహిత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అతని సోదరుడు అశ్వనీ గార్గ్ తెలిపారు. మోహిత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య అస్సాంలోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది. పదేళ్ల క్రితమూ ఇలాగే.. అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం సోమవారం కన్పించకుండా పోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగా అదృశ్యం కావడం విశేషం. -
నల్లగొండ టు రాజస్థాన్
నల్లగొండ క్రైం: ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఐదురోజుల కిందట నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్ కట్టపై బ్యాగు, సూసైడ్ నోట్, చున్నీ, చెప్పులు వదిలి వెళ్లిన హబీబ్ ఉన్నీసా, తెగుళ్ల శ్రావణిల అదృశ్యం మిస్టరీని సోమవారం పోలీసులు ఛేదించి ఇరువురిని తల్లిదండ్రులకు అప్పగించారు. స్నేహితులైన వారిద్దరు వేర్వేరు చోట్ల ఉండలేక, ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రుల దృష్టి మళ్లించి కలసి బతికేందుకు ఇంటినుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. జనవరి 31న శ్రావణి, హబీబ్ ఉన్నీసాలు పానగల్ చెరువుకట్ట వద్ద బ్యాగ్ వదిలేసి నల్లగొండ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రైలులో ఈ విద్యార్థినులు మొదట గుంటూరు వెళ్లారు. తర్వాత చెన్నై, ముంబై, గుజరాత్, వడోదరా, రాజస్థాన్ ప్రాంతంలోని పుష్కర్‌కు వెళ్లారు. పుష్కర్‌లో కొత్త సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేసి హాస్టల్లో ఉన్న స్నేహితురాలిని ఫోన్లో సంప్రదించారు. అప్పటికే సెల్ లొకేషన్ సెర్చ్ చేస్తున్న పోలీసులు రాజస్థాన్‌లోని పుష్కర్‌లో వారు ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలు నచ్చకపోవడం, భాష సమస్య కారణంగా అక్కడ ఉండలేమని వారు విజయవాడ ప్రయాణమయ్యారు. ఈనెల 4న విజయవాడ సమీపంలోని కృష్ణలంక లబ్బీపేటలో వారు ఉన్నట్లు సెల్‌టవర్ లొకేషన్ చూపించింది. అప్పటికే వారిని వెతికేందుకు వెళ్లిన నల్లగొండ పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా హబీబ్ ఉన్నీసా, శ్రావణిలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి నల్లగొండకు తీసుకొచ్చారు. విడిపోలేనంత స్నేహం కారణంగానే ఇద్దరూ కలిసి పారిపోయినట్లు సీఐ బాషా తెలిపారు. -
తెల్లారితే పెళ్లి.. వధువు అదృశ్యం
బంజారాహిల్స్: మరికాసేపట్లో... పెళ్లి జరుగనుండగా పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్ సమీపంలోని హకీంపేట్‌కు చెందిన సంతోషి(19) వివాహం సికింద్రాబాద్‌కు చెందిన జైపాల్‌తో నిశ్చయమైంది. గురువారం ఉదయం జుమ్మరాత్బజార్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్లిన సంతోషి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి స్వప్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గగుడిలో చీర మాయంపై సీఎంను కలుస్తాం
-
భార్య దూరమైందని..
హయత్‌నగర్: భార్య దూరమైందనే మనస్థాపానికి లోనైన వ్యక్తి తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన లకావత్ రాజేందర్‌కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యతో విబేధాలు తలెత్తడంతో ఆమెతో విడిపడి సోదరునితో కలిసి వేరుగా ఉంటున్నాడు. భార్య దూరమైందనే మనస్థాపంతో బాధపడుతున్న రాజేందర్ ఆదివారం ‘నేను చనిపోతున్నాను నాకోసం ఎవరూ వెతకొద్దూ’ అంటూ లేఖ రాసి వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అదృశ్యం
తగరపువలస(భీమిలి): జీవీఎంసీ భీమిలి జోన్ 4వ వార్డు కు చెందిన జి.భారతి(25) అనే వివాహిత అదృశ్యమైంది. గత నెల 28న మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదనిఆమె తల్లి ధనలక్ష్మి శుక్రవారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాణీ విద్యానికేతన్ సమీపంలో తల్లితో నివసిస్తున్న భారతికి గతంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. మూడేళ్ల క్రితం ఆయనతో విడాకులు తీసుకున్నట్టు తెలిసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోతానంటూ లేఖ రాసి..
బంజారాహిల్స్: ‘జీవితంపై విరక్తి చెందాను..బతకాలని లేదు.. చావడానికే వెళ్తున్నాను’... అంటూ ఓ యువతి లేఖరాసి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని వ్యాపారి రాజు కుమార్తె శ్రీలత(23) పీజీ పూర్తి చేసింది. ఆదివారం ఉదయం స్నేహితు రాలి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఆమె గదిలో గాలించగా అద్దం కింద ఓ లేఖ కనిపించింది. అందులో తాను జీవితంపై విరక్తి చెందానని చనిపోవడానికే వెళుతున్నట్లు ఉండటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడ?
బెంగళూరు, వైట్‌ఫీల్డ్: బెంగళూరు బెళ్ళందూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఐటీ ఇంజినీరుగా పనిచేస్తున్న పాట్నాకు చెందిన అజితబ్ (29) అదృశ్యం కేసు పదిరోజులు దాటినా మిస్టరీగానే ఉంది. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, మిత్రులు ఆన్లైన్లో ప్రచారాన్ని చేపట్టారు. తన కారును విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన చేసిన అజితబ్ ఎవరో దానిని కొనడానికి ఫోన్ చేయగా, కారు తీసుకొని వెళ్లాడు. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు. ఈ నెల 18న ఘటన జరిగింది. అతని రూమ్మేట్ యిచ్చిన సమాచారం మేరకు టెక్కీ తమ్ముడు ఆర్ణబ్‌కుమార్ ఫిర్యాదు చేయగా వైట్‌ఫీల్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అజితబ్ ఆచూకీ తెలపాలని సోషల్ మీడియాలో ప్రకటనలు, వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. అజితబ్ తండ్రి అశోక్ కుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన బిడ్డ ఎవరికీ హాని చేయలేదని అమాయకుడని అన్నారు. తన బిడ్డను వదలివేయాలని విజ్ఞప్తి చేస్తున్న వీడియోను కూడా ఆన్లైన్లో ఉంచారు. త్వరలో పెళ్లికి విషయమై కొద్దిరోజుల కిందటే తనతో మాట్లాడాడని, బెంగళూరు అంటే ప్రశాంతతకు మారుపేరని అనుకున్నామని చెప్పారు. అతని అదృశ్యం అంతుచిక్కనిదిగా మారడంతో అతని కోసం పోలీసులు ఒకవైపు, మరోవైపు అతని కుటుంబ సభ్యులు, మిత్రులు వెదుకుతున్నారు. కారు కొంటామని కాల్ చేసినవారే ఏదైనా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. కార్ కొనుగోలుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 18వ తేదీ సాయంత్రం 7:30 సమయంలో చివరిసారిగా అతని ఫోన్ వైట్‌ఫీల్డ్ పరిధిలోని గంజూరులో పనిచేసింది. ఆ తరువాత నుంచి స్విచ్ఛాఫ్ అయ్యింది. ఎంబీఏ చదవడానికి కారు అమ్ముదామని.. మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన అజితబ్ ఉన్నత చదువుల కోసం తపించేవాడు. వచ్చే ఏడాది కోల్‌కతా ఐఐఎంలో ఎంబీఏ చేయాలనే లక్ష్యంతో డబ్బు సమకూర్చుకోవడానికి తన కారును విక్రయించాలని నిర్ణయించాడు. ఈ నెల 20వ తేదీ లోగా మొదటి వాయిదా కింద ఆ డబ్బు కట్టాల్సి ఉంది. అందుకే కొత్తగా కొన్నప్పటికీ ఎంతో ఒకంతకు అమ్మేసి బంగారు భవితను నిర్మించుకోవాలని అతను కలలుగన్నాడు. అయితే విధి ఏం తలచిందోగానీ అదే విషయంలో ఎక్కడో భారీ తప్పిదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ అనుమానాస్పద కారు, ఇతరత్రా లభ్యమైనట్లు తమకు సమాచారం అందలేదని వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ అహద్ చెప్పారు. -
కారు అమ్మడానికి వెళ్లి.. టెక్కీ అదృశ్యం
వైట్‌ఫీల్డ్: ఒక ఐటీ ఇంజినీరు అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 18వ తేదీన తన కారును విక్రయించేం దుకు వెళ్ళిన అతడు కని పించడంలేదని తెలిపా రు. ఫిర్యాదు మేరకు వివరాలు యిలావున్నాయి. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ఆపార్టుమెంట్‌లో పాట్నాకు చెం దిన అజితబ్ (29) తన స్నేహితుడితో నివాసం వు న్నాడు. అజితబ్ బెళ్ళందూరులోని ఒక కంపెనీలో టెక్కీ. తన వద్దవున్న కారును విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన చేశాడు. మారుతీ క్లాజ్ కారును రూ. 12 లక్షలకు కొనుగోలు చేసినట్లు, దీన్ని 11లక్షల 80వేలకు విక్రయిస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. కొందరు ఈ కారు కొనడానికి ఫోన్ చేశారని, తాను వెళ్తున్నానని తన రూమ్మేట్కు తెలిపాడు. అలా వెళ్లిన వ్యక్తి తరువాత కనిపించలేదు. అతని ఫోన్ పనిచేయలేదు. అప్ప టి నుంచి అతని ఆచూకీ తెలియరాలేదని టెక్కీ తమ్ముడు ఆర్ణబ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు కొనడానికి వచ్చిన వారే కిడ్నాప్ చేసివుంటారని అనుమానం వ్యక్తంచేశాడు. -
అమ్మో.. 74 వేల ఎకరాలా?
సాక్షి, హైదరాబాద్: వేలాది ఎకరాల ‘భూదాన్’ భూములు అదృశ్యం కావడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయి చర్చ మొదలైంది. ఇన్నాళ్లుగా లెక్కాపత్రం లేని భూదాన భూముల గురించి జిల్లాల వారీగా గణాంకాలతో ‘భూదాన్ దొంగలు దొరికేనా?’ శీర్షికన మంగళవారం సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అందులోని వివరాలు చూసి ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోయాయి. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి సర్వే నంబర్లోని భూముల రికార్డులు పరిశీలిస్తున్న నేపథ్యంలో.. భూదాన్ భూముల లెక్క కూడా తేలితే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయిలో చర్చ భూరికార్డుల ప్రక్షాళనపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాల నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో భూదాన భూముల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఒక కీలక సూచన చేసినట్లు తెలిసింది. ఎవరైనా భూస్వామి భూదానపత్రంలో సర్వే నంబర్లు, విస్తీర్ణం చెప్పకపోయినా... 1975 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం భూముల వివరాలు వెల్లడించినప్పుడు ఫలానా సర్వే నంబర్లోని, ఫలానా విస్తీర్ణం గల భూమిని భూదానం కింద ఇచ్చినట్లుగా పేర్కొని ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. అలా పేర్కొన్న భూములను భూదాన్ కిందకు చేర్చాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక భూదాన్ యజ్ఞబోర్డు నుంచి తెప్పించుకున్న వివరాల ఆధారంగా.. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైనా వివాదాలు తలెత్తినప్పుడు అన్ని రికార్డులు పరిశీలించి ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఏ మేరకు భూదాన్ భూములున్నాయనే దానిపై స్పష్టత రావచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే నంబర్లు లేని భూములు, సాగుకు యోగ్యం కావని నిర్ధారించిన భూముల నిగ్గు తేల్చేందుకు మరో మార్గం లేదని.. ఉన్నంతలోనే లెక్కల్లో స్పష్టత వస్తుందని ఓ సీనియర్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూదాన్ భూములు అక్రమార్కుల పాలైన మాట వాస్తవమేనని.. కానీ ఇంత భారీగా భూములకు లెక్కలు లేకుండా పోయాయనే విషయం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే భూదానోద్యమ స్ఫూర్తికి సార్థకత చేకూరుతుందని, భూమి లేని పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే నంబర్లు లేనివి పట్టుకునేదెలా? ఎప్పుడో 1950–65 సంవత్సరాల మధ్యలో దానంగా వచ్చిన భూముల వివరాలను పదిలపర్చడం, వాటిని పరిరక్షించడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వాటి వ్యవహారం తేలడం అంత సులభమేమీ కాదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 1.69 లక్షల ఎకరాల భూదాన్ భూముల్లో కనీసం 60 వేల ఎకరాలకు సర్వే నంబర్లు లేవని చెబుతున్నాయి. అలా సర్వే నంబర్లు లేని భూముల లెక్క ఎలా తేల్చాలన్నది కూడా సమస్యగా మారనుంది. అంతేగాకుండా కొందరు దాతలు భూములిస్తూ సమర్పించిన దానపత్రంలో సర్వే నంబర్లు పేర్కొనలేదని, మరికొందరు సర్వే నంబర్లు ఇచ్చినా భూమి విస్తీర్ణం చెప్పలేదని, ఇంకొందరు వివాదాస్పద భూములను కూడా దానం చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎన్ని ఎకరాల భూములను అప్పట్లో రెవెన్యూ అధికారులు నమోదు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ఏమయ్యారు!
♦ ఖుడుకు ఆదివాసీ సేవాశ్రమ హాస్టల్లో కనిపించని ఇద్దరు విద్యార్థులు ♦ ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు తోటి విద్యార్థుల వెల్లడి ♦ ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లాడని పోలీసుల అనుమానం జయపురం : నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి ఖుడుకు గ్రామంలో ఆదివాసీ సేవాశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కనిపించడం లేదు. ఈ నెల 13వ తేదీ నుంచి వీరి ఆచూకీ లేదని సమాచారం. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల భద్రతకు సంబంధిత అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో ఈ సంఘటన వెల్లడిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఖుడుకు ఆదివాసీ సేవాశ్రమ పాఠశాలలో 13వ తేదీ నుంచి ఇద్దరు విద్యార్థులు కనిపించకపోయినా ఈ విషయం 14వ తేదీన గాని పాఠశాల అధికారులు తెలుసుకోలేకపోయారు. కనిపించకుండా పోయిన ఆ విద్యార్థులు 6వ తరగతి చదువుతున్న సంజయ గోండ్, జోగేశ్వర హరిజన్. 13వ తేదీన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు రాలేదని తెలిసింది. 14వ తేదీన వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు సబిత ముఝుందార్ విద్యార్థుల హాజరు వివరాలు తీసుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు లేకపోవటం గుర్తించారు. హాస్టల్లో ఉండాల్సిన ఆ ఇద్దరు విద్యార్థులు ఏమయ్యారని ఆమె విచారణ జరిపారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ ఇరువురు విద్యార్థులను పిలిచి తీసుకువెళ్లారని మిగతా విద్యార్థులు వెల్లడించారు. ఎవరు వచ్చారు, అనుమతి లేకుండా వారిని ఎవరు తీసుకువెళ్లారు, అన్నదానిపై చర్చించిన ఆమె ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియజేసేందుకు వారిని పాఠశాలకు పిలిపించారు. వారు వచ్చిన తర్వాత వారి పిల్లలు కనిపించటంలేదని ఎవరో వచ్చి వారిని తీసుకువెళ్లినట్టు విద్యార్థులు తెలిపిన విషయాన్ని వారికి చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలు తెలిపిన విషయం విని వారి తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల భద్రత మీది కాదా అని వారు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే వారికి సముదాయ పరచి ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయమని వారికి సూచించగా సంజయ గోండ్ తండ్రి నంద గోండ్ అతని భార్య కలిసి కుందెయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బయట ప్రపంచానికి శనివారం వెలుగుచూచిన ఈ సంఘటన జిల్లాలో చర్చనీయమైంది. ఆదివాసీ హరిజన సంక్షేమ హాస్టల్ల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ బిడ్డలు కనిపించకుండా పోయేందుకు కారణం ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తక్షణం దర్యాప్తు జరిపించి తమ బిడ్డలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులను తీసుకుపోయిన వ్యక్తి వారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారి భవానీ మిశ్ర సూచనప్రాయంగా విలేకరులకు తెలిపారు. ఎవరు తీసుకుపోయారు, ఎందుకు తీసుకువెళ్లారు, వారిని విక్రయించేందుకా లేదా కార్మికులుగా చేర్చేందుకా అన్న చర్చ జరుగుతుంది. ఇద్దరు విద్యార్థుల అపహరణపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆ సేవాశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిని నవరంగపూర్ జిల్లా సంక్షేమ అధికారి ఆదేశించినట్టు తెలిసింది. తరచూ ఇటువంటి ఏదో ఒక సంఘటన ప్రభుత్వ ఆదివాసీ హరిజన సేవాశ్రమాలలో చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలవబిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అపహరించబడినట్టు ఆరోపించబడుతున్న ఆ ఇద్దరు విద్యార్థులను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఒంటరిగా వెళ్లింది.. జంటగా వచ్చింది
సురక్షితంగా సత్తెనపల్లి పోలీస్టేషన్‌కు వచ్చిన యువతి సత్తెనపల్లి : పట్టణంలోని వడ్డవల్లికి చెందిన యువతి రాసంశెట్టి శ్రీలక్ష్మి అదృశ్యం చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామిశెట్టి అజయ్‌కుమార్, లక్ష్మిల దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తెకు వివాహం అయ్యింది. కాగా, అజయ్‌కుమార్ రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమార్తెలు ముగ్గురు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చివరి కుమార్తె అయిన శ్రీలక్ష్మి ఇంటర్మీడియట్ చదువుకుని కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చేయవచ్చుకదా అని ఆమె అక్కలు పలుమార్లు చెబుతుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి గత నెల 16న రెండు పేజీల లేఖ రాసి ఇంటి నుంచి అదృశ్యమైంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన శరీరం కూడా దొరకదని అందులో పేర్కొనడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గతనెల 17న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 11న యానాం నుంచి ఫేస్బుక్ ద్వారా కుటుంబ సభ్యులకు లక్ష్మి మెసేజ్ పంపింది. తాను సురక్షితంగా ఉన్నానని, వివాహం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ పోలీసులకు విషయాన్ని తెలియ చేయడంతో ఫేస్బుక్ అకౌంట్ ఆధారంగా ఆచూకీని కనుగొన్నారు. శ్రీలక్ష్మి ఫేస్బుక్లో పరిచయమైన యానాం వాసి పెద్దిరెడ్డి ఈశ్వరప్రసాద్ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. బుధవారం శ్రీలక్ష్మితోపాటు ఈశ్వర ప్రసాద్‌లను పోలీసులు తీసుకొని జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు వద్దకు తీసుకెళ్లారు. అనంతరం సత్తెనపల్లి పోలీస్టేషన్‌కు తీసుకు వచ్చారు. శ్రీలక్ష్మి సత్తెనపల్లి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలిగింది. -
ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
-
ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
విజయవాడ: ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం నగరంలో కలకలం రేపుతోంది. నగర శివారులోని నున్న ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు నిన్న(మంగళవారం) పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఉప్పుతల శరణువల్లి(15), ఆది వైష్ణవి(14), అత్తులూరి నాగ సంజన(14)లు మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
మెహందీ కోసం వెళ్లి యువతి అదృశ్యం..
డబీర్‌పురా(హైదరాబాద్): మెహందీ పెట్టుకోవడానికి స్నేహితురాలి వద్దకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. డబీర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీకా అలావా ప్రాంతానికి చెందిన సఫియా బేగం కూతురు సమీనా(19) ఈ నెల 19వ తేదీన రాత్రి 9.30 గంటలకు మెహందీ పెట్టుకోవడానికి స్థానికంగా ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెందారు. స్నేహితురాలి ఇంటి వద్ద, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సఫియా బేగం తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు 040- 27854791 డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
చేలు మాయం.. చెరువుల మయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టాలో వరి చేలు మాయమవుతున్నాయి. సాగు భూములు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. అనధికారికంగా తవ్వుతున్న చెరువుల కారణంగా డెల్టా ప్రమాదంలో పడింది. నాలుగేళ్లుగా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గతంలో జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఆక్వా చెరువుల కారణంగా 5.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం వరి విస్తీర్ణం 4 లక్షల ఎకరాల లోపే ఉన్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టాలో పొలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లో వరిసాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు కాగా, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అధికారిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారికంగా మరో లక్ష ఎకరాల వరకూ చెరువులుగా మారినట్టు అంచనా. అనుమతి లేనివే అధికం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, యలమంచిలి, పాలకొల్లు మండలా ల్లోని అత్యధిక విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందులో అనుమతి లేనివే అధికం. తాజాగా ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, పెరవలి, అత్తి లి మండలాల్లోనూ చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. డెల్టా మండలాల్లో ఏటా రెండు పంటలు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కాలంలో కొత్త వంగడాలు సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం, తెగుళ్లు తప్పడంతో దిగుబడి బాగా పెరిగింది. గతంలో రెండు పంటలకు 60 నుంచి 65 బస్తాల వరకూ దిగుబడి వస్తే.. ఇప్పుడు సగటున 80 బస్తాల వరకూ పెరిగింది. అయితే, సాగు భూములు మాత్రం తగ్గిపోయాయి. ఆక్వా జోన్లుగా ప్రకటించడంతో.. ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా డెల్టాలోని కొన్ని మండలాల్లో అక్వా జోన్లను ప్రకటించింది. దీంతో ధనిక రైతులు వ్యవసాయం నుంచి అక్వా వైపు మళ్లుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఎక్కడా రొయ్యల చెరువులకు అనుమతి లేదు. ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు డెల్టాలోనూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లోని భూములన్నీ ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. ఉప్పునీటి బోర్లకు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తు్తన్నారు. సెలనిటి చాలకపోతే చెరువుల్లో నేరుగా బస్తాలకొద్దీ ఉప్పు కలుపుతున్నారు. రొయ్యల సాగు కోసం యాంటీబయోటిక్స్ సైతం అధికంగా వాడుతున్నారు. ఈ నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనినే చాలా గ్రామాల్లో తాగునీటికి ఉపయోగించాల్సిన దుస్థితి దాపురించింది. పని దినాలు తగ్గిపోయాయి ఆక్వా చెరువుల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ఆ భూముల్లో వరి సాగైన సమయంలో కూలీలకు సగటున 50 పని దినాలు ఉంటే అక్వా వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయాయి. దీంతో కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రొయ్యల చెరువులున్న గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఉప్పు నీటి కారణంగా పంటలు పండటం లేదు. దీనివల్ల రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టాలో వ్యవసాయ భూములు తగ్గిపోతుండటంతో కౌలు రేట్లు పెంచేశారు. గతంలో ఎకరానికి 24 బస్తాలు (రెండు పంటలకు కలిపి) ఉండే కౌలు ఇప్పుడు 32 నుంచి 34 బస్తాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అధికారిక గణాం కాల్లో తగ్గిన విస్తీర్ణం చూపించడం లేదు. గతంలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందో ఇప్పుడూ అంతే చూపిస్తున్నారు. వాస్తవానికి దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి కూడా పెరగాలి. అయితే, తగ్గిన విస్తీర్ణాన్ని చూపించకుండా అధికారులు పాత లెక్కలతోనే సరిపెడతున్నారు. డెల్టా పరిరక్షణకు నడుం కట్టాలి ఏటా పెరుగుతున్న అక్రమ చెరువుల కారణంగా డెల్టాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తిండి గింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం
గచ్చిబౌలి: మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ బాల్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పోచమ్మ బస్తీకి చెందిన ప్రియాంక గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 27న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. భర్త శ్రవణ్‌కుమార్ మంగళవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకుల విద్యార్థి అదృశ్యం
బోనకల్: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆ విద్యార్థి తాను చనిపోతానంటూ లేఖ రాసి తోటి విద్యార్థులకు ఇచ్చివెళ్లడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల కథనం మేరకు.. ఏన్కూరు మండలం తూతూకలింగన్నపేట గ్రామానికి చెందిన కేతినేని రామారావు కుమారుడు రవి కుమార్ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో 5వ తరగతినుంచి విద్యనభ్యసిస్తున్నాడు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. జనవరి 1న మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటి విద్యార్థులకు లేఖ ఇచ్చి కళాశాల నుంచి వెళ్లిపోయాడు. వెంటనే విద్యార్థులు ఆ లేఖను ప్రిన్సిపాల్ అంజలికి అందజేశారు. అదే రోజు సాయంత్రం 5 గం టలకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తోటి విద్యార్థులను ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి లేఖపై తల్లిదండ్రులు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ లెటర్ ఏమీ లేదని బుకాయించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్ఐ నారాయణరావు కళాశాలకు చేరుకుని విద్యార్థి అదృశ్యంపై విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ను అడిగి వివరాలు సేకరించారు. అప్పటివరకు బుకాయించిన ప్రిన్సిపాల్ ఏఎస్ఐకి విద్యార్థి రాసిన లేఖ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. తాను చనిపోతానంటూ రవికుమార్ లేఖలో పేర్కొనడంతో చదివిన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారునికి ఏమైనా జరిగితే కళాశాల సిబ్బందే పూర్తిబాధ్యత వహించాలన్నారు. అధ్యాపకుల వేధింపులు భరించలేక.. తనకు ఆరోగ్యం సరిగాలేదని, కళాశాలలో చదవడం ఇష్టంలేదని, కొంతమంది గెస్ట్ అధ్యాపకులు తనను వేధిస్తున్నారని, ముఖ్యంగా సాంబ య్య అనే అధ్యాపకుడు వేధిపులు భరించలేకపోతున్నానని రవి కుమార్ రాసినæనోట్లో పేర్కొన్నాడు. ఇటీవల కళాశాలకు వచ్చిన ఉన్నతాధికారులకు కళాశాలలో భోజనం సక్రమంగాలేదని, తాను ఫిర్యాదుచేశానని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తనను సూటిపోటిమాటలతో వేధిస్తున్నారని రాశాడు. విద్యార్థితండ్రి రామారావు ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ నారాయణరావు కేసు నమోదుచే శారు. విద్యార్థి అదృశ్యంపై కలెక్టర్ ఆదేశాలతో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రుషికేష్‌రెడ్డి సోమవారం కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ అంజలిని వివరాలడిగి తెలుసుకున్నారు. ఆమెనుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులపట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలాఅని ప్రశ్నించారు. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని తెలి పారు. ప్రిన్సిపాల్ అంజలి, గెస్ట్ టీచర్లు కూడా రోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై కళాశాల ఎస్ఎంసీ చైర్మన్ జిల్లా అధికారికి ఫిర్యాదుచేశారు. గతంలో ఒక విద్యార్థి కళాశాలనుంచి బయటకువచ్చి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలుఎక్కి విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. కళాశాల అధ్యాపకులతీరుపై మండలవాసులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఒడిశా సీఎం హెలికాప్టర్ అదృశ్యం
45 నిమిషాల పాటు ఉత్కంఠ... సమాచార లోపంతో గందరగోళం భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు ముప్పావు గంట (45 నిమిషాలు) ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత హెలికాప్టర్ సభా ప్రాంగణానికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం కొరాపుట్ జిల్లా జయపురంలో పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి ముందస్తు షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కోట్పాడు బయల్దేరారు. 12.50 గంటలకు కోట్పాడుకు చేరాల్సి ఉంది. అనుకున్న సమయానికి హెలికాప్టర్ అక్కడికి చేరుకోలేదు. దీంతో అంతా అందోళనకు గురయ్యారు. ప్రధానంగా ముఖ్యమంత్రి భద్రత, జిల్లా యంత్రాంగం అధికారుల్ని పరుగులు తీయించింది. హెలికాప్టర్ కదలికకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో సీఎం హెలికాప్టర్ కోట్పాడు సభా ప్రాంగణానికి చేరింది. తప్పుడు సమాచారంతో ఈ మేరకు అసౌకర్యం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనలో వర్క్స్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు బిరాంచి మహంతిని సస్పెండ్ చేసినట్టు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి విచారణకు కొరాపుట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి అదృశ్యం
మిర్యాలగూడ అర్బన్ : కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థి కనిపించకుండా పోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలం కమలానగర్‌కు చెందిన పోరెడ్డి సైదిరెడ్డి, రజితారెడ్డి కుమారుడు రవీందర్‌రెడ్డి(19) నల్లగొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఈనెల 16వ తేదీన తన తల్లి రజి తారెడ్డితో కలిసి తన స్వగ్రామం కమలానగర్ నుంచి మిర్యాలగూడకు వచ్చాడు. వాసవీభవన్ రోడ్డులో షాపింగ్ ము గించుకొని తల్లిని నేరేడుచర్ల బస్సు ఎక్కించాడు. తాను నల్లగొండకు వెళ్తానని చెప్పాడు. మరుసటి రోజు కళాశాల నుంచి ఫోన్ చేసిన లెక్చరర్లు రవీందర్‌రెడ్డి కాలేజీకి రాలేదని తల్లిదండ్రుకు తెలిపారు. దీంతో కంగారుపడి తమ బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఈ నెల 18 వ తేదీ సాయంత్రం రవీందర్‌రెడ్డి ఫేస్బుక్ నుంచి తన తల్లికి ఐ మిస్ యూ మమ్మీ..అంటూ మెసేజ్ పంపాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పో లీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
తన గురించి వెతకొద్దని మెసెజ్ పెట్టి..
మలేసియా టౌన్ షిప్: తన గురించి వెతకొద్దని కుటుంబ సభ్యులకు ఎస్సెమ్మెస్ పంపించి గృహిణి అదృశ్యమైంది కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ మహేష్ గౌడ్ కథనం ప్రకారం... నిజాంపేట గ్రామంలోని మిలినియం హోమ్స్‌లో ఎస్.జందారావు, చందన ప్రతిమ దంపతులు (35) నివాసముంటున్నారు. జందారావు ప్రైవేట్ ఉద్యోగి కాగా, చందన ప్రతిమ గృహిణి. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం ప్రతిమ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో జందారావు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించడంతో పాటు బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన గురించి వెతక వద్దని చందన ప్రతిమ భర్తకు, సోదరుడికి సెల్ ద్వారా మెసేజ్ పంపించినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.2 లక్షలు మాయం
భీమవరం టౌన్ : బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2లక్షలు మాయం కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. టూటౌన్‌కు చెందిన పి.రామరాజు గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.రెండులక్షలు విత్‌డ్రా చేసి ఆ మొత్తాన్ని సంచిలో పెట్టుకుని మోటార్‌సైకిల్‌కు తగిలించాడు. ఇంటికి వెళ్లి చూడగా, నగదు ఉన్న సంచి కనిపించ లేదు. దీంతో అతను అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు శుక్రవారం తెలిపారు. బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించగా, కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఉప్పల్‌లో అదృశ్యం.. గోవాలో ప్రత్యక్షం!
ఉప్పల్/ నాగోల్: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ–1 స్కూల్ విద్యార్థులు నలుగురు అదృశ్యం తీవ్ర కలకలం సృష్టించింది. వారు గోవాలో ప్రత్యక్షం కావడంతో తల్లిదండ్రులు, స్థానిక పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు... ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సోమయ్య కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడు. ఆయన బుధవారం ఆయన ఉప్పల్ ఠాణాకు వచ్చి... ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ–1 స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తన కుమారుడు టీఎస్ విజయ్‌కుమార్ (14), మరో విద్యార్థి ఎన్.సాయికృష్ణ (14) మంగళవారం పాఠశాలకు వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు. ఎల్బీనగర్ ఠాణాలో మరో ఫిర్యాదు... ఇది విధంగా ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్న తమ కుమారులు సాయినాథ్‌రెడ్డి (13), లిఖిత్‌కుమార్ (14) అదృశ్యమయ్యారని శివగంగకాలనీ నివాసి తేర మణిపాల్‌రెడ్డి, బండ్లగూడ ఇంద్రప్రస్థకాలనీ నివాసి గోపాల్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు పోలీస్స్టేషన్ల అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోమయ్య ఫిర్యాదుతో అప్రమత్తమైన ఉప్పల్ పోలీసులు విజయ్‌కుమార్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గోవాలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. గోవా పోలీసులు నలుగురు బాలురు ఆచూకీ కనుగొన్నారు. వారిని తమ సమక్షంలో ఉంచుకున్నారు. చిన్నారులను నగరానికి తీసుకొచ్చేందుకు ఉప్పల్ పోలీసులు తమ సిబ్బందిని గోవాకు పంపారు. కాగా, పై నలుగురు విద్యార్థులు 23, 24 తేదీల్లో అసలు పాఠశాలకే రాలేదని తేల్చిచెప్పారు. జల్సా చేసేందుకే నలుగురు విద్యార్థులు గోవా వెళ్లినట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్ లో విద్యార్థి అదృశ్యం
ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన రామారావు కుమారుడు వినయ్‌కుమార్(18) కూకట్‌పల్లిలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నాడు. ఈ నెల 11న కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నేపాల్ మహిళ అదృశ్యం
నేపాల్‌కు చెందిన మహిళ అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం....ఫలక్‌నుమా జహనుమా ఎం.టి. కాలనీకి చెంఇన అయేషా మహ్మద్ ఇంట్లో నేపాల్‌కు చెందిన హీరా కోమల్ బుదా(34) సర్వంట్‌గా కొనసాగుతోంది. కాగా గత నెల 29వ తేదీనా రాత్రి భోజనం అనంతరం అయేషా కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా కోమల్ కనిపించలేదు. దీంతో అయేషా ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కాలేజీకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం
కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వర్‌తేజ్ (19) బిటెక్ చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కాలేజీకి వెళ్తున్నానని తెలిపి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో చూట్టుపక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకాబు చేసిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు ఉద్యోగి అదృశ్యం
డ్యూటీకి వెళుతున్నానని చెప్పి వెళ్లిన ప్రైవేట్ ఉద్యోగి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం..బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే వసంతపురం కిరణ్ (27), లక్ష్మి భార్య భర్తలు. వారికి ఒక బాబు ఉన్నాడు. ఈనెల 2వతేదీన ఆఫీసుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యం
నాగిరెడ్డిపేట : ఎల్లారెడ్డి మండలంలోని అజామాబాద్‌కు చెందిన చింతకాయల నర్సవ్వ తన ఇద్దరు పిల్లలు గతనెల 31న మండలంలోని గోపాల్పేట నుంచి అదృశ్యమైనట్లు నాగిరెడ్డిపేట ఏఎస్సై కిష్టయ్య తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికలాన్‌కు చెందిన నర్సవ్వకు కొంతకాలం క్రితం ఎల్లారెడ్డి మండలం అజామాబాద్‌కు చెందిన చింతకాయల ఊశయ్యతో వివాహం జరిగింది. కాగా తనతల్లి ఆరోగ్యం బాగాలేదని ఆమెను చూడడానికి గతనెల 24న నర్సవ్వ తన కూతురు అలేఖ్య, కొడుకు సంతోష్‌తో కలిసి లింగంపల్లికలాన్‌కు వెళ్లింది. వారంరోజులపాటు అక్కడే ఉన్న నర్సవ్వ హైదరాబాద్‌లో పనిచేస్తున్న తన భర్త ఊశయ్య వద్దకు వెళ్తానని చెప్పడంతో ఆమె అన్నయ్య రొడ్డ చిన్నఅంజయ్య గతనెల 31న గోపాల్‌పేటలో నర్సవ్వతోపాటు ఆమె పిల్లలను హైదరాబాద్ బస్సు ఎక్కించాడు. కాగా నర్సవ్వ తనవద్దకు రాలేదని ఆమె భర్త చెప్పడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో నర్సవ్వ అన్నయ్య అంజయ్య ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం
ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ డివిజన్ జయానగర్ కాలనీకి చెందిన బి. ప్రదీప్(20) ఇబ్రహీంపట్నంలోని శ్రీ దత్తా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. కళాశాలలో నిర్వహించిన పరీక్షలో ప్రదీప్ మూడు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. గత నెల 29న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరిన ప్రదీప్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రార్థనకంటూ వెళ్లి..
ప్రార్థనలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం....షమా టాకీస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అలీముద్దీన్(53) సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. కాగా గత నెల 5వ తేదీనా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నమాజ్ చేసేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అలీముద్దీన్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అతని భార్య సాబెరా బేగం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
జగద్గిరిగుట్టలో విద్యార్థిని అదృశ్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లమ్మబండ మాణిక్యనగర్‌లో నివాసముండే కుర్మయ్య కుమార్తె శిరీష (15) శంషీగూడ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గత నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంత వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తండ్రి కుర్మయ్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
మేడిపల్లిలో వివాహిత అదృశ్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం..కాచవానిసింగారం ముత్వేలిగూడకు చెందిన దశరథ్ కుమార్తె సాయి కీర్తన(24)నకు ఐదేళ్ల్ల క్రితం రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉంది. 10 రోజుల క్రితం భార్య భర్తలకు గొడవ జరగడంతో పుట్టిలైన ముత్వేలి గూడకు వచ్చింది. ఈక్రమంలో జూలై 29వతేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో సోమ వారం తండ్రి దశరథ్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి..
కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంజయ్‌పురి కాలనీకి చెందిన మెరుగు నర్సింహులు కుమార్తె నిఖిత (19) కూకట్‌పల్లిలోని సిద్దార్ధ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 25న ఉదయం 9 గంటల సమయంలో కాలేజీకి వెళ్లిన యువతి నేటి వరకు తిరిగి రాలేదు. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టైలరింగ్ నేర్చుకునేందుకు వెళ్లి యువతి అదృశ్యం
మూడున్నర నెలల క్రితం ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో అదృశ్యమైన సంతోష్‌కుమారి(20) జాడ ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు కె. రామారావు, చంద్రావతి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన తమ కూతురిని వెతికిపెట్టాలంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులను మరోమారు ఆశ్రయించారు. ఏప్రిల్ 12వ తేదీన సంతోష్‌కుమారి టైలరింగ్ నేర్చుకోవడానికి సమీపంలోని లేడీస్ టైలర్ శేఖర్ షాప్‌నకు వెళ్లింది. అయితే, రాత్రి 7 దాటినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అయితే తన కూతురిని లేడీస్ టైలర్ శేఖర్ బలవంతంగా తీసుకెళ్లాడని అతడి కుటుంబసభ్యులను విచారిస్తే ఆమె జాడ దొరుకుతుందని తండ్రి రామారావు మంగళవారం ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సంతోష్‌కుమారి కోసం గాలింపు చేపట్టారు. -
ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిం చకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి లో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే పి. రాజగోపాల్రావు కుమారుడు పిసివి కృష్ణకుమార్ (27).జిహెచ్ఎంసి పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్లో ఏఈగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు, తిరిగి రాలేదు. సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వస్తుంది. దీంతో తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాచిగూడలో వ్యక్తి అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ మజార్ మహ్మద్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.... తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన బి.సుధాకర్‌రెడ్డి (30) ఈ నెల 22వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తెలిసిన వారి ఇండ్లలో, వివిధ ప్రాంతాల్లో ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. సుధాకర్‌రెడ్డి తమ్ముడు బి.వేణుగోపాల్ రెడ్డి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీ డబ్బులతో వ్యక్తి అదృశ్యం
ఇంట్లో ఎవరూలేని సమయంలో చిట్టి డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎఎస్సై నారాయణ కథనం ప్రకారం...లాలాపేట ఇందిరనగర్‌కు చెందిన ఎన్. శంకర్(35) వృత్తిరీత్యా ప్రై వేటు ఉద్యోగి. అయితే ఈ నెల 19వ తేదీన శంకర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉన్న చిట్టి డబ్బులు 68 వేల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య రేణుక తెలిసిన వారిని, బంధువులను, స్థానికులను వాకబు చేసింది. కాని, ఫలితం దక్కలేదు. నాలుగు రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో శంకర్ భార్య స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫలక్‌నూమాలో చిన్నారి అదృశ్యం
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారీ పాప తప్పిపోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.....కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాజిద్ ఈ నెల 18వ తేదీనా ఫలక్‌నుమాలోని జహనుమా ల్యాన్సర్ ప్రాంతానికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా వచ్చాడు. కాగా ఈ నెల 20వ తేదీనా ఉదయం 8 గంటలకు తన చిన్న కుమార్తె నజ్మా(2) బంధువుల చిన్నారులతో కలిసి తిను బండారాల కోసం స్థానికంగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మేరకు సాజిద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ చిన్నారీ ఆచూకీ తెలిసిన వారు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616512 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
అదృశ్యమయ్యాడు..శవమై తేలాడు
♦ రంగంపేట కొత్తచెరువు తూములో మృతదేహం ♦ హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ కొల్చారం : మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన వడ్ల రాజశేఖర్ (28) ఈ నెల 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే అతడు సోమవారం రంగంపేటకు సమీపంలోని కొత్తచెరువు తూములో శవమై కనిపించాడు. కొల్చారం ఎస్సై విద్యాసాగర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగంపేటకు చెందిన వడ్ల రాజశేఖర్(28) గ్రామంలో మోటర్ మెకానిక్ షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 6న భార్య హేమలతకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మెదక్‌లోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని తల్లిగారి ఇంటికి వెళ్లమని రంగంపేటలో బస్సు ఎక్కించాడు. అనంతరం రాజశేఖర్ 9గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చిందంటూ స్నేహితులకు చెప్పి బయటకు వెళ్లినట్లు తెలిపారు. అదే రాత్రి భార్యను తిరిగి ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు. అనంతంరం ఫోన్ స్విచ్ఆఫ్ అయింది. విషయం గమనించిన భార్య హేమలత మరుసటిరోజు ఇంటికి చేరుకుంది. రాజశేఖర్ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఈ నెల 9న శనివారం కొల్చారం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తి అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రంగంపేటలోని కొత్త చెరువు అలుగు నుంచి వాసన వస్తుండడంతో అక్కడి రైతులు పోలీసులకు చెప్పారు. కొల్చారం ఎస్సై విద్యాసాగర్ సిబ్బందితో కలిసి తూము కాలువలోకి దిగి చూడగా శవం కనిపించింది. మృతదేహం రాజశేఖర్‌దిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేశారు: కుటుంబీకులు రాజశేఖర్‌ను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హత్య చేసి చంపివేసినట్లు అతడి భార్య హేమలత, తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీ కొడుకును ఎలాగైనా చంపేస్తానంటూ ఇంటికి వచ్చి బెదిరించి వెళ్లాడని, అదే ఈ రోజు నిజమైందని వారు ఫిర్యాదు చేశారు. మృతుడికి రెండున్నర ఏళ్ళ కూతురు రక్షిత ఉంది. -
సెల్‌ఫోన్ విషయమై గొడవ..యువకుడి అదృశ్యం
సెల్ ఫోన్ విషయంలో సోదరితో గొడవ.. తండ్రి మందలింపుతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం...బాగ్ అంబర్‌పేట సోమసుందర్నగర్లో నివాసముంటున్న దయానంద్ కుమారుడు సుహాన్(20) సికింద్రాబాద్ ఎస్పీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన ఇంట్లో సోదరి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ విషయంలో గొడవ పడ్డాడు. గొడవ వద్దని తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు చోట్ల వెతికిన ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘట్కేసర్లో బాలిక అదృశ్యం
ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐశ్వర్య(15) అనే బాలిక అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి, తనయుడు అదృశ్యం
పెద్దాపురం : కన్న బిడ్డతో తల్లి అదృశ్యమైన సంఘటన పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో చోటు చేసుకుంది. పెద్దాపురం ట్రైనింగ్ ఎస్సై జోషి తెలిపిన వివరాల మేరకు.. ఆర్బీ పట్నం గ్రామానికి చెందిన గీసాల గంగా భవానీ (25) తన కుమారుడు వర ప్రసాద్ (4) రెండు రోజులుగా కనిపిచండం లేదని జల్లూరు గ్రామానికి చెందిన ఆమె తల్లి పిల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఉస్మానియా యూనివర్శిటీ: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఓయూ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం... హబ్సిగూడ ఎస్‌ఎస్‌నగర్ నివాసి వేణుముద్దల శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె ప్రియాంక (21) నల్ల నర్సింహారెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 1న తెల్లవారుజామున 2 గంటలకు ప్రియాంక ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ప్రియాంకకు ఆమె తల్లి ఫోన్ చేయగా.. స్నేహితులతో కలిసి షిరిడీ వెళ్తున్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఫోన్ చేస్తా సమాధానం లేదు. దీంతో ఆమె తండ్రి ఆదివారం ఓయూ పోలీసులకు తన కుమార్తె కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఆచూకీ తెలిసిన వారు సెల్: 94906 16733 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
ఒకే కుటుంబంలో ముగ్గురి అదృశ్యం
పెదగంట్యాడ : యారాడకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని న్యూ పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివరాల్లోకి వెలితే... యారాడకు చెందిన మరుపల్లి పైడిరాజు తన కొడుకు, కోడలు, మనవడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కొడుకు సత్యనారాయణ(35), కోడలు అనిత(30), మనవడు హరీష్(4) ఈ నెల 20న విజయనగరంలో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు.అయితే రాత్రయినా అక్కడకు చేరుకోలేదని, ఫోన్ చేసినా సమాధానం లేదని, మూడు రోజుల పాటు బంధువులు, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని పైడిరాజు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. -
కిరాణా షాపుకు వెళ్లి...
కిరాణ షాపుకు వెళ్లిన ఓ యువతి అదృశ్యం అయింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాటేదాన్ బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన పి.అంజమ్మ కుమార్తె స్వాతి(19). అదే ప్రాంతంలోని నానమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం వెళ్లింది. అక్కడి నుంచి కిరాణా షాపుకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చదువు మాన్పిస్తారని.. పారిపోయింది..
చదువు మాన్పిస్తాం.. పెళ్ళి చేస్తామంటూ తల్లిదండ్రులు గట్టిగా చెప్పడంతో ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్ నెం. 7 జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీలో నివసించే పి.సాయిలక్ష్మి(19) ఇటీవలి ఇంటర్ రెండోసంవత్సరం పరీక్షల్లో మొదటి శ్రేణిలోపాస్ అయ్యింది. డిగ్రీ చదవాలని ఎంతో ఆశపడింది. కొద్ది రోజులైతే డిగ్రీ కళాశాలకు వెళ్తానని స్నేహితులతో ఆనందంగా చెప్పేది. ఎస్ఆర్నగర్లోని ఓ డిగ్రీ కాలేజీలో చేరేందుకు దరఖాస్తులు కూడా చేసుకుంది. అయితే తల్లి వనిత, తండ్రి పి.గోపాల్ మాత్రం ఆమె చదువుకు ససేమీరా అన్నారు. చదువు మానెయ్... వచ్చే నెలలో పెళ్ళి చేస్తామంటూ తల్లి గట్టిగా చెప్పింది. ఇలాగే ఉంటే తనకు పెళ్ళి చేయడం ఖాయమని తనకు ఎంతో ఇష్టమైన చదువుకు దూరమవుతానని బాధతో ఈ నెల 5వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటాను తప్పితే పెళ్ళి మాత్రం చేసుకోనని చుట్టుపక్కల వారితో అన్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలేజీకి వెళ్లి .. తిరిగి రాలేదు..
విద్యార్థి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....ఆర్.కె.హెచ్. కాలనీ వీధి నంబర్ 5లో నివాసముండే గోపయ్య కుమారుడు సంతోష్ (17) విద్యార్ధి. మంగళవారం కళాశాలకు వెలుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సంతోష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో బుధవారం తండ్రి గోపయ్య నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేందర్ మూవీస్ మదన్ అదృశ్యం
భార్య, స్నేహితుల గాలింపు మధురై: వేందర్ మూవీస్ మదన్ గంగలో సమాధి అవుతానని లేఖ రాసి పెట్టి అదృశ్యం అయిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో ఆయనను వెదుక్కుంటూ భార్య, మిత్రులు కాశీకి బయల్దేరారు. వేందర్ మూవీస్ సంస్థాపకుడు మదన్. ఈయన 2011లో ఈ సంస్థను ప్రారంభించి ‘అరవాన్’, విశాల్ నటించిన పాండియనాడులతో సహా పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 20 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఈయన ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధ్యక్షుడు పచ్చముత్తుకు సన్నిహితుడు. వేందర్ అని పిలవబడే పచ్చముత్తు తరఫున వేందర్ మూవీస్ అనే సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా ఎస్ఆర్ఎం కళాశాలలో అడ్మిషన్ల భర్తీకి మదన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. విద్యార్థులు చెల్లించే డొనేషన్ మదన్ ద్వారా కళాశాలకు చేరుతుంది. ఈ స్థితిలో వేందర్ మూవీస్ లెటర్ హెడ్లో ఐదుపేజీల లేఖను రాసిపెట్టి మదన్ అదృశ్యం అయ్యారు. ఈ లేఖ జిరాక్స్‌ను వాట్సప్ ద్వారా సినిమా, పత్రికల్లోని స్నేహితులకు పంపారు. అంతేగాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆ లేఖలో తాను కాశీలోని గంగలో సమాధి అవుతానని తెలిపారు. తాను ఎంతో నిజాయితీగా, నిస్వార్థంగా పచ్చముత్తు వద్ద పనిచేశానని, కొందరు తనపై చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య వున్న స్నేహాన్ని దెబ్బతీశారని, ఐజేకే పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడినట్లు మదన్ తెలిపారు. ఈ స్థితిలో విరక్తి చెందిన తాను ఇకపై ప్రాణాలతో బతికి ఉండడం వృథా అని పేర్కొన్నారు. దీంతో అతను ఎక్కిడికి వెళ్లాడనే ఆచూకీ తెలియలేదు. మదన్‌ను వెతుకుతూ అతని భార్య, అమ్మ క్రియేషన్స్ శివ, నటుడు లారెన్స్ కాశీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. -
డబ్బుతో పరారయ్యాడా.. కిడ్నాపా?
హైదరాబాద్: ఫ్యాక్టరీ యజమాని దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి రూ.25లక్షల నగదుతో అదృశ్యమయ్యాడు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం... ఫలక్‌నుమా శంషేర్‌గంజ్ ప్రాంతానికి చెందిన చంద్రమోహన్ బెరీ(42) గత పదేళ్లుగా డీవీ కాలనీకి చెందిన సుమిత్ సింగాల్ వద్ద పనిచేస్తున్నాడు. సుమీత్కు పటాన్చెరులో పలు పరిశ్రమలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన హైటెక్ సిటీలో ఉండే ప్యాక్టరీ మేనేజర్ పురుషోత్తంకు రూ.25లక్షల నగదు అందించాలని చంద్రమోహన్ బేరికి యజమాని పురమాయించాడు. సాయంత్రం 7.30గంటలకు నగదు ఉండే బ్యాగును ఇచ్చి ఇంటి నుంచి పంపించాడు. ద్విచక్ర వాహనంపై సింధీ కాలనీ నుంచి బయల్దేరిన చంద్రమోహన్ బెరీ మొబైల్ ఫోన్ 15 నిమిషాలకే స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి చంద్రమోహన్ ఆచూకీ లభించలేదు. యజమాని సుమీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రమోహన్ కిడ్నాప్‌కు గురయ్యాడా, డబ్బుతో పరారయ్యాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ మ్యాచ్ చూడొద్దన్నందుకు బాలుడి అదృశ్యం
జీడిమెట్ల: ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ చూడనివ్వడం లేదని ఓ బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కుమారుడు సాయిగణేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసాడు. ఆదివారం ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా తండ్రి టీవీ ఆపేశాడు. దీంతో సాయిగణేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నెల క్రితం అదృశ్యం.. నేడు ప్రత్యక్షం
పలాస: కాశీబుగ్గ శివాజీనగర్‌కు చెందిన యువకుడు గోపీనాథ్ పట్నాయక్ అదృశ్యం మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. ఫిబ్రవరి 28న కాశీబుగ్గలోని తమ గణేష్ ప్రింటర్ షాపు నుంచి విధులు ముగించుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. రాత్రి 10 గంటల సమయంలో అదే రోజు ఒక అపరిచితుడి ఫోన్ నుంచి గణేష్ ప్రింటర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ సోదరుడు గోవింద పట్నాయక్‌కు కాల్ వచ్చింది. మీ తమ్ముడు సజీవంగా మీకు కావాలంటే మేం కోరిన డబ్బులివ్వాలని, అక్కుపల్లి శివసాగర్‌బీచ్‌కు డబ్బులు పట్టుకుని రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు ఆందోళన చెంది కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గ పోలీసులు ఫోన్‌కాల్ ఆధారంగా పరిశీలిస్తే విశాఖపట్నం నుంచి కాల్ వచ్చినట్టు తెలుసుకున్నారు. ఆ తరువాత అతని ఆచూకీ లభించలేదు. ఆ మరుసటి రోజు నుంచి అతని కోసం అటు పోలీసులు, ఇటు కుటుంబీకులు గాలించారు. నెలరోజులు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనతో ఉన్న సమయంలో గోపీనాథ్ నుంచి రెండురోజుల క్రితం గోవింద పట్నాయక్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. తాను కేరళలోని రైల్వేస్టేషన్ వద్ద గల ఆర్పీఎఫ్ స్టేషన్లో ఉన్నానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పడంతో కాశీబుగ్గ పోలీసులు సహకారంతో కారులో కేరళ బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం కాశీబుగ్గ చేరుకొని పోలీసుల ముందు ఆయన్ని హాజరుపర్చారు. ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో ఏం జరిగిందనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉందని కాశీబుగ్గ పోలీసులు చెప్పారు. మొత్తానికి గోపీనాథ్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. -
కొద్ది గంటల్లోనే పెళ్లి...వరుడు అదృశ్యం
కొద్ది గంటల్లోనే వివాహ వేడుక జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....అడ్డగుట్టలోని వడ్డెర బస్తీలో నివసించే సఫీ(25) తుకారాంగేట్‌లోని రియోపాయింట్ హోటల్ సమీపంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అయితే, కొద్ది రోజుల క్రితం సఫీకి మౌలాలీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేందుకు సఫీ ముందుకు వచ్చాడు. మార్చి నెల 31వ తేదీ రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఏం జరిగిందో తెలియదు కాని గురువారం ఉదయం నుంచి పెళ్లి కొడుకు సఫీ కనిపించకుండా పోయాడు. మధ్యాహ్నం వరకు చూసినా అతడి జాడ తెలియలేదు. తెలిసిన వాళ్లందరినీ వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు శుక్రవారం తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించారు. -
తల్లీకూతురు అదృశ్యం
చేవెళ్ల రూరల్: ఓ వివాహిత తన కూతురితో కలిసి కనిపించకుండా పోయింది. పోలీసుల కథనం ప్రకారం. చేవెళ్లకు చెందిన ఒగ్గు పాండు, శశికళ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతుళ్లు అశ్విని, ఆకాంక్ష (4) ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 21న దంపతులు గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శశికళ తన చిన్న కూతురిని తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారి కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. శశికళ వద్ద ఉన్న ఫోన్‌కు కాల్ చేయగా స్విఛాఫ్ వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన శశికళ తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. కనిపించకుండాపోయిన ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు. జవహర్‌నగర్‌లో నివసించే ఎ. శ్రీనిఖిత(21) హిందూ డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈ నెల 19నుంచి జరగనున్న పరీక్షల కోసం హాల్ టికెట్ తెచ్చుకుంటానని గురువారం ఉదయం మేనత్త కూతురు రితికతో కలసి వెళ్లింది. హాల్‌టికెట్ తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అన్ని ప్రాంతాలు గాలించారు. స్నేహితులు, బంధువులతో పాటు స్వగ్రామంలోనూ ఆరా తీసినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో కూడా వెళ్లిన రితిక కూడా కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షలు రాయడానికి వెళ్లి... బోరబండ ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్‌లో నివసించే బి. ఎలీష(20) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. చార్మినార్ వద్ద రాయల్ ఉమెన్స్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండటంతో గురువారం ఉదయం 7గంటలకు బస్సులో చార్మినార్ వెళ్లింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కావడంతో సాయంత్రం 5 అవుతున్నా ఎలీషా ఇంటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు శ్రీదేవికి ఫోన్ చేశారు. అయితే ఎలీషా పరీక్ష రాయడానికి రాలేదని శ్రీదేవి వెల్లడించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నగలు, నగదుతో గృహిణి అదృశ్యం
చిలకలగూడ : ఇంట్లో ఉన్న నగలు, నగదుతో గృహిణి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీకి చెందిన రాజు, మల్లిక (32)లు భార్యభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటు పాలవ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రాజు తన పిల్లలను స్కూలుకు దిగబెట్టేందుకు వెల్లగా, మల్లిక రెండు ఏటీఎం కార్డుల నుంచి రూ.80వేలు విత్‌డ్రా చేసి, ఆ సొమ్ముతోపాటు ఇంట్లోఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు,రూ.3 లక్షల నగదు తీసుకుని అదృశ్యమైంది. పిల్లలను స్కూలుకు దిగబెట్టి ఇంటికి వచ్చిన రాజుకు భార్య మల్లిక కనిపించలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితంలేకపోయింది. ఇంట్లోని నగదు, నగలుతోపాటు తన భార్య కనిపించకపోవడంతో భర్త రాజు పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ముగ్గురు యువతుల అదృశ్యం
మెదక్ టౌన్: ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మెదక్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన జెల్ల శృతి (19) పట్టణంలోని చర్చికాంపౌండ్‌లో గల తన బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. గత నెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో శనివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉండే సౌమ్య (19) హైదరాబాద్‌లో బీటెక్ చేస్తోంది. మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఉండే మేనమామ అల్లం సంతోష్ ఇంటికి సంక్రాంతి సెలవులకు వచ్చింది. జనవరి 25న కడుపునొప్పిగా ఉంది. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సౌమ్య తిరిగి రాలేదు. దీంతో ఆమె మేనమామ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన వంజరి రాధ (20) మెదక్ పట్టణంలో రెండేళ్లుగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తుంది. ఈనెల 25న స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు. -
రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలికల అదృశ్యం
దుండిగల్: రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలిక లు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీ స్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన గ్రేసీకర్ (15) ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. దీంతో బాలికను కుత్బుల్లాపూర్ మండ లం చర్చి గాగిల్లాపూర్‌లోని నవజ్యోతి నికేతన్ రెస్క్యూ హోంలో చేర్పించారు. ప్రస్తుతం గ్రేసీకర్ స్థానిక సెయింట్ ఇగ్నీషియస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తప్పిపోయిన తమిళనాడుకు చెందిన వరలక్ష్మి (14), రెండు నెలల క్రితం జూపార్కు వద్ద తప్పిపోయిన సారా కాటూన్ (17)లను రెస్క్యూ హోంకు తరలించారు.వరలక్ష్మి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా, సారాకాటూన్ రెస్క్యూ హోంలోనే ఉంటోంది. కాగా, శుక్రవారం రాత్రి ఈ ముగ్గురు బాలికలు రెస్క్యూ హోం నుంచి తప్పిం చుకున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో శనివారం రెస్క్యూ హోం నిర్వాహకులు దుండిగల్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. మరో బాలిక సైతం వెళ్లి తిరిగి వచ్చినట్లు సమాచారం. గ్రేసీకర్ గతంలోనూ ఇదే విధం గా రెస్క్యూ హోం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఐటీ విద్యార్థిని అదృశ్యం
హిమాలయాలకు వెళ్తున్నట్టు ఉత్తరం చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నత ఉద్యోగాలకు బాటవేసే ఐఐటీ చదువును ఆపివేసి ఆధ్యాత్మిక జీవనం వైపు పయనమైందో విద్యార్థిని. ‘ఆధ్యాత్మిక జీవనం తన మనస్సును లాగుతోంది, హిమాలయాలకు వెళ్తున్నా’ అంటూ ఉత్తరం రాసిపెట్టి మరీ అదృశ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష (20) మద్రాసు అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్లో ఉంటోంది. ప్రత్యూష రెండ్రోజులుగా కనిపించడం లేదు. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్‌కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించగా తెలుగు, ఇంగ్లిషులో రాసిన ఉత్తరం దొరికింది. ‘ఆధ్యాత్మిక జీవనంపై రోజురోజుకూ నాకు ఆసక్తి పెరుగుతోంది, ఈ కారణంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషిస్తూ హిమాలయాలకు వెళుతున్నా. నాకోసం వెతకవద్దు, తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి’ అంటూ ఉత్తరంలో రాసింది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిందని, అయితే ఆమె స్వస్థలానికి చేరుకోలేదని తెలియడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం రాత్రి మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
కిరాతకం !
అదృశ్యమైన బాలిక హత్య బిల్లలమెట్ట ప్రాంతంలో శవమై కనిపించిన దివ్య కిరాతకంగా గొంతుకోసి హత్యచేసిన వైనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ఏ పాపం ఎరుగని ముక్కుపచ్చలారని ఈ పాపాయి చేసిన నేరమేంటో తెలియదు... ఆ చిట్టితల్లి గొంతును అత్యంత కిరాతంగా కోసి హత్య చేశారు...నిర్యానుష్య ప్రాంతంలో నిర్దాక్షణ్యంగా పడేశారు... వేల దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులు నిష్ఫలమయ్యాయి...తమ గారాల పట్టి క్షేమంగా వస్తుందనుకున్న వారి ఆశలు ఆడియాసలయ్యాయి... మంగళవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దివ్య గురువారం శవంగామారింది... దేవరాపల్లి: మేనమామ ఇచ్చిన డబ్బులతో తినుబండారాలు కొనుక్కునేందుకు వెళ్లి అదృశ్యమైన బాలిక మూడో రోజు రైవాడ జలాశయం గేట్లుకు ఆనుకొని ఉన్న బిల్లల మెట్ట ప్రాంతంలో శవమై కనిపించడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. తన కుమార్తె దివ్య అదృశ్యమైందని స్థానిక మహేశ్వరి థియేటర్ సమీపంలో నివాపముంటున్న ధనలక్ష్మి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుం బ సభ్యులు అనుమానం మేరకు బాలికకు మేనమామ వరుసైన గుణశేఖర్పైను విచారించినా ఫలితం లేకపోయింది. పోలీసు జాగిలాలు జీనబాడు రహదారిలో బ్లిల మెట్ట క్వారీ ప్రాంతం, రైవాడ జలాశయం పరిసరాలకు వెళ్లి గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో అప్పటికి గాలింపు నిలిపివేసి, గురువారం ఉదయం ప్రారంభించారు. జాగిలాల సహాయంతో గాలిస్తుం డగా ఆ బాలిక శవమై కనిపించింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్యచేసినట్టు ఆనవాళ్లున్నాయి. దేవరాపల్లికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ఉన్న నిర్మాణుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి బాలిక గొంతుకోసి హతమార్చారు. మేనమామే హత్యచేశాడు.. అన్యంపుణ్యం ఎరుగని తమ కుమార్తెను వరుసకు మేనమామ అయిన సుబ్బాచారి గుణశేఖర్ హత్య చేశాడని బాలిక తల్లిదండ్రులు మురుగాన్, ధనలక్ష్మిలు ఆరోపిస్తున్నారు. పోలీ సులు కూడా గుణశేఖర్పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నా రు.అలాగే వివాహేతర సంబంధాలేమైనా కారణమా? అన్నకోణంలో కూడాదర్యాప్తుచేస్తున్నట్టు తెలిసింది. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ.. దివ్య హత్యకు గురైన ప్రాంతాన్ని, బాలిక మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం స్థానిక సీఐ కిరణ్‌కుమార్, ఎస్ఐ జి.ఎన్.అప్పన్నలు పరిశీలించి ఆధారాలు సేకరిం చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణ నిమితం ఏఎస్పీ కె.సత్యనారాయణ ఇక్కడకు వచ్చారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుమార్తే అత్యంత కిరాతకంగా హత్యకు గురికావడంతో దివ్య తల్లిదండ్రులు మురుగన్,ధన లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. బాలిక హత్యకు గురైందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి రిజర్వాయర్ లో శవమై తేలిన ఘటన అనంతపురం జిల్లా లో జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. కాగా.. శనివారం రోజు జీడిపల్లి రిజర్వాయర్ లో మృతి చెంది కనిపించాడు. మృతుడిని గ్రామానికి చెందిన ఎర్రస్వామి(45)గా గుర్తించారు. మృతుడిని గుర్తు తెలియని దుండగులు హతమార్చి.. గోనెసంచిలో పెట్టి జీడిపల్లి రిజర్వాయర్ లో పడేశారు. నీటిలో గోనె సంచి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటి బిడ్డ మాయం
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ అదృశ్యమైన ఘటన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరల్లోకి వెళితే.. ఏర్పేడు మండలం రావులవారి కండ్రిగ గ్రామానికి చెందిన గర్భిణి సుధ(23) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు ఆదివారం ఆడబిడ్డ పుట్టింది. కాగా.. సుధ నిద్రిస్తున్న సమయంలో పక్కనే ఉన్న బిడ్డ అదృశ్యమైంది. అర్థరాత్రి లేచి చూసేసరికి పక్కన లేకపోవడంతో.. తల్లి ఆందోళన చెంది.. సిబ్బందికి తెలిపింది. విషయం తెలిసిన సుధ బంధువులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే పాప కనిపించకుండా పోయిందని.. ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉప్పుటేరులో వ్యక్తి గల్లంతు
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఉప్పుటేరులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతి పరిధిలోని చింతరేవులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బంగార్రాజు(45) శనివారం ఉదయం చేపల వేట కోసం వెళ్లాడు. అయితే.. వేటాడే సమయంలో ప్రమాద వశాత్తు ఉప్పుటేరులో పడిపోయాడు. ఇది గమనించిన తోటి జాలర్లు స్థానికులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.