అదృశ్యమై.. హత్యకు గురై | Disappeared and been killed | Sakshi
Sakshi News home page

అదృశ్యమై.. హత్యకు గురై

Published Tue, Oct 13 2015 2:26 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Disappeared and been killed

చేవెళ్ల రూరల్: దాదాపు మూడు నెలల క్రితం అదృశ్యమైన ఓ బాలుడు దాయా ది చేతిలో హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో బాలుడిని చంపేసి నిందితుడు తన పొలంలోనే పాతిపెట్టాడు. హతుడి కుటుంబీకుల అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొ ని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రావులపల్లిలో సోమవారం కలకలం సృష్టిం చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన  కావలి పాండు, పావని దంపతులకు కొడుకు మహేం దర్ అలియాస్ మహేశ్(17), కూతురు రాణి ఉన్నారు.

మహేందర్ తల్లిదండ్రులకు వ్యవసాయపనుల్లో సాయంగా ఉండేవాడు. ఇదిలా ఉండగా, గత జులై 19 రాత్రి నుంచి మహేందర్ కనిపించకుండా పోయాడు. ఆరోజు తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లడంతో అతనొక్కడే ఇంటివద్ద ఉన్నాడు. మరుసటి రోజు మహేందర్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అతడి సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్విఛాఫ్ వచ్చింది.

గాలించినా ఫలితం లేకుండా పోవడంతో చేవెళ్ల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తమ కుమారుడు హత్యకు గురై ఉండొచ్చనే అనుమానంతో పాండు దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వారి అనుమానమే నిజమైంది. దాయాది  లచ్చయ్య, మరో యువకుడు రవితో కలిసి మహేందర్‌ను చంపేశాడు. లచ్చయ్య తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టాడు.  
 
పాండు కుటుంబానికి గ్రామంలో దాయాదులతో పాత గొడవలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో గతంలో మహేందర్‌పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. కొడుకు కో సం మహేందర్ తల్లిదండ్రులు గాలిస్తూ నే ఉన్నారు. వారి దాయాది అయిన లచ్చయ్య రెండురోజుల కిత్రం తాగిన మైకంలో మహేందర్‌ను చంపేసినట్లు వాగాడు. ఈనేపథ్యంలో పాండు దంపతులు.. లచ్చయ్య ఇతరులతో కలిసి తమ కుమారుడిని చంపేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ విషయం పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు లచ్చయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే దాయాది రవితో కలిసి జూలై 19న రాత్రి మహేందర్‌ను హత్య చేసి పొలంలో పాతిపెట్టినట్లు నేరం అంగీకరించాడు.  
 
తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన నిందితుడు..
లచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం చేవెళ్ల తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, సీఐ ఉపేందర్, ఎస్‌ఐ రాజశేఖర్  సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడు చెప్పి స్థలంలో స్థానికులతో కలిసి తవ్వకాలు చేపట్టారు. నిందితుడు మహేందర్‌ను హత్య చేసేందకు వాడిన  పారను పక్కనే ఉన్న పొదల్లోంచి స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు మృతదేహం కనిపించకపోవడంతో జేసీబీని రప్పించి తవ్వించగా మహేందర్ అస్థిపంజరం కనిపించింది. పోలీసులు తహసీల్దార్ సమక్షంలో పంచనామ చేశారు.
 
డాక్టర్ శివబాలాజీరెడ్డి ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో లచ్చయ్య హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసు లు అనుమానిస్తున్నారు. ఈమేరకు లచ్చ య్య, రవిని అదుపులోకి తీసుకొన్నారు. హత్యలో వీరిద్దరితోపాటు ఇంకెవరైనా ఉన్నారా..? అనే కోణంలో కూడా దర్యా ప్తు చేస్తున్నారు. డీఎస్పీ ఏవీ రంగారెడ్డి గ్రామానికి చేరుకొని మృతుడి కుటుంబీ కులతో మాట్లాడి వివరాలు సేకరిం చా రు. ఎప్పటికైనా తిరిగి వస్తాడనున్న కు మారుడు హత్యకు గురవడంతో పాండు దంపతుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement